ఆనందం ఒలికింది
మౌనం పలుకై
పువ్వు నవ్వింది
నవ్వు చినుకై
మధువు రాలింది
అనుభూతులు తెమ్మరలై
దుఃఖపు తెరలు తొలిగాయి
హాసాలు కాంతిపుంజాలై..!!

లక్ష్మీ కందిమళ్ళ గారి నివాసం కర్నూలు. గృహిణి, కవయిత్రి, రచయిత్రి.
ప్రవృత్తి: కథలు కవితలు రాయడం.
ఇంత వరకు రాసిన కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
ఉగాది పురష్కారం 2019 కర్నూలు కలెక్టరు గారి చేతులమీదుగా అందినది.
మొదటి కవితా సంపుటి “రెప్పచాటు రాగం”.