సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    కృష్ణచైతన్య గారు
    హృదయపూర్వక అభినందనలు. ఈమధ్య కాలంలో ఇంత సూటి యైన, నిక్కచ్చి యైన ‘విమర్శ’ చదవలేదు. ఆ పుస్తకం నేనింకా చదవలేదు కానీ మీ సవివరమైన విమర్శ, పేజీలతో సహా ఓపికగా స్పష్టంగా తెలియజేసిన మీ అభిప్రాయాలు ఆమోదయోగ్యమైనవే.
    ఇది ఏ ఒక్కరికో సంబంధించినది కాదు, ‘విమర్శ’ చేస్తున్నాం అనుకునే వారిలో ఒక అస్పష్టత కనిపిస్తోంది. ఒక అసమంజసమైన అహంకార ధోరణి కనబడడమూ కద్దు. అసలే అంతంత మాత్రంగానే ఉన్న సాహిత్య విమర్శలో ఈ ‘రంగుటద్దాలు’, ‘ఏకపక్ష నిర్ణయం’, ‘నిరంకుశ, ఆధిపత్య భావాలు’ వల్ల సద్విమర్శ బతికి బట్టకడుతుందా అనే అనుమానం కలుగుతోంది.
    ఎవరో ఒకరి పక్షాన వకాల్తా పుచ్చుకోకుండా నిష్పక్షపాతంగా చేసిన మీ విమర్శకు అభినందనలు.

  2. 2

    Shyamkumar Chagal. Nizamabad

    చాలా వివరంగా అద్భుతంగా ఉంది సమీక్ష. మీ రచన చదివి తె విమర్శ కు ఎంతటి ప్రాదాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

  3. 3

    మథు చిత్తర్వు

    ఈ దిక్చక్రం అనే వ్యాసాల పుస్తకం నేను చదవలేదు కానీ, తెలుగు సాహిత్యంలో సరైన అధ్యయనం చేసి రాసే విమర్శకులు లేరని అర్థం అవుతోంది.చాలావరకు వ్యక్తిగత అభిప్రాయాలు వారికి నచ్చిన వామపక్ష సిద్దాంతాలు లేక వ్యక్తిగత స్నేహాలు విమర్శకులని ప్రభావితం చేస్తున్నాయి అని అనిపిస్తోంది.ఉదాహరణకి నేను రాసే సైన్స్ ఫిక్షనే తీసుకొని దానిలో సదాశివరావు గారు తప్ప ఎవరూ లేరు అనుకోవడం,ఎప్పుడో వంద ఏళ్ళ కిందట జెక్ రచయిత కార్ల్ కోపెక్ రాసిన రోబోట్ నాటకం గురించి రాసి అదే విమర్శ అధ్యయనము అనుకోవడం హాస్యాస్పదంగా వుంది.నా పేరు రాయలేదని నేను కోపం గాని బాధతో గాని ఇది రాయడం లేదు.తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసిన కె.ఆర్.కె మోహన్, మైనంపాటి భాస్కర్, యండమూరి, మల్లాది వెంకట కృష్ణమూర్తి,ఎన్.ఆర్. నంది, పురాణపండ రంగనాథ్, కస్తూరి మురళీకృష్ణ, వేమూరి వేంకటేశ్వరరావు లాంటి వారు ఎందరో ఉన్నారు అని కనీసం ఒక వాక్యం కూడా రాయని వారిది సాహిత్య విమర్శ ఎలా అవుతుంది? లేకపోతే తాను ఆ అంశం అధ్యయనం చేయలేదని రాయాలి.వీరి వ్యాసాలు భవిష్యత్తులో రిఫరెన్స్‌కి వస్తాయి కా‌బట్టి వాస్తవాలు మరుగునపడి ఇదే నిజమని భావి తరాల పాఠకులు అనుకుంటారు.అలాగే మాంత్రిక వాస్తవికత, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం, హాస్యం, వ్యంగ్యం,భయానక, అపరాధ పరిశోధన, భక్తి సాహిత్యం పౌరాణిక సాహిత్యం ఈ అన్ని విభాగాల తెలుగు సాహిత్యం గురించి రాయాలంటే విడి విడిగా అధ్యయనం చేయాలి.ఆంగ్లసాహిత్యం విమర్శనా పద్దతులు అవలంబించి రాయొచ్చు కానీ అంతకు ముందే మన సాహిత్యంలో విమర్శ పద్ధతి, లక్షణగ్రంథాలు ఎన్నో వున్నాయి.విశ్వనాధ లాంటి వారి సాహిత్యంలో కూడా మాజిక్ రియలిజం వున్నవి వున్నాయి.అంపశయ్య నవీన్, జేమ్స్ జాయిస్ యులిసిస్ స్ఫూర్తి తోనే అంపశయ్య రాశారు.గురజాడ, కందుకూరి వీరేశలింగం లాంటివారు కూడా ఇంగ్లీష్ నవలల నాటకాలు ప్రభావం తోనే రచనలు చేశారు.ఆథునిక తెలుగు సాహిత్యంలో నేను చదివిన వారిలో గోపిని కరుణాకర్ అద్భుతంగా మాజిక్ రియలిజం కథలు రాశారు.మిగిలినవారి గురించి నా అభిప్రాయం వేరు.ఏదయినా విమర్శ అధ్యయనము నిష్పాక్షికంగా సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరుకోవడం తప్పు కాదు.అసమగ్రమైన విమర్శలు, దీర్ఘకాలంలో సాహిత్యానికి మేలు బదులు ఎక్కువ కీడు చేస్తాయి అని నా భయం.
    అయితే తెలుగులో సరైన విమర్శకులు ఎవరూ లేరు అంటే ఆయా విమర్శకులకి ఎంత బాధ కలుగుతుందో, సైన్స్ ఫిక్షన్‌లో ఎవరూ రచయితలు లేరు అంటే రాసే నాలాంటి వారికి కూడా అంతే నిరుత్సాహం కలుగుతుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!