సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    Sagar

    బద్దకానికి దూరమైతే అన్నీ సాధ్యమే సర్ . దూరభారాలు, ఖర్చు విషయంలో అయితే పరవాలేదు. ప్రతి ఒక్కరి స్ధాయినీ మనం శాశించలేం కదా? కానీ అందుబాటులో ఉన్నవాళ్ళు, దగ్గరి ప్రదేశాలలో ఉన్నవాళ్ళు సైతం మీరన్నట్లు భాషాభివృద్దిపైనోరుచించుకునే మేధావులు హాజరుకాకపోవడం ఖచ్చితంగా తప్పిదమే. ఇక నిర్వాహకులు కూడ క్రమశిక్షణకు ప్రాధాన్యత మీరు పైన కెప్పిన విదంగా అతిధి అయిన మీరు పదీహేను నిమషాలు ముందు వెళ్ళినా నిర్వాహకులు లేకపోవడం బాధాకరం. ఇలాంటి వాటిని పట్టించుకుంటేనే అన్నీ సాధ్యమవుతాయి. లేకుంటే తెలుగు బాష ప్రాధాన్యత క్రమేపీ క్షీణించడం ఖాయం. మంచి వ్యాసాన్ని అందించినందుకు మీకు ధన్యవాదములు సర్ .

  2. 2

    J Mohan Rao

    తెలుగు భాషా పరిరక్షణ కుటుంబము నుంచి . మొదలు కావలసి యున్నది. తల్లి తండ్రులు భా
    త్యత చాల వున్నది. పిల్లలును తప్ప కుండా ఇంటిలో బయటను తెలుగు లోనే మాటలాడే విధము అలవాటు చేయవలె. భాష మన సంస్క తిలో భాగమని తెలిపి
    భాష యొక్క గొప్పతనము అందరు సమాజ ప్రాతిపదికన భాష వికాశా నికి తోడుపడవలె.
    ప్రభుత్వము కుడ విధిగా తెలుగు లోనే కార్య
    కలాపములు, సమాచార వ్యవస్థలు తెలుగు లోనే చేసేల చిత్త శుద్ధి కలిగిన యంత్రాగము . తెలుగు
    మాధ్యమము లోనే బోధన జరగాలి. Secondary school స్తాయి వరకు తెలుగు తప్పక language subject గా వుండాలి.
    English bashanu వుద్యోగ సంపాదనకు, interview లో face చేయుట కును మాత్రం
    వక tool గా పరిమితo చేయవలె .
    తెలుగు is vital for manifestation
    of life.
    English is for limited purpose of getting job and getting along in other countries or elsewhere.
    Learning English which is an international language is good for survival but తెలుగు is GOLD.
    నమస్తే . Sir. మంచి topic. దీని గురించి నేను చెప్పినది చాల తక్కువే. యెంతయో చేయ వలసి వున్నది తెలుగును బ్రతి కించి కోవటానికి
    So much needs to be done for Revival of our LIFE LINE. ( తెలుగు భాష.) అమ్మ భాష.
    Three M ‘s no one can forget
    Mother, Mother tongue and Mother land .
    The Italian of the east.
    నమస్తే. అందరికీ.
    తెలుగు typing లో నేను improve కావలెను
    అందుకే English వాడుట జరిగినది.
    క్షమించవలె. భాషాభిమానులు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సుడీర్ఘమైన
      స్పందన అభినందనీయం
      ధన్యవాదాలు మీకు.

  3. 3

    భవాని

    మంచివ్యాసం.
    మనమంతాఆలోచించాలి

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాహిత్య సభలు సమావేశాలకు
    నేను ఎక్కువగా వెళ్లలేదు సార్
    వెళ్లాలని ఇంట్రెస్ట్ ఉన్న దురాభారాల వల్ల వెళ్లడం కుదరలేదు.
    మీ వ్యాసం వలన సాహిత్య సభలు సమావేశాల కష్టనష్టాలను,
    తెలుసుకోగలిగినాము
    ధన్యవాదములు సార్ మీకు
    —కె.కళావతి
    హైదరాబాద్

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవును సర్..ఈ రోజుల్లో రచించిన పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి చాలా ప్రయాసగా ఉంటుంది సభాముఖంగా.మీరన్నట్టు తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉన్న పెద్దలే ఎక్కువగా హాజరౌతున్నారు.యువతలో తెలుగు పట్ల ,తెలుగు సాహిత్యం పట్ల పుస్తకాల పట్ల ఆసక్తి పెరగవలసిన అవసరం ఎంతో ఉంది.అప్పుడే పుస్తకావిష్కరణ సభలు కళ కళలాడతాయి.పుస్తకావిష్కరణ ఇబ్బందులను,జరిగే ప్రయోజనాలు(పెద్దల్ని మిత్రుల్ని కలవడం)చక్కగా వివరించారు. ధన్యవాదాలు💐💐🙏
    —డి.నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నరేంద్ర సందినేని
    జ్ఞాపకాల పందిరి -191 చాలా
    బాగుంది.పుస్తకావిష్కరణ
    కార్యక్రమంలో జరుగుతున్న
    వాస్తవానికి అద్దం పడుతుంది.
    అందరు చదవాల్సిన ఆర్టికల్.
    అద్భుతం సార్.
    —-నరేంద్ర సందినేని.

