ఆపదల్లో విలవిలలాడే
అభాగ్యులకు ఇచ్చే
ధైర్యమే బాసట.
నీకు నేనున్నా
అనే బావన కల్పించేది-
ఒంటరివాడిని
ఒడ్డుకు చేర్చే-
నావలాంటిదీ బాసట!!
ఆదుకునే నాథుడులేక-
నా అన్నవారు దూరమై-
జీవితానికి
చరమగీతం పాడిన అభాగ్యులందరూ
బాసట కరువైన వారే.
పైసా ఖర్చు చేయకున్నా,
పైన చెయ్యేసి-
అక్కున చేర్చుకునే –
మానసిక ధైర్యమే కదా బాసట??
బంధాలకు దూరమై,
అనుబంధమే మృగ్యమైన
అల్లాడే బ్రతుకులకు-
బాసట ఒక- అమృతభాండం .
అది ఒక ఆపన్నహస్తం!!
సహాయానికి
మారుపేరు-
సహృదయతకు
పట్టంకట్టే మంచితనం
దయార్ధ గుణంతో
ఫరిడవిల్లే మరో సుగుణం
ఈ బాసట!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
8 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
బాసట..గురించి
అన్ని కోణాల నుంచి
ఆలోచించే విధంగా
సాగింది మీరచన.
నా కళ్ల ముందే మీరు
ఎదుగుతున్న విధానం
నాకు గర్వంగా వుంది.
మీరు కవితా రంగం లో
మరింతగా ఎదగాలని
మనస్పూర్థి గా
ఆశీర్వదిస్తున్నా.
అభినందనలు సాగర్.
——కె.ఎల్వీ *
హనంకొండ.
sagar
మీ అపూర్వ ఆశీస్సులకు ధన్యవాదములు సర్
Sambasivarao Thota
Brother Sagar!
Baasata gurinchi chakkagaa cheppaaru!
Sagar
Tq Sir.Sorry for late reply.
Jhansi koppisetty
అద్భుతంగా వుంది మీరు బాసట గురించి విశదీకరించిన విధానం
…

ఈ మధ్య నించుంటే కవిత్వం కూచుంటే కవిత్వమైపోయారు మీరు…Hearty Congrats and keep it up
Sagar
మీ అపూర్వ స్పందనకు ధన్యవాదములు మేడమ్ . ఆలస్య స్పందనకు క్షంతవ్యుడిని.
మొహమ్మద్. అఫ్సర వలీషా
చాలా బాగా వ్రాశారు సాగర్ గారు. బాసట గురించి. నిజం గా కష్టాల్లో ఉన్న వారికి ఎదుటి వారు అందించే ఆ బాసట కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.చక్కని సమాజ రహిత స్ఫూర్తి దాయక కవిత నందించిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు












Sagar
ధన్యవాదములు మేడమ్ . ఆలస్య స్పందనకు క్షంతవ్యుడిని.