సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పతంజలి గారి వ్యాఖ్య:
    ఆనాటి చారిత్రక వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నారు . అభినందనలు. ధోకా(= మోసము, )నమక్‌ హరామ్(= చేసిన మేలు మరచి పోయి ద్రోహం తలపెట్టేవాడు, కృతఘ్నుడు,) జహాపనాహ్(= లోక రక్షకుడు) గోసాయి (= బైరాగి) మొదలయిన పదాల ప్రయోగం ఆనాటి కథా వాతావరణానికి తగినట్లుగా సందర్భోచితంగా ఉన్నాయి.
    ” పొలిమేరలు ఉషోదయం కోసం ఆవలిస్తున్నాయి.” ఎంత చక్కటి ఉక్తి వైచిత్రి. కథానుగుణమైన వర్ణన. అభినందనలు.
    ఒక చిన్న సందేహం. పటా అంటేనే కత్తి , ఖడ్గము అని అర్థాలు కదా . (తెరగున వలరాజు తెజిపైనెక్కి, మెరుగుచాయలు మించు మేల్‌ పటాబూని.(కాటమరాజు కథలు 1-58) మీరు పటాకత్తి అన్నారు. స్పష్టత కోసమా? వీలుంటే సందేహాన్ని తీర్చండి. అలాగే కుమ్మ పొగ ఏమిటండి? కుమ్మ అంటే నీరుపోసిన నిప్పు, జ్వాల లేని నిప్పు. కుమ్మ పొగ అంటే? మరోమారు మీ శైలికి నమామి. 🙏
    – పతంజలి

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది విహారి గారి వ్యాఖ్య: నమస్తే… మీరు ఎంతో శ్రద్ధగా చదివి వివరంగా విశేషాలు చెబుతున్నారు.. ధన్యవాదాలు…
      ఇక, పటాకత్తి…
      ఇది వ్యావహారికంలో, నాటక పరిభాషలో …
      ఒరలో ఉండేది…
      పటాకత్తులును, కటారు బాకులు.. అని ఊపు కోసం వాడతారు…. నాజర్ అల్లూరి సీతారామరాజు బుర్రకథలో ప్రయోగించారని గుర్తు…
      కుమ్మ పొగ….మీ వివరణ బాగుంది…
      ఇక్కడా ఇది గ్రామ్యం…
      కనిచీకటి వేళ..
      ఊరి పొలిమేర లో
      నిలిచి చూస్తే ఒక్కొక్కప్పుడు దూరంగా గుడిసెల్లో నుంచీ కమ్ముకొని పొగ కనిపిస్తుంది…ఆరిన పొయ్యిలు మళ్ళీ వెలిగించని పరిస్థితి…నా చిన్నతనంలో వాడలు,గూడెంల పేదరికానికి ప్రతీకగా చూపి చెప్పుకునేవారు… నాకు అనుభవం!!
      మరోసారి ధన్యవాదాలు..

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    కథను కన్నులకు కట్టిస్తున్నారు.. ధన్యవాదములు విహారి గారూ.. చాన్నాళ్ళ తరువాత ఒక మంచి సీరియల్ చదువుతున్నాము. వర్ణన ఉత్కంఠ భరితంగా ఉంటోంది..💐🙏
    కూర చిదంబరం.

  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    మొఘలాయిల కాలంనాటి యుద్ధ వాతావరణాన్ని రాచరిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నారు.. విహారి గారికి అభినందనలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!