    1. 6.1
  7. 7

    Rajendra Prasad

    Any product including the books for publishing and publicizing attracts expenditure. Books that do not have commercial value will push the writer of the book into further financial obligations. These are the days people are not depending on prints.

  8. 8

    అల్లూరి Gouri Lakshmi

    చాలా మంచి వ్యాసం ఇది. ఉపన్యాసాలు crisp గా ముగించాలి.ప్రేక్షకుల సమయాన్ని గౌరవించాలి.సభా నిర్వాహకులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చేవాళ్ళు మరో మీటింగ్ కి రావాలని అనుకుంటారు..reasons behind for not attending literary meetings are honestly discussed..Congrats KLV jee.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      ధన్యవాదాలండి

  9. 9

    Shyamkumar Chagal. Nizamabad

    పుస్తకావిష్కరణ సభలకు హాజరు అయ్యే జనాలు రోజు రోజుకి తగ్గిపోతున్నారనేది ఎవరు కాదనలేని సత్యం.
    దానికి కారణాలు అనేకం అయినా కూడా కొన్ని కారణాలు సహెతుకంగా రచయిత గారు వర్ణించారు.
    ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను అదేమిటంటే ఈ సభలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఆహ్వానితులను పట్టించుకునే నాధుడు లేడు సరి కదా ఆహ్వానించిన వారు వచ్చిన వారిని ఏమాత్రం లెక్కచేయకుండా వారి కార్యక్రమం ముగించారు.
    ఈ కార్యక్రమానికైనా హాజరు కావాలన్నప్పుడు దానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు దానికి తగిన స్పందన లేనప్పుడు , సమయపాలన సరిగ్గా లేనప్పుడు, మనకు బాధ కలగడం సహజమే.
    సాహిత్య అభిలాషకులు ఎక్కువమంది హాజరు కావాలనుకుంటే దానికి తగిన విధంగా ఆహ్వానం పలకడం కూడ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

    కార్యక్రమంలో రచయిత గారు చెప్పినట్లుగా మంచి వక్తలను ఎన్నుకొని కార్యక్రమాన్ని రక్తి కట్టించడం చాలా ముఖ్యం.
    ఆహ్వానితులను ఎక్కువసేపు బోర్ కొట్టించకుండా కార్యక్రమాన్ని ముగిస్తే ఇంకా బాగుంటుంది.
    కొన్నిసార్లు పుస్తక ఆవిష్కరణ సభల్లో అందులో ఉన్న మొత్తం కథలన్నిటిని పూర్తిగా చెప్పేస్తుండడం జరుగుతోంది. దాంతో ఇక ఆ కథలను చదివే అవసరం కనబడడం లేదు.

    ఏది ఏమైనా పుస్తక రచయిత ఎన్నో కష్టాలు పడి పుస్తకాన్ని ప్రచురించిన తర్వాత ఈ సభను ఏర్పాటు చేయడం చాలా కష్టతరమైన పని అని చెప్పాలి. అది సక్సెస్ కావాలన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని సభను నిర్వహించాలి.
    అది జరగనప్పుడు ఆహ్వానితులందరూ ఉసురోమంటూ ఇంటి దారి పడతారు.
    ఈ మధ్యకాలంలో చాలావరకు అలాగే జరుగుతుంది.
    ఇందులో రచయిత యొక్క పొరపాటు ఏమీ లేనప్పటికీ అందరూ వారిని తిట్టుకుంటారు.
    ఒకటి మాత్రం నిజం కథలు రాయడం పుస్తకాన్ని అచ్చు వేయడం కంటే ఈ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం చాలా కష్టతరమైన పని.
    ఈ విషయంలో కలుగుతున్న సాధక బాధకాలని చక్కటి ఉదాహరణలతో మన కందించిన రచయిత శ్రీ డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా యొక్క అభినందన నమస్కారములు.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ విశ్లేషణ/స్పందన
      బాగున్నాయి.
      ధన్యవాదాలు.

