[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
సంగీతమును మోక్షవిద్యగా భావించి శ్రీ త్యాగరాజ స్వామివారు జీవిత గమ్యమును చేరుకొనుటకు సంగీతమును ఉపాధేయముగ స్వీకరించి ఉపాసించినారు. “శ్రీపప్రియ సంగీతోపాసన జేయవే ఓ మనసా” అని మనసును సంబోధించి చెప్పుకొనినారు. నాదోపాసన ద్వారా తనకు రామసాక్షాత్కార భాగ్యము కల్గునని ఆయన ధృఢ విశ్వాసము. తన యిష్ట దైవనుగు శ్రీరామచంద్రుడిని నాద స్వరూపునిగ భావించినారు. రామకథను రచింపజాలని తన జన్మము వ్యర్థమని తలంచి బాధాతప్త హృదయముతో శ్రీరామునికి ఈ విధంగా విన్నవించుకున్నారు.
“ఏ జన్మించితినని నీవెంచవలదు శ్రీరామ నేనేపనికో”
“మానములేదా తనవాడని అభిమానము”
“సొగసుగా మృదంగతాళము జతగూర్చినిను”
త్యాగయ్యకు శ్రీరామచంద్రుడు అభయదాన మొసంగాడు.
ఆనందముతో త్యాగయ్యగారు “రామకథా సుధారసపానమొక రాజ్యము చేసునే” అని పాడుకున్నారు.
రామకథను రచించని కవులు లేరు. 13వ శతాబ్ది యందు తిక్కన కవీంద్రులు తమ నిర్వచనోత్తర రామాయణమున
“ఎత్తఱినైనను ధీరోదాత్త నృ
పోత్తముడు రామధరణీపతి స
ద్వృత్తము సంభావ్య మౌట
నుత్తర రామాయణోక్తి యుక్తుడనైతిన్”
అని వ్రాశారు.
రామకథను ఇందరు కవులిన్ని రకములుగా రచించుట చర్వితచర్వణము, పిష్ట పేషణము గాదా ఆను ప్రశ్నించువారలకు మురారి “అనర్ఘరాఘవమున” చక్కగ సమాధానమిచ్చినారు. జయదేవుడు తన ప్రసన్నరాఘవమున శ్రీరాముని గుణములను ప్రశంసించినారు.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలగు శ్రీ విశ్వనాథ – రామాయణ కల్పవృక్షమును వ్రాయుచు “మఱల నిదేల రామాయణ”మని తన్ను ప్రశ్నించు వారలకు – కుంతకుడు చెప్పిన అభిప్రాయన్ని ఆయన ఆమ్రేడించినారు.
రామకథ సర్వరససమ్మిళితము. శృంగార రసాద్యఖిలసార పూరితమైనది రామకథయని. అట్టి రామకథానందాబ్ధియుత సంగీతశాస్త్ర జ్ఞానము సారూప్యసౌఖ్యద మనినారు త్యాగయ్య,
రామాయణమునందు – రాజ, ప్రజా, పతి, సతీ, భ్రాతృ, పుత్ర, భృత్య, మిత్ర మున్నగు ధర్మములన్నియు ఉన్నవి.
“వేదవేద్యే పరే పుంసి జాతే దశరధాత్మజే
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా”
వేదవేద్యుడు అంటే శ్రీరాముడని, వేదతత్త్వజ్ఞుడే రామాయణకర్త యగు వాల్మీకియని, వేదార్థప్రకాశమే రామాయణమని తెలుస్తుంది.
‘జగదానందకారక’ అను నాటరాగ పంచరత్న కీర్తనలో ‘సత్కవి హృదాలయ’ ‘సుకవి జన హృత్సదన’, ‘దాశరథే దయాశరథే’ అను కోకిలప్రియ రాగ కీర్తనమున ‘కవీశ సుహృదయ నివేశ’ అని సంభావించినారు.
‘కవీన బిలజ మౌనికృత చరిత్ర సన్నుత’ అని శ్రీరాముని కొనియాడినారు. ఈ విషయమును ‘The spiritual heritage of Thyagaraja’ అను గ్రంథమున Dr. V. Raghavan గారు చెప్పినారు.
“In the same Nata Pancharatna (8th charana) he calls Rama one whose story was set forth by the ant hill born sage who was also the king of poets.”
‘కవీన బిలజ మౌనికృత చరిత’ అట్టిదగు రామచంద్రుని చరితమును ఆయా కాండలలో త్యాగయ్య ఎట్లా రచించారో చూద్దాం.
రాగం: హంసధ్వని
పల్లవి:
శ్రీ రఘుకులమందు బుట్టి నీవు సీతను చేకొనిన రామచంద్ర
అర్థము:
దీనిలో శ్రీరామజననము – కళ్యాణమును చెప్పినారు.
