సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    sagar

    మీరన్నట్లు పదవీ విరమణతో పాటు తోటివారి పదవీ విరమణలను చూసి ఆనందించడం అదృష్టమే. ఆ అదృష్టం పొందిన మీకు శుభాకాంక్షలు. మరియు మంచివ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదములు సర్.

    Reply
  2. 2

    ggmbabu@gmail.com

    ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక అతిముఖ్యమైన అంశం ….. పుట్టిన తరువాత గిట్టడం ఎంత సత్యమో ఉద్యోగంలో చేరిన తరువాత ఎప్పుడోఒకప్పుడు విరమణ తప్పదు ……. మీ వ్యాసంలో మనం ఉద్యోగబాధ్యతలతో బాటు వ్యక్తిగతమైన బాధ్యతలను కూడా పూర్తిచేసుకోవాలన్న మంచి సూచన చేశారు , బాగుంది ” ఉద్యోగo పురుష లక్షణం ” అన్న మాట ఒకటుంది , ఇక్కడ ‘ పురుష ‘ అంటే కేవలం మగవాళ్లేనేమోనని చాలామంది భ్రమపడతారు , పౌరుషమున్న ప్రతి వ్యక్తీ స్త్రీలైనా , మగవారైనా పురుషులే …… దాన్ని కాలక్రమంలో మార్చిపారేశారు ….. ప్రతి మనిషీ తాను ఉద్యోగించే కాలంలోనే తనకుటుంబబాధ్యతలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసుకోగలిగితే మీరన్నటు విరమాణానంతర జీవితం సుఖవంతంగా సాగిపోతుంది , కాకపోతే ఒకళ్ళిద్దరి జీవితాల్లో కొన్నికారణాలవల్ల అది సాధ్యంకాకపోవచ్చు కాని , ప్రతి ఉద్యోగి ఈ విషయంలోమాత్రం జాగ్రత్తగానే ఉండాలి .. వ్యాసం చివర్లో మాంఛి సూచనలాంటి ఒక హెచ్చరికకూడా చేశారు అది అక్షరసత్యం , ప్రతివ్యక్తీ తన జీవనశైలి తన పిల్లలకు ఆదర్శంగా ఉండేటట్టు మలచుకోవాలి . లేని పక్షంలో దాని ఫలితం వృద్ధాప్యంలో కనిపిస్తుందన్న మాట నిజమే ! సందేహపడాల్సిన అవసరమేలేదు .. చక్కని సూచనలతో మంచి వ్యాసం అందించారు డాక్టర్ గారూ ! అభినందనలు .

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  3. 3

    Shyam kumar chagal

    ఆ రోజుల్లో, ఉద్యోగం సంపాదించు కోవటమే జీవితపు ముఖ్య ఉద్దేశంగా ఉండేది. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అంటే మరీను.
    ఉద్యోగపర్వంలో మనము ఎదుర్కొనే ప్రతి విషయాన్ని రచయిత గారు చాలా జాగ్రత్తగా ఎత్తిచూపారు. భావోద్వేగాలు రాగద్వేషాలు కోపాలు తాపాలు అలకలు న్యాయ అన్యాయాలు సుఖదుఃఖాలు ఓటమి విజయాలు అన్నిటినీ ఎదుర్కొంటూ చివరకు పదవీ విరమణ అన్నది బాధాకరమైన సంఘటన అని చెప్పాలి. ఉద్యోగ విరమణ తర్వాత అసలు జీవితం అన్నది మనకు మొదలవుతుందని వ్యక్తిగత అనుభవంతో తెలుసుకున్నాను.
    సరైన ప్రణాళిక ఉన్నవాళ్లు పదవీ విరమణ తర్వాత సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు అనేది చేదు నిజం. ఆ సమయంలో కన్నపిల్లలతో, మనుమలు మనుమరాండ్లతో బంధుమిత్రులతో గడపడం అదృష్టంగా భావిస్తాను.
    డాక్టర్. కి ఎల్వి ప్రసాద్ గారు అన్నట్లుగా కొందరు పదవీ విరమణ తర్వాత వృద్ధాశ్రమంలో గడపడం దురదృష్టకరం.

