[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘దిక్కు నేనున్నానని..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


కుక్కను మొక్కను పెంచు
అక్కున చేర్చుకుని
మక్కువ చూపిస్తాయి
బక్క చిక్కిన వేళ
నక్కి నక్కి చూసే
నక్క నాయాళ్ళ మాదిరి
నిక్కు చూపించవ్
మిక్కిలి ప్రేమను పంచి
దిక్కు నేనున్నానని
కొత్త రెక్కలు అందిస్తాయి
కోటి ఆశలు కల్పిస్తాయి

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.