సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    ramasundarimsbpnv

    దాసరి గారి అతి అరుదైన ప్రతిభ, సినిమా చూపించినట్టు సీన్ బై సీన్ వర్ణించిన వారి దృశ్యాత్మక నైపుణ్యం… గ్యాంగ్ లీడర్ లో పాటలు రైల్లో రాత్రికి రాత్రి రాసిన వైనం, పోటీలో ఎంపికైన తీరు, బప్పీదాతో మీ చెలిమి, వారి అసిస్టెంట్ తో మీరు నెగ్గిన విధానం… ఎంత అద్భుతంగా ఉన్నాయి ఉదంతాలన్నీ!
    మనుషుల్లో కృతజ్ఞత లోపించింది…అది సినీ రంగంలో ఇంకా సీరియస్ గా జరుగుతోంది. ఉపకారం చేసిన మనిషిని తొందరగా కాలగర్భంలో కలిసేలా చేసేందుకు కంకణం కట్టుకుంటారు వాళ్ల వల్ల ఉపకారం పొందినవాళ్లు. అలాంటప్పుడు ‘ధర్మం ఒక పాదం మీదే కదా నడుస్తోంది ఈ కలికాలంలో’ అని వాపోతుంటాం. మాట తప్పనివాడు ఈనాడు ‘ధర్మం తప్పినవాడు’ గా చెలామణి అవుతున్నాడు… ఎందుకంటే ‘కలియుగంలో ధర్మానికి మూడు కాళ్లు విరిగిపోయాయి కనుక మాట తప్పినవాడే ధర్మబద్ధంగా నడుచుకునే వాడు’ అనమాట.
    మేము చిత్రా, బాలు, బప్పీ, వాసూరావు, రాజ్-కోటి, సుశీల, జానకి గార్ల పేర్లు మాత్రమే విన్నాం. మీరు వాళ్లతో మమేకమై పని చేశారు. మీ ద్వారా ఒక అందమైన పాట వెనక ప్రాణవంతమైన నేపథ్యం అర్థం చేసుకోగలుగుతున్నాము. ధన్యవాదాలు అన్నా.
    చండి (రమాసుందరి)

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బలభద్రపాత్రుని రమణి గారి స్పందన: *అద్భుతం అంత మంది గొప్పవారిని ముఖ్యంగా ఇందీవర్ గారిని కలవడం.. తాల్ మిలా.. పాట మీకెంత ఇష్టమో,మీరు పాడితే నాకంత ఇష్టం..*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం భువనచంద్ర గారూ. మీ జీవితంలో జరిగిన అనుభవాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినా అవి మిమ్మల్ని మీ ఎదుగుదలకు దోహదం చేసే అంశాలు గా ఉన్నాయి కానీ మీకు మాత్రం అచంచల భక్తి భావం తో పాటు పట్టుదల తో పనిచేసారు. అది చాలా గొప్ప విషయం.
    సినీ పరిశ్రమలో మంచి చెడు రెండూ తారాజువ్వలుగానే ఉంటాయి. ఈపరిశ్రమలో నిలదొ క్కు కోవటం అనేది తేలిక కాదు కాని మీ మంచితనం పాటమీద మీకున్న ప్రేమ మీ పై మీకున్న నమ్మకం పట్టుదల నిలబెట్టింది
    అనుకుంట. మీ గురించి విన్నాను చాలా మొహమాటస్తులు, మంచి మనిషి, చాలా పట్టుదలగా మంచి మాటలు వ్రాస్తారని, చాలా మంచివారని. ఆ పేరును జీవితాంతం నిలబెట్టుకుంటున్నారు.
    చాలా మంచి పాటల్ని అందించి మీరు నిలబడి నిర్మాతల్ని నటీనటులను నిలబెట్టారు అని ఘంటాపధంగా చెప్పుకోవచ్చు కానీ ఎంత మాత్రం విలువను ఇవ్వటం మరచిపోతారు. ఏది ఏమైనా సినిమా పాట మీ జీవితం మీ ప్రాణం అని నిరూపించండి. చాలా చాలా అభినందనీయం.
    చాలా ఆనందంగా వుంది మీతో ఈ ప్రయాణం.