    సాహితీ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత ఏ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా దాదాపుగా అందరూ పదవీ విరమణ చేసిన వారు లేదా ఆ వయసు వారు మాత్రమే కనబడుతున్నారు.
    పదవి విరమణ అన్నది ప్రభుత్వం వారు ఏర్పరిచిన ఒక మైలురాయి మాత్రమే. సంతోషాలకి అది విరమణ కాదు.
    మంచి విషయాన్ని మన మధ్య ప్రస్తావన కు తెచ్చిన
    డాక్టర్ కె ఎల్ బి ప్రసాద్ గారికి నా యొక్క ధన్యవాదములు

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా చాలా గొప్పగా స్పండించావు.
      ధన్యవాదాలు.

      Reply
  4. 4

    sunianu6688@gmail.com

    చదువుతున్నంతసేపూ చాలా హాయిగా అనిపించింది మనసుకి sir. ఆత్మీయుల మధ్యలో రిటైర్మెంట్ అవ్వడం కన్నా ఆనందదాయకం ఏమి ఉంటుంది. పదవీ విరమణ రోజు కొంచెం భాధ గా వున్నా ప్రస్తుతకాలంలో బ్యాంక్ ఉద్యోగులలో అధిక పనీ ఒత్తిడి కారణంగా అనందం గానే రిటైర్మెంట్ అవుతున్నారు అనిపిస్తుంది. మీ మరదలు గారికి మా పాఠకుల తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేయండి. రచయత శ్రీ Dr KLV ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍🌹

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా మీకు
      కృత జ్ఞత లు.

      Reply
  5. 5

    Bhujanga rao

    ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఉద్యోగంలో చేరిన ప్రతి వారికి విరమణ తప్పదు.మీరన్నట్టు ప్రతి ఒక్కరూ ఉద్యోగం అధికారం అనే భావన కాకుండా,బాధ్యతను గుర్తించి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రణాళికాబద్దంగా పూర్తిస్థాయిలో చేసుకోగలిగితే పదవి విరమణ తరువాత జీవితం సుఖమయమవుతుంది. చివరగా మంచి మాట చెప్పారు సర్.మన జీవన శైలి,పిల్లలను పెంచే విధానంలో మంచైనా, చడైన పిల్లల మీద తప్పక ప్రభావం పడుతుంది.అదే చివరి రోజుల్లో మన మీద ప్రభావం పడుతుంది. చాలా మంది బంధువులు మరియు స్నేహితుల పదవి విరమణ కార్యక్రమాన్ని చూడడమే కాకుండా కొన్ని సందర్భాలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఆనందించిన మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు సర్🙏

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి ఉద్యోగికి జీవితంలో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఉంటాయి. మీకు అన్ని మధుర జ్ఞాపకాలే ఉన్నట్టున్నాయి.

    నాకు ఉద్యోగం ప్రయత్నించకుండానే దొరికింది. కాని నేను ఆ ఉద్యోగం వదిలి పెట్టి విశ్వవిద్యాలయంలో ఉద్యోగం సంపాదించడానికి మాత్రం కొంచెం కష్టపడ్డాను.
    మా పిల్లలు అందరు నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు. కాబట్టి పదవీ విరమణ తర్వాత నాకెలాంటి సమస్యలు లేవు.
    మీ అనభవం బాగుంది.
    శుభం ఆశాసే.

