పాఠకులు విశేషంగా ఆదరణను అందిస్తున్నందుకు సంచిక ధన్యవాదాలు తెలుపుతోంది. పాఠకులను ఆకర్షించుకొని, వారు మెచ్చే రచనలను అందించాలని సంచిక తపన పడుతోంది. కోట్ల సంఖ్యలో తెలుగువారు ఉన్నా, పట్టుపని పది పత్రికలు లేకపోవడం తెలుగు భాష పట్ల అభిమానం కలవారందరూ ఆలోచించాల్సిన అంశం. ఎందుకని ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయో, కొనసాగుతున్నాయో విశ్లేషించి, పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
తన వంతుగా సంచిక ఈ నెల నుంచి ‘విశ్వవేదిక’ అన్న శీర్షికను ఆరంభిస్తోంది. ప్రపంచం నలుమూలలా విస్తరించి ఉన్న తెలుగు వారికి ఒక వేదిక నిస్తుందీ శీర్షిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ తమ అనుభవాలు, జీవన విధానాలు పంచుకునే వేదిక ఈ శీర్షిక. తమ సందేహాలు, సందిగ్ధాలు ఈ శీర్షిక ద్వారా ప్రకటించటం వల్ల ఒకరికొకరు పరిచయం అవటమే కాక, ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన అందరి సంతోషాలు, బాధలు ఒకే స్వరూపం అని అర్థమవుతుంది. అది మనల్ని మరింత సన్నిహితులని చేస్తుంది.
ఈ శీర్షికను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన శ్రీ సారధి మోటమర్రి గారిని సంచిక అభినందిస్తునే, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. క్షణం తీరికలేని ఉద్యోగంలో ఉంటూ కూడా వారీ బాధ్యతను తలకెత్తుకోవటం తెలుగు భాష, సాహిత్యాల పట్ల వారి అభిమానాన్ని స్పష్టం చేస్తుంది.
ఇంకా పలు రకాల శీర్షికలు, రచనలతో పాఠకులకు ఆనందం కలిగించాలని సంచిక ప్రయత్నిస్తోంది.
1 సెప్టెంబరు 2021 తేదీన సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలివి
సంభాషణం:
- కవి వి. ఆర్. విద్యార్థి – డా. కె.ఎల్.వి. ప్రసాద్
ప్రత్యేక వ్యాసం:
- జ్యోతిర్లింగ క్షేత్రం కాళేశ్వరం – పివి నరసింహారావు
కాలమ్స్:
- రంగుల హేల 42: నైపుణ్యాలు – అల్లూరి గౌరిలక్ష్మి
- సంచిక విశ్వవేదిక – పరిచయ వాక్యం – మోటమర్రి సారధి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- సెప్టెంబరు 2021- దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -18 – ఆర్. లక్ష్మి
కథలు:
- కరెంట్ బొమ్మ – డా. మధు చిత్తర్వు
- వీడిన మబ్బులు – జొన్నలగడ్డ శేషమ్మ
- టచ్ ఫోను – దాసరి శివకుమారి
కవితలు:
- చెరువు – శ్రీధర్ చౌడారపు
- ఎందుకు? – డా. కోగంటి విజయ్
పుస్తకాలు:
- ‘విశ్వపుత్రిక’ గజళ్ళ నెత్తావి – యోగరేఖలు – పుస్తక సమీక్ష – డా. సిహెచ్. సుశీల
సినిమాలు:
- ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 49 – ఫిర్ కబ్ మిలోగీ – సినీ పరిచయం – పి. జ్యోతి
బాలసంచిక:
- చిత్రప్రాణ విద్య – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- చిరంజీవి – మార్కండేయ మహర్షి – అంబడిపూడి శ్యామసుందర రావు
- ‘సిరికోన’ చర్చా కదంబం 2 – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
- పాత్రికేయ నవలాకారుడు శ్రీ వీరాజీ..!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్
రచనల ద్వారా, సలహాలు, సూచనల ద్వారా, ఇతర పాఠకులను పరిచయం చేయటం ద్వారా సంచికను మరింతగా పాఠకులకు చేరువచేసే వీలు కల్పించాలని అభ్యర్ధిస్తున్నది సంచిక.
– సంపాదక బృందం.