అప్పుడు నేను… బిక్షగాడినే..!!
కాలం కలసిరాకుంటే, పరిస్థితులు అనుకూలించకుంటే, అవసరానికి మించిన ఆలోచనలు చేస్తే, ముందువెనుకలు ఆలోచించకుంటే, ఒకోసారి మన పరిస్థితి ఊహించడానికి వీలులేనంత క్లిష్టపరిస్థితుల్లోకి దిగజారుతోంది. అలా జరుగుతుందని అసలు కలలో కూడా అనుకోలేము. కానీ సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి కూడా కాలం కలసి రావలసిందే! ఒక ధనవంతుడిగా, సమాజంలో గొప్పపేరున్న వ్యక్తి, ఒక సామాన్యుడి సహాయం కోరవలసి రావచ్చు. ఇంటి నిండా కార్లూ, ఇతర సౌకర్యవంతమైన వాహనాలు కలవాడైనా ఒక్కోసారి ఆటోలోనో, రిక్షాలోనో ప్రయాణం చేయవలసి రావచ్చును. అంతకంటే దారుణంగా కాలినడకన రావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కోటీశ్వరుడు కూడా ఒక్కోసారి తప్పని పరిస్థితిలో ఒక సామాన్యుడి దగ్గర అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. వందలకొద్దీ చీరలు బీరువాల్లో మూలుగుతున్నా, పరిస్థితుల ప్రభావం వల్ల, ముతక నేతచీరతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా పరిస్థితులు సందర్భాన్ని బట్టి తారుమారు అయినప్పుడు, మన అసలు పరిస్థితి మారిపోయి మరో అవతారం ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుచేత ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలియదు. పరిస్థితులను బట్టి ఆయా వ్యక్తుల విలువ గొప్పదనం తెలుస్తాయి. ఎంతటి చిన్న హోదాలోవున్నవాడైనా మనకంటే ఆ క్షణంలో కొన్ని ఎత్తుల ఎత్తుకు ఎదిగిపోతాడు.
ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు, ఊహించలేము. అనుభవించిన తర్వాత మాత్రమే మనకు దాని గురించి ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. ప్రతివారి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని కొందరు అప్పుడే మరచిపోతారు, నాలాంటి వారు మరికొందరు, ఎంత మరచిపోదామన్నా అది ఏదో సందర్భంలో గుర్తుకు వస్తూనే ఉంటుంది. నేను – నా శ్రీమతి ఎదుర్కున్న ఒక వింత అనుభవాన్ని ఇప్ప్పుడు మీ ముందు వుంచుతాను. అలాంటి అనుభవం పగవాడికి కూడా రాకూడదని ఎవరైనా అనుకుంటారు.
అది 2015వ సంవత్సరం. అప్పటికే నేను రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నది. నా శ్రీమతి బ్యాంకింగ్ సర్వీస్‌లో వున్నది. అమ్మాయికి పెళ్లి అయింది, కానీ పాప ఇంకా అప్పటికి పుట్టలేదు. నేనూ – నా శ్రీమతి అమెరికాలో ఉంటున్న మా అబ్బాయి దగ్గరికి వెళ్లాలని అనుకున్నాం. అప్పటికి మా అబ్బాయి రాహుల్ అమెరికా వెళ్ళడమూ, అక్కడ ఎం.ఎస్. చేయడమూ, ఉద్యోగం చేయడం కూడా జరిగిపోయాయి. అబ్బాయి చాలాకాలంగా మా ఇద్దరినీ అక్కడికి రావాలని ఒకటే అడుగుతున్నాడు. మాకు కూడా చూడాలనే వుంది, కానీ ఏదో చెప్పలేని భయం. అన్ని గంటలు విమానంలో ప్రయాణం చేయడం, మధ్యలో దుబాయ్‌లో విమానం దిగి మళ్ళీ ఇంకొక విమానంలో ప్రయాణం చేయడం ఇవన్నీ తలచుకుంటేనే భయం వేసేది. సరే, అవన్నీ తర్వాతి విషయాలు. ముందు పాస్‌పోర్ట్, తర్వాత వీసా కావాలి కదా! పాస్‌పోర్టు హన్మకొండ లోనే ఒక బ్రోకర్ ద్వారా