ఓ ఇంటివాడినయ్యా..!!
జీవితంలో ఒక్కోసారి ఊహించని రీతిలో కొన్ని సంఘటనలు జరిగి అవి జీవితాంతం గుర్తు వుంచుకునేలా ఉంటాయి. అవి మంచికి జరిగిన సంఘటనలైతే, అసలు మరిచిపోయేటట్టు వుండవు. అది ఎవరివల్లనైనా మేలు జరిగిన అంశం అయితే, మేలుచేసిన వాళ్ళని నిత్యం స్మరించుకోవాలనిపిస్తుంది. ఆ సహాయం అందించినవారు రక్తసంబంధీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. అది మన మీద వున్నఅభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, బాధ్యతగా భావించడం వల్ల కావచ్చు.
ఈ రోజుల్లో సహాయం చేయడం అన్నది, వింత విషయమే! అలా అని అసలు సమాజంలో మంచి చేసేవారు, మేలు చేసేవారు, సమాజంలో అసలు లేరని చెప్పడం నా ఉద్దేశం కానేకాదు. కానీ ఎక్కువశాతం స్వార్థబుద్దినే పట్టుకుని వ్రేలాడేవారు వుంటారు. అలాంటి వారు, ఎదుటివారు బాగు పడుతుంటే ఓర్వలేరు! ఇక సహాయం చేసే మనసు ఎక్కడ ఉంటుంది వాళ్లకి? పైగా ఒకరి అభివృద్ధి, వారికి జెలసీ కలిగిస్తుంది. సహాయం చేయకపోగా, ఏదో పద్ధతిలో దెప్పిపొడవడం, అసూయపడడం వంటివి చేస్తుంటారు.
చాలా కుటుంబాలలో, తమకంటే చిన్నవారు, జీవితంలో బాగా స్థిరపడాలని తోచిన సలహాలిస్తూ, అవసరమైతే తగిన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొన్ని కుటుంబాలలో దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. పైగా దానికి తోడుగా ఎగతాళి చేయడం ఒకటి అదనంగా వచ్చి చేరుతుంది. అలా కావాలని నిరుత్సాహ పరిచేవాళ్లూ వుంటారు. ఇవి జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో రూపంలో ప్రత్యక్షమవుతుంటాయి. సమస్యలను, అతి సులభంగా ఎదుర్కొని మంచి ఫలితాలను సాధించేవాళ్ళు కొందరైతే, నిరుత్సాహపడి సమస్యలకు తలవొగ్గేవారు మరి కొందరు!
అయితే మేలుచేసినవారిని ఎప్పుడూ ఏదో ఒక రూపంలో సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకునేవాళ్ళు వుంటారు. గుర్తు చేసుకోకుంటే వాళ్ళు అసలు వాళ్ళు మనుష్యుల జాబితాలోకి వస్తారని నేను అనుకోను. అయితే మేలుపొంది మరచిపోయేవాళ్లను ఎందరినో మనం చూస్తుంటాం. చేసిన సహాయం మరచిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకునేవాళ్లూ, నలుగురికీ గొప్పగా చెప్పుకునేవాళ్లూ కూడా వుంటారు, వున్నారు కూడా!
ఇలాంటి జాబితాలోకి నేను కూడా వస్తానేమో మరి మొత్తం చదివితేనేగానీ అది నిర్ధారణకు రాదు!
