[యూరప్‌లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]
జనవరి 2020లో పారిస్ సిటీ చూసిన తర్వాత మేము యూరప్ లోని ఒకటైన ఫాస్ట్ ట్రైన్స్ Thalys లో ముందుగా రిజర్వేషన్ చేసుకుని నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్కి వెళ్ళాం. వాళ్ల టైం జోన్ ప్రకారం ఈవినింగ్ అయింది మేము చేరేటప్పటికి.
ట్రైన్ స్టేషన్ నుండి మేము వెళ్లాల్సిన హోటల్‌కి మన మెట్రో లాంటి ట్రైన్ ఎక్కి వెళ్ళాం. మా హోటల్ ఆ మెట్రో స్టేషన్‌కి పక్కనే ఉంది. స్టేషన్ ఎగ్జిట్ మెట్లు దిగి రాంగానే ఎడమవైపున మా హోటల్ కనబడింది. అప్పుడు అక్కడి వాతావరణం చాలా చల్లగా, విపరీతమైన బలమైన గాలులతో ఉంది. నేను చదివిన కటాబాటిక్ గాలులు గుర్తుకొచ్చాయి. ముందుకు నడుస్తుంటే చల్లని గాలులు వేగంగా వెనక నుండి తోస్తున్నాయి. ఫ్రెష్ అయిన తర్వాత మేము దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్‌కి వెళ్ళటానికి బయటకు వచ్చాము.
హోటల్ స్టాఫ్ చెప్పిన గుర్తుల ప్రకారం పేవ్మెంట్ మీద నడుచుకుంటూ సూపర్ మార్కెట్‌ని వెతుకుతూ వెళ్ళాం. గాలులు మమ్మల్ని బలంగా ముందుకు తోస్తుంటే చలికి వణుకుతూ నడిచాం. అప్పటికి మూడు నాలుగు లేయర్ల ఉలెన్స్ వేసుకున్నాం. అయినా కొరికేస్తున్న చలి. ఆ చలిని ఎంజాయ్ చేస్తూ ముందుకు నడిచాను. మాకు కావాల్సిన షాప్ దాదాపు ఒక కిలోమీటర్ తర్వాత కనబడింది. అందులో మాకు కావాల్సిన కాఫీ, టీ, మిల్క్ షుగరు, స్నాక్స్, ఫ్రూట్స్ బ్రెడ్ లాంటివి కొనుక్కుని హోటల్‌కి తిరిగి వచ్చాం. కెటిల్లో తయారు చేసుకున్న వేడి కాఫీ తాగి, తెచ్చుకున్న బ్రెడ్ తిని మర్నాడు చూడాల్సిన ప్రదేశాలు ఏమి ఉన్నాయో, ఎలా వెళ్ళాలి? అనేవి తెలుసుకుని ప్లాన్ చేసుకున్నాము.
మర్నాడు ఉదయమే మా హోటల్‌కి ఎదురుగ ఉన్న ట్రామ్ స్టాప్‌లో ట్రామ్ ఎక్కి ఆమ్స్టర్డామ్ లోని ప్రసిద్ధ World War Memorial Anne Frank Museum కి వెళ్ళాము.
అది – రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో Hitler జరిపించిన సైనిక దురాగతాలకి ప్రజలు ఎలా కష్టపడ్డారో తెలుసుకుని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
టికెట్లు తీసుకొని లోపలికి వెళ్లాము. అప్పటికే చాలా మంది సందర్శకులు అక్కడ ఉన్నారు. అందరికీ audio set ఒకటి ఇచ్చారు. ఒక క్రమ పద్ధతిలో అందర్ని గైడ్ చేస్తూ లోపలికి తీసుకెళ్ళారు. Audio set లో మనకి వచ్చిన language select చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ గదులలో ప్రదర్శనకు పెట్టిన photos, objects గురించిన సంగతులు తెలుస్తాయి.
యుద్ధ సమయంలో నాజీలకి దొరక్కుండా Anne Frank కుటుంబ సభ్యులు అక్కడ రహస్యంగా ఎలా ఉన్నారు? బైట తిరుగుతున్న సైనిక దళాలకు కనపడకుండా ఎలా జాగ్రత్త పడ్డారు? రహస్య అటక మీద వాసన, పొగ రాకుండా వంట ఎలా వండుకున్నారు వంటి అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి.
వారి రహస్య జీవితం మన ఊహకి అందనిది. యుద్ధం హింస ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం కావటం కష్టం. అది అనుభవించిన వాళ్ళకే తెలియాలి.
అక్కడ మమ్మల్ని ఇరుకు మెట్ల మీదుగా ఒక్కొక్క గది లోపల చూపిస్తూ వివరిస్తూ చూపించారు. రహస్య ద్వారం బుక్ షెల్ఫ్‌లా కనిపడేదాని వెనక ఉంది. అందులోంచి అటక మీద వారి బస. పగలు నిశ్శబ్దంగా ఉంటూ సాయంత్రం వేళల్లో అంతే నిశ్శబ్దంగా సైనికుల కంటపడకుండా ఎలా ఉన్నారో వివరిస్తూ ఉంటే ఒళ్లు జలదరించింది. మనస్సు భయంతో వణికిపోయింది.