  10. 10

    కరిపె రాజ్ కుమార్

    కవితా సంపుటాల ఆవిష్కరణల అవస్థలను చాలా చక్కగా విశ్లేషించారు.తెలుగుభాషా పరిరక్షణ కోసం అమూల్యమైన సూచనలు సలహాలు చేశారు.అనేకానేక ధన్యవాదాలు సర్.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గ్రంథావిష్కరణ సభలకు ఎక్కువమంది హాజరవడం లేదు అనేది అక్షర సత్యం. ఇందుకు కారణాలు కోకొల్లలు.60లు దాటిన వారే సభలకు హాజరయ్యేది.కొన్నిసార్లు వారితో ఎవరో ఒకరు తోడుగా రావాలి. లేకపోతే వారు రాలేని పరిస్థితులు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి చోట్ల దూరాభారం ఒక కారణం. కొంతమంది వక్తలు పుస్తకం గురించి కాక వారి పరిజ్ఞానాన్నంతా వినిపిస్తారు. అసలు ఆ సభకి ఎందుకు వచ్చారో ఆహుతులు మర్చిపోతారు.
    ఈమధ్య కొంత మంది పుస్తకం లోని కథలన్నీ చదివేస్తుంటారు.ఇక కొని చదవాలనుకునే వారు ఎవరుంటారు.
    ఇక్కడ మా ఊరికి సంబంధించిన సంగతి చెప్పాలి. ఒక స్థానిక పత్రిక విలేఖరి నే”ను గ్రంథావిష్కరణ చేసి పెడతాను”.అని రచయితల వెంట పడతారు. రచయితలు ఘనంగా ఏర్పాట్లు చేసుకుని, తన అభిమానులని, శ్రేయోభిలాషులను తమతో తీసుకుని వెళతారు. అప్పుడు తనకిష్టమైన వారిలో ఒకరికి పుస్తకం ఇచ్చి అక్కడి కక్కడే పరిచయం చేయమని పిలుస్తాడు నిర్వాహకుడు. సమీక్ష ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు మన సంచిక పాఠకులకి.. ఇక రచయితకి ఏమి చెయ్యాలో తెలియదు. తన శ్రేయోభిలాషులు మాట్లాడే అవకాశం లేదు. నిర్వాహకుడు ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడు సరే! కనీసం రచయిత స్పందన కు కూడా టైమివ్వడు. అరగంట లో తూతూ మంత్రం. అంతే! అటువంటి సభలకు వెళ్ళడానికి ఎవరు సాహసిస్తారు.
    సభానిర్వహణ, మంచి సమయపాలనతో, వినేరీతిన మాట్లాడే వక్తలు, తినడం కోసమే వెళ్ళం ..కాని కనీస అతిథి మర్యాద ఉండాలి కదా!
    అయ్ బాబోయ్! నేనిక ఆపాలి.లేకపోతే ఉపన్యాసం మితిమీరిందని మనవాళ్ళనుకోవచ్చు..డాక్టర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు .
    ——-పుట్టి నాగలక్ష్మి
    హైదరాబాద్.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  12. 12

