సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    తన అనారోగ్యం గురించి తెలిసి వెంటనే వచ్చిన ఆనంద్ నుంచి చూసి మాలతి కళ్ళలో వెలుగు తో పాటు “విజయగర్వం”! ఈ ఒక్క పదం తో మాలతి మనస్తత్వాన్ని చెప్పేసారు రచయిత్రి. పైగా ఈ సందర్భంలో ప్రవేశించిన సైకియాట్రిస్ట్ శృతకీర్తి ద్వారా మాలతి మనసు లో తిష్ట వేసుకుని, ఆమెని తన గుప్పిటిలో బిగించిన సక్కుబాయి అత్తయ్య వైనం తెలిసింది. సాంప్రదాయ పద్ధతిలో పెరిగినా, మాలతి చిన్నతనం లోనే దురదృష్టవశాత్తు సక్కుబాయి ప్రభావం తో తనలో స్పిట్ పర్సనాలిటీ చోటుచేసుకుంది. భర్తకూ, తనకూ మనశ్శాంతి లేకుండా చేయడమే కాక, ఏ పాపం తెలీని పసిబిడ్డ జాన్వికి తండ్రి ప్రేమ ను దూరం చేసింది. ఉంటారు ఇలాంటి స్త్రీలు – అశాంతి తో రగిలిపోతూ.

    Reply
    1. 1.1

      శారద పువ్వాడ

      సుశీలమ్మ గారి కి హృదయ పూర్వక ధన్యవాదములు అండి. మీ విశ్లేషణ నా నవలా రచన కు స్ఫూర్తి లాగా ఉంది. చాలా థాంక్స్ అండి.

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *మాలతి స్ప్లిట్ పర్సనాలిటీ.. ఊహించని ట్విస్ట్ ఇది. మాలతి లోని మాలతిని మరియు సక్కుబాయి అత్తయ్యని, వారిద్దరి మధ్య మాలతి సంఘర్షణని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.. స్ప్లిట్ పర్సనాలిటీ బారిన పడిన మాలతి గురించి చదువుతుంటే మాలతి నిస్సహాయ స్థితి అర్థం అవుతుంది.. తన జీవితం కూడా సక్కుబాయి లాగానే అయిపోయింది అని ఒక గూడు లాంటిది ఏర్పరచుకొని దానిలోనే ఉండిపోయింది.. బద్దలు కొట్టుకుని బయటకి వస్తే నిజానిజాలు తెలిసేవేమో.. రాలేకపోయింది… ఇది ఒక ఎత్తు అయితే.. దానికన్నా రెట్టింపు ఆసక్తిని ఇచ్చిన ట్విస్ట్ సైకాలజిస్ట్ శ్రుతకీర్తి మరియు తనని నియమించింది ఆనంద్ అని.. ఇప్పుడు సైకాలజిస్ట్ శ్రుతకీర్తి ఇచ్చే థెరపీ మాలతిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.. కథ ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తికరంగా ఉంది.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *సైకాలజిస్ట్ ఎంటర్ అయింది కనుక మాలతి జీవితం చక్కగా ఉంటుందని నా నమ్మకం. స్త్రీ చిన్న పొరపాటు చేసినా కూడా తననో విలన్‌గా చూడాలి, తన జీవితంకి దారి లేకుండా అగమ్యగోచరంగా అయిపోతుందనే సమాజపు మూస ఆలోచనల్లా కాకుండా తన వల్ల పొరపాటు జరిగినా కూడా ఆ పొరపాటు దగ్గర్నుండి మరియొక కొత్త జీవితం వైపు అడుగులు వేయగలగాలని మాలతి పాత్ర చెప్పాలని నా అభిప్రాయం. ఈ సైకాలజిస్ట్ ఆలోచన ఆనంద్ మాలతి వెళ్ళకముందే చేయాల్సింది. అందుకే ఒక తప్పు జరిగితే ఆ తప్పులో కేవలం ఏ ఒక్కరిదే తప్పు ఉండదు, అందరి పొరపాటు ఉంటుందని నా అభిప్రాయం 🙂 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *సైకాలజిస్ట్ ప్రవేశంతో మాలతి కథ మలుపు తిరగబోతోందనిస్తోంది. *