అనుపల్లవి:
ఆ రామమందు మునులకోరిక లీడేర సేయ బూనుకొన్న రామ
రామచంద్రుడు అరణ్యవాస మున మునులకభయమిచ్చి దుష్టరాక్షససంహారమునకు కడంగి విరాధుని, ఖరదూష ణాది పదునాలుగు వేలమంది రక్కసులను సంహరించిన విధమును ప్రస్తావించినారు.
చరణములో – రామ వధానంతరము రామచంద్రుడు సీతా సమేతుడై అయోధ్యను చేరుటను చెప్పారు.
మన దేశ చరిత్రలో భగవత్ సాక్షాత్కారం పొందిన మహా యోగులూ అచార్య పురుషులు, జగద్గురువులూ, అవధూతలూ – ఇంకా ఎందరో అవతరించి తమ ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వరిల్ల చేసి మన పవిత్ర భరత భూమిని పునీతం చేసినవారు అనేకమంది కనిపిస్తారు.
గురువుల వద్ద శాస్త్ర పాండిత్యము, మహత్తర జ్ఞానము, విజ్ఞానము, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవంతుని గురించి వేయి విధముల వల్లించినవి, స్తుతించినవి ఎన్ని నేర్చుకున్నా శిష్యునికి యథార్థ అనుభూతి కలగనప్పుడు అవి నిరర్థకం.
ఏ గురువు కూడా ప్రత్యక్షానుభవము ఇచ్చేది కాదు. ప్రసాదింప గలిగేది ఒక పరతత్వమే. భగవత్ శరణం ఒక్కటే మార్గం.
ఆ మార్గం పొందాలంటే ‘మాయ’ను దాటాలి. జగన్మాత అనుగ్రహము లేనిదే – ఈ మాయా సముద్రమైన సృష్టి సాగరాన్ని దాటి అవతలి ఒడ్డున వెలుగుతున్న భగవత్ జ్యోతిని కనుగొనలేము. గురువు మార్గాన్ని ఉపదేశిస్తాడు. స్వయంగా మనం జగన్మాతను ప్రార్థించాలి. దానికోసం ‘తపస్సు’ చేయాలి.
“తుంగభద్రానదీ తీరము శ్రీరామచంద్రుని పవిత్ర పాదస్పర్శచే పునీతమైన కిష్కింధా పర్వతము దగ్గరికి వెళ్ళి తవస్సు చేయాలి” అని విద్యారణ్యుల గురువు శిష్యునకు ఉపదేశించారు. ఆయన గురువు చెప్పిన దారిలో తపస్సుకి ఉపక్రమించినప్పటికి, అయన మనస్సుకి చుట్టు ఉన్న దేశం, ప్రపంచం, ప్రజల ఆర్తనాదాలు, ఆవేశ కావేశాలతో జరిపే మారణకాండలు, అశేష మానవాళి ఇలా దుఃఖ సముద్రంతో తేలుతు వుంటే తనకేమి పట్టనట్లు స్వార్థపూరిత హృదయుడై కేవలం తన మోక్షం కోసం తను పడే తపన మంచిది కాదేమో అనుకున్నారు. ఇదే మాయ. తను ఒకటి అనుకుంటే దైవము ఇంకోటి తలచినట్లు.
కారణజన్ములు అవతారాల వెనుక వెలుగొందె మహా కారణం – అది వ్యక్తిగతమైనది కాదు. యావదిశ్వము తరించాలి. అదే లౌకిక విశ్వ ప్రేమ. అలాంటి వారు మానవత్వం ముసుగులోంచి తొంగిచూసే పరమాత్మ యొక్క అనుగ్రహ మూర్తులు. వ్యర్థమైన జీవితము మరణం కన్నా హీనము.
మనస్సు అప్పుడే వికసించిన గులాబీ పుష్పంలా నిర్మలత్వంతో నిజాయితీతో సత్యం పరిమళిస్తుండగా భగవానునికి పాద పుష్పంలా సమర్పించాలి.
పవిత్రత ఉండగానే భగవానునికి ప్రేయసిగా సర్వ సమర్షణ గావించుకోవడం, శరణాగతి పొందడం ద్వారా మనిషి జీవితానికి ఒక విలువ వుంటుంది. ఆ విలువ, ఈనాటి ఆధునిక ప్రపంచ పోకడలకు, యువత అందుకోలేకపోతుంది. మారవలసింది సమాజమా – మనుషులా.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు. భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ). భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు. గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు. మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పదసంచిక-43
అసూయ
పొంచి ఉన్న జీవ రసాయనిక ఆయుధాల ప్రమాదం
మనోమాయా జగత్తు-7
హౌజ్వైఫ్
భక్తిమార్గం ప్రాశస్త్యం
స్వేచ్ఛ
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-25
తిరుమలలో శ్రీవారు – సేవలు
మా ఊరి బస్సు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®