అవి.. నేను మహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా) ఆసుపత్రిలో పని చేస్తున్న రోజులు. అద్దె ఇంటిలో గడుపుతున్న కాలం. అలా అని ఇబ్బంది పడుతున్నానని కాదు సుమండీ! ఆస్తుల గురించి, అంతస్థుల గురించి ఏమాత్రం ఆలోచనలు లేని కాలం. సర్వం మరచి హాయిగా గడుపుతున్న రోజులు. ఎక్కడ సెటిల్ అవ్వాలన్నది అప్పటికి ఇంకా మా ఆలోచనలలోకి రాలేదనే చెప్పాలి. అందుకే మేము ఒక నిర్ణయం అంటూ తీసుకోలేదు. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం అన్నయ్య – వదినల సంభాషణలలో ఈ అంశం చర్చకు వస్తుండేది. నేను అప్పటికి ఇంకా హైదరాబాద్‌లో భూమి కొని ఇల్లుకట్టే స్థాయి లేకపోవడం వల్ల ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునేవాడిని కాదు. అయితే అప్పుడప్పుడూ, ఇంటి స్థలం కొనడానికి నా స్థాయికి తగ్గ ప్రాంతంలో చూడమని చెబుతుండేవాడిని. ఇల్లు అయినా కొనుక్కోడానికి చూడమని చెబుతుండే వాడిని. అన్నయ్య పెద్ద సీరియస్‌గా ఈ విషయం పట్టించుకోలేదు. అందుకే ఎప్పుడూ.. “ఎక్కడా మంచివి కనపడ్డం లేదురా..” అనేవాడు.


వదిన శ్రీమతి శిరోరత్నమ్మ
ఇలా.. కొద్దీ రోజుల తర్వాత, నన్ను ఆశ్చర్య పరుస్తూ వదిన శ్రీమతి శిరోరత్నమ్మ దగ్గర నుండి ఫోను వచ్చింది. అప్పటికి మొబైల్ సందడి ఇంకా రాలేదు. వదిన ఇంజనీరుగా వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసేవారు. ప్రజా సంబంధాలు ఎక్కువగావుండే డిపార్ట్మెంట్ అది. అందుచేత ఆవిడకు విషయం తెలిసి ఫోన్ చేశారు. దాని సారాంశం ఏమిటంటే, హైద్రాబాద్‌లో ఒక చోట నివాస స్థలాలు ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారని, అక్కడ ఇల్లు కూడా కట్టి ఇచ్చే పద్దతి ఉందనీ, అక్కడ ప్లాట్ కొనుక్కుంటే బావుంటుందని, ఇప్పుడు కొనుక్కోపోతే, భవిష్యత్తులో హైద్రాబాద్‌లో సెటిల్ అయ్యే అవకాశం రాదనీ, అందుచేత తక్షణమే వచ్చి చూసుకొమ్మని దాని సారాంశం. నా లాంటివాడికి ఇదే మంచి పద్దతి అనుకుని, నా శ్రీమతితో చర్చించి, ఒక శుభోదయాన బయలుదేరి హైద్రాబాద్‌కు వెళ్లాను. మా వదిన ఆ సైట్‌కు తీసుకువెళ్ళింది. అది ‘శేరిలింగంపల్లి’ అనే ప్రదేశం. హైద్రాబాద్ విశ్వవిద్యాలయం తర్వాత ఇది ఉంటుంది. అంటే బి.హెచ్.ఇ.ఎల్.కు వెళ్లే దారి అన్నమాట. ప్రేమ్‌కుమార్ అనే ఆయన విదేశాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి, ఆ అనుభవంతో హైద్రాబాద్‌లో బిజినెస్ ప్రారంభించారు. నేను అది చూసేటప్పటికి ఒక ఫేజ్.. ఇళ్ళు కట్టడం పూర్తి అయింది. స్థలము ఇల్లు కలిపి రేటు నిర్ణయించడం – ఈ స్కీము నాకు నచ్చింది కానీ, మెయిన్ సిటీకి దూరంగా ఉండడం, సింగిల్ రోడ్డు, అతి తక్కువ బస్సు సౌకర్యం ఉండడం నన్ను కొంచెం ఇరుకున పెట్టింది వ్యవహారం. అయినా.. ఒక నిర్ణయానికి వచ్చేసాను, తీసుకోవాలని. మా వదిన కూడా బాగా ప్రోత్సహించింది.
దీనికి సంబందించిన కార్యాలయం నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్స్‌కు ఎదురుగా ఉండేది. ఒక ఎక్స్-సర్వీస్‌మాన్ మానేజరుగా వుండేవారు. ఆయన పేరు గుర్తులేదు. ఆయన మొత్తం మేప్ చూపించి ఒక కార్నర్ ప్లాటు,రెండు పక్కలా రోడ్డు ఉండేది, తీసుకొమ్మని సలహా ఇచ్చాడు. ఇతర ప్లాట్ల కంటే కొంచెం ఎక్కువ సొమ్ము ఖర్చుపెట్టాలి!
