మెరవడం, ఉరమడం ఆకాశం సొత్తు కాదు అది ఈ భూమ్మీద మొలకెత్తిన పచ్చని గడ్డిపువ్వు తెగువ కూడా గడ్డిపువ్వు మెత్తనైన మనసు కలది కాని అనంతమైన ఆకాశపు పిడుగుల గర్జనకు ఏ మాత్రం చలించదు
అది రొమ్ము విరుచుకుని ఆత్మవిశ్వాసంతో, పదునైన చిరునవ్వుతో మోర ఎత్తుకుని నింగికేసి చురుకైన చూపులను చురకత్తుల వలె విసురుతుంటుంది
ఆకాశం తన విశాలమైన శరీరంతో, మరింత నల్లగా మారి తుఫానులను సృష్టించినా, అవి వరదలై వెల్లువలా మారి గడ్డిపువ్వును కర్కశంగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఎన్కౌంటర్ చెయ్యచ్చు
పువ్వురాలిందనే అమానుష తృప్తితో తను సృష్టించిన విధ్వంసాన్ని దాని తల ప్రక్కన పడేసి సంతృప్తితో వెళ్లిపోవచ్చు మళ్లీ వేకువకి మరో పసుపచ్చని మెత్తనైన గడ్డిపువ్వు అదే చిరునవ్వుతో, ఆకాశం కేసి తలెత్తుకుని నవ్వూతూనే వుంటుంది
అలసిన ఆకాశం, గెలిచానన్న తృప్తి ముఖంలో మెరవకముందే జరిగిన హత్యకు రంగులు పులుముకునేదానికి నానా తిప్పలు పడక తప్పదు
భూమి గర్భాన కన్నపేగు తెగుండొచ్చు ఆ కన్నపేగును చీల్చుకుని, వేలాది పచ్చని గడ్డిపువ్వులు ఈ భూమ్మీద తడి ఆరని రక్తపు గురుతులు సాక్షిగా ఎర్రని వేకువలని పూయిస్తూనే వుంటాయి.
తిరుపతికి చెందిన 42 ఏళ్ళ ఎం.కె. కుమార్ వర్ధమాన రచయిత. సమకాలీన అంశాలపై 500లకి పైగా రచనలు చేశారు. అవన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమయ్యయి. 20 కవితలు, 15 కథలు వివిధ ప్రింట్, వెబ్ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నాన్న లేని కొడుకు-2
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -7
మరో మనిషి
మలిసంజ కెంజాయ! -10
పాపం కోటిగాడు
సామెత కథల ఆమెత-10
మరుగునపడ్డ మాణిక్యాలు – 11: లక్ బై చాన్స్
మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-1
సమాజం ఎటు పోతున్నది
జీవన రమణీయం-50
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®