సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా
    9866252002.

    Reply
  2. 2

    Sagar

    మీరన్నట్లు సంపాదించడం మాత్రమే కాదు సర్ . దానిని నిలబెట్టుకునే వ్యక్తిత్వమూ అలవడాలి. నా కనులముందు కూడ అలా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవంగ మాట్లాడాలి అంటే నేను కూడ ఒక సందర్భంలో ఆ విదంగ ఖర్చుచేసిన వాడినే. తరువాత తెప్పరిల్లి ఉన్నంతలో సాగుతున్నా. మంచి విషయాలతో జీవనశైలిని నేర్పిస్తున్న మీకు ధన్యవాదములు సర్

    Reply
  3. 3

    Rajendra+Prasad

    Yes Sir. The Family example is so well placed before our eyes that reflects the lives of many poor people in E.G Dist. Many poor people’s financial position is lifted but a few couldn’t retain the prosperity they gained. Even today, many are sacrificing family life for survival.
    – Rajendra Prasad

    Reply
  4. 4

    samsundar.yeeda@gmail.com

    నిజాలు నిష్టూరంగా ఉంటాయి అనటానికి ఇదే ఉదాహరణ..చాలా బాగా చెప్పారు…మన వాళ్ళైనా కాకపోయినా ప్రాథమిక సూత్రాలు పాటించకపోతే నష్టపోతారు అని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మీ యొక్క రచనా ప్రయాణం సుదూర తీరాలకు చేరాలని మా ఆకాంక్ష…

    Reply
    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు శ్యామ్.
      చాలా కాలానికి
      నీ స్పందన చదివాను.

      Reply
  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఒకవ్యక్తి గాని, కుటుంబం గాని
    ఉండే స్థితిగతులకు ఖచ్చితంగా ఇదే కారణం అని చెప్పలేంకదా సార్ !
    అనుకున్నామని జరగవు అన్నీ,
    అనుకోలేదని ఆగవు కొన్ని !
    ఎంత తార్కి క దృష్టితో… ఎంతగొప్ప సత్యాన్ని చెప్పాడాకవి 🙏💐🙏
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  6. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నిజమే , పుట్టుకతో పేదరికం ఉండొచ్చు కాని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యడం మన బాధ్యతే , సందేహమేలేదు …
    కాని పేదవాడి పైనే తమపబ్బంగడుపుకుంటున్న నేటి మనయేలికల కారణంగా ప్రజాస్వామ్య మనేది ఒక మేడిపండు రీతిలోకి మారింది .. అందుకే ఆరుద్ర గారు చిరాకెత్తి
    మనప్రజాస్వామ్యం
    ఒక మేడిపండు
    మన దరిద్రం
    ఒక రాచపుండు
    అన్నాడు ….
    ఈ దేశం లో అవకాశాలు సన్నగిల్లడం పాలకుల స్వార్థాలకు పేదలు బలికావడాన్ని మీరుఉపోద్ఘాతంగా చెప్పిన మాటలు వందశాతం కరెక్టే ..
    అట్లా దేశాంతరాలకు వెళ్ళి కష్టపడి సంపాదించి ఎదిగినా , ఆ కష్టార్జితాన్ని నిలబెట్టకోవడం లో సంయమనం లేకపోతే మీరు చెప్పిన మీతమ్ముని ఉదంతం ఉత్తమనిదర్శనం…
    ఇటువంటి ఇతివృత్తం తోనే మనవేదిక లో రాజ్ కుమార్
    “ పులిస్వారీ “ అని ఒక నాటిక ప్రదర్శించారు .. దాదాపుగా అది ఇట్లాంటి కథే ..
    సంపాదన విషయం లో తగిన నియంత్రణ ఉండటానికి ముందుగా కావలసింది మనం మన పూర్వస్థితిని విస్మరించరాదన్న విషయం మీ కథనం లో ధ్వనిస్తూ ఉంది …. మనం ఎన్ని ఇబ్బందలనెదుర్కున్నామో, ఎందుకు ఎదుర్కోవలసి వస్తున్నదో మనం మరచిపోక పోతే మనమీద మనకు నియంత్రణ సాధ్యమౌతుంది …
    మన చర్యలవల్ల మనతదనంతరం మనవాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్న పలు విషయాలతో ఇప్పటి తరానికి అవసరమైన విషయాన్ని వివరించారు …
    అభినందనలు సర్ !!!!
    –గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    అమెరికా (హన్మకొండ)

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      గురువుగారు
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ.