ఆయన చెప్పినదే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఆ మేనేజర్ మమ్మలిని సైట్ దగ్గరికి తీసుకు వెళ్లి చూపించారు. అదే ‘డాయన్స్ టౌన్షిప్’ (Doyen’s township). ఖాయం చేసుకుని మహబూబాబాద్‌కి బయలుదేరాను. అప్పటికి నాచేతిలో ముప్పైవేలు మాత్రం వున్నాయి అడ్వాన్సు కట్టడానికి. ఇంకా పెద్దమొత్తం కట్టాలి. ఇది 1991 నాటి మాట!
నా శ్రీమతికి ఇంటి లోన్ సౌకర్యం వుంది. అప్పటికి ఆమె స్టేట్ బాంక్ ఆఫ్ – హైద్రాబాద్‌లో పని చేస్తున్నది. కానీ వెంటనే లోన్ రాదు. ఏమి చేయాలో అర్థం కాలేదు అయితే అప్పటికి కొద్దినెలల క్రితమే, ఒక నెలవారీ చిట్.. లో చేరి వున్నాను. దానిని నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు,నా శ్రేయోభిలాషి, డా. వి. నరసింహ రెడ్డి గారు, రాజగోపాల్ అనే వ్యక్తితో కలిపి నడిపించేవారు. ఆయన ప్రైవేట్ ప్రాక్టీషనర్. నేనంటే బాగా ఇష్టపడేవారు. ఆయన దగ్గరకువెళ్లి ఒకరోజు ఈ విషయం అంతావివరించాను. ఆయన ఏమాత్రం ఆలోచించకుండానే, “నీ చిట్టీ డబ్బులు ముందే ఇప్పిస్తాను, అక్కడ కట్టేయ్” అన్నారు. ‘బ్రతుకు జీవుడా!’ అనుకుని,ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసాను. ఆ మరునాడు, ఆ డాక్టరు గారే నా ఇంటికి డబ్బు పంపించారు. తర్వాత నేను వెళ్లి అక్కడ ఆఫీసులో కట్టవలసిన సొమ్ము జమ చేసాను. దాని ఆధారంతో, హైదరాబాద్ రాయదుర్గ బ్రాంచిలో, నా శ్రీమతికి ఋణం మంజూరు అయింది. అప్పుడప్పుడు ‘టౌన్షిప్’కు వెళ్లి, ఇల్లు కట్టడ పురోగతిని చూస్తూండేవాడిని. చక్కని ఇల్లూ – మూడు పక్కల ఖాళీ స్థలం బాగుంది. అయితే, మా ఒప్పందంలో ప్రహరీగోడ (compound wall) లేదు. అది నేనే కట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అక్కడ నేను దగ్గర వుండి కట్టించే అవకాశం లేదు.


అందుచేత ఈ విషయంలో బావగారు (చిన్నక్క భారతి భర్త) స్వామి రావు గారి సహాయం అర్థించాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. వాస్తు విషయంలో నాకు పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ, నలుగురి కోసం, నేను దాన్ని పాటించక తప్పలేదు. మహబూబాబాద్ డాక్టర్ నరసింహారెడ్డిగారు ఇందులో సిద్దహస్తులు. విషయం చెప్పగానే, అంతగా ఆరోగ్యం బాగోనప్పటికీ, హైద్రాబాద్ రావడానికి సిద్ధపడ్డారు. కొలతలు చూపించి పని ప్రారంభింపజేశారు ఆయన. నెల రోజుల్లో ప్రహరీ గోడ పని పూర్తి అయింది. 1993లో అనుకుంటాను, గృహ ప్రవేశం చేసాను. స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇచ్చిన ప్రేమకుమార్ గారినీ, మహబూబాబాద్‌లో పరిచయం ఐన డి.ఎస్.పి. ఆకుల రామకృష్ణ గారినీ, మహబూబాబాద్ డాక్టర్లను, స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను చాలా మందిని పిలిచాను. నాకు చిన్నాన్న, నా శ్రీమతికి తాతయ్య(ఈద బాల సుందర్ రావు గారు-సరిపల్లి) ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించడం ద్వారా గృహప్రవేశం జరిగింది. ఆత్మీయులు చాలామంది ఆ రోజు వచ్చారు. బాలసుందర రావు గారు(మా అత్తగారి తండ్రి), నా పెద్దన్నయ్య, పెద్దక్క, చిన్నక్క, ఈ రోజున లేకుండా పోయారు. నాకు నిత్యం ప్రేమను పెంచే నా తమ్ముడు (పిన్నికొడుకు) ఆశీర్వాదం (సరిపల్లి) కూడా ఈ రోజున లేడు. ఇలా ఎందరి సహాయంతోనో, ఆశీస్సులవల్లనో నేనొక ‘ఇంటివాడిని’ అయ్యాను. ఈ విషయంలో మా వదినగారు చేసిన సహాయం, ప్రోత్సాహం మరువలేనిది. ఆ ఋణం తీర్చుకోలేనిది.


