సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమ గారి స్పందన: *నాకూ పెళ్ళాం కావాలి.. సినిమా చూస్తాను.. మీరు రాస్తున్న ఒక్కో సెగ్మెంట్ మీరు ఎక్కిన ఒక్కో మెట్టులా.. మాకు కూడా బాగనిపిస్తుంది భువనచంద్ర గారు. 🙏 – ఉమ, యు.ఎస్.ఎ.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ML నరసింహం గారి స్పందన:* ఈసారీ కొత్త విషయాలు తెలుసుకున్నాను. జాలాది రాజారావుగారని తెలుసు గానీ వారి పూర్తి పేరు జాలాది సువర్ణరాజారావు అని మీరు చెబితేనే తెలిసిందిప్పుడు ధన్యవాదాలు సార్.*

    Reply
  3. 3

    ramasundarimsbpnv

    ‘కప్ కీ, లిప్ కీ మధ్య లక్ష అడ్డంకులుంటాయి’ ఎంత విలువైన మాట చెప్పారు డాక్టర్ గారు! వారు తమ దగ్గరకి వచ్చిన వారికి మిమ్మల్ని పరిచయం చేయడం…అలా మీకు సినీ రంగ పరిచయం జరగడం, జాలాది గారి వంటి పరిచయంతో మీ ప్రయాణం మరింత రసవత్తరంగా మారడం, మొదటి చెక్కు అందుకున్నపుడు డాక్టర్ గారి దీవెనలు…ఎంత మహత్తరమో మీ జీవన పయనం. మీరు అనుక్షణం మనసులో తలుచుకునే చింతలపూడి అమ్మ వారు, స్వామీజీ మీరు వేసే ప్రతి అడుగునీ అంత భద్రంగా ఉండేలా చూశారు. ఇప్పుడు ‘నాకూ పెళ్లాం కావాలి’ చూస్తాను అర్జంటుగా. అంతర్గతంగా లిరిక్ రైటర్ కావాలనే కోరికతో మీరు చిన్నప్పుడు పోస్టర్లలో ఆత్రేయ గారి పక్కన మీ పేరు రాసుకోవడంతోనే అమ్మవారు మీకు ఆశీస్సులు ఇచ్చేశారు…తథాస్తు…అని. లిరిక్ రాయడం, మార్చడం వంటి పనుల్ని మీరు సునాయాసంగా నిముషాల్లో ముగించడం చాలా ఆశ్చర్యం గొలిపే విషయం. మీ లైఫ్ ఎందరికో స్ఫూర్తిదాయకం. చిన్నప్పుడు నాన్నగారు సొంత సంపాదన ఉండాలిరా అంటే తాలూకాఫీస్ దగ్గర కూర్చుని లేఖరిగా పావలా, పావలా చొప్పున మొదటి రోజే పదిరూపాయలు సంపాదించడం ఎంత గొప్ప! ఇంట్లో నేర్చుకున్న విషయాలు, బళ్లో స్నేహితులతో గడిపిన క్షణాలు, సైనికుడిగా రాజస్థాన్ మరుభూముల్లో దేశ రక్షణ బాధ్యత అప్రమత్తతతో నెరపిన వైనం, పాదచారిగా హిమాలయ పర్వత సానువుల్లో ఒంటరిగా గడపడానికి నిర్ణయించుకున్న సాహసం, మళ్లీ జనారణ్యంలోకి వచ్చి, క్రియేటివ్ ఫీల్డ్ అయిన సినిమాలో మీదైన ముద్ర వేసుకున్న తీరు అంతా అమోఘం…అద్వితీయం..అపూర్వం! ఎప్పుడో 40 ఏళ్ల నాటి ముచ్చట్లలో ఎక్కడా తడబాటు లేకుండా నిన్న మొన్న జరిగిన సంగతుల్లా పేర్లన్నీ గుర్తు చేసుకుంటున్నారు..నాయుడు టైలర్స్…అక్కడ తాగిన టీ! సురేష్ గారి చేతివ్రాత అంత అందంగా, వైనంగా ఉంటుందని చెప్తే ఒక్కొక్కరికీ ఎంత టాలెంట్ ఉంటుందిరా భగవంతుడా అనిపిస్తోంది. మీ అంతరంగం ఒక సువిశాల భవనం. అందులో ముద్ర పడిన ప్రతి రూపానికీ వెనక ఒక చరిత్ర ఉంటుంది. ఇంకా ఇంకా చెప్పండి..ఎందరి గురించి చెప్తారో..