అటక గదిలో అందరూ తెల్లవారుఝాము లోపల అన్నిపనులు పూర్తి చేసుకుని రోజంతా శబ్దం రాకుండా జాగ్రత్తగా ఉన్నారట. ఎవ్వరికీ కనపడకుండా, వినపడకుండా, చిమ్నీ నుండి వంట పొగలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారట.
అలాంటి పరిస్థితుల్లో భీకర ప్రపంచ యుద్ధంలో భయపడుతూ జీవనం. పుట్టిన రోజులు, పండగలు అజ్ఞాతం లోనే.
కానీ ఒకరోజు వారి జీవితాలకు ఎండ్ కార్డ్ పడింది. నమ్మిన వారే కారణమట.
అన్నే ఫ్రాంక్ మరణించినప్పుడు ఆమె వయస్సు కేవలం 15 సంవత్సరాలు, కానీ ఆమె డైరీ బహుశా నాజీ ఆక్రమణలో జీవితం మరియు యూదులు అనుభవించిన హింసను వివరిస్తుంది ఆమె కోణంలో.
జ్యూయిష్ ఫ్రాంక్ కుటుంబం నాజీలచే బంధించబడకుండా తప్పించుకోవడానికి అన్నే తండ్రికి చెందిన కంపెనీ ఆవరణలో రహస్య అటక గదుల్లోకి మారింది. వారు అక్కడ వాన్ పెల్స్ అనే మరొక యూదు కుటుంబంతో మరియు తరువాత, ఫ్రిట్జ్ ఫీఫెర్ అనే యూదు దంతవైద్యునితో నివసించారు.
అన్నే ఫ్రాంక్ పూర్తి పేరు అన్నెలీస్ మేరీ ఫ్రాంక్.
అన్నే తండ్రి, ఒట్టో, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ సైన్యంలో పనిచేసిన జర్మన్ వ్యాపారవేత్త. నాజీల పెరుగుతున్న సెమిటిజం నేపథ్యంలో, ఒట్టో తన కుటుంబాన్ని 1933 శరదృతువులో ఆమ్స్టర్డామ్కు తరలించాడు. అక్కడ, అతను జామ్ తయారీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు మరియు పెక్టిన్లను విక్రయించే కంపెనీని నడిపాడు.
వారి అరెస్టు తరువాత, అనెక్స్ నివాసితులు మొదట నెదర్లాండ్స్‌లోని వెస్టర్బోర్క్ ట్రాన్సిట్ క్యాంప్‌కు, తరువాత పోలాండ్లోని అపఖ్యాతి పాలైన ఆష్విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు తీసుకెళ్లబడ్డారు. ఈ సమయంలో పురుషులు మరియు మహిళలు విడిపోయారు.
అనెక్స్ నివాసితులను అరెస్టు చేసిన తరువాత, అన్నే డైరీని ఫ్రాంక్ కుటుంబానికి చెందిన విశ్వసనీయ స్నేహితుడు మీప్ గీస్ తిరిగి పొందారు, వారు అజ్ఞాతంలో ఉన్న సమయంలో వారికి సహాయం చేశారు. గీస్ డైరీని డెస్క్ డ్రాయర్లో ఉంచాడు. అన్నే మరణాన్ని ధృవీకరించిన తర్వాత జూలై 1945 లో ఒట్టోకు ఇచ్చాడు.
ఆ డైరీ 70 భాషలలోకి అనువదించబడింది. 30 మిలియన్లకు పైగా కాపీలు ప్రచురించబడ్డాయి
అదేమీ కాలవైపరిత్యమో కానీ ప్రపంచ యుద్ధాల నుండి నేర్చుకున్న గుణపాఠాలు మర్చిపోతున్నారు.
Photos: Mr. D. Nagarjuna
(వచ్చే వారం కలుద్దాం)
డి. చాముండేశ్వరి రిటైర్డ్ సోషల్ స్టడీస్, తెలుగు ఉపాధ్యాయిని. దశాబ్దాల పాటు హైస్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించారు. యాత్రలు, గార్డెనింగ్, కథారచనలో అభిరుచి. బహుముఖీన వ్యక్తిత్వం గల రచయిత్రి ఇటీవల బాలల కథలు వ్రాసి, వాటికి బొమ్మలు గీశారు.
మీ యాత్రానుభవాలు బాగున్నాయండీ
యాత్రా కథనం గ్రాఫికల్ గా బాగుంది
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 9
అందమైన తెలుగు చిత్రం ‘పంతులమ్మ’
నవ్య శకలం
గుబులు
నేను గాలి భూతాన్ని
ఆశల నానీలు 3
ఉగాది బాల కథల పోటీ ఫలితాల ప్రకటన
తదనంతరం
కాజాల్లాంటి బాజాలు-20: మాఘమాసం ముచ్చట్లు..
జీవన రమణీయం-42
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®