సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. మాధురి ఇంగువ గారి వ్యాఖ్య:*గురువుగారు, ‘సంచిక’లో వచ్చిన మీ ‘జీవితం ఓ ప్రయాణం’ ఫీచర్ ఇప్పుడే చదివాను, అద్భుతంగా ఉంది! మీ కలం మీ జీవితపు లోతుల్ని, ప్రయాణంలోని అనుభవాల్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తోంది. మీ సరళమైన శైలి, భావవ్యక్తీకరణ చదువుతుంటే దృశ్యం కళ్ళకు కట్టినట్టు ఉంది. సూపర్ సార్! ఈ అద్భుతమైన కలం కలకాలం ఇలాగే సాగుతూ మాకు ఆనందాన్ని , ప్రేరణనీ కలిగించాలని కోరుకుంటున్నాను 🙏 కృతజ్ఞతలు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. పంజాల నరసయ్య గారి స్పందన:*భువనచంద్ర గారూ! మీరు దాపరికం లేని మనిషి అనిపించింది, మీ జీవిత ప్రయాణం మొదటి భాగం చదివిన ప్రొఫెసర్ నరసయ్య పంజాలకు. అంటే నాకే.
    రెండు ఇడ్లీలు, హార్లిక్స్ బాటిల్ సాంబారు.. నవ్వించాయి. నవ్వి తప్పు చేయలేదు కదా! – ప్రొ. నరసయ్య పంజాల. *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Dr. Venkat Utukuri: *Thank you very much. Will read it with great interest.🙏🙏. *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పులగం చిన్నారాయణగారి వ్యాఖ్య: *సర్, ఇప్పుడే ‘సంచిక’ వెబ్ సైట్‌లో మీ ‘జీవితం ఓ ప్రయాణం’ – ‘సీ ‘రియల్’ చదివాను. ఒక కథలా అద్భుతంగా రాశారు. “జీవితమనే సీ.డి.ని ఎన్ని సార్లైనా రివైండ్ చేసుకోవచ్చు. బట్ నో ఫాస్ట్ పార్వర్డ్”, “కలలు నా ప్రాణస్నేహితులు. పడుకున్న మరుక్షణం అవి నా కనుపాపల్లో వాలిపోతాయి” వంటి వాక్యాలు అయస్కాంతాల్లా ఆకర్షించాయి. వచ్చే వారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ- మీ పులగం చిన్నారాయణ. *

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుద్దాల అశోక్ తేజ గారి స్పందన: *అన్నయ్యా చదివాను. మొత్తం స్టోరీ ఎప్పుడు చదువుతానా అనే కాంక్ష మొదలైంది. గొప్ప prose కూడా మీరు రాయగలరని ‘వాళ్ళు’ తో ఎప్పుడో తెలిసింది. eagerly waiting అన్నా!! శుభం. జయహో. *

    Reply
  6. 6

    ramasundarimsbpnv

    భువనచంద్ర గారూ,
    ‘జీవితం ఓ ప్రయాణం’ సీరియల్, మీ పాటలు విన్న శ్రోతలకీ, రచనలు చదువుతున్న పాఠకులకీ ఎంతో స్ఫూర్తిదాయకం. చింతలపూడి స్వామీజీ, మాతాజీ, అమ్మవారి ఆశీస్సుల్ని అంతగా గుండెల్లో నిలుపుకున్నారు కాబట్టే సాహిత్య, సంగీత, సినిమా రంగాల్లో అగ్రగణ్యులతో కలిసి పనిచేసే అద్వితీయ అవకాశం వచ్చింది. మీ జీవితంలో మీరు కోరుకున్న సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగిందో కళ్లకి కట్టినట్టు వివరించారు. జలంధర గారూ, డా. గోపాలకృష్ణ గారి వంటి మహనీయులతోనే మొదలైన ప్రయాణం అంతకంతకూ మహత్తర స్థాయిని తీసుకు వచ్చింది. ఇది గంతవ్యం. కాబట్టే బేస్ అలా ఏర్పడింది. అసలు మరపురాని మీ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యం కలుగుతుంది. మీరెలా ఆరోజు అనుభూతి చెందారో అదే అనుభూతి పాఠకులకి కలుగుతుంది. చాలా సంతోషంగా ఉంది మీ ధారావాహిక చదవడం.
    చండి (రమాసుందరి)

