సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    కోడిహళ్లి మురళీ మోహన్

    చక్కని వ్యాసం. తెలుగులో కూడా ఇలాంటి కథలు/నవలలు విరివిగా రావల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది ఈ వ్యాసం.

    Reply
  2. 2

    Dr. Uma

    చాలా చక్కని వ్యాసం చదివాను. కనుమరుగు అవుతున్న పుస్తక పఠనం గురించిన ఆలోచనలు హృదయాన్ని కదిలించాయి

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    చాలా వివరంగా మనకి కర్తవ్యాన్ని బోధించిన వ్యాసం.🙏🏻

    Reply
  4. 4

    ASURI HANUMATHSURI

    రచయితల దృష్టి కోణాన్ని మార్చగల చక్కటి సమీక్ష. రచయితల్ని ఒక్క క్షణం ఆలోచింపచేసే మంచి వ్యాసం. రచయితలు ముందుగా మంచి పాఠకులు అవ్వాలని చెప్పే రచన. రచయిత కృష్ణ చైతన్య కు హ్యాట్సాఫ్.

    Reply
  5. 5

    Garipelli ashok

    ఒక మంచి వ్యాసం. అందరికీ అవసరమే…….అభినందనలు….. గరిపెల్లి అశోక్

    Reply
  6. 6

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    గతంలో కృష్ణచైతన్య వ్యంగ్య పూరిత బాణాలతో లాంటి వ్యాసాలు చదివాను. నిర్మొహమాటంగా చీల్చిచెండాడడం చూసాను.
    కానీ వివేచనా పూరితమైన ఈ వ్యాసం చాలా సంయమనంతో, ఇతర భాషా రచయితలు ముఖ్యంగా ఆంగ్ల రచయితలు అనుసరిస్తున్న విధానాలు, తమ సాహిత్యాన్ని నిలబెట్టుకోవడానికి వారు చేసే ప్రయత్నాలను చిత్తశుద్ధితో వివరించారు. తెలుగు సాహిత్యం, తెలుగు కవులు రచయితలు కూడా ఇలాంటి మార్గంలో నిజాయితీతో తమ సాహిత్యాన్ని నిలబెట్టుకోవడానికి బలంగా కృషి చేస్తే ఎంత బాగుంటుందీ అనే అందమైన ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. కానీ ఎవరికి వారు “గీతలు” గీసుకుని, ” గోడలు” కట్టుకుంటున్న సంకుచిత ప్రవర్తనలు ఉన్న నేటి పరిస్థితుల్లో సాధ్యమా అనిపిస్తోంది. ఇతర దేశాల్లోని లైబ్రరీలు, ప్రచురణ సంస్థలు, రచయితలు ఒకే స్థిరమైన ఆశయం, పట్టుదలతో తమ సాహిత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చూస్తుంటే ముచ్చటగా ఉంది.
    చాలా వినూత్నమైన వ్యాసం. వారి ప్రయత్నాలు, కృషి గురించి చాలా విషయాలు తెలిసాయి. తెలుగు భాష లో ఈనాటి పరిస్థితుల్లో –
    “అందుకే తెలుగు సాహిత్య ప్రేమికులంతా ఏకమై…” అది సాధ్యపడుతుందా కృష్ణచైతన్యా!

    Reply
  7. 7

    Ravinder Gajula

    చాలా చక్కని వ్యాసం ఈరోజు తెలుగు రచయితలు కవులు అందరూ చదవాల్సిన వ్యాసం. చదవడమే కాదు పునరాలోచించాల్సిన విషయం.ఇజాలు ఎన్ని ఉన్నా సాహిత్యాన్ని సాహిత్యంగా అధ్యయనం చేసి సమాజానికి అందించాల్సిన అవసరాన్ని చక్కగా వివరించారు

    Reply
  8. 8

    శీలా సుభద్రాదేవి

    చాలా అవసరమైన వ్యాసం.అంతేకాకుండా మూసివేయబడుతున్నపుస్తకాలషాపులగురించి వచ్చిన ఇతర భాషానవలల పరిచయంతో రచయితలు ఏకంకావలసిన అవసరాన్ని తెలియజేసారు.
    సాహిత్యం తెలిసిన మూతపడిన పుస్తకాల షాపు యజమాని గురించిన కథ పదేళ్ళ క్రితం అరుణ పప్పు చాలా గొప్పగా రాసింది.ఆ కథ గుర్తు వచ్చింది.
    చదవాల్సిన రచనలను పరిచయం చేసిన కృష్ణచైతన్య కు అభినందనలు