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *చాలా బాగా రాసినవు అక్కా.. చిన్నప్పటి సంఘటనలు మనసు మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. సైకాలజిస్ట్ కి చూపించే ఆలోచన బాగుంది.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *బాగుందండి. మాలతి ప్రవర్తన స్క్రిజోఫోనియా అనే మానసిక జబ్బు గురించీ చెబుతారనుకున్నా. దాదాపు అలాంటిదే చెప్పారు. చిన్నతనంలో మనసులో యేర్పడిన భావాలు భయాలు మనిషి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. బాధాకరం యేమిటో మన సమాజంలో అలాంటి వాళ్లను చూసి యేదో ఒక ముద్ర వేసి మాట్లాడేవాళ్ళే యెక్కువమంది. వాళ్లందరు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించరు. ఇప్పటీకి సైక్రియాటిస్ట్ దగ్గరికి దగ్గరికివెళ్ళటకనికి నామోషీగా భావించేవాళ్ళెక్కువమందే ఉన్నారు. ఇక కథలో ఊర్మిళకు ఆమే అసహాయతకు ఆసరా ఇచ్చిన ఆనంద్ లభ్యమయ్యాడు మాలతికీ కన్నతండ్రికి కూడ ఆమె పరిస్థితి తెలియలేదు. ఒక విధంగ ఊర్మిళ అదృష్టవంతురాలు. కుటుంబాన్ని కోల్పోయి అనాథైనా కూడా విద్య విజ్ఞానం వచ్చి కుటుంబ మేర్పడి చక్కని జీవితమనుభవిస్తున్నది. తండ్రి భర్త కూతురు డబ్బు అన్నీ ఉండి కూడ మాలతిది దుఃఖమయం. ఆవిడ తప్పేమిలేదు. ఇప్పటికైనా ఆనంద్‌కు సైకియాట్రిస్ట్‌కు చూపెట్టాలన్న ఆలోచన వచ్చింది. దానికి యేదో కారణముండుంటుంది. ఎవరైన సలహా చెప్పి ఉంటారు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. నళిని గారి వ్యాఖ్య: *పాపం మాలతి.. సగటు ఆడదాని మనస్తత్వం.. ఆనంద్ మీద ప్రేమ.. ఇలా స్ప్లిట్ పర్సనాలిటీని చేసినాయి..*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది కథ. సూపర్.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య: *ఈ వారం కథ చదివితే నా మస్తిష్కంలో మెదిలిన ఆలోచనలు. మాలతి ఆనంద్‌కి విడాకులు కోరుకున్నట్లు లేదు. ఆమెది గుడ్డి ప్రేమ అందుకే ఆమెకు అనుమానం. దానికి ఫలితం మానసిక, శారీరక సమస్యలు. ఇంకో పక్క ఆనంద్, ఊర్మిళ ఒకరిపై ఒకరికి అభిమానం, సానుభూతి. ఎక్కడా లక్ష్మణ రేఖ దాటలేదు! దీని బట్టి చూస్తే ఈ కథలో కొంత నూతనత్వం! పద ప్రయోగం అద్భుతం ముఖ్యంగా ‘బడబాగ్ని’ లాంటి పదాలు! ఇది పాఠకుడిగా నా స్పందన!*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావుల వసంతమయి గారి వ్యాఖ్య: *ఇప్పుడే కంప్లీట్ చేశాను. కథ బాగా సాగుతూంది. శ్రుతకీర్తి పేరు చాలా చాలా నచ్చింది. ఊర్మిళ లాంటి వారు కూడా సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారనిపిస్తుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!