    మీరు ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను హృదయపూర్వకంగా.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన: *అద్భుతః*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శైలకుమార్ గారి స్పందన: *క్రమం తప్పకుండా చదువు తున్నాను భయ్యా. చాలా బాగా గుర్తుంచుకొని రాస్తున్నారు. మద్రాస్ లోకి మళ్ళీ వస్తున్నాం🙏*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి పల్నాటి గారి స్పందన: *వారం వారం క్రొత్త క్రొత్త విషయాలతో అమ్మచేసిన మిఠాయిలా ఆహా అనేలా జీవితం ఓ ప్రయాణం వుంది అండీ. సినిమాని ఓ కళగా, తపస్సుగా భావించి కళామతల్లికి సేవచేసిన పుణ్యమూర్తుల గురించి వినే భాగ్యం కల్పిస్తున్న మీకు వందనాలు. ఎంతోమంది దర్శకుల పేర్లు తెర మీద చూడటమే కాని వారి ఉన్నతమైన వ్యక్తిత్వం మాలాంటి వారికి తెలిసే అవకాశం లేదు. అవ్వన్నీ చదువుతుంటే చాలా ఆసక్తి దాయకముగా ఆనందమ్ గా వుంది. జానకమ్మ గారిగురించి మీరు వ్రాసిన వర్ణన నిజం కళ్ళు మూసుకుంటే ఆవిడ రూపం పెద్ద బొట్టు పసిపాప నవ్వు తో మనో ఫలకం మీద దర్శనం ఇస్తారు. ఏమైనా సినిమా ని ఓ వ్యాపారం లా కాకుండా కళగా ఆదరించిన ఆ కాలాన్ని మాకు స్క్రీన్ లేకుండా సినిమా చూపిస్తున్నారు జీ -ధన్యవాదములు 🙏🌹-రోహిణి*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మోహన్ గోటేటి గారి స్పందన: *దర్శకరత్నతో మీ తొలి పరిచయం అనుభవం ఆసక్తికరంగా ఉంది. వారి కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మీరు అద్భుతమైన పాట రాశారు. ఇక బప్పీలహరితో మీ అనుబంధం బాగుంది. మీ కాంబోలో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. గ్యాంగ్ లీడర్ పాటల చిత్రీకరణ కూడా బాగుంటుంది. మీ పాటల్ని రీమిక్స్ చేసుకున్నప్పుడు సదరు నిర్మాత మీకు క్రెడిట్ ఇవ్వాలి. ఆ విషయంలో మీ ఆవేదన అర్థం చేసుకోగలం. మీరేమో.. చాలా.. చాలా సాఫ్ట్ మనిషి!*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ, “నాకూ పెళ్ళాం కావాలి” సినిమాలో రెండు పాటల నుండి ప్రారంభమైన మీ పాటల ప్రస్థానం విజయవంతంగా సాగుతున్నా – “గ్యాంగ్ లీడర్” సినిమా పాటలు ఒక పెద్ద ప్రభంజనాన్ని సృష్టించాయి. మీ పేరు మారుమోగిపోయింది. G A N G… అని బాలు గళం ఉద్వేగంతో పాడుతుంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ సంభ్రమంతో ఊగిపోయారు. ఈ పాటలో ఎంత జోష్ తో చిరంజీవి & టీం స్టెప్స్ వేసారో – “వానా వానా వెల్లువాయె ” పాటలో ఒక రకమైన స్వింగ్ తో స్వీట్ మూమెంట్స్‌తో “ముఖ్యంగా మెట్ల మీద పాదాల కదలింపు” తో యువతను వెర్రెత్తించారు. అది ఎంత సూపర్ హిట్ అంటే 18 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ పై చిత్రీకరించినా నేటి తరం యువత అంతే హుషారెత్తిపోయారు. “ఏ సచ్ ముచ్ వండర్ హై!”*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎంఎల్ నరసింహం గారి స్పందన: *చాలా విశేషాలు తెలిసాయండి ఈ వారం. ది హిందూలో 1988 ఆగస్ట్ 5న నా మొదటి ఆర్టికల్ దాసరిగారి ఇంటర్య్వూ. ఇందీవర్ గారి పాటలంటే అభిమానం.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగళ కందూర్ గారి స్పందన: *వావ్. ఈ 13 వ భాగం నిండా చాలా విషయాలు తెలుసు కొన్నాను.ఔను.దాసరి గారు తెలుగు సినిమానే మార్చేశారు.తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాలు ఎలా తీయాలో చూపించారు. మీ వానా.. వానా.. పాట సూపర్.ఎప్పటికీ గుర్తుండి పోతుంది. హిందీ సినిమా వారితో మీ పరిచయం లో చాలా విషయాలు తెలుసుకొన్నాను. అన్నీ గుర్తు పెట్టు కొని చక్కగ వ్రాస్తున్నారు. సరస్వతీ చంద్ర లో పాటలు, సంగీతమూ విన సొంపుగా వున్నాయి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®