అంతే కాదు మొదట నా ఇంట్లో అద్దెకు వున్న కేరళ వాసి నాయర్, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు పెంచి నాకు ఎంతగానో సహాయం చేసాడు. అంతమాత్రమే కాదు, నా ఇంట్లో ఉండడం వల్ల, ఆర్థికంగా తాను చాలా బలపడ్డానని సాక్ష్యం ఇవ్వడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది. బహుశా నా జీవితంలో నేను నా సంతానం కోసం చేసిన ఒకే ఒక్క మంచి పని ఈ ఇల్లు సంపాదించడమే! దాని విలువ – ప్రాధాన్యత, అంచనాలకు మించి ఉండడం నిజంగా మా అదృష్టమే!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
76 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక
సంపాదక వర్గానికీ
ఇతర సాంకేతిక నిపుణుల కు
ధన్యవాదాలు.
Sagar
జరిగిన విషయాలను మళ్ళీ గుర్తుచేసుకునే తీపి అనుభవాలతో పాటు మేలు చేసినవారిని గుర్తుచేసుకుంటున్న మీ సంస్కారం, సభ్యత, అందరికీ ఆదర్శం సర్ . మీకు ధన్యవాదములు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అవకాశాలు అరుదుగా వస్తుంటాయి…. లభిస్తాయి….వాటిని అందిపుచ్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకొన్నందుకు….నాకూ అనందంగా వుంది…. అభినందనలు….!
—–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శర్మ గారు
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
Dr NVNChary
ఇల్లుకట్టిచూడు పెళ్ళి చేసి చూడుఅన్నారు పెద్దలు మీరీరెండూ సునాయాసంగా పూర్తిచేసారు. కాలం కలిసొస్తే నడిచేకొడుకు పుడతాడంటారు.ఏదైనా జరగాలని మన జీవితంలో వ్రాసియుంటే అదిఅనివార్యంగా జరుగుతుంది. దైవం మానుష రూపేనా అన్నట్లు ఆయనే ఎవరిరూపంలోనైనా వచ్చి
ఆ పనిపూర్తిచేస్తాడు.మనం సహాయంచేసినవారే మనకు సహాయం చేయనవసరంలేదు వేరే వారు మనకష్టాల్లోకాపుకాయొచ్చు. సకారాత్మక మైన వ్యాసం ప్రేరణాత్మకం శుభం భూయాత్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
ధన్యవాదాలు .
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చదివాను సార్ అయిన వాళ్ళు, కుటుంబం లో పెద్ద వాళ్ళు బాధ్యతగా చేసిన సహాయానికి ఇంత గుర్తు పెట్టుకోని కృతజ్ఞతలు చెప్పే మంచితనానికి అభినందనలు
______నిధి(బ్రహ్మ చారి)
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
శ్యామ్
Have 2 points are more relevent.
1. Relatives feel jeolousy when we surpass the.
2. I too never forget my persons who helped me. And frequently refer that to all.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you shyam.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గతంలో మీరు రాసిన జ్ఞాపకాలకు ..
