పొదుపు అనే పదం వినగానే, ముఖం చిట్లిస్తారు కొందరు. పొదుపు చేసేవాడు, వట్టి పిసినారివాడని కొందరి అభిప్రాయం. అవసరం వచ్చేవరకూ పొదుపు విలువ తెలియక ఆ తర్వాత ఇబ్బందిపడేవారు, బాధపడేవారూ చాలా మంది. జీవితంలో కొన్ని అనుభవాలు స్వయంగా చూస్తే తప్ప మన జీవితంలో పొదుపు గురించి సీరియస్‌గా ఆలోచించే పరిస్థితి ఎదురుకాక పోవచ్చు. ఒకరి జీవితం ద్వారా మన జీవితం ఆనందమయం చేసుకోవడానికి పొదుపు ఒక చక్కని అవసరం. తినడం మాని డబ్బు దాచుకోవడం పొదుపు అనిపించుకోదు. మనం కనీస జీవితం గడుపుతూ దానికి సరిపడా సొమ్ము ఉపయోగించుకుని మిగిలిన ఎంత తక్కువ సొమ్మునైనా ఆదా చేయగలగడం పొదుపు అవుతుంది. దీనికి భిన్నంగా ఏమి జరిగినా అది పిసినారితనం అవుతుంది.
ఒక ఉద్యోగి, లేదా ఒక వ్యాపారి, తన సంపాదనలో, కుటుంబం కనీస జీవనానికి అయ్యే కనీస ఖర్చులు పోగా ప్రతినెలా కొంత సొమ్మైనా రాబోయే భవిష్యత్ జీవితానికి ఆదా చేసుకోవాలి. అలా ముందు చూపు లేకుండా, వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటే, భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద పెద్ద అవసరాలు వచ్చినప్పుడు పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుంది. అలాంటప్పుడు దిక్కుతోచని పరిస్థితి. అప్పులు చేయడానికి అది రహదారి ఏర్పరుస్తుంది. అప్పు అనేది మనిషిని ఎంత అధః పాతాళానికి లాక్కుపోతుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.
పొదుపు అనేది సాధారణ గృహిణి నుండి కూడా నేర్చుకోవచ్చు. తాను ఖర్చు పెట్టగా మిగిలిన సొమ్ము అది ఎంత చిన్న మొత్తం అయినా పోపుల డబ్బా లోనో మరెక్కడో దాచి పెడుతుంది. అత్యవసరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అలా కాకుండా, బ్యాంకు లోనో, పోస్ట్ ఆఫీసులోనో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ప్రారంభించి, ఎంత తక్కువ సొమ్ము అయినా, నెలకు కొంత డిపాజిట్ చేయడం వల్ల, సంవత్సరానికి కొద్దీ పెద్ద మొత్తం మనకు లభిస్తుంది. ఇలాంటివి వారి వారి స్థాయిని బట్టి నెలకు ఎంత మొత్తం పొదుపు చేయాలన్న అంశం నిర్ణయించుకోవాలి. వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఆ నిర్ణయం అమలు కావాలి. వచ్చింది వచ్చినట్టు తినేయడం, తర్వాత పిల్లలు పుట్టి డబ్బు అవసరాలు పెరిగినప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడడం అది మన అసమర్థతకు తార్కాణం.
ఒక ప్రధాన ప్రభుత్వ కార్యాలయంలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరి పదవీ విరమణ నాటికి రెండు ప్రమోషన్లు పొందిన ఒక కుటుంబరావు, ఒక మామూలు ఇంట్లో అద్దెకు ఉండేవాడు. కూతురికి పెళ్లి చేయవలసి వచ్చి కాస్త పెద్ద అద్దె ఇల్లు కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఆశ్రమంలో నాకు అతను ఎదురైనప్పుడు విషయం తెలుసుకుని “రిటైర్ అయ్యావు కదా! చిన్న ఇల్లు కూడా కట్టుకోలేదా?’’ అన్నాను ఆశ్చర్యంగా.
