సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలిత శివజ్యోతి గారి స్పందన:*కంప్లీట్‌గా సిట్యుయేషన్ ఫీలయి, ఎక్స్‌పీరియన్స్ చేస్తే వచ్చే మాటలే పాటల లిరిక్స్ 👌👍ఈ శుభ ఆదివారం మా సూపర్ స్టార్ కృష్ణ గారిని ప్రస్థావించారు ధన్యవాదములు 🙏🙏 *

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్తే భువన చంద్ర గారూ. మీరు వ్రాసిన పాటలు చాలా ఉన్నాయి. వాటిలో మీరు ప్రాణం పెట్టి వ్రాసిన పాటలు చాలా వరకు. రచయిత మనసులో భావాలు స్పష్టంగా సహజంగా సుస్పష్టంగా కనిపిస్తాయి. మీ పాటల్లో ఆ పదాల భావం తడి ఆరకుండా ఉండటమే కాకుండా శ్రోతల మనసుకు కూడా ఆడి అంటుతుంది.
    మీలో ఓ ఆర్ద్రత నిండి ఉండటమే మీ పాటలు, మీరు ఇంత దగ్గరగా ఉండటం జరిగింది అనిపిస్తుంది.
    మీ పాటలో ఓ అందమైన అంతర్లీనంగా ఓ మౌనరాగం ఉంది, దానివల్లనే మీ పాటకి ఆకర్షణ కలుగుతుంది అని నా అభిప్రాయం.
    మీరు పట్టుదల, సున్నితత్వం, నిర్మలమైన మనసుతో వ్రాస్తున్నారు కాబట్టి మీ జీవితం పరిపూర్ణంగా పాటలపందరి అయింది.
    చాలా మంచి విషయాలు, ఆలోచనలు, పాటలు పంచారు. చాలా చాలా విషయాలు చెప్పారు. హృదయపూర్వక ధన్యవాదాలు. అభివందనం అండి.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్ సుశీలమ్మ గారి స్పందన:*భువన్ జీ, సినీ ప్రపంచంలో ఒక హిట్ కొడితే రెమ్యూనరేషన్ అనూహ్యంగా పెంచే కళాకారులు (తెర ముందు, తెర వెనుక) ఉన్నారు. మీకు పెంచకపోగా ఎంత యిస్తే అంత తీసుకోవడం, అడ్వాన్స్ అసలే అడగకపోవడం మీకే ప్రత్యేకమైన సంస్కారం. “రాయడమే” మీ ప్రథాన లక్ష్యం.. లక్షలు కాదు. తేనెమనసులు సినిమా కోసం మీ ధైర్యసాహసాలు నాకేం చిత్రంగా అనిపించలేదు. ఎందుకంటే మనం కృష్ణ గారి ఫ్యాన్స్ కదా! తేనెమనసులు సమయంలో ఎలా ఉన్నారో ఆ తర్వాత కూడ “అలాగే” ఉన్నారు. మీరు ఉంచిన కృష్ణ, శ్రీదేవి పిక్ చాలా బాగుంది. Manlyగా కృష్ణ, నిండైన బుగ్గలతో అమాయకంగా, బేబీ ఫేస్ తో శ్రీదేవి.*

    Reply
    1. 3.1

      Bhuvanachandra Raju

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీలమ్మ గారు మీ కామెంట్స్ ఎప్పుడు నాకు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి ఎంతో స్ఫూర్తినిస్తాయి

      Reply
  4. 4

    ramasundarimsbpnv

    శైలజ గారి మాటల్లో ఆమె సహజత్వం, ఆధ్యాత్మిక భావాలూ కనిపిస్తాయి. ఎంత మాయాప్రపంచంలోనూ మీరు డా.గోపాలకృష్ణ గారు, జలంధర గారు, శైలజ గారు వంటి మహనీయులతో కలిసి ప్రయాణిస్తూ మీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అల్ప పదాలతో అనల్పార్థాన్నిచ్చే పాట సందర్భశుద్ధిగా రాయడం మీకు అలవాటైపోయాక ఇక తిరుగేముంది? చిన్నప్పుడు నేను కూడా కృష్ణ గారి ఫ్యాన్ నే. స్కూల్లో పిల్లలు ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., కృష్ణ పార్టీలుగా విడిపోయి ఉండేవారు. నేను ఏ పార్టీ కాదు. సినిమాలో అన్యాయాన్ని ఎదిరించేవాడే హీరో అనుకునేదాన్ని. కృష్ణ గారి సినిమాలు త్వరత్వరగా వచ్చేవి.
    చౌధరాణి గారి గురించి అనిల్ గారు చెప్తుండేవారు. శ్రీదేవిని చిన్నప్పుడు ఆ స్టాల్ లోనే చూశానని రాశారు.
    జీవితంలో సాధించాలనుకున్న ఆశయం సాధించారు. ఇప్పుడు మేము ఆ నిచ్చెన మెట్లని చూస్తున్నాము… ఆశ్చర్యపడుతూ.
    చండి (రమాసుందరి)