చేయించుకున్నాం (అప్పటికి హన్మకొండకు పాస్‌పోర్ట్ బ్రాంచి ఆఫీసు రాలేదు). ఇక తర్వాతిది వీసా వ్యవహారం. దానికి అవసరమైన డాక్యూమెంట్లు రాహుల్ అక్కడినుండి పంపించాడు. ఎలా అప్లై చేయాలన్నది చెల్లెలికి వివరించాడు. ఏమి పేపర్స్ కావాలి అన్నది కూడా చెప్పాడు. అలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని అమ్మాయి ఇంటర్వ్యూ డేట్ కోసం అప్లయి చేసింది. ఒక శుభోదయాన డేట్ ఫిక్స్ అయి లెటర్ వచ్చింది. అన్నీ సిద్ధం చేసుకొని వాళ్ళు ఇచ్చిన తేదీ ప్రకారం అమెరికన్ కాన్సులేట్ (బేగంపేట్)కు వెళ్ళాము. మాతో మా అమ్మాయి నిహార కూడా వచ్చింది. గతంలో మా అబ్బాయి వీసాకు అప్లయి చేసినప్పుడు హైదరాబాద్‌లో ఈ ఆఫీసు లేదు. చెన్నై (మద్రాసు)కు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ సౌకర్యం రావడం అందరికీ ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇది ఇప్పుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు పనిచేస్తున్నట్టు తెలిసింది. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళకి కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమే. బంధువులో, మంచి మిత్రులో ఉంటే తప్ప అదనపు ఖర్చుల భారం మోయక తప్పదు.
నిర్ణయించిన సమయం ప్రకారం, బృందాలుగా లోపలికి పిలుస్తున్నారు. అవసరమైన డాక్యుమెంట్స్ ఫైల్ తప్ప,మిగతా అన్నీ మా అమ్మాయికి ఇచ్చేసి, మాకు పిలుపు రాగానే ఇద్దరం లోపలికి వెళ్ళాము. బయట గేటుకి, లోపలి ఆఫీసుకి చాలా దూరం వుంది. ఇలాంటి సందర్భాలలో నాకు విపరీతమైన టెన్షన్ వస్తుంది. నాకంటే ఇలాంటి విషయాల్లో నా శ్రీమతి చాలా దైర్యంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మొదటి విండో దగ్గరికి మార్గం చూపించారు. అక్కడ డాక్యుమెంట్లు, పాస్‌పోర్టులు పరిశీలించే స్థలం అది. ముందు నా ఫైల్ ఇచ్చాను. అన్నీ చెక్ చేసి ఫైల్ నాకు ఇచ్చేసి, రెండవ విండో దగ్గరకు వెళ్లామన్నారు. నా తర్వాత నా శ్రీమతి ఫైల్ తీసుకున్నారు. అంతే అక్కడ సమస్య ఎదురయ్యింది. మేము తీసుకెళ్లిన ఫోటోలు సరిగాలేవని, అక్కడ వున్న మినీ ఫోటోస్టూడియోలో ఫోటో తీసుకుని మళ్ళీ సబ్మిట్ చేయమని తిరిగి ఫైల్ ఇచ్చేసాడు. నాలో ఆందోళన మొదలయింది, వళ్ళంతా చెమటలు పెట్టడం మొదలయింది. ఏమి చెయ్యాలో తోచడంలేదు. ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది. కారణం, అక్కడే ఫోటో తీసుకోవాలి, ఫోటోకు వందరూపాయిలు ఖర్చు అవుతాయి. జరిగింది ఏమిటంటే, సమస్తమూ బయట మా అమ్మాయికి ఇచ్చేసి వచ్చాము. అంటే పర్సులతో సహా! బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే, ఆవాళ్టి ప్రోగ్రామ్ కాన్సిల్ అవుతుందేమో అన్న భయం. ఏమి చేయడానికీ తోచడం లేదు. చెప్పలేని నీరసం శరీరంలో ప్రవేశించింది. పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగుతున్నాను. ఈలోగా నా శ్రీమతి ఒక ఉచిత సలహా ఇచ్చింది. అది కూడా భయంకరమైనదే. “ఎవరైనా ఇస్తారేమో, బయటికి వెళ్ళాక ఇచ్చేద్దాం, అడిగి చూడండి” అంది. ఇదేదో బాగానే వుందనిపించింది. కానీ ఎలా అడగడం?