    Reply
  9. 9

    V durga prasad

    మంచి వ్యాసం.
    పుస్తకాలు చదివే దిశగా యువతిని ఆకర్షితులను చేయాలంటే, వాళ్ళ విద్యాభ్యాసం లో ఒక 20 మార్కుల పరీక్ష తప్పనిసరి చేయాలి..అది సమాజంలో మంచి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల లో ఏవో 5 పుస్తకాలను చదివి సమీక్షలు రాయ మని అప్పుడే 20 మార్కులు లభించాలి.
    అలాగే సభలలో పుష్ప గుచ్చాలకి బదులు పుస్తకాలు ఇచ్చే సంస్కృతి ని ప్రభుత్వ పరమయిన ఆదేశాల తో వృద్ధి చేయచ్చు.
    గ్రంధాలయాల వృద్ధి కోసం కొంత నిధులు కేటాయించి ప్రభుత్వం ఆ వ్యవస్థ ని బతికించాలి. ఇలాంటి అనేక సంస్కరణలు తెస్తే కానీ పుస్తక పఠనం ప్రమాదపు అంచులనుండి బయటపడదు. దృశ్య విధానా నానికిఅలవాటు పడుతున్న నేటి జనం సృజనాత్మక త చేంజ్ కోల్పోతున్నారు.

    Reply
  10. 10

    మధు చిత్తర్వు

    వ్యాసం చాలా బావుంది.
    సప్త వర్ణాలు కలిస్తే నే సాహిత్యం.తెలుగులో అన్ని రకాల భావాలు, జానర్ లలో ని మంచి సాహిత్యాన్ని గమనించి చదవాలి అనే పరిస్థితి లేదు.వారి భావజాలం ఉత్తమ మైనది అవే ఉత్తమ కథలు అని ప్రకటిస్తుంటారు‌.ఇది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది.పాఠకులు వేరే విధంగా ఓటీటీ టీవీ మొబైల్ ఫోన్ లో ఆప్ లో ఉచితం గా వారి కి కావలసిన సాహిత్యం చదువుతున్నారు.పుస్తకాలు కొని చదివి అభిప్రాయం మంచో చెడో చెప్పే సమయం కూడా లేదు.ఇది వేగవంతంమైన సమాజం.Choices are many.
    ఈ వ్యాసం లో కొన్ని పదాలు సముచితం గా వున్నాయి.సాహిత్యంలో అస్ప్రృశ్యత‌..
    రంగుటద్దాలు.
    ప్రాచీన సాహిత్యాన్ని తృణీకరించడం,…
    పుస్తకాలు అమ్ముడు పోవడం లేదు నిజానికి, దీనికి చాలా కారణాలు ఉన్నాయి.కానీ రచయితలు పరస్పర పొగడ్తలు ప్రశంసలు తో, బెస్ట్ సెల్లెర్స్ అనుకుని సంతోష పడటం ప్రచారం చేయడం‌‌.దీని వల్ల కృత్రిమ వాతావరణం ఏర్పడి ఏ సమూహానికి చెందకుండా రాసుకునే రచయితలకి ఒక నిరాశ నిస్పృహ కలుగుతున్నాయి.ఏ‌ టాలెంట్ లేని రచయితలకి లేని పోని అహం ఏర్పడి ,ఆ తర్వాత నిజం తెలిసి నిరాశ కలిగించే అవకాశం ఏర్పడుతుంది.కారణం ఏదయినా కానీ ఇతర భాషల రచనల ప్రచారం, మన తెలుగు రచనల విలువలే లేవని తగ్గించుకోవడం, జరుగుతూ వుంది‌. బాగా లేక పోయినా సరే ఇతర భాషల రచయితల ని ఒక ఉన్నత స్థాయి లో ఉంచడం కనిపిస్తుంది.నా వుద్దేశ్యం లో తెలుగు రచయితలు ఏమాత్రం తక్కువ కాదు.
    నిజానికి ఈ ప్రచారం, ప్రమోషన్ ప్రచురణ సంస్థలు చేయాలి.పుస్తకాల సరఫరా ఎక్కువ,కొనేది తక్కువ (demand and supply)అయినా తెలుగు రచయితలు రచనలు పుంఖానుపుంఖాలుగా రచించడం సొంతంగా ప్రచురణ చేసి మార్కెట్లోకి విడుదల చేసుకోవడం ఒక గొప్ప విషయం.ఏ భాష సాహిత్యం లో కూడా జరగని విషయం. ‌
    తెలుగు సాహిత్య రచన ఒక కుటీర పరిశ్రమ లా మారిన ప్రస్తుత వాతావరణం లో మంచి రచనలను కొని చదివింపజేసే నూతన విధానాలు విమర్శలు చర్చలు కావాలి.అలా అని నిరాశ తో ఏమీ చేయకుండా మనం రాయాలి అనుకున్నది రాయకుండా వుంటే
    ఇదే థోరణి ప్రబలి తెలుగు సాహిత్యం వెనుక బడి పోవడం కాకుండా, ఎక్కువ మంది మంచి రచయితలు గుర్తింపు లేకుండా కాలగర్భంలో కలిసిపోయి, కొంత మంది కొన్ని భావాలతో రాసిన వే గొప్ప సాహిత్యం గా మిగిలిపోతాయి.