    కొత్తపల్లి రవిబాబు

    బెజవాడలో అయితే గంట ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఆవిష్కరించిన వారే పుస్తకం పట్టుకుని ఫోటో తీయించుకోవాలీ. మిగిలినవారు ఫోటోలో వుంటారు. అదేమిటో ఆ తర్వాత అందరికీ పుస్తకాలు ఇచ్చి ఫోటో తీయించి దానిని పత్రికలకు పంపిస్తారు.
    ఒక సూచన. ఆవిష్కరణ సభలకు వచ్చినవారిని రకరకాలు గా హింసించినందుకు బదులుగా ఆ నాడు ఆవిష్కరించిన పుస్తకం వారికి వుచితంగా ఇస్తే బాగుంటుంది. ఎలాగూ చాలా పుస్తకాలు మిగిలిపోతాయి గదా. వచ్చినవారికి ప్రోత్సాహకంగా వుంటుంది. మళ్ళీ మళ్ళీ రావటానికి.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్
      సూచన బాగుంది.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాహిత్య కార్యక్రమాల గురించిన మీ జ్ఞాపకాల పందిరి ఎన్నో విషయాలను గుర్తు చేసింది.
    సాహిత్య సమావేశాలు అట్టహాసంగా వుండాలని సభలనేర్పాటు చేసినవారనుకుంటారు.అయితే వేదికమీద ఉన్నంథ మంది కూడా వేదికమీద వుండరు.
    తన సభలో చాలామందికి భాగస్వామ్యం కల్పించి వారిని గౌరవించాలనో సంతోషపెట్టాలనో రచయిత అనుకుంటడు. ఆ కారణంగా ప్రాసంగికుల సంఖ్య కొండవీటి చేంతాడంత అవుతుంది.ఆత్మీయ అతిథులు.గౌరవ అతిథులు , మూఖ్య అతిథులు.అభినందన తెలిపేవారువ, ఆవిష్కర్త, సమీక్షకులు ( ఒక్కరు సరిపోరని ఇద్దరు ముగ్గురిని పెడతారు) స్వాగతకర్త కృతజ్ఞతలీర్త ఎట్లాగూ వుంటారు.ఈనడుమ కొత్తగా సభా నిర్వాహకుడు ( event manager)కూడా తోడవుతున్నడు
    .అతిథులకు సన్మానం నిర్వహించేవారు వేరే.
    సాయంత్రం సభ అయిదుగంటలకు అంటే మీరన్నంఅటు సమయానికివపోయినవాడు పొరపాటున వేరే చోటికి వచ్చినమేమో అని సందేహించవలసిందే.
    గంట గంటన్నర ఆలస్యంగా ఆరంభమయ్యే భలు వక్తలలిస్టులో మధ్యమధ్య చేర్చబడే అతిథులతోమూడు నాలుగు గంటలు జరుగుతుంది.శ్రోతలకు ఎక్కడలేని విసుగు తెప్పిస్తుంది.అట్లైతే ఎవడురమ్మన్నాడు నిన్ను అనే ప్రశ్న వేస్తరు. ఇన్నింటికీ భరించి సభలో కూర్చుంటే తమపుస్తకారు రచయితలకు గతంలో ఇవ్వలేని వారు సభ నడుస్తుండగానే మధ్యమధ్య రచయితలకిచ్చి వారిని సంతోషపట్టే ప్రయత్నం చేస్తూ సభకు అంతరాయం కలిగిస్తూ వుంటారు.వక్తలు ఒకరిని మించి ఒకరు మాట్లాబి చదువరులకు పుస్తకాన్ని చదివే అవకాశమే లేకుండా చేస్తరు .సమయం మీద దృష్టి వుండటం అరుదు. పూర్వం యువభారతి సభలు చాలాపద్ధతిగా జరిగేవి.ఇప్పుడు సహృదయవి.
    అయినా ఒక్కొక సారి మొహమాటాలెదురైతవి.రచయితలకు ( కొందరికి) వేదికలు లేక ఏదోసంస్థ ద్వారా తమపుస్తకాలు ఆవిష్రింపచేసుకుంటరు.వక్తలు ఆవిష్కర్తలు ఆతని ఛాయిసే.అయితే సభ జరిగే రోజు కూడా జరుగుతున్న సమయంలో వక్తలను చేరుస్తూ వుండి నిఅవాహకులను అసహనానికివగురి చేస్తరు.. ఇక సమయపాలన. ఒకరోజుల్లోవకాళోజీ సోదరులను సమావేశాని కి ఆహ్వానిస్తే భయమయ్యేది.అయిదు గంటలకు సభ అంటే అయిదు కాంగనే వారు తామే వేదికపైకిపోయి ఇవాళసభ అయిదు గంటలకున్నది నేను అధ్యక్షుఠిని అంటూ సభ ప్రారంభం అయితున్నదనివఅధ్యక్షస్థానంలొ?కూర్చునే వారు. సాహిత్య సభలు పావుగంటనో అరగంటనో నలభై నిమిషాలో ఆలస్యం అయితే సర్దుకోవచ్చు గంట,రెండు గంటలు ఆలస్యం.గథంలో పెండ్లి రిసెప్షన్ గురించి మీపందిరికింద మాట్లాడుకున్నం ఏడుగంటలని ఆహ్వానంలో సమయమిస్తేశకొత్త దంపతులే తొమ్మిది గంటలకు వచ్చి అతిథుల ఓపికకు పరీక్షపెడతరు.సాహిత్యసభలూవఒక్కొకసారి అట్లనే అవుతున్నవి. ఇక సమీక్షకులు పస్తకంలోని 90% విషయాన్ని ప్రస్తావించి మురిసిపోతుంటరు .ఆవిష్కరణసభలు లేదా సాహిత్య సభలు ఏవైనా రెఅండుగంటలకు మించి జరుగకుండా వుంటే బాగుంటది దూరం పోవలసినవారు మనవంటి సీనియర్ సిటిజన్ లకుండే తిప్పలు తప్పి సాహిత్య సభలంటే ఇష్టంతో వచ్చేటట్టుండాలెగాని మొహమాటానికి వచ్చేటట్టు ఉండకూడదు కదా.
    నేనూ సభలోని ఉపన్యాసకునివలెనే చాలా సమయం తీసుకున్నందుకు మన్నించండి. కొందరు తాము ఎంథసేపైనా మాట్లాఠవచ్చువకాని అవతలివాడువమాట్లాడుతుంటే మాటిమాటికి అసహనానికి గైతుంటరు తనకోనీతి ఇతరులకోనీతిఅన్నట్టు( ఇప్పుడు నావలె)
    —రామశాస్త్రి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!