అందులోని కొన్ని ముక్కుసూటి వాక్యాల కి… నిజంగా ఇది ఒక రెమిడీ అనుకోవచ్చు.
కొన్ని చేదు నిజాలను గొంతులో దాచు కొని ..గుండెల్లో పదిల పరుచుకోని ……..
ఇట్లా మంచి జరిగిన విషయాలను పదిమందితో పంచుకోవడం ఉత్తమం అని నా అభిప్రాయం.
చిన్నవా ళ్ళం
ఈ అభిప్రాయం మంచిదో కాదో తెలియదు …
సూచన మాత్రమే.
కానీ నేను అది పాటిస్తాను
______అనీల్ ప్రసాద్
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మానవత్వం.. మంచి తత్వం కలబోసినాయి..సహాయాన్ని గుర్తించుకోవడం గొప్ప విషయం







——రాం శర్మ
బెంగుళూరు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Gd Mng doctor garu,
Kashte phali antaru. With all the pains, what ever small money you could moblise in 1991 is worth crores now. Mee manchi tananiki mechhi bhagavantudu mee vadinagari roopamlo vachhi yee sampadani ichharu.
______సూర్య నారాయణ రావు
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Sir.
రమాదేవి బాలబోయిన..మృదువిరి
అనుకోకుండా వచ్చిన అవకాశాలే ఒకోసారి అత్యంతవిలువైనవిగా మారుతుంటాయి..ఇల్లు కట్టడం అనేది మంచివిజయమే సర్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
Sambasivarao Thota
Doctor Garu!
Cheshina Sahayaanni gurthunchukovadamanedi Chaalaa goppa Vishayam..
Manchi Samskaaram..
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Rao garu
డి.వి.శేషాచార్య
Thankfulness is the quickest path to joy
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగుంది సార్
వారం వారం మీరు రాస్తున్న అనుభవాల కథనాలు
web పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని ఆలోచింప చేస్తూ ఉన్నాయి. మీకు హృదయ పూర్వక అభిందనలు.
సొంత ఇల్లు సాకారం లో ఉన్న ఆనందం మరొకటి లేదు.అందు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కట్టుకున్న దాంట్లో ఉన్న ఆనందాన్నీ వెలకట్ట లేము.నిజానికి మీరు చాలా అదృష్టవంతులు.అనుకున్నది సాధిస్తారు.దానికి మేడం తోడ్పాటు,ఆత్మీయుల సహకారం ఉండటమే.ప్రతీ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క కథనంగా మలుస్తున్న మీకు నా నమస్కారాలు..మీ నుండి ఇంకా మరెన్నో కథనాలు రావాలని ఆశిస్తూ….
మీ…..
వెంకన్న
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చక్కటి అనుభవం.
—–రావులపాటి సీతా రామారావు
. … హైదరాబాద్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీరు వ్యక్తపరిచినట్టు..ఈ రోజుల్లో వీలయితే తోడ్పాటు నందించటం మాట అటుంచి, తోటి వారు ఎదుగుతుంటే ఓర్వలేని తనం,అడ్డంకులు కల్పించే తత్వం ఎక్కువవు తుంది..సహకరించిన వారు అసందర్భంగా అదే పనిగా చెప్పుకోవడం అనుచితమైనా, సహాయం పొందిన వారు గుర్తు పెట్టుకోవడం..అవసరమైనప్పుడు ఉదహరించడం విజ్ఞుల లక్షణం..తద్వారా మనమూ అవసరార్థులకు మన పరిధిలో సహకరించాలనే తపన మొదల వుంది…మీ ‘అనుభవం’ స్పూర్తి దాయకంగా ఉంది డాక్టరు గారు అభినందనలు…
ప్రొ.ఎం.వి.రంగారావు
హనంకొండ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సలహ పాటించి ఆచరించారు కాబట్టిఈరోజు ఆప్రాంతంలో,ఇల్లు సంపాదించ కలిగారు.
మి సలహో దారులు,/మీ శ్రీమతి support
Kuda appreciable.