    Reply
  11. 11

    Dr Nagasuri Venugopal

    మంచి పరిశోధనతో అవసరమైన సమయంలో వచ్చిన విలువైన వ్యాసం ఇది. పరిష్కారాలు కూడా సృజనాత్మకంగా ఉంటాయని కూడా మనకు ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది.
    కృష్ణ చైతన్యకూ అలాగే సంచికకూ అభినందనపూర్వక ధన్యవాదాలు! ఈ వ్యాసాన్ని ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాను.
    — డా నాగసూరి వేణుగోపాల్

    Reply
  12. 12

    RATHOD SRAVAN

    చాలా చాలా బాగా రాసారు. ఈ వాస్యం చాలా విలువలతో కూడుకుంది. నేటి కాలంలో యువత రంగుల ప్రపంచంలో మునిగి తెలుతున్నారు.ఇలాంటి వ్యాసాలు చదివితే యువతలో మార్పు వచ్చే అవకాశం మాత్రం లేక పోలేదు. చక్కటి వ్యాసం రచించిన వ్యాసకర్త కృష్ణ చైతన్య గారికి హృదయ పూర్వక అభినందనలు….
    రచయిత రాథోడ్ శ్రావణ్ పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక ఆదిలాబాద్, జిల్లా తెలంగాణ.

    Reply
  13. 13

    M Rajendra Prasad

    వ్యాసం బాగుంది. చక్కగా ఆలోచింప చేసే వ్యాసం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్యను మిగిలినవారు, వేరే దేశాల్లోని వారు ఎలా ఎదుర్కొంటున్నారు అనే వివేచన చేసే మంచి వ్యాసం.
    …….మద్దూరి రాజేంద్ర ప్రసాద్

    Reply
  14. 14

    ఏల్చూరి మురళీధరరావు

    శ్రీ కృష్ణచైతన్య గారు ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టి పట్టి చదవవలసిన వినూత్న ప్రపంచాన్ని కన్నుల ముందు నిలబెట్టారు. తెలుగువారు సృష్టించుకొన్న జాతి, కుల, మత, ప్రాంతీయ విభేదాల hurdles మీది నుంచి దూకుతూ రచయితలు పడుతున్న కష్టాలకు ఆచరణీయ పరిష్కార మార్గాలను విశ్వసాహిత్య నైపథ్యానుసంజనతో చక్కగా ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలో ఆసాంతం ఒక్క బిగిని చదివించిన హృద్యమైన వ్యాసం ఇది. వ్యాసకర్త శ్రీ కృష్ణచైతన్య గారికి, ప్రకటించిన ‘సంచిక’ సంపాదక వర్గానికి సాభినందన ధన్యవాదాలు.