    జనార్దనరావు
    రసాయన శాస్త్రము

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవనం అందంగా తీర్చి దిద్దుకోవడానికి ఉద్యోగ జీవితంలో ఒక ప్రణాళిక అవసరం.మీరన్నట్టు ఎన్నో రకాల జీవితాలు పదవీ విరమణ తర్వాత అనేక విధాలుగా ఉంటాయి.స్వీయ క్రమశిక్షణ తో మీలా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వారికి ఆ కాలమంతా నల్లేరు మీద నడకే.ఇతరుల పదవీ విరమణ చూసి ఆనందించే సమయం దక్కడం కొంత భగవంతుని దయ అయితే చాలా వరకూ చక్కని జీవనవిధానాన్ని ,నిత్య నూతన వ్యాపకాలను పెట్టుకోవడం,నిర్మల మనస్సుతో ఉండడం,అన్నింటికీ మించి ఆరోగ్యాన్ని కాపాడుకొని పిల్లలకు బలంగా మారడం అనేవి ముఖ్యమని వివరించిన మీ జ్ఞాపకం చాలా బావుంది సర్.శ్రీమతి హేమలత గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు సర్💐💐💐🙏
    —నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 7.1
  8. 8

    Rajendra Prasad

    Job or business being a lively hood is an important part in life. You explained it with your experience that reminded us of our own sir!

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉద్యోగంలో చేరినరోజే మనం ఎప్పుడు విరమణ చేస్తమో తెలుస్తుంది.జాతస్యహి ధృవో మృత్యుః వలె.
    ముక్కుసూటిగా ఉద్యోగంచేసిన వారికి ఉద్యోగవిరమణ విచారాన్నివ్వదు అనుకుంటున్న. అయ్యో ఇఅంకో నెలో రెన్నెల్లో వుంటే మరింత డబ్బు సంపాదించుకుని వుండేవాడినికదా అను కునేవారికే ఉద్యోగవిరమణ దుఃఖాన్ని కలుగచేస్తుంది. మీవృత్తిచాలా పవిత్రమైన వృత్తి.మీతో సేవలపొందిన వారు మిమ్మల్ని బాగావగుర్తు పెట్టుకుంటారు . .public contact ఉండే ఏఉద్యోగంలో సేవాభావంథో పనిచేసేవారిని జనం గుర్తుంచుకుంటరు అని నా భావన. అట్లా నా ఉద్యోగంలో 36న్నర ఏండ్లు ఉద్యోగించిన. కాని ఎక్కడా నాబాధ్యతనుమరవకుండా నిర్వర్తించే అవకాశమే నాకు కలిగింది.నేను ఎలక్ట్రిసటే రెన్యూ విభాగంలో పనిచేసేటప్పుడు ప్రజలతో సంబంధాలుండేవి.చాలామంది వినియోగదారులు వారి సర్వీస్ నంబర్లతో గుర్తుండేవారు.
    ఉద్యోగి పదవీ విరమణచేస్తుంటే ఆ ఉద్యోగంతో సంబంధంఉన్న ప్రజలువిచారిస్తే వాడు మంచి ఉద్యోగి అనే నేను భావిస్త.మీ అదృష్టవశాత్తూవమీరు అట్ల పదవీ విరమణ చేయగలిగినారు అభినందనలు.నేనువపదవీ విరమణ చేసి 25 ఏండ్లయింది..అయినా కొంత మంది ఇంకా గుర్తుంచుకొని మాట్లాడతుంటరు. మనం విరమణ చేసినాక అరే ఆయన రిటైరయినాడా అని అనుకోవాలె కాని వాడా మంచిదయింది రిటైరయిండు అనుకోకూడదు.
    మరొకమారు అభినందనలతో
    —రామశాస్త్రి

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ .

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 170 లో… ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరేటప్పుడు ఎంతో సంతోషపడతాడు. ఉద్యోగ నిర్వహణలో ఎన్నో కష్టాలు పడతాడు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, సహ ఉద్యోగులు సృష్టించే అనవసరమైన సమస్యలు..ఇలా ఎన్నో బాధలు. మీరు చెప్పినట్టుగా ఏ చిక్కులు చికాకులు, ఆరోగ్య సమస్యలు లేకుండా పదవీవిరమణ చేయడం భగవంతుడు ఇచ్చిన వరమే. సింగరేణిలో ఎందరో రిటైరైన కార్మికులు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ డబ్బులు పిల్లలు బలవంతంగా లాక్కుని, వీధుల పాల్జేస్తున్నారు. దయనీయమైన పరిస్థితి. చక్కటి కథనం. అభినందనలు.
    ——జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!