Chandrasekhar
Dondapati. Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Jogam.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Doyen’s విజయగాథ ఇదన్నమాట .చేసిన మేలును ఇట్టే మర్చిపోయే ఈరోజుల్లో మనకి సహాయం చేసినవారిని అణువణువున గుర్తుపెట్టుకొని వారియందు కృతఘ్నత భావంతో వుండడం చాల ముదావహం డాక్టర్ గారు.


—-‘శ్రీహరి.కొణతం
హనంకొండ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Good evening ellukonadamannadichalamerachipoleni sanghatana tenents thoanubhavalu chalachalamaruvalenivi
—–నాగ కామెశ్వరి
విజయవాడ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
Dr. O. Nageswara Rao
Very good Achievement, it’s your own efforts you earned a house in Hyderabad, now it is prime location for software n all eminents. You are very Lucky man. You are coredpathy now, settled in Hanumakonda n getting rent from Hyd.
Any you are Great n Lucy man
Everything is Gods Grace.
Excellent planning from the beginning so you succeed in your life n happy with your family.
May God bless you in future also
Thank God.
Gratitude is a must towards God n people who helped us in crisis.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Brother.
గుండెబోయిన శ్రీనివాస్
బాగుంది సార్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఇంటి కోసం మీరు పడిన పాట్లు, మీకు సాయంచేసిన బంధువులు, స్నేహితుల సహృదయతను చక్కగా వివరించారు. కథనం బాగుంది.
—జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
ధన్యవాదాలు .
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బాగుంది చేసిన పుణ్యము చెడని పదార్ధం అన్నట్లు..వారందరూ మీకు సహాయం చేయడం..మీరు వారందరినీ గుర్తుచుకోవడం అభినందనీయం!ఇల్లు చాలా బాగుంది!






______పెబ్బిలి హైమవతి
విశాఖపట్నం
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అక్కగారూ…
ధన్యవాదాలు
Rajendra Prasad
తోబుట్టువులు తో, మిత్రులతో, బంధువులతో, ఇరుగు పొరుగు thin సహ ఉద్యోగులతో మన కుండే సంబంధాలను బట్టి మనపై ప్రేమ, అభిమానంతో సహాయం చేస్తుంటారు. మీ మంచితనం, దేవుని అనుగ్రహం మీకు ఉండబట్టి మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు. ఇంటి విషయమే కాదు, పిల్లల పెళ్లిళ్ల విషయం, చదువు, ఉద్యోగాల్లో కూడా మనకు మన శ్రేయోభలాషుల నుండి మేలు కలుగు తుంది. మనం కూడా మనకు తెలియ కుండానే స్వాభావికంగా ఇతరులకు సాయపడుతు ఉండాలని నా అభిప్రాయం. ఒక మంచి జ్ఞాపకాన్ని పంచారు. ధన్యవాదాలు సర్
రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
రాజేంద్రప్రసాద్ గారు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Some people are jealous but there are many who help others without expecting anything. You are fortunate to have some around you.
_____Dr.M.Manjula
Hyderabad
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thanks
Dr.garu
మొహమ్మద్ అఫ్సర వలీషా
వారం వారం ఒక మంచి సందేశం పుణికిపుచ్చుకుంటాము మీ మధురమైన జ్ఞాపకాలతో.అలాగే ఈ వారం పొందిన సహాయానికి ఎంతో చక్కగా కృతజ్ఞతాపూర్వకంగా ఆనాటి మనుషుల సహాయ సహకారాలను , సాకారమైన సొంతింటి కలను , అందమైన ఫోటో లతో మాకందించిన మీ తీరు అద్భుతం అభినందనీయం సార్. మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన తీయని జ్ఞాపకాలను పదిలంగా దాచి మాకందిస్తున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ…












డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..
మీ స్పందన కు
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Construction is always enjoyable that to with the through our hard earned money. Assets value perginapudu, manam entha manchipani chesaamo ardha autundi
_____mrs.padma.ponnada
Narasapur.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Madam,
Thank you.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Vadina gari guidance ,manchi salaha tho chakkani eĺlu konugolu cheyyadam eppati rojullo dani viluva yennoretlu peragadam chala thrupi.A very good decision to acquire own house. At the same time never forget the people who helped. It’s a blessing


. May god bless you with abundance. Asusual good narration.