“లేదు, సార్, నేను ఎప్పుడూ లంచాలు తీసుకోలేదు, అందుకే ఇల్లు కట్టలేక పోయాను” అన్నాడు. అతని సమాధానం నన్ను అబ్బుర పరిచింది. అంటే ఇల్లు కట్టుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లంచాలతోనే ఇల్లు కట్టుకున్నట్టా?ఈ రోజున గృహ నిర్మాణం కోసం ఉద్యోగులకు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలూ, జీతం పూచీకత్తుగా అప్పులు ఇస్తున్నాయి. పదవీ విరమణ చేసే లోపు అప్పు తీర్చేయగల వెసులుబాటు కలిగిస్తున్నాయి. అలాంటప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగి తనకోసం కనీస వసతి ఏర్పరచుకోలేకపోవడం తప్పు కాదా? ఇలాంటి సందర్భాలలో ‘పొదుపు’ అనే పదం, తప్పక గుర్తుకు వచ్చి తీరాలి.
నా జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వెలుగు చూడబోయాయి. కానీ ముందుగానే నాకు ఇలాంటి విషయాల్లో అవగాహన ఉండడం మూలాన నేను ముందస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చేది. నా బంధువులలో ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైనప్పటికీ, పదవ తేదీకల్లా అప్పుల కోసం తిరగడం నేను కళ్లారా చూసాను. అప్పటికి నా చదువు పూర్తి కాలేదు, పెళ్ళి కాలేదు. అయినా ‘అలాంటి అప్పుల జీవితం నాకు రాకూడదు’ అని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అది నేను ఉద్యోగస్థుడినైన తర్వాత తూ. చ. తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేశాను.
ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఇంటావిడ సహకారం చాలా అవసరం. ఆ సహకారం నాకు నూటికి నూరుపాళ్లు నా శ్రీమతి నుండి లభించడం మూలాన నేను కొన్ని చేయగలిగాను. అటువంటి పొదుపు పథకాలలో నేనుఎన్నుకున్నవి – పి.పి.ఎఫ్. అకౌంట్ (పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ – పోస్టల్). ఈ అకౌంట్, బ్యాంకు ముఖ్యబ్రాంచిలలో కూడా తెరవవచ్చు. నెలకు 50/-తో ప్రారంభించవచ్చు. సంవత్సరానికి, లక్షా యాభై వేలు వరకూ డిపాజిట్ చేయవచ్చు. దీని మీద వచ్చే సంవత్సరాంతర వడ్డీ మొత్తం ఆదాయపు పన్నునుండి మినహాయింపు దొరుకుతుంది. సంవత్సరానికి కట్టిన మొత్తం సొమ్ము 80-సి సెక్షన్ కింద మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఉద్యోగులకు ఈ పొదుపు పథకం ఉపయోగానికి వస్తుంది. లేదంటే దీని లాక్ పిరియడ్ 15 సంవత్సరాలు. ఈ పథకాన్ని నేను సర్వీసులో ఉన్నంత కాలం వినియోగించుకున్నాను.
తర్వాత పోస్టల్ జీవిత భీమా పథకం, రికరెన్సు డిపాజిట్ – బ్యాంకు/పోస్టల్ ఇందిరా వికాస పత్ర, ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు ఎన్నుకుని నేను అధికంగా ప్రయోజనం పొందాను. నా సాధారణ దినసరి జీవితానికి సరిపడ సొమ్ము వినియోగించగా మిగిలిన సొమ్ము ఇలా పొదుపు చేసుకునేవాడిని. డెంటల్ చైర్, టి.వి, రెఫ్రిజిరేటర్, వంటివి బ్యాంకు లోన్ ద్వారా కొనుక్కున్నవే! మొత్తం జీతం నుండి చెల్లించేవాడిని.
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. నా తోడల్లుడు ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో వివిధ హోదాలలో పనిచేశాడు. ఆయన ఎప్పుడూ పొదుపు గురించి, తద్వారా డబ్బు సంపాదించడం గురించి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెబుతుండేవారు. కానీ నేను అసలు శ్రద్ధ పెట్టేవాడిని కాదు. అయినా ఆయన వాటి గురించి చెప్పడం మానలేదు, నేను శ్రద్దగా విన్నదీ లేదు.
రచయిత తోడల్లుడు…జాన్ గాబ్రియేల్,చీఫ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రిటైర్డ్) హైదరాబాద్. మ్యూట్యుయల్ ఫండ్స్ గురించి అవగాహన చేసినవారు.
కానీ నా శ్రీమతి బ్యాంకు ఉద్యోగిని కావడం మూలాన, ఎవరి ద్వారానో తెలుసుకుని నాకు తెలియకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టడం ప్రారంభించి మంచి ఫలితాలు రాబట్టింది. అది తెలుసుకునేవరకూ నేను వాటిమీద శ్రద్ధ పెట్టలేదు. సామాన్యుడికి వుండే అనుమానాలూ/భయాలూ నాకూ ఉండేవి.