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పువ్వాడ శారద గారి వ్యాఖ్య: *నేడు పాఠకులు తగ్గి పోయారు. శ్రోతలు, ప్రేక్షకులే ఎక్కువయ్యారు. కాలమార్పు అనుకుని వదిలేయకుండా, తెలుగు సాహిత్యం
    నిలదొక్కు కోవాలని కృష్ణ చైతన్య గారు చెప్పిన విషయం బాగుంది. తెలుగు సాహిత్యం కంటే ముందు, తెలుగు భాష నిలబడాలి. ఫేస్‌బుక్ ల్లోనో, గ్రూప్ ల్లోనో, వెబ్ మ్యాగజైన్స్ లోనో ఎక్కువగా ఒక తరం వారు, రచనా వ్యాసంగం కొన సాగిస్తున్నారు. లేకపోతే మూతపడిన ఎన్నో పత్రికలతో తెలుగు సాహిత్యం కూడా అటకెక్కేదేమో! ఈ కాలం వారిలో తెలుగు భాష పై పఠనాభిలాష కలిగించే అవసరం ఎంతైనా ఉంది. ఎంత చెత్తగా ఉన్నా తెలుగు సినిమా చూస్తారు. కానీ తెలుగు నవలా సాహిత్యం పట్ల ఆసక్తి ఉండదు. అంతగా బుక్ చదవాలంటే ఏ ఇంగ్లీష్ నవలనో చదువుతారు.
    ఆ స్థాయి తెలుగు సాహిత్యంలో వారికి కనబడదా! లేక తెలుగు భాష చదవడం ఇబ్బందినా? తెలుగు చదివే ఒక తరం తగ్గడం వల్లే, తెలుగు సాహిత్య మనుగడ గురించి ఆలోచించే పరిస్థితి వచ్చిందేమోననిపిస్తోంది.
    మరో పది కాలాలు తెలుగు సాహిత్యం నిలబడాలనే అందరి ఆశాభావం కూడా!- పువ్వాడ శారద*

    Reply
  16. 16

    Shyam kumar chagal

    తెలుగు రచయితలు అందరూ కలిసి ఒక తాటిపై నిలిచి ఏ పని చేయరు. ఇది జీవిత సత్యం. తెలుగు సాహిత్యం చదివే వారి సంఖ్య నానాటికి తగ్గి పోతోంది . దీని కారణం మన విద్యా వ్యవస్థలో తెలుగు భాషకు ప్రాముఖ్యత లేకుండా పోవడం.
    అసలు, పుస్తకాలు చదివే వారు లేకపోవడంతో వాటిని అమ్మే దుకాణాలు కూడా కరువైపోయాయి. ఒకప్పుడు చిన్న చిన్న పాన్ షాపులో కూడా వార్తాపత్రికలు ,వార పత్రికలు అమ్మే వారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవన్నీ ?
    ఈ మధ్యన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకి పుస్తకాలు కొని, చదివించడం అలవాటు చేస్తున్నారు. కానీ అవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు.
    తెలుగు పుస్తకాలు చదవాలంటే ముందుగా పిల్లలకి తెలుగు భాష చదవడం రావాలి కదా.
    చాలామంది తెలుగువారింట్లో తల్లిదండ్రులు పిల్లలతోటి ఇంగ్లీష్ లో నే మాట్లాడడం జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థులు
    ప్రస్తుతం స్కూళ్లలో నేర్చుకుంటున్న కొద్దిపాటి తెలుగు భాష తో, కథలను చదవడానికి ఇబ్బంది పడటం చూశాను.
    చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసంలోనే, మన పాఠశాలల్లో తెలుగు భాషకు కావాల్సినంత సహకారం మరియు ప్రాముఖ్యత ప్రభుత్వం కల్పిస్తేనే కానీ భవిష్యత్తులో తెలుగు పుస్తకాలు చదివే పాఠకులు ఉంటారు. లేదంటే ఈ ఆంగ్ల మాధ్యమ చదువుల్లో మన భాష, సాహిత్యం, మన పాఠకులు శిలాజాల లాగా మారిపోవడం ఖాయం.

    మంచి వ్యాసాన్ని అందించిన చైతన్య గారికి మరియు
    సంచిక కి నా అభినందనలు.

    Reply
  17. 17

    భక్తవత్సల రెడ్డి నాగపట్ల

    ఆలోచింపచేసే జేసే చక్కటి వ్యాసం. కార్యోన్ముఖులుకండి అని ఉద్బోధిస్తున్న వ్యాసం. ఎంత మంది నడుం బిగిస్తారో చూద్దాం. దీనికి సృజనాత్మక రచనలు కానవసరం లేదు. కృష్ణచైతన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!