_____Dr.Jhansi Nirmala.
Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Dr.ji.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చేసిన సహాయం, మరిచి పోగూడదు. అలాంటి విలువలు సన్నగిల్లినవి ఈ రోజులలో. అవును మానవీయ విలువలు తగ్గినవి. మంచి వారికి మంచె జరుగు తుoది. మీకు ఎప్పటికీ శుభములు
——ప్రొ.పి.రవికుమార్
కాజీపేట
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బ్రదర్
మీ స్పందన కు
ధన్యవాదాలండీ
G.Girijamanoharababu
శీర్షికే చాలా అర్థవంతంగా ఉంది … తెలుగు జాతీయాల్లో “ ఇంటివాడు కావడం “ చాలా అందమైన జీవితాన్ని అందుకోబోయే దానికి వాడుతుంటారు … చమత్కారంగా దాని అసలు అర్థం తో దాన్ని ప్రయోగించి విషయానికి బలం తెచ్చారు , బాగుంది .. ఇదికూడా జీవితానికొక సార్థకతనూ , జీవితాంతపు ఆనందాన్ని తెచ్చిపెట్టే అంశమే కదా!!
మనవంటి మధ్యతరగతి జీవులకు ఇల్లు కట్టుకోవడం అనేది గొప్ప ‘అఛీవ్ మెంట్ ‘ …ఆ లక్ష్యం చేరుకోడానికి మీ వదిన గారి చొరవ మీ భవిత పట్ల వారికున్న దూరదృష్టీ , ఆత్మీయుడైన మిత్రుని సహకారం హైదరాబాదులో మీ ఇంటి కలను సాకారం చేసింది .. ఈ విషయాలన్నీ జీవితాంతం జ్ఞాపకం చేసుకోవటానికి మన సంస్కారాన్ని ఎత్తిచూపే కారణమైనా , ఒక పెద్దపనికి ఎందరి ఆత్మీయుల , సన్నిహితుల సహకారం , ప్రేరణ అవసరమౌతుందో తెలిపినట్లైంది…
దాదాపుగా ఇట్లాంటి సందర్భాలు మనలాంటి వారందరికీ ఎక్ఏకడో ఒక చోట ఏదో ఒకరూపం లో అనుభవంలోకి వచ్చిన అంశాలే అయ్యుంటాయి ….. మన జీవితం సుఖకరం కావటానికీ , మనపిల్లలకు భవిష్యత్తు లో కొంత స్థిరాస్తిని సంపాదించిపెట్టటానికీ , మన ప్రయత్నాల సాఫల్యానికీ ఎందరు ఎన్ని విధాల తోడ్పాటునందిస్తుంటారో తెలపడమేగాక ఆ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉన్నట్టు మీ కథనం సూచించినట్లైంది ….
ఈ వేగవంతమైన జీవితంలో మనం పై మెట్లు ఎక్కటానికి నిచ్చెనలు వేసి తోడ్పడ్డ వారిని మరచిపోకుండా మీ జ్ఞాపకాలపందిరి లో స్మరించుకున్న మీ సంస్కారానికి అభినందనలు డాక్టర్ గారూ !!!
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గురువు గారూ
మీ స్పందన
అద్భుతం.
ధన్యవాదాలు.
Jhansi koppisetty
ఓ ఇంటివాడినయ్యానని శీర్షిక చదవగానే గృహస్థ జీవనంలోకి అడుగుపెట్టారనుకున్నా…చమత్కారంగా గృహ నిర్మాణం గృహప్రవేశంల గురించి ది రాయటం బావుంది. సహాయం చేసినవారిని పెరుపేరునా స్మరించుకోవటం మీ సంస్కారానికి సంకేతం. I second the opinion of Girijamanohar babu garu

డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చాలాబాగుంది ఇంటినికట్టించడం వేరు….. కట్టినది కొనడంవల్ల సమయం కలిసొచ్చింది ఇటువంటి సందర్భంలో సహాయం చేసేవాళ్ళు బహు కొద్దిమంది వుంటారు అటువంటి వారు నీకు మిత్రులు గావుండి ప్రోత్సాహం అందించడం చాలాగొప్పవిషయం అటువంటి సహకారం అందరికి దొరకదు …..ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని నలుగురితో పంచుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా……..