ఆలోచిస్తే, అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు కూడా! ఎవరి పనుల్లో వాళ్ళు అటూఇటూ తిరుగుతున్నారు. అలాంటివారిలో ఒక తెలుగు మాట్లాడే మహానుభావుడిని గుర్తించి, ఆయన స్పీడుకు తగ్గట్టుగా ఆయన కూడా పరిగెత్తినంత పని చేసి, నా విషయం వివరించి,బయటకు వెళ్ళాక ఆ సొమ్ము ఇచ్చేస్తానని చెప్పాను.
ఆయన నావంక అదోలా పైకి -క్రిందికి చూసి ‘చూడ్డంలేన్ది’ అని ఒక మాట నా ముఖానకొట్టి, మళ్ళీ కనిపించకుండా ఏటో వెళ్ళిపోయాడు. ఇలాంటి తెలుగువాళ్లు నలుగురైదుగురి వెంటపడి నా విషయం చెప్పాను. అందరూ ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారు. ఇక మేము ఆశలు వదులుకున్నాం. మళ్ళీ ఇంకోరోజు రాక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చేసాము. నాకు నాలుక ఎండిపోయి, నీరసం ముంచుకొచ్చింది. ఎందుకో ఆలోచన వచ్చి ఆఖరి ప్రయత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. మాకు కొద్ది అడుగుల దూరంలోనే ఒక జంట, ఫైల్ సర్దుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి అసలైన బిక్షగాడి స్టైల్లో, తెలుగులో నా వ్యవహారం సణగడం మొదలుపెట్టాను. అప్పుడు అతను నావంక చూసి “ఇంగ్లీష్ ఆర్ హిందీ ప్లీజ్” అన్నాడు ఎంతో మర్యాదగా. నేను విషయం అంతా ఆంగ్లంలో వివరించాను. “జస్ట్ వెయిట్” అన్నాడు. ఇది కూడా అనుమానం కేసురా బాబూ.. అనుకుంటున్న సమయంలో, ఆయన భార్యను ఉద్దేశించి “సాబ్ కో సౌ రూపాయ్ దేదో” అన్నాడు. ఆవిడ మరో ఆలోచన లేకుండా బ్యాగ్‌లో నుండి వందరూపాయల నోటు తీసి నా చేతిలో పెట్టింది.
వాళ్లకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. బయటికి రాగానే సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని, వచ్చేరాని హిందీ భాషలో చెప్పి, వారిద్దరి దగ్గరా సెలవు తీసుకుని ఫోటో స్టూడియోకి వెళ్లి మిగతా పనులన్నీ పూర్తి చేసాం. వీసా పది సంవత్సరాలకు అనుమతి వచ్చినట్టు తెలుసుకుని బయటికి వచ్చాము. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, మాకు సహాయం చేసిన ‘మనుష్యుల్లో దేవుడు’ కోసం బయట, అరగంటపాటు తిరిగి ముగ్గురం వెతికాము. మా ప్రయత్నం అసలు ఫలించలేదు. నాకు ఇచ్చిన వంద రూపాయలకంటే, వారి సమయం అమూల్యమైనది. అందుకే త్వరగా వెళ్ళిపోయివుంటారు. వారు చేసిన సహాయం సామాన్యమైనది కాదు. ఆ రోజు వాళ్ళందరి ముందు నిజంగానే నేను బిచ్చగాడినైపోయాను.