అందుచేత వాటికి దూరంగా వున్నాను. తర్వాత జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునన్న జ్ఞానోదయం కలిగింది. అందుచేత నేను కూడా ఒక ఏజెంట్ సహకారంతో చిన్న చిన్న మొత్తాలు ఫండ్స్‌లో పెట్టి అధిక వడ్డీ రేట్లు పొందగలిగాను. ఇప్పుడు మా ఇద్దరితో పాటు నా పిల్లలు కూడా మ్యూచువల్ ఫండ్స్ మార్గం ఎంచుకున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
రచయిత ఇంట్లో మొదట ఫండ్స్ లో ప్రవేశించిన తల్లి కూతుళ్లు….అరుణ, నిహార.
అమెరికాలో వుండిఫండ్స్ విషయంలో అవగాహన పెంచుకున్న రచయిత అబ్బాయి రాహుల్. కానేటి.
రచయిత కుటుంబంని,ఫండ్స్ వైపు ముందు నడిపించిన శ్రీ సిద్ది.అంజయ్య, హన్మకొండ.
ఇదంతా నా గొప్ప చెప్పుకోవడానికి కాదు. జీవితంలో అడుగుపెట్టబోతున్న యువతీ యువకులను అప్రమత్తం చేయడానికీ, వారి భవిష్యత్ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఈ నా కొద్దీ అనుభవాలూ కొందరికైనా కొంత వరకూ ఉపయోగ పడతాయన్నది నా ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. మన బ్రతుకు, మన ఆనందం, మన ఉత్సాహం/ఉల్లాసం అంతా మన చేతిలోనే వుంది. చిన్నమొత్తాలలో అధిక రాబడులు సాధించే అవకాశల కోసం ఎదురుచూడాలి గానీ, లంచాలు సంపాదించగల ఉద్యోగాల కోసం కాదు.
అందుచేత సుఖసంతోషాలతో జీవితం గడపడానికి, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటవేయడానికి, ‘పొదుపు’ తప్పనిసరి. అలా జీవితాంతం గుర్తుంచుకోవల్సిన పదం పొదుపు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు. —-డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ జిల్లా.
సంపాదన లో పొదుపు గురించి సరళమైన విధానంలో, క్లుప్తంగా వివరించారు. పొదుపు సూత్రాన్ని Dr.KLV ప్రసాద్ స్వయంగా తాను కూడా ఆచరించారు. తన అనుభవసారం మనకు ఆచరణ యోగ్యమైనది . ఒకప్పుడు పొదుపు ను ఉత్సాహ పరిచే ప్రభుత్వ విధానాలు ఇప్పుడు లేవు. ఈ తరం యువత అప్పుల ఊబిలో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరికి మార్గ నిర్దేశం చేయగల సామర్థ్యం కలిగిన వ్యక్తులు, వారి రచనలు అవసరం.
మిత్రమా….. నీ స్పందన కు ధన్యవాదాలు
చాలా బాగ చెప్పారు సర్. పొదుపు అనేది ఎంత తక్కువ సొమ్మయినా ఖచ్చితంగా ఉపయోగకరమే. అలాంటి జాగ్రత్తలు పాటించక ఇబ్బందులు పడుతున్నవాడిలో నేనూ ఒకడిని. మంచి విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు సర్.
సాగర్ ధన్యవాదాలు. అభినందనలు.
Good morning sir, We need not to have a lot of money to attain financial freedom. Making money or earning is just one part of the game, it is equally important to save and put aside some money into investments in order to achieve financial freedom. Thank you sir for letting us know about the mismanagement of income and importance of financial planning through your experiences.
Thank you Dr.Harika. Your understanding is Commendable.
జ్ఞాపకాల పందిరి 94 అదుపులో పొదుపు..!!పొదుపు గురించి చాలా బాగా చెప్పారు. మన సొమ్మును అవసరాలకు వాడుకుంటూనే మిగిలిన సొమ్మును ఆదా చేసుకుని,జీవితం ఆనందమయం చేసుకోవడానికే కాకుండా భవిష్యత్ అవసరాలు తీర్చుకొని,సుఖ శాంతులతో గడపడానికి,పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి పొదుపు తప్పనిసరి అవసరంగా గుర్తించమని మీ అనుభవ పూర్వకముగా ఈ ఎపిసోడ్ ద్వారా తెలిపి ఇప్పటి తరానికి మంచి సందేశాన్ని ఇచ్చారు సర్.పొదుపు మరియు పెట్టుబడులను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడాలి కూడా.మీరు డబ్బు కోసం కాదు, మీ కోసం డబ్బు పని చేసే విధానమే పొదుపు అని తెలిపిన మీకు హృదయ పూర్వక నమస్కారములు డాక్టర్ గారు.🙏🙏🙏
మీ స్పందన కు ధన్యవాదాలండీ భుజంగరావు గారూ.
