సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రోజు ఇది అందరు చూసేదే అనుభవించేదే. కాని విధిలేని పరిస్థితి. ప్లాటున్నవాడు ఎప్పుడో ఒకప్పుడు ఇల్లు కట్టాల్సిందే కద! ఇలా జరుగాల్సిందే. ఆ శుభ్రత పాటించడం వాడి చేతిలో కూడా ఉండదు. పనివాళ్ళు ఎంత చెప్పిన వినరు. ఇదీ దేశపరిస్థితి. అనుభవించక తప్పదు.
    ఇక వాహనాల సంగతి. ఇళ్ళు 60 గజాల్లో కడతాడు. వాడికి ఉండడానికే సరిపోదు. ఇంక వాహనమెక్కడ పెడతాడు. లేదా ఇల్లు కట్టేప్పుడు వాహనం కొనుక్కోగలనని వాడు కలగూడ కనడు. కాలప్రభావంతో కొనక తప్పదు. ఎక్కడ పెట్టాలి మరి? వీథే గతి!
    ఇది ఈ దేశ పరిస్థితి. ఏం చేయమంటారు ప్రసాద్ గారు?
    ——ప్రొ.జనార్ధన్ రావు
    ఖాజీపేట.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవును లెండి…ఎవరు మాత్రం ఏమి చేయగలరు?కనీసం మన మురికి వేరే వారికి ఇబ్బంది పెట్టకుండా చూడాలంతే గదండీ..

  3. 3

    Shyam Kumar Chagal

    మన జీవితంలో ఆరోగ్య పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత గురించి మంచి ఉపోద్ఘాతాలతో మరియు ఉదాహరణలతో కూడిన జ్ఞాపకాల పందిరి చాలా బాగుంది.
    రచయిత గారు చర్చించిన విషయాలు చాలావరకు మనకు ప్రతిరోజు కళ్ళముందే కనబడుతూ ఉంటాయి. కాకపోతే వాటిని మనం పట్టించుకోకుండా పరిస్థితి సహిస్తూ జీవనం గడిపేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక ప్లాటు కొనడం దాని సరిహద్దుల వరకు పెద్ద బిల్డింగ్ కట్టడం దాన్ని చూసుకొని మురిసిపోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఒకటి రెండు కార్ల గురించి లేదా మూడు సైకిల్స్ పెట్టుకోవడానికి కావలసిన పార్కింగ్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే ప్లాటు సరిహద్దు నుంచి బయటికి దిగడానికి కావలసిన మెట్లు, వాహనాలు ఎక్కించడానికి దింపడానికి వీలయ్యే ర్యాంపు వగైరాలు కూడా రోడ్డుమీదికి చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయమేమిటంటే ఇంటి ముందట చెట్లు పెట్టుకోడానికి విలేజ్ స్థలాన్ని కూడా ఎవరూ వదలడం లేదు సరి కదా రోడ్డు మీద ఉన్న కాస్త స్థలాన్ని ఆక్రమించి చిన్న ఫెన్సింగ్ చేసి మొక్కలను పెంచుకొని మురిసిపోతున్నారు. వాహనాలు నిలుపుకోవడానికి అందరికీ నీడ కావాలి కానీ ఎవరూ వారి ఇంటి ముందు చెట్లు పెంచరు. ఏతావాత ఒక ట్రెండు చెట్లు పొరపాటున మొలిచినా,వాటి యొక్క ఆకులు వారి ఇంటి ముందు పడి,ఊడవడానికి కష్టమవుతుందని వాటిని కొట్టేస్తూ ఉండడం కూడా నేను చూశాను.
    కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు లేదా ఉన్న ఇంటికి మరమ్మత్తులు చేస్తున్న వాళ్లు, కట్టడానికి కావలసిన ఇసుక సిమెంటు రాళ్లు రప్పలు వాటిని ఇంటి ముందురోడ్డు ఆక్రమించి వాటిని ఇతరులకు ఇబ్బంది కలిగించడం వారి జన్మ హక్కుగా భావిస్తుంటారు. వాటిని అందరూ అంగీకరించడం అన్నది సహజ న్యాయంగా ప్రకటించబడుతూ ఉంది. పండగ పబ్బాలు లేదా ఇంట్లో జరిగే శుభకార్యాలకు, అందరూ వాడుకునే రహదారులే చాలా సౌకర్యంగా ఉండడం గమనిస్తున్నాం.
    ఈ మధ్య జరిగే రాజకీయ స్టంట్ లు కూడా రహదారుల మీద జరిపి ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా చేయడం అన్నది ఒక విపరీత పరిణామం.
    కొన్ని చోట్ల అయితే రహదారి దిగ్బంధనాలు నెలల తరబడి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అక్కడే వంటలు వార్పులు స్నానాలు బాత్రూం బెడ్ రూమ్ లు అన్నీ కట్టుకొని నెలలుగా గడిపేసి ఆ రహదారులను వాడే ప్రయాణికుల గురించి కానీ తోటి ప్రజల గురించి గానీ ఆలోచించకుండా ఒకసారి స్టిక్ ఆనందం పొందే వారి గురించి చెప్పనవసరం లేదు.
    ఇది ముఖ్యంగా ఎంత పెద్ద పట్టణాలు అయితే అంత అధికంగా ఉంది.పల్లెటూర్లలో ఈ జాడ్యం ప్రవేశించలేదు కానీ వారిదైనంది న. కార్యక్రమాలు, పశువులను కట్టి వేయడం లాంటివి చాలావరకు రోడ్లమీద జరుగుతుంటాయి. కాకపోతే ఆ రోడ్లో వాడకం ఎక్కువగా ఉండ దు కాబట్టి ఎవరికి అంత ఇబ్బంది కలిగించదు.
    ఇవన్నీ చూస్తుండడంతో మనిషికి పరిసరాల పరిశుభ్రత, శారీరక ఆరోగ్యం అనేవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది.
    ఈసారి కూడా రచయిత డాక్టర్ కే. ఎల్ వీ ప్రసాద్ గారు సంచిక ద్వారా మంచి శీర్షికను ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా..నా వ్యాసాన్ని మించి విపులంగా వుంది,నీ స్పందన.హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  4. 4