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ వివేకం కడియాల గారి స్పందన:* 👌Very interesting sir.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శైల కుమార్ గారి స్పందన: *అయ్యా శుభోదయం. చదువుతూ ఉన్నాను. అద్భుతంగా రాస్తున్నారు 🙏*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి పల్నాటి గారి స్పందన: *శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. హిట్ అయినా రెమ్యూనరేషన్ పెంచుకోవాలి అనే ధ్యాస లేకుండా, ఏడ్వాన్స్ తీసుకోకుండా దగ్గరికి వచ్చిన పాటలు వ్రాస్తూ తీరిక వేళల్లో డాక్టర్ గోపాలకృష్ణ గారిదగ్గర కూర్చొని రిలాక్స్ గా బుక్స్ చదవడం అంత బాలన్స్‌డ్‌గా ఉండటం డబ్బు కోసం పాటలు కాదు పాట కోసం పాట వ్రాయటం ఓ వరం అండీ.పాట వ్రాసి ఆ పాటని ఆస్వాదించటానికి ఓ రోజు తీసుకోవటం వింటుంటే తొలిచూలు బిడ్డని తల్లి తనివితీరా చూసుకోవటం గుర్తుకు వస్తోంది. అణా కి ఇడ్లీ అర్ద రూపాయికి డిన్నర్ బంగారం లాంటి రోజులు. ప్రతి వారం కొత్త విషయాలు తెలియచేస్తున్న మీకు ధన్యవాదములు -రోహిణి 🙏🌹 *

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రచయిత్రి శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మి గారి స్పందన: *సినీ ఫీల్డ్ లో జరిగే చాలా విశేషాలు పాటలు పదనిసలు ఓహ్ చాలా తెలుసుకుంటున్నాను. అభినందనలు.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మోహన్ గోటేటి గారి స్పందన: *మీరు ఎంతటి మొహమాటస్తులో నాకు బాగా తెలుసు. మీ పాటలు సూపర్ హిట్టయి ఊపేస్తున్న తరుణంలో కూడా మీరు పారితోషికాన్ని పెంచకుండా.. ఎంత ఇస్తే అంత తీసుకోవడం.. ఒకవేళ ఏమీ ఇవ్వకపోయినా అడగలేకపోవడం.. ఇవన్నీ మీ మొహమాటం వల్లనే. ఒకప్పుడు మీరు కమాండ్ చేసే స్థితి వచ్చినప్పటికీ, మీరు పారితోషికం విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. పాట రాయడంలోనే ఆనందం, తృప్తి పొందేవారు. అదే మీకు పరిశ్రమలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చింది. మీ ప్రయాణం సంగతులన్నీ చదువుతుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పాండీ బజార్ పూల పరిమళం.. గీతా కేఫ్ కాఫీ ఘుమఘుమలు.. చక్రవర్తి మెస్ కమ్మటి భోజనం.. జ్ఞప్తికి తెచ్చారు. మనసు అటు లాగేస్తోంది.. – మోహన్ గోటేటి.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి తీగవరపు శాంతి గారి స్పందన: *నమస్కారం అండి. మీ జీవితనౌకా పయనంలో, అత్యద్భుత, ఆనంద జీవనతరంగాలను ఎంతో వివరంగా, మీ మనస్సులో పదిలంగా దాచుకున్న ఎన్నెన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా మీ స్నేహితులతో కలిసి చింతలపూడిలో బాల్య మిత్రులతో గడిపిన మధురానుభూతులు గుర్తు చేసుకుంటూ, మా ముందుచడంతో , మీతో పాటు మేము కూడా పయనించి, ఆనందానుభూతి పొందాము.
    మీ బాల్యంతో పాటు మీ సినీ పరిశ్రమలోని రచయితలు, దర్శకులు, గాయకులు, హీరో,హీరోయిన్లు అందరితో గడిపిన మధురాతి మధురమైన జ్ఞాపకాల దొంతరలు మా ముందుంచి మాతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మీ వంటి జ్ఞాన సరస్వతుల భావాలను, జ్ఞాపకాలను ప్రజలకు అందిస్తున్న వారినందరినీ అభినందిస్తూ.. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు పాదాభివందనాలతో- శాంతి 🙏🏻🙏🏻*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రవి గారి స్పందన: *మావయ్య గారు నమస్కారం.. మీ సంచిక చాలా బాగుంది.. మీ మధుర జ్ఞాపకాలు అద్భుతం గా ఉన్నాయి.. మీరు పంపించిన లింక్ ద్వారా మీ పూర్వం సంచికలు కూడా చదువుతున్నాను.. ధన్యవాదములు..*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గడ్డమణుగు సుజాత గారి స్పందన: *సంచిక 10, 11, చదివాను బాబాయ్. తులసిని చూస్తే నిజంగానే బంధువుల అమ్మాయి అనిపిస్తుంది. సైకిల్ మీద ఏలూరు ప్రయాణం బావుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®