____కృష్ణ మూర్తి.కానేటి
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
తమ్ముడూ
నీ స్పందన కు
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బాగుంది సార్ మొత్తం మీద అష్ట కష్టాలూ పడి ఇల్లు కొనేసారన్నమాట, కంగ్రాట్స్ సార్
——రాయవరపు సరస్వతి
విశాఖ పట్నం.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీరు ఒక ఇంటి వారయిన సంగతి బాగా నెరేట్ చేసినారు . ఇక మేలు చేసిన వాళ్ళను గుర్తుంచుకొవటం లేక పొవటం వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. బాగున్నది ఈ27వ ఎపిసోడ్
—–రామశాస్త్రి
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీరు ఇల్లు కట్టుకున్న విషయాన్ని పూర్తిగా చదివాను మీ వదిన ఫోన్ చేయడం మీరు వెళ్లడం మీ మరో డాక్టర్ చిట్టి పైసలు ఇవ్వడం మొత్తంమీద ప్రహరీ గోడ కట్టడం ఓపెనింగ్ చేయించడం మనిషి సంకల్పం మంచిదైతే నలువైపుల నుండి సహకారం లభిస్తుందని ఈ అనుభవం చెబుతోంది
____అబ్దుల్ రషీద్
హైదారాబాద్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సార్ నమస్తే !మీ 27 వ జ్ఞాపకాల పందిరి చదివాను.మీరు కోరుకున్నట్టు సొంతంగా ఇల్లు కట్టుకోవటానికి బంధుగణం,మిత్రుల సహాయం ఎంతగానో కొనియాడదగినది.వాళ్ళకు కృతజ్ఞతగా వుండడంగొప్ప విషయం.ఓకే!మరి హనుమకొండలో వున్నది మరో ఇల్లా?
______బొందల నాగేశ్వర రావు
చెన్నై.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
నీలిమ
డాక్టర్ గారు..
మంచివారు, చెడ్డవారు, ప్రోత్సహించేవారు, నిరుత్సాహపరిచేవారు అందరూ వుండే కలగలిసిన లోకం ఇది అని మీ అనుభవాల జ్ఞాపకాల్లో చాలా చక్కగా వివరించారు.
అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రేయోభిలాషులు వుంటారని మీ ఈ జ్ఞాపకం మరోసారి అందరినీ తమ తమ శ్రేయోభిలాషులను తలచుకునేలా చేసింది..
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఇప్పుడే చదివాను సార్. బాగుంది మీ ఙాపకాలపందిరి. నిజమే మనం అప్పుడప్పుడు ఇతరుల సలహా, సహృదయంతో, సహాయంతో చేసే మంచిపనులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మీ వదిన సహృదయంతో చెప్పిన మాట మీకు చద్దన్నం మూటలా ఉపయోగపడింది కదా!చాలా సంతోషం. ఆలస్యానికి మన్నించండి.

______డా.విద్యా దేవి.ఆకునూరు
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ పందిరి అందాలు అద్భతం డాక్టర్ గారూ…





మనం ఒకరి హితం కోరేవారమైనప్పుడు మనకు కూడా ఏదో రూపంలో మేలు జరగుతుందనడానికి నిదర్శనంగా…. చాలా బావున్నాయి.
_______లలిత కుమారి
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
చిట్టె మాధవి
నిజమే సర్..మన ఆప్తులు మన మంచే కోరుతారు.వారు బంధువులు..స్నేహితులు అయివుండొచ్చు.మీకు చాలా మంచే జరిగింది.మీ చుట్టూ చాలా మంచివారు వున్నారు నిజంగా మీరు అదృష్టవంతులు. అభినందనలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.