శుభోదయం సార్ 🙏💐🙏నిజమే సార్ పొదుపులేని బ్రతుకును అదుపులో ఉంచలేం !నేను సంపాదన మొదలుపెట్టిన నాటినుండే… పొడుపుకి అధిక ప్రాధాన్యతనిచ్చి నా భవిష్యత్తును ఆర్ధిక పరమైన చక్కని ప్లానింగ్ తో ముందుకు నడిపాను !కనుకనే సకాలం లో నాబాధ్యతలు నెరవేర్చుకో గలిగాను !… బాగుంది 👏👏👏👏 ——కోరాడ నరసింహారావు విశాఖపట్నం.
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు కోరాడ వారు.
పొదుపు చాలా అవసరం ఖర్చులను అదుపు చేసుకొని భవిష్యత్తుఅవసరాలకు దాచుకుంటే మంచిది ప్రస్తుతం మ్యూచ్‌వల్ ఫండ్స్, ఎస్ ఐ పి లు ఆశాజనకంగా ఉన్నాయి. పిల్లలు ఉద్యోగ ఆరంభంనుండే హౌజ్ లోన్ ద్వారా ఇల్లుకొనుక్కోవడం చిన్నమొత్తాల పెట్టుబడులవల్ల మంచిప్రయోజనాలు పొందవచ్చు. ఒకే దానిలో కాకుండా మల్టిపుల్ సంస్థలలో పెట్టుబడి పెట్టడంవల్ల రిస్క్ తక్కువ మంచి వ్యాసం ప్రేరణాత్మకం
ధన్యవాదాలు చారిగారు.
సిద్దిపేట అంజయ్య maa వారికి funds గురించి సలహాలు ఇస్తూ వుంటారు —-డా.అంజనీ దేవీ హన్మకొండ.
మేడం ధన్యవాదాలు.
డాక్టర్ గారు.. ఈ వ్యాసం లో పొదుపు యొక్క ఉపయోగాలు చాలా బాగా చెప్పారు . ముఖ్యంగా ఈ తరంవాళ్ళు తప్పక తెలుసుకోవలసింది.. పెన్షన్స్ లేని ఉద్యోగాలు, గ్యారంటీ లేని ఉద్యోగాలు ఉన్న ఈరోజుల్లో పిల్లలకు మంచి మార్గదర్శకం మీ ఈ సంచిక.. ధన్యవాదాలు…
అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలు.
చాలా ఉపయోగకరమైన మార్గదర్శకం సార్. నేను వెన్నెల మరియు అల్లుడుకి కూడా ఫార్వార్డ్ చేస్తాను. భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు 🙏🏿💐 –డాక్టర్ డి.సుజాత విజయవాడ.
పొదుపు గురించి చక్కటి సలహాలు చెప్పారు.. ఐతే పొదుపు పథకాలపై ప్రజలను ఇంకా చైతన్య పరచాల్సిన అవసరం ఉంది.. –వెంకట్రామ నరసయ్య మహబూబాబాద్.
నాజీవితం లో నుండి తీసుకున్నాను.. ధన్యవాదాలండీ.
పొదుపు అన్ని విషయాలలోనూ ఆహ్వానించదగినదే. నాకు మొదటినించీ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ పెంచి ఆదాచెయ్యడం తప్ప వేరే మార్గాలు తెలియవు. ఇప్పుడు మ్యూచ్‌వల్ ఫండ్సులో పెట్టిస్తున్నారు పిల్లలు. ఆదా చెయ్యడం పిల్లలకు నేర్పాలి ప్రతి తల్లిదండ్రులు
ధన్యవాదాలు సరసి గారూ.