    Bhujanga rao

    మన పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని మన వ్యర్ధాలు మరియు మురికినీరు వేరేవారికి ఇబ్బందీ పెట్టకుండా చూడాలి.ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లాట్ ఉంటే వ్యర్ధాలు ఏ మాత్రం సంకోచించకుండా పడేస్తుంటారు ఎందరినో చూస్తున్నాము. వ్యర్ధాలను సక్రమైన ప్రదేశంలో పారవేయాలి, పరిసరాల శుభ్రతే మన తొలి ప్రాధాన్యం కావాలి.బహిరంగ మురుగు నీరుకు అండర్ డ్రైనేజి అవసరంగా భావించాలి. ప్రజలకు మరియు పాలకులకు చిత్తశుద్ది ఉంటే,వేలాది కోట్ల స్కాములు అపగలిగితే అసాధ్యం కానేరదు.ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిసరాల శుభ్రత గురించి మంచి ఉదాహరణలతో (ఫొటోలు) చక్కటి సంచిక అందించిన మీకు హృదయపూర్వక నమస్కారములు🙏

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

    2. 4.2

      పుట్టి. నాగలక్ష్మి

      పరిశుభ్రత గురించి మీ వివరణ బావుంది.. కొంతమంది వారింట్లోని చెత్తను పక్కింట్లో వేసే వాళ్ళని చూశాం. పట్టణాలు, నగరాలలో ఇళ్ళు కట్టే సమయంలో మీరు చెప్పింది సర్వసాధారణం..మనం సర్దుకుని ముందు కెళ్లక తప్పని పరిస్థితులు..ఏం చేయగలం మరి.

      1. 4.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        అంతే గా మరి
        ధన్యవాదాలు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 158 లో పరిశుభ్రత గురించి రాశారు. పరిశుభ్రత ఆరోగ్యానికి అవసరమని, స్వీయ పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి తెలిపారు. నేటి రోజుల్లో పరిసరాల పరిశుభ్రత గురించి పట్టించుకునేవాళ్ళు బహు అరుదు. చక్కటి కథనం.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 5.1
  6. 6

    Rajendra Prasad

    అందరినీ బాధించే సమస్యను ఏకరువు పెట్టారు. బాగుంది, కానీ మన మందరమూ ఏదో రూపేణా భాద్యులమే. మన ఇంటి ర్యాంపు రోడ్డు పైకి కడతాము. ఇంటి ఫంక్షన్ కు రోడ్డు మోసేటందుకు వెనకాడము. పార్కింగ్ రోడ్డు పై పెట్టి ప్రజలకు నానా ఇబ్బంది కలుగ చేస్తాం. ఎవరికో తప్ప, అధికులకు స్పృహ కూడా ఉండదు తప్పు చేస్తున్నామని. ఈ మధ్య మీరు సమాజంలో ఉన్న చెడును చెండాడుతున్నారు. సంతోషం