వారికి అలా ఋణపడిపోయాను. వారికి తిరిగి డబ్బు ఇవ్వలేకపోయానన్న బాధ నన్ను ఇంకా వెంటాడుతూనే వుంది. ఒకవేళ ఇప్పుడు వారు కనపడినా నేను వారిని గుర్తు పట్టలేనేమో! అలా వచ్చిన వీసాతో అమెరికా వెళ్లడం, నెల రోజులు అబ్బాయితో ఆనందంగా గడిచిపోయినా, నాకు సహకరించిన జంట సహృదయతను ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాను, అలాగే తెలుగు సోదరులు తప్పించుకున్న సంఘటన కూడా.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
46 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి
ఇతర సాంకేతిక నిపుణుల కు
హృదయపూర్వక ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా చాలా సందర్భాల్లో జీవితం లో ఎదురైన సంఘటనలు వివరించారు సరే అలాంటి భీకర సంఘటనలు కొల్లలుగా అనుభవించిన నాకూ ఒక్కసారి అలాంటి పరిస్థితులు ఆలోచించూ తూOటే ఇప్పటి నా పరిస్థితి మీకు అర్థమయ్యే వుంటుంది. సహాయం చేసిన ఆ దంపతులకు కోటి ధన్యవాదాలు
—ప్రొ.రవికుమార్.
నిట్—వరంగల్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
బ్రదర్,
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Good one
—-Ravulapati.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir.
రాపాక అశోక్ కుమార్
మామయ్య, నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. ఇంచుమించు అందరి జీవితాల లోను ఏదో సందర్భంలో ఈ పరిస్థితి వస్తుంది. కాని డబ్బు జేబులో వున్నంత సేపు చాలా ధైర్యంగా వుంటుంది. మనం అలా అడగవలసిన పరిస్థితి వచ్చినపుడు మనలో ఎక్కడ లేని ఆందోళన కలుగుతుంది. అది చిన్న అమౌంట్ కావచ్చు కాని అవతలి వారి చూపులు చాలా ఇబ్బంది కరంగా వుంటాయి. తరువాత ఆ సందర్భం తలచుకుంటే రకరకాల భావాలు కలుగుతాయి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అవును అశోక్.
నీ స్పందన కు
హృదయపూర్వక ధన్యవాదాలు.
మొహమ్మద్. అఫ్సర వలీషా
నమస్తే శుభ శుభోదయం సార్
నిజంగా జరిగిన సంఘటన చదువు తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సార్ కనీసం మనిషి ఏ పరిస్థితి లో ఉన్నారో అనే చిన్న ఆలోచన కూడా లేకుండా మనుషులు అంత దయలేకుండా ఎలా ఉండ గల్గుతారో తెలియదు మీరేమైనా వేలు అడగలేదు కదా ఓ వంద రూపాయలు తెలుగు వారై ఉండి సహాయం చేయలేకపోవడం శోచనీయం .ఈ రోజు ఎపిసోడ్ చదువు తుంటే ఆనాటి మీ బాధ కళ్ళ కు కట్టి ఎంత మీరు మానసికంగా ఆందోళన పడ్డారో తలుచుకుంటే చాలా మనసు బాధతో నిండి పోయింది సార్ ఆ










కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకున్నది మీ మంచితనమే ఆ జంట రూపంలో మిమ్మల్ని ఆదుకున్నది సార్. మీరు ప్రారంభం లో వ్రాసిన పంక్తులు చాలా విలువైనవి ప్రతి ఒక్కరికి. కొన్ని జ్ఞాపకాలు అంతే మనసు మూలన దాగి ఉంటాయి.మీ ప్రతి కష్ట సుఖాలు జ్ఞాపకాల పందిరిలో దాచి మాకు అందిస్తున్న తీరు అద్భుతం సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ స్పందన కు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Nice memory ……..purpose serve ayyendi ….evaru evvaka aaa roju cancell ayethe situation vere la undedi
—కోటేశ్వరరావు (రైల్వే)
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నీ స్పందన కు ధన్యవాదాలు.