మీరు అన్నట్టు మన బ్రతుకు,మన ఆనందం మనచేతుల్లోనే అని మీరు ప్రాక్టీకల్ గా చేసి చూపారు.నిజమే ఈ రోజుల్లో లక్షల్లో సంపాదిస్తున్నా కూడా పొదుపు బాట పట్టని వారు చాలా మంది ఉన్నారు.కొందరికి రాక,కొందరికి తెలీక.మీరు సూచించిన విషయాలు తెలియని వారికి జీవితంలో ఒక మెట్టు ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగిస్తాయి.మంచి అవగాహనతో,అనుభవంతో కూడిన ఆవశ్యకమైన అంశాన్ని ఈనాటి మీ జ్ఞాపకాల పందిరిలో మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సర్💐🙏 ——డి.నాగజ్యోతి శేఖర్ కాకినాడ.
అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలండీ.
చాలా చక్కగా పొదుపు చేయడం గురించి వివరించారు సార్ అందరికీ ఉపయోగకరమైన విషయాన్ని జ్ఞాపకాల పందిరి ద్వారా తెలిపిన మీకు హృదయపూర్వక శుభాభినందనలు 👏👌💐👏👌🙏👏👌💐🙏👏👌🙏
,94 వ మజిలీ చదివిన. సర్. దాంట్లో కామెంట్ చేయటానికి ఏమీలేదు.నెల జీతగాళ్ళు తమకు తెలిసిన (నాలుగిండ్లలో పని చేసే) వాండ్ల దగ్గర,చేబదులో వడ్డీకో డబ్బు తీసుకోవటం నేను చూసిన. అందుకే నెల వారీ ఖర్చు లెక్కలు రాసుకుంటే దుబారా దేనిమీద ఔతుందో తెలిసి జాగ్త్త పడే వీలుంటది.నేను విద్యార్థిగా ఉన్నప్పుడుమా నాయన గారు ( ఊరినుంచి డబ్బు పంపేవాడు ఇక్కడ గది కిరాయకు తీసుకొని వంటచేసుకు తినే వాడిని) ఏంఖర్చు పెట్టినవో లెక్క రాయమనేవాడు.ఆ అలవాటు నాకిప్పటికీ ఉన్నది. మీఇవాళటి జ్ఞాపకాల పందిరి జీవితంలో అందరికీ ఆచరించవలసిన జీవనపద్ధతివలెనే ఉన్నదనటం లో సందేహం లేదు. ధన్యవాదాలు —రామశాస్త్రి హన్మకొండ జిల్లా.
ధన్యవాదాలండీ.
Excellent message. Good guidance for middle class and beginners 👏 Thanks very much for the wonderful and valuable information and helpful message dear brother .👌💐👏 —jhansi nirmala Hyderabad.
Thank you sister Nirmala..
పొదుపు గురించిన మీ అనుభవాలు, జ్ఞాపకాలు బాగున్నాయి సార్. ‘ జ్ఞాపకాల పందిరి ‘ ఒక మంచి అనుభవ సారం .మొత్తం పుస్తకాన్ని చదువాలని ఉంది నాకు . మెట్టు మురళీధర్
ధన్యవాదాలండీ మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
నమస్తే సార్. మీ ఫండ్స్ పొదుపుల ఙాపకాలపందిరి చాల బాగుంది. చిన్నతనంలోనే లక్షలార్జిస్తున్న నేటి యువతకు అవసరం, మీరు ఆదర్శం కూడ. ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేరితే బాగండు. 👌👏🙏 —-విద్యా దేవి.ఆకునూరు హన్మకొండ జిల్లా.
అమ్మా ధన్యవాదాలండీ.
జ్ఞాపకాల పందిరిలో పొదుపు గురించి బాగా రాశారు. సింగరేణిలో పోస్టాఫీసు ఆర్.డి. మరియు ఎల్. ఐ.సి. పథకాలకు జీతంలో రికవరీ చేస్తారు. ఎంతటివారైనా ఎంత ధనవంతుడికైనా పొదుపు అవసరం. సందేశాత్మక కథనం. —–జి.శ్రీనివాసాచారి కాజీపేట.
చారి గారూ ధన్యవాదాలండీ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పడమటి గాలికి కీర్తి గీతిక
మహాభారత కథలు-54: ఇంద్రప్రస్థపురం చేరుకున్న అర్జునుడు
‘రామకథాసుధ’ నాకెందుకు నచ్చిందంటే..
వారాల ఆనంద్ చిన్న కవితలు 9
పిచ్చుకల్ని ప్రేమించండి
సాఫల్యం-36
మానస సంచరరే -15: పరిపరి విధముల భక్తి పరిమళం!
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-5
కాంచన శిఖరం-1
అవసరమా అంటే!?
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®