తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ వేదిక, గుడివాడలో ప్రముఖ రచయిత్రి అనూరాధ రచించిన ‘గుప్పెడు మనసు’ కథా సంపుటిని సాహితీవేత్తలు, భాషాభిమానులు, ఆత్మీయుల ఆనందోత్సాహాల మధ్య ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ వల్లూరిపల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావు 23/7/2023 ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన సభలో ఆవిష్కరించారు.
పుస్తక సమీక్షకులు డాక్టర్ సోమసుందర్రావు మాట్లాడుతూ మానవత్వం, ఆప్యాయత, ఆనందం, అనుబంధాలు, కుటుంబ సంబంధాలకు ప్రతిబింబంగా ‘గుప్పెడు మనసు’ కథా సంపుటి అద్దం పట్టిందన్నారు. రచయిత్రి అనురాధను ప్రత్యేకంగా అభినందించారు. మోకా మాధవరావు, పి.వి. సత్యనారాయణ, వంగ శ్రీనివాస్ వేదికను పంచుకున్నారు.
సమితి సమన్వయకర్త డి.ఆర్.పి. ప్రసాద్, ఉరిటి రామారావు, రూప్ చంద్ జైన్( భారత్ వికాస్ పరిషత్), అర్జా ప్రసాద్ (ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్), మాజేటి రంగనాథ్ (అమ్మ చారిటబుల్ ట్రస్ట్), లక్కింశెట్టి విజయలక్ష్మి (బంధువు, ఉపాధ్యాయిని) విడివిడిగా ఘనంగా రచయిత్రిని సన్మానించారు. చింతలూరి సత్యనారాయణ, దాసరి హరగోపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి అనూరాధ తను పిల్లలకు పాఠాలు చెప్పిన స్కూల్లోనే తన పుస్తకం ఆవిష్కరణ జరగటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తిరుప్పావై – నేటికీ వర్తించే మార్గదర్శిని
అమ్మమ్మ అంతరంగము
నమ్మకు… నన్ను నమ్మకు
అభిమానం
నీవుగాక ఎవరు నా దేవత
అద్వైత్ ఇండియా-9
జ్ఞాపకాల తరంగిణి-51
కాజాల్లాంటి బాజాలు-104: ఒక గుర్తింపు..
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-18
నేను పత్ర హరితమై..
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®