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరన్నట్టు తెలిసినవారికి సులభంగా చెప్పవచ్చు ఏమీ తెలియని వానికి సులభతరంగా తెలుపవచ్చు సమస్యల్లా థెలిసీ తెలియని వారితోనే
    తెలియని మనుజుని సుఖముగ
    తెలుపందగు సుఖతరముగ తెలుపగ వచ్చున్
    తెలిసిన వానిని
    తెలిసీతెలియని నరుదెల్ప బ్రహ్మవశమే జగతిన్.
    అని పెద్దలు చెప్పిన్రు.
    కొందరు ” మాఇల్లు శుభ్రంగా వుంటే చాలుననితమచెత్తంతా పక్కింటి వారింటిముందు పోస్తరు.
    ఇకహైదరాబాదు లో ముచ్చట .నేను మాపిల్లలున్న శ్రీనగర్ కాలనీలో చూసిన కారులన్నీ రోడ్లమీదనే రెండు పక్కల కార్లు పార్కు చేస్తే మిగిలేది సగం రోడ్డే.ఒక కారు వస్తే ఎదురుగా ఇంకో కారు పోవటానికి వీలుకాదు . రోడ్డుమీద నీరు, మురికినీరు సరేసరి .యూసఫ్గూడాలోగల్లిలలో రోడ్డుచిన్నగ మురికినీరు ప్రవాహానికి జాగా వదిలితే మిగిలింది నడవటానికి సరిపోదు .దుంకుకుంటూ పోవాలె. కాంపౌండ్లో చెట్లుంటేవపక్కవారితో రోజూ జగడమే.పండ్లచెట్లైతే మరీ పండ్లు కావాలె కాని ఆకు లు అటువేపుపడటానికి వీలులేదు చెట్లు?పర్యావరణకు హితంచేసేవే అన్న సంఖతే గుర్తించరు ..
    ఇక అపార్ట్ మెంట్లది మరో కథ .బయటివారి బండ్లు లోపలికి ర్వద్దు అంటరు అందులో వున్న వారిని కలవటానికి వచ్చేవారు బండ్లు రోడ్ మిద పెట్టాల్నా?.లక్షలుపోసి ఇల్లు కట్టుకొని లోపల పార్కింగ్కు జాగావుంచుకోరు పైగా ఎదురింటి ముందర పెడతారు ఏమన్నంటే రోడ్డు మేసొంతంవకాదుగదా అని దబాయింపు పర్వం ఒకటి .ఇన్ని సమస్యల మధ్య నోరులేనివాళ్ళు నెగ్గుకు రావటం కత్తిమీదసామే.కనుక మనమే కాంప్రమైజ్ కావాలె.
    మీరు చెప్పిన విషయాలన్నీ వంథశాతం నిజం .మనమేమీచేయలేమనేది అంతకంటే నిజం.
    —నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలండీ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctor garu,
    Yesterday I have lodged a complaint with GHMC authorities about dumping of mud & other waste materials opposite our house by the owner of a house under Construction.
    It has become a menace all through the city. To avoid all these nusence, I am going for a walk on our terrace.
    —-suryanarayana rao
    Hyderabad

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    💐🙏ఎస్…. ఎవరి సుఖం వారిది… ఈమధ్య తమ పాత ఇళ్లను అపార్టుమెంట్లకు ఇచ్చేస్తున్నారు… వాళ్ళు పక్కనే ఉన్న ఇళ్లను పట్టించుకోరు !
    మా ఇంటివెనుక ప్రక్కనే ఉన్న రెండిళ్లవాళ్లకలిసి అపార్ట్మెంట్స్ కి ఇచ్చేసారు వాళ్ళు ఆ కంస్ట్రక్షన్ చేసుకుంటూ మమ్మల్ని పట్టించుకోలేదు ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ మా ఇంటి పిట్టగోడను ఆనుకునే….
    వాళ్ళ ఇటికే ముక్కలు, రాయి సిమెంట్ ముద్దలు, కర్రముక్కలు, ధూళి దుమ్ము, చెత్త, చెదారం వీటితో పాటు తీవ్ర శబ్ద కాలుష్యం భరించలేకపోయాం… అదింకా పూర్తికాలేదు మాఇంటిని ఆనుకునే, కుడిప్రక్క అచ్చం అలాంటిదే మరోకంక్ట్రక్షన్…
    ఎన్నిమార్లు చెప్పినా, తిట్టినా addagaa టార్పాలిన్ ఏదైనా కట్టన్ద్రాబాబూ అని ఎంత చెప్పినా వినిపించుకొనకపోతే ఆఖరికి gvmc. వాళ్లకు రిపోర్ట్ చేస్తే… పెట్టామంటే, పెట్టామన్నట్టు చిన్న సిమెంట్ గోనెలలో తయారుజేసిన ఒక్కముక్క అడ్డుగా కట్టారు…
    ఎక్కడా… ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ అపార్టుమెంట్లు పూర్తయేసరికి ప్రక్కనున్నవాళ్ళ ఇల్లు ఒళ్ళు పూర్తిగా పాడై పోతున్నాయి.
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ నరసింహారావు గారు
      కృత జ్ఞత లు సర్ మీకు.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వ్యక్తపరచిన ఈ సమస్యతో ప్రతినిత్యము ప్రత్యక్షంగా విసిగి వేసారి పోయాము. కనులుండి చూడలేక ,మందలించగలిగీ నోరు మెదపక సర్దుకపోతున్న మా పరిస్థితిని ఏమని వర్ణించగలను.
    No more comments!
    —బి.రామ కృష్ణారెడ్డి.
    సికిందరాబాద్.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డిగారూ
      ధన్యవాదములు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!