సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగళ కందూర్ గారి స్పందన: *మీరు వ్రాసిన 14 వ.భాగం చదివాను ఇప్పుడే.అందులో మీరు చెప్పిన కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చాయి.
    జరిగిపోయిన దాని గురించి విచారించే అలవాటు నాకు లేదు. నిరాశ నన్నేమీ బాధించ లేదు. నీది అయితే నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. నీది కానిది ఎంత ప్రాకులాడినా రాదు.*

    Reply
    1. 1.1

      Bhuvanachandra Raju

      హృదయపూర్వక ధన్యవాదాలు మంగళ గారు

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ! ఆ మహామహులైన గేయ రచయితలు, సంగీత దర్శకులు ఎక్కడికి వెళ్తారు! మీరన్నట్టు ఆకాశంలో మిలమిల మెరుస్తున్న నక్షత్రాల్లో ఉంటారు, మన హృదయాల్లో నిరంతరం తళుక్కుమంటూనే ఉంటారు. ఆ మేధో సంపత్తి వైబ్స్ మీలాంటి గేయ రచయితల కలం నుండి జాలువారి, సంగీత దర్శకుల చేతుల్లో హొయలు పోయి మావంటి ప్రేక్షకులకు నిరంతరం ఒక ఆనందాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. సాహిత్యం, సంగీతం అజరామరణం కదా!
    ఎవరేమనుకున్నా – రౌడీ అల్లుడు సినిమా పాటలు యువతను ఒక ఊపు ఊపేసాయి. చిరంజీవి అటు శోభనతో “చిలుకా క్షేమమా” (మీరు రాసిందేనా) అంటూ, ఇటు దివ్యభారతి తో “ప్రేమా గీమా తస్సాదియ్యా ” “లవ్ మి మై హీరో” అనే పాటలు సూపర్ డూపర్ హిట్స్.
    మాస్ ట్యూన్స్ కి సరిపోయేట్టు పాట మొదలుపెట్టి, చరణాల్లో మాధుర్యాన్ని నింపుతూ, మెలొడీ సాంగ్స్ రాయడం మీ ప్రత్యేకత అని నేను గమనించాను. అందుకే మీకు మళ్లీ మళ్ళీ అభినందనలు.*

    Reply
    1. 2.1

      Bhuvanachandra Raju

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీల గారు మీ స్పందనకి చాలా చాలా సంతోషం

      Reply
  3. 3

    ramasundarimsbpnv

    ప్రేక్షకుల్ని అలరించే చిరంజీవి డాన్సులకి అద్భుతమైన ట్యూన్లతో సంగీత దర్శకులు వారి పని ముగిస్తే, శ్రోతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని అందించి పాటల్ని ఆచంద్రతారార్కం నిలబెట్టిన సాహితీమూర్తులు మీరు. 19 సంవత్సరాలకే లోకం వీడిపోయిన దివ్యభారతి అందం, నటన ప్రేక్షకుల్ని ఉర్రూతలూపేసింది. బొబ్బిలిరాజా, మోహన్ బాబు సినిమా ఏదో ఉండేది…అసెంబ్లీ రౌడీ అనుకుంటా.. ఈ రౌడీ అల్లుడు..ఆమెకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఉండి ఉంటే శ్రీదేవిలా గొప్ప స్టార్ అయ్యేది. ఎంతమంది ప్రతిభ… సమయం… కలిసి వస్తే ఒక సినిమా హిట్ అవుతుందో తెలుస్తోంది. ఇలాంటి హిట్ సాంగ్స్ అందించే సమయాల్లో పర్సనల్ గా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారో… ! నిజం, మనసు గతంలో జరిగిన విషయాల్ని నిక్షిప్తం చేసుకుంటుంది.. ఆనందంగా ఉన్నప్పుడు గతంలో జరిగిన అలాంటి సందర్భాల్నీ, దుఃఖంగా ఉన్నప్పుడు మునుపు జరిగిన అలాంటి సందర్భాల్నీ గుర్తు చేసుకుంటుంది. కానీ స్వామీజీ, ఆశ్రమ సాన్నిహిత్యంతో మీకొక అతీత స్థాయిలో ఉండే మానసిక స్థైర్యం చిన్నప్పుడే అలవాటైంది. ఒక సైనికుడిగా శస్త్రాన్ని పట్టి యుద్ధభూమిలో జనన మరణ రేఖల్ని దగ్గరగా చూసిన మీరు…గొప్ప సాహితీ పిపాసతో ఎప్పటి నుంచో పాటలు రాసుకుంటూ ఇటు మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఉన్నత సాహితీ ప్రకర్షని రుచి చూపిన మీరు…చాలా అరుదైన ఫీట్ నిర్వహించారు. అన్నా…నమోవాకాలు..
    చండి (రమా సుందరి)

    Reply
    1. 3.1

      Bhuvanachandra Raju

      థాంక్యూ చండీ చక్కని అభిప్రాయాన్ని తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉంగుటూరి శ్రీ లక్ష్మీ గారి స్పందన: *అద్భుతంగా ఉన్నది. పాటలు వ్రాయటం, రికార్డు చేయించటం వాటి కష్టసుఖాలు బాగా తెలుస్తున్నాయి. హిందీ మహానుభావులు గురించి వ్రాశారు. వారి కీర్తి అజరామరం.
    బాబూ, మీ వ్యాసాలు చదువుతుంటే ఆ కష్టాలు అర్థమవుతున్నాయ్. మీ పాజిటివ్ దృక్పథం నాలాంటి వారికి కొత్త పాఠాలు నేర్పు తున్నది అభినందనలు బాబూ. *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®