    చండి (రమాసుందరి MSBPNV)

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. చంద్రశేఖర అజాద్ గారి స్పందన: *ప్రతి‌సారీ నిరాశే.. అప్పుడే అయిపోయిందా అని.. మొత్తం మీ అనుభవాలన్నీ ఓ రోజులో చదివేయాలని వుంది… ఇది సీరియల్ కదా.. ఆ ఎదురు చూపులు వుండాలి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Rentala Jayadev:*Excellent nostalgic narration sir🙏*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఊటుకూరు శ్రీ లక్ష్మీ గారి స్పందన: *అదరగొట్టేశారు బాబూ, చాలాకొత్త విషయాలు తెలుసుకోగలిగాను. అభినందనలు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమా శాండిల్య గారి స్పందన: *మీ మొదటి పాట గురించిన విశేషం, మీరు సినిమా కోసం పెట్టుకున్న పేరు గురించి చెప్పినవన్నీ మీ నోటినుంచే మళ్ళీ వింటున్నాటలనిపించింది… మొదటి సినిమా పాటే మీకు అవార్డు తెచ్చిపెట్టటం అభినందనీయం. మరొక పాట మొత్తం ఎన్ని పాటలను చేసింది? జాలాది గారి గురించి భలే చెప్పారు.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*భువన్ జీ, ఇంకో ఆరు నెలల్లో నలభై ఏళ్ల సినీ జీవన ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. అన్నేళ్ల కిందట నుండి ఏ చిన్న విషయాన్నీ మర్చిపోకుండా నేటి పాఠకులకు అందించాలన్న మీ ఉత్సాహం, సత్సంకల్పం మాకు వరం సుమా!
    ముగ్గురమ్మలు – తెన్నేటి హేమలత, భువనేశ్వరమ్మ, జలంధర గార్ల ప్రోత్సాహం, డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆశీస్సులు మీకు కొత్త జీవితాన్ని – మీరు కోరుకున్న సినీ జీవితాన్ని ఇచ్చాయి. మొదటి అడిగే అదృష్టంతో నిండి పడింది. మొదటి పాట రికార్డింగ్ అవుతుండగా బయటకు వచ్చి వెక్కివెక్కి ఏడవటం వెనుక ఎన్నాళ్ళనుండో మనసులో ఉన్న ఆశ, కోరిక తీరిని క్షణం, అదీ విజయ బాపినీడు గారి వంటి దర్శకుడు, వాసూరావు గారి వంటి సంగీత దర్శకుడు, ప్రఖ్యాత గాయకుడు బాలు కలిసి మీ అక్షరాల్ని స్వరాల్లోకి మార్చిన క్షణం.. ఉద్వేగాన్ని ఆపుకోవటం కష్టమే కదా! అవన్నీ మా కళ్ళ ముందు దృశ్యాలు దృశ్యాలుగా ఉంచుతున్న మీకు ఎన్నెన్నో కృతజ్ఞతలు. మీ సినీ అనుభవాలు ఇంకా ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నా, నేనయితే చాలా నిదానంగా నా కళ్ళ ముందు జరుగుతున్న ఓ సినిమాలా ఊహించుకుంటూ చదువుతున్నాను.
    మరో ముఖ్య విషయం – మీరు బాక్స్ లో ఇస్తున్న సమాచారం చాలా విలువైనది. మాకైతే తెలియనివి. నాటి మూకీ చిత్రాలు, స్టూడియో నిర్మాణాలు, సినిమా హాల్స్ వంటి వివరాలు అందించటం చాలా బాగుంది. సినిమాలకు సంబంధించిన పుస్తకాలు, సినిమా వారి జీవిత చరిత్రలు, ఆత్మకథలు చదివాము కానీ ఇది ఒక ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.
    కొన్ని నెలల నుండి అత్యవసర పనుల్లో మునిగి ఉండి, ఈ రోజే ఒకేసారి ఈ మూడు భాగాలు చదివి థ్రిల్ అయిపోయాను. మీకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.*

    Reply
    1. 8.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది భువనచంద్ర గారి స్పందన:*సుశీల గారు గుండె నిండా మీకు ధన్యవాదాలు. మూడు వారాల జీవితంపైన అద్భుతంగా చక్కగా సూటిగా విశ్లేషించారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే మీ స్పందన లభించటం నిజంగా అదృష్టం. మరోసారి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.*

      Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యామిని దేవి గారి స్పందన:*మీతో పాటు డాక్టర్ గారిని అవేప చెట్టునీ ఆ కప్పుల్ని మందుల బాక్స్నీ అందరినీ అన్నిటిని ఉన్నది ఉన్నట్టుగా మా కళ్ళ ముందు కూర్చోబెట్టారు. డాక్టర్ గారంటే గౌరవం పెరిగింది. అసలు మీ మాటల్లో ఎవరి పట్లైనా ఎంత ప్రేమ ఉందో కచ్చితంగా కనపడుతుంది. ప్రతి వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం మీ మాటల్లో మేము చూస్తాం.
    మా బోటి వారందరూ మీ నుంచి నేర్చుకోవాల్సిన ఆచరించాల్సిన విషయం ఇది.
    జాలాది గారి గురించి బాపినీడు గారి గురించి మీకు ఎదురైన ప్రతి వ్యక్తి గురించి ప్రతి సంఘటన గురించి గుర్తుపెట్టుకుని వివరంగా మా కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటే ఆత్రం ఎక్కువ అవుతోంది. మొత్తం ఒకేసారిగా చదివేయాలని..
    జాలాది గారికి మీరు పాద నమస్కారం చేసుకున్నాను అన్న విషయం చదివినప్పుడు నా మదిలో ఒకే ఒక ఆలోచన తిరుగాడింది.
    (మీ పాద దర్శనం చేసుకునే భాగ్యం నాకు ఎప్పుడు అన్న ఆలోచన. నాలో పదేపదే సదా అదే ఆలోచన.)
    గురువర్యా మీరు చెప్తున్నా ఒక్కొక్క సంఘటన మీ ఎదురుగా కూర్చుని మేం వింటున్నట్టే ఉంది.
    పాట వింటూ బయటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చూసినట్టే అనిపిస్తోంది.
    వెయ్యినూటపదహార్లు చెక్కు మీరు అందుకున్నప్పుడు నాకు ఆనందమేసింది.
    ఒకటే నా కనిపిస్తోంది ఇన్ని చదివాక కూడా సినిమా పాటలు దర్శకుల నిర్మాతల అవసరాల మేరకు వారి కోరిక మీద వారికి కావలసిన విధంగా వ్రాశారు. అయితే ఆ నాలుగు వేల పాటల్లో అసలు మిమ్మల్ని.. అసలైన మిమ్మల్ని నేను చూడగలను.
    వాళ్లు గ్రంథం చదివాక మీ లోపల మీరు ఏంటో పైకి అందరికీ కనపడేది ఏంటో తెలుసుకున్నాను. సముద్రాన్ని మదిస్తే అనేకం లభించినట్లు మీ నుంచి మాకు అనేక గ్రంథాలు, జీవిత పాఠాలు, వేల పాటలు, జీవన బోధలు, బోధనామృతాలు అనేక కథలు కీర్తనలు లభించాయి తీసుకున్న వారికి తీసుకున్నంత అన్నట్లు నిధి నిక్షేపాలు పోగు చేసి అందిస్తున్నారు. అనేక జ్ఞాననిధుల్ని మాకోసం అందుబాటులోకి తెచ్చారు ధన్యులం గురువర్యా.
    ఆ సినిమా గుర్తుంది ఆ పాటలు ఇక్కడ చదివాక మరొకసారి వాటిని వినాలని మరలా సినిమా చూడాలని ఇప్పుడే అనిపిస్తుంది.
    మీరు చెప్తున్నా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ సానుకూలమైందేదో కనపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్ను ఒక్కొక్క రంగు పెన్ను వారు వాడారు అన్న విషయం చదివాక భలే ముచ్చట వేసింది.
    మీరు చెక్కు డాక్టర్ గారికి ఇచ్చినప్పుడు పాదాల వద్ద పెట్టినప్పుడు వారి దీవెనలు మీరు అందుకున్నప్పుడు మీ పాదాల వద్ద నేను ఉన్నట్లుగా భావించాను.
    ఆ నింబవృక్షం సాక్షి అన్నప్పుడు ప్రకృతి మీద మీ ప్రేమ కనపడి ఆనందపడ్డాను.
    కారణజన్ముల కరుణ మీకుంది. మీ ప్రేమపూర్వక కరుణ మా మీద (అందరి మీద) ఉంటుందని నమ్ముతాను.
    అది నేను వాళ్ళు చదివాక అర్థం చేసుకున్నాను.
    మనుషులందరిలోనూ సమస్త ప్రకృతిలోనూ జీపులన్నింటిలోనూ మీరు మంచి చూస్తారు. మీరు ఎప్పుడూ బాగుండాలి. బావుంటారు.
    మరో వారం మీరు చెప్పే కబుర్ల కోసం జీవన సత్యాల కోసం ఎదురుచూస్తూ ధన్యవాదాలు తండ్రి
    మీ.. 🌺యామి🌺*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెబ్బిలి హైమావతి గారి స్పందన:*చాలా బాగుంది అన్నయ్యా