      Reply
  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంపాదించడం ఎంత కష్టమో నిల బెట్టు కోవటం అంతే కష్టం. మీరు చెప్పిన మాట సత్యం అన్నయ్య గారు.పేద వారు మోస పూరి త వాగ్దానాలు అని గ్రహించ క నమ్మి మోసపోతునే వున్నారు.నెరవేర్చాలని అడగా లేక పోతు న్నారు.ప్రజలలో మార్పు రావాలి.
    —శ్రీమతి అలెగ్జాండర్
    అమెరికా.

    Reply
    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  8. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    డాక్టర్ గారూ ! జ్ఞాపకాల పందిరి 105 సందేశాత్మకంగా ఉంది . ‘పేదవాడుగా మరణించడం నేరం ‘…ఇది చాలా నిజం సార్ . ఏదైనా ఒక ప్రణాళికతో ,క్రమశిక్షణతో చేయాలనేది కూడా నిజం . ఏదేమైనా వ్యక్తిగత అనుభవాలను సమాజపరం చేస్తూ రాస్తున్న మీ రచనలు చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతాయి .అభినందనలు సార్ .–మెట్టు మురళీధర్
    హన్మకొండ.

    Reply
    1. 8.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  9. 9

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    KRUSHITHO PATTUDALATHO PRAYATHNISTHE SADHINCHALEKAPOVADAM ANTOO VUNDADANI EE EPISODE LO MAROKKAMAARU NIROOPINCHABADINDI..

    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      రావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  10. 10

    డి. వి. శేషాచార్య

    చాలా అమూల్యమైన విషయాల్ని తెలియజేసారు.
    ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో తెలిపే మీ సందేశం సరళంగా సూటిగా ఉంది.

    Reply
    1. 10.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మిత్రమా
      మీ స్పందనకు ధన్యవాదాలండీ.

      Reply
  11. 11

    Shyam Kumar Chagal. నిజామాబాద్

    ముందు ముందుగా తను చెప్పదలచుకున్న విషయానికి వివరణాత్మక పరిచయ వాక్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా అందంగా పరిపక్వతతో మన ముందుంచడం రచయిత గారికి వెన్నతో పెట్టిన విద్య అని అర్థమవుతుంది.

    పేదరికం పేదరికం అనే చర్చ తో మొదలుపెట్టి ప్రభుత్వాలు వాటి పేరున ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్న యి అనే విషయాన్ని చర్చకు తీసుకుని వచ్చారు డాక్టర్ కె. ఎల్ వి ప్రసాద్ గారు.

    ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు లేదా వివిధ పార్టీలు ఎరచూపి ఓట్లు వేయించుకునే హామీల మీద ప్రజలు ఆధారపడటం మానివేసి ఏ విధంగా భవిష్యత్తును నిర్మించు కోవాలి అన్నది రచయిత గారు చాలా బాగా వివరించారు. ఆ వివరణాత్మక క్రమంలో పేదవారు ఏ విధంగా గల్ఫ్ దేశాల ఉద్యోగాలలో పడుతున్నారు ఇంకా ఏ విధంగా తమ సంపాదనను దుర్వినియోగం చేసుకుంటున్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ దాన్ని పాఠకుల దృష్టికి తేవడం అన్నది చాలా మంచి విషయం. అయితే ఆ గల్ఫ్ దేశాల సంపాదనను సద్వినియోగం చేసుకొని బాధపడ్డా జీవితాల గురించి కూడా తాను మర్చిపోకుండా ఇక్కడ ఆచితూచి చర్చించడం అన్నది రచయిత యొక్క పరిణితికి నిదర్శనం.
    ఈ క్రమంలో తనకు తెలిసిన కుటుంబాలను ఉదాహరించి పై విషయాలను వారి నిజ జీవితాలకు అన్వయించారు. ఏది ఏమైనా ప్రతి విషయాన్ని తన యొక్క పరిధిలోని ప్రపంచాన్ని చూసి తన పరిశీలనలను మనకు పరిచయం చేయడం రచయిత యొక్క ప్రాథమిక కర్తవ్యం.
    ఈ విధంగా ప్రతి వారం మనకు రచయిత గారు ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చకు తీసుకు రావడం ఆయన యొక్క కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని చెప్పాలి. వారికి నా యొక్క ధన్యవాదములు

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మిత్రమా
      బాగా విశ్లేషించావు.
      మీ వంటి వారి స్పందన నాకు అమూల్యం.
      ధన్యవాదాలు.

      Reply
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    105 వ సంచిక చదివినాను సర్.అన్ని విషయాలలోనూ మంచీ చెడూ ఉన్నాయని మీరన్నమాట నిజం.అవకాశాలను సద్వినియోగంచేసుకోవటంతోపాటు ఒక ప్రణాళిక లేకపోవటం ,పైగా సంపాదనఎక్కువై ఆమోజులో దారితప్పటం మనుషులు చితికి పోవటానికి కారణం.నడమంత్రపు సిరి వస్తే మంచం దిగ తీరదు అన్నమాట కొందరి విషయంలో నిజమే అనిపిస్తూంది.

    ఇంతకంటే చెప్పటానికేమీలేదు.
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీరన్నది నూటికి నూరుపాళ్లు నిజం జీవితంలో ఎదగాలనే తపన ఎంత ఉండాలో సంపదను ఒదిగి ఉంచుకోవడమూ అంతే ముఖ్యం.పేదరికం ఎప్పటికీ తప్పు కాదు మీరన్నట్టు ఆ పేదరికంలోనే మరణించకూడదు. స్వీయ సంపాదన ఎంత అవసరమో స్వీయ నియంత్రణ అంతే అవసరం అంటూ వాస్తవిక సంఘటన ను కళ్ళ ముందుంచి మంచి హెచ్చరిక చేసినందుకు ధన్యవాదాలు సర్🙏🙏💐
    –నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 13.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  14. 14

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 105 లో క్రమశిక్షణ లేకపొతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిపే వివరణ సందేశాత్మకంగా ఉంది.కష్టపడే వారికి ఆర్ధిక క్రమశిక్షణ ఉండాలి,కష్టపడి ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే కష్టానికి ఉన్న విలువ పోగొట్టుకున్నట్లే. పొదుపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి,అంటే ఆదాయం-పొదుపు=ఖర్చులు అనే సూత్రాన్ని అనుసరించాలని మంచి సందేశం ఇచ్చిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్🙏

    Reply
  15. 15

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    చాలా మంచి విషయాలు అవగాహన కల్పిస్తున్నారు సార్. మీరు చెప్పినట్లు అటు ప్రభుత్వ వైఖరి అలాగే ఉంది. ఇటు పేదవారి పరిస్థితి అలాగే ఉంది. నిజాయితీగా నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పే మీ వ్యక్తిత్వం మాకు ఆదర్శం సార్. పేదవారు గా పుట్టటం వారి పరిస్థితిని బట్టి ఉన్నా కష్టపడి సంపాదించి ధనవంతులు గా మరణించడమనేది చాలా గొప్ప విషయం సార్. సమాజ హితమైన మీ వ్యాసం అర్థ వంతమైనది సార్. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు శుభాభినందనలు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!