Sagar
మనది కానిరోజు అనేది ప్రతి ఒక్కరికి తారసపడుతుంది అనేందుకు మీ విషయం ఉదాహరణ. పర్స్ కూడ బయట ఇచ్చి వెళ్ళడం అనేది యాదృఛ్ఛికం అయినా అది నిజంగా తలవ్రాత అంటారే అలాంటిది. సరే అంత టెన్షన్లోనూ అలాంటి వ్యక్తులు మీకు తారసిల్లడం నిజంగ అదృష్టమే. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందన కు ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Mng doctor garu,
A typical experience, I wish no one should encounter such a situation.
But your bitter experience is an eye opener for many.
However, your experience had a happy ending. God’s grace.
–Surya narayana rao.
Rtd.DGM-SBI
HYDERABAD.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆపదర్మం కోసం మీరు అడిగారు. నిజగం ఆ జంట ఆ రోజు సహాయం తో మీరు అమెరికా యాత్ర అయినట్లు కదా సర్.
మీ మని స్థితి నీ చక్కగా వర్ణించారు , కథ రూపం లో.
—–డా. డి.సత్యనారాయణ
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Shyam
డాక్టర్ ప్రసాద్ గారు మీరు రాసినట్లుగా ప్రతి మనిషి జీవితాంతం ఏదో ఒక దగ్గర, ఎప్పుడూ ప్రతిరోజు అర్థించే జీవి కిందే లెక్క. సాటి మనిషి సహాయం లేనిదే ఎవరూ జీవనం కొనసాగించలే రు. మనిషి బ్రతకడానికి కావలసిన ఆహార పదార్థాలు కూడా వేరే వ్యక్తి పండించినవే
సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నా ఆ డబ్బులు వేరే వ్యక్తి ఇవ్వాల్సిందే. అసహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రతిసారి దేవుడు ఏదో ఒక రూపంలో, ఎవరో రూపంలో వచ్చి సహాయం చేస్తారు. అలా దేవుడు లాంటి మనుషులు ఇప్పటికీ సహాయం చేయబట్టే ప్రపంచంలో ధర్మం ,న్యాయం ,ప్రేమ ,నమ్మకం అనేవి నడుస్తున్నాయి. అటువంటి దేవతలు మన నుంచి ఏమీ ఆశించకుండా మాయం అయిపోతుంటారు. బహుశా మీకు అలాంటి దేవుడే వచ్చి సహాయం చేసి వెళ్లిపోయాడు. ఇలాంటి పనులు వలన మనుషుల్లో దైవత్వం సిద్దిస్తుంది. మీ మంచితనమే మిమ్మల్ని దేవుడు కాపాడేలా చేస్తుంది. ఇది సత్యం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమానీ స్పందన బాగుంది
కృతజ్ఞతలు.
Bhujanga rao
ఇది కలియుగం కాదు,అవసర యుగం. కావున ఇటువంటి పరిస్థితి అందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తటస్థ పడుతుంది.మీ పరిస్థితి యాదృచ్చికంగా జరిగినది.ఒకరిని అడుగ వలసిన పరిస్థితి,మోహమాటపడిపోయిన స్థితి,ముందుకు వెళ్లలేని మరియు వెనుకకు రాలేని పరిస్థితుల్లో మేడం గారి సలహా బాగా ఉపయోగపడింది. అది చిన్న అమౌంట్ కావచ్చు కానీ అవసరం వెలకట్టలేనిది. అక్కడున్న పరిస్థితి గమనించి కూడా సహాయం చేయకపోవడం దురదృష్టకరం మరియు బాధాకరం.ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని అదుకున్నది మీ మంచితనమే ,ఆ దంపతుల రూపంలో మిమ్మల్ని ఆదుకున్నారు. మీ కష్ట సుఖాలు ఈ జ్ఞాపకాల పందిరి ద్వారా మాతో పంచుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదములు డాక్టర్ గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
భుజంగరావు గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
59వ సంచిక బాగుంది.చెప్పిన గదా మీ భూమిక -విషయం లొకి పాఠకుడిని తీసుకుని వెళ్ళే పద్ధతి -బాగుంటది
మనిషి తత్త్వాన్ని బాగాచెప్పినారు అతను డబ్బులుఇచ్చేముందుకూడా ఈకేసూ దండగ కేసే అనుకున్నారు .కాని ఆశ్చర్యకరంగా ఆయన డబ్బిచ్చి మిమ్మలనుషాక్కు గురిచేసిండుగదా
అనుకొని సంఘటనలే జీవితంలొ థ్రిల్
బాగుంది సర్
—-రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది bank లో కానీ ఒకరు మీరు telephones ఉంటారు కదా పరవాలేదు మాడం అన్నారు ఆ ఒక రూపాయి తీసుకోలేదు ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటుంది చాలా చక్కగా వివరించారు
—–విజయలక్ష్మి.
హైదరాబాద్ (కడప)
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
Sambasivarao Thota
Prasad Garu!
Mana hrudayam manchidaithe , yelaanti Klishta paristhithulainaa , mabbu theralla tholigipovaalsinde..
Mee vishayamlo ade jarigindi…
God is always Great
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sambasiva rao garu.
Rajendra Prasad
మీరు రాసిన ఉపోద్ఘాతం చాలా బాగుంది. మానవత్వం, ఇతరులకు అవసరంలో సహాయం చేయటం భాషతో సంబంధం లేదని తెలిసింది. మీకు సహాయం చేసిన వారికి దేవుడు తప్పక మేలు చేస్తాడు
రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభలాషి
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
ప్రసాద్ గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Sir, I don’t want to comment publicly, but what you have written is absolutely correct. Majority of Telugu people, particularly Andhras, even though Iam an Andhra myself are so selfish, no concern about fellow people. By nature Telugu people forget the good things others do for them, not only that they will turn against the helper and become enemies. I have so many bitter experiences including close relatives. You have presented your anguish in a mild manner.
—Uma shankar
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
Jhansi koppisetty
Good one

ఉత్తర భారతీయులతో పోల్చి చూస్తే మన
తెలుగు వాళ్ళలో ఈ సంకుచిత స్వభావం ఎక్కువగా వుండటం నేనూ గమనించాను..
Anyways తిరిగి కూడా ఆశించని ఆ ఉదార స్వభావ జంట మీ అవసరం తీర్చి మిమ్మల్ని ఆదుకున్నారు.. దేవుడు ఏదో రూపంలో మంచివాళ్ళకు సాయం చేయకపోడు…
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చదివానండి.. వంద రూపాయలు తిరిగి ఇవ్వలేకపోయినప్పటికీ.. జ్ఞాపకం చేసుకున్నారు అది చాలు..



—-సంగివేని రవీంద్ర.
ముమ్బై.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారు నమస్కారం
మీకు అమెరికన్ కౌన్సెలేట్ లో ఎదురైన వింత అనుభవం, దాని పర్యవసానంగా మీరు పడ్డ టెన్షన్, దాన్ని వివరించిన విధానాన్ని, చదువుతూ ఉంటే మీరు ఎంతో సున్నిత మనస్కులు మరియు మోతాదుకు మించిన మొహమాట పరులుగా అనిపిస్తుంది.
ఎన్నో సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉంటూ విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఎందరో ప్రజలతో మమేకమైన మీరు ఇటువంటి ఇబ్బందికరమైన సంఘటను ఎదుర్కొనడంలో మీరు అనుభవించిన మానసిక మరియు శారీరక వ్యధ మీయొక్క సున్నిత మనస్తత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇలాంటి అనుభవమే మా శ్రీమతి కూడా 2011 సంవత్సరంలో మొదటిసారి అమెరికాకు వెళుతున్నప్పుడు కౌన్సిలేట్ ఆఫీసర్ కిచూప వలసిన ఒక డాక్యుమెంట్ కాఫీ మరచిపోవటం తో తిరిగి గేటు దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చారు. ఆ పేపరు నేను అందించడంతో తిరిగి ఆమె తన పని పూర్తి చేసుకుని రాగలిగారు .ఒక్క తెలుగు తప్ప ఇతర భాషలు తెలియని ఆవిడే దాన్ని చక్కదిద్దుకున్నారు.అంటే మొహమాటం లేకుండా ధైర్యంగా ఎదుటివారిని ఎదుర్కొన్నప్పుడే మన పనులు చక్కబడతాయి. అలాగే అమెరికాకు మొదటి సారి ఆవిడ ఒక్కరే వెళ్లి తిరిగి రాగలిగారు.
—–బి.ఎన్. కృష్ణా రెడ్డి
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Sarasi
నిజానికి ఆ సమయంలో తెలుగు వాడెవడూ సహాయపడకపోవడం విచిత్రమే. మీరు డాక్టర్ అని సరిగా చెప్పుకోలేకపోయారా?
Sarasi
తెలుగు వారెవరూ సహాయపడకపోవడం ఆశ్చర్యమే. మీరొక డాక్టర్ నని సరిగా చెప్పుకోలేకపోయారా? వీసా కోసం వచ్చిన వారెవరూ బిచ్చగాళ్లు కారు. హోదా కలవారే వస్తారు. దురదృష్టం అంతే.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సరసి గారు
ధన్యవాదాలు.
Dr.Harika
Good morning sir,
Sometimes the person you need most in a trying moment isn’t a person you know at all.
Almost every person encounter such situations in their lives.
It’s an eye feast to see the unexpected kindness that people have received from someone they didn’t know.
These stories range from simple acts that brightened a person’s day to grand gestures that changed a person’s life.
Your story reminded me to recall such incidents that I have come across sir.
Thank you sir for sharing.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Dr.Harika.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Sir.anati mee jnapakam.vivarana,cheppina vidhanam,chala chala bagundi.
Aa sanghatana manasu ki badha kaliginchindi.sir.
Nijam ga sir
Adiginapudu sayam andisthe aa thrupthe veru.
Yevarinaina anumaninchadam avamanichadame.
Br lo unnapudu oka athanu vishayam cheppi sayam adigeru.nenu ventane ichesenu.athanu velli poyaka yenti madam ilage untaru yenduku icherandi annaru.aa mate naku badhesindi.sir vallu yendukaima kaaniyandi.nenu vallaki manchi kosam ichenu.adi naku kastam kadu anedanni
Nenu anukune danni pedha valla charithra le rastharu.
Okkakkari life lo yenni rakala jnapakaluntayo
Rayochu kada ani.
Yemaina meeru baga rasthunnaru sir.
Prathi sanghatana manaki anandanno, leda lesson ga no upayoga paduthundi.
——-mrs.sujana panth.
HANAMKONDA.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you madam.
డా కె.ఎల్.వి.ప్రసాద్
[25/05, 20:59] MANJULA M. DR: Many times we come across with problems really not big issue but very problematic. Problems are resolved in the same way. We have to thank God.
Similar problems of others also you must have helped and in return you will get timely help.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Dr.Manjula garu.