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చండి గారి స్పందన: *ఈ ధారావాహిక ప్రభంజనం కాబోతోంది. వటవృక్షంలా ఎదిగిన నువ్వు జీవితంలో ఏ అనుభూతిని మరిచిపోకుండా రచనల ద్వారా ప్రజల మనసుల్లో చెదరని ముద్ర వేసుకుంటున్నావు అన్నయ్యా. నేను ఈ లింక్ తెలిసిన గ్రూపుల్లో కూడా పోస్ట్ చేశాను.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ కాళ్ళకూరి శైలజ గారి వ్యాఖ్య: *పరమాద్భుతం బాబాయ్ గారూ.. 🙏 అభినందనలు. వందనాలు.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. కె. రామయ్యగారి వ్యాఖ్య: *ప్రియమైన భువనచంద్రరాజు గారూ.. పారిస్ కార్నర్ దగ్గరున్న బర్మా బజార్ లో కాసియో కాలిక్యులేటర్ కొనుక్కుందాం రారా అని మా పెచల్ మామ మద్రాసు తీసుకెళ్లినది.. లజ్ కార్నర్ వద్ద లజ్ హోటల్లో ఓ చిన్న రూములో ఉన్న 1980 వ సం|| గుర్తుకొచ్చాయి.
    ఆరుద్ర, రామలక్ష్మి అక్క, తెన్నేటి హేమలత (శ్రీశ్రీ, రంగనాయకమ్మ అక్క, కొ.కు. నాయనల సాహితీ వాగ్వివాదాలు.. రామాయణం వివాదాలు.. ఆ రోజుల్లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ఆంధ్రజ్యోతి వారపత్రికలో)..
    టీ.నగర్, పాండీ బజార్ చూసాం కానీ, మలర్కోడి మేన్షన్ చూసే అదృష్టానికి నోచుకోలేదు. బాపు-రమణల ప్రియమిత్రుడు ఎం.వి.ఎల్ నరసింహరావు గారిది నూజివీడే కదండి. మీరు పరిచయం చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గారిని తలచుకుంటే వినమ్రంగా నమస్కరించాలనిపిస్తుంది. సాయంత్రం వేళ్లలో పాండీ బజార్ పార్క్ లో విద్వత్సభలను నడిపిన మల్లాది రామకృష్ణశాస్త్రి ( మా బందరు వారు) గారికి నమస్కరిస్తూ..
    మద్రాసు తెలుగు సినీలోకం తోటి మీ అనుభవాలని మరిన్ని తెలుసుకోవాలని ఆశక్తితో…
    ~ ఇట్లు, భవదనుగ్రహ పాత్రుడు, కె.కె. రామయ్య*

    Reply
    1. 9.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది భువనచంద్ర గారి ప్రతిస్పందన: *చాలా చాలా సంతోషం రామయ్య గారు మీ మెసేజ్ నాకు అంతులేని ఆనందాన్ని శక్తిని ఇచ్చింది హృదయ పూర్వక ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ సో మచ్.*

      Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి గారి స్పందన: *శ్రీ భువనచంద్ర గారికి నమస్కారములు. మీ సినీ జీవన ప్రస్థానం చదివాను అండీ. చాలా చాలా బాగుంది.మీజీవిత అనుభవాలని ఇలా వున్నది ఉన్నట్లు వ్రాయటం మీ ఒక్కరికే సొంతం.4ఏళ్ల వయసులోనే కలలు కనటం అవి 40ఏళ్ల వయసులో నిజమవటం చాలా అద్భుతం గా వ్రాసారు. 40సంవత్సరాల క్రితం సినిమా పరిశ్రమ ఎలావుండేది ఓ పోసిషన్ కి రావాలంటే ఎంత కష్టం ఉంటుంది కళ్ళకు కట్టినట్లు వ్రాసారు. ఎంతో మంది సీనీ, సాహిత్య ప్రముఖుల పరిచయం, డాక్టర్ గోపాలకృష్ణ గారి లాంటి ఉన్నత మైన వ్యక్తుల గురించి వ్రాసారు. 40సంవత్సరాలక్రితం మనుషుల జీవితాలు, ఆలోచనలు ఎంత సింపుల్ గా ఉండేవో కళ్ళకు కట్టినట్లు వ్రాసారు. ఉదాత్తమైన పాత్రలను కలగర్భం లో కలసిపోకుండా అక్షర బద్దం చేసిన మీకు 🙏. మీ సాహిత్యం లో కధ తో పాటు ఎన్నో విషయాలు పంచుతారు ఈ తరం వాళ్ళు చదివి ఆచరించ వలసినయి చాలా ఉన్నాయి. వచ్చే సంచిక కోసం ఆసక్తి గా ఎదురుచూస్తూ -రోహిణి 🙏🌹*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బలభద్రపాత్రుని రమణి గారి స్పందన: *భువన చంద్ర గారి జీవితం ఓ ప్రయాణం చాలా బావుంది. అజాత శత్రువు కాబట్టి అందరిలో ఆయనకి మంచే కనిపిస్తుంది. ఇప్పుడే ప్రారంభం అయిందిగా.. ఇంకా ముందు ముందు చాలా బావుంటుంది.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. ఎల్. నరసింహంగారి వ్యాఖ్య:*భువనచంద్రగారూ, మీ సినీ జీవన ప్రస్థానం తొలి దశ గురించి సినీ పాత్రికేయం కొంత కాలం వెలగబెట్టిన నాకు కొంత మేరకు తెలిసినా, తెలుసుకోదగ్గవి చాలానే వున్నాయనిపించింది, తొలి సంచిక చదవగానే. ఉన్నది ఉన్నట్టు రసవత్తరంగా ఆత్మ (కథ) ని ఆవిష్కరించగలగడం అతికొద్దిమందికే సాధ్యం. వారిలో మీరు మొదటి వరుసవారు. మరో ఆదివారం ‘సంచిక’ కోసం ఎదురు చూస్తూ – ఎం. ఎల్. నరసింహం.*

    Reply
  13. 13

    అనిల్.అట్లూరి

    భయ్యా, అందరూ తెలిసినవారే.
    వారితో మొదలు పెట్టిన ఈ శీర్షీక
    మీ “జీవితం ఓ ప్రయాణం”
    అద్భుతంగా సాగుతోంది.
    జిజ్జీ, వారి మేనత్త లత, చంద్రమోహన్, డాక్టరు గారు.. ఇలా అందరిని మళ్ళీ ఇలనుండి భువికి దింపి పళ్ళీ సాక్షాత్కరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు.
    మీ ఆరోగ్యం జాగ్రత్త!

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమా భారతి గారి స్పందన: ‘కలగా వస్తా కలనై వస్తా .. నీ కంటి పాపలో నిదురిస్తా’.. చాలా బాగుంది భువచంద్ర గారు. ఇది పాటగా రూపొందే ఉంటుంది.. ఎందులోనిది చెప్పండి. నమస్తే భువనచంద్ర గారు.. ఎలా ఉన్నారు.. మీ సినీరంగ ప్రవేశం, పరిచయాలు .. ఎలా ఎప్పుడు జరిగాయి అన్న విషయాలని .. రాస్తున్నారు.. ఇంటరెస్టింగ్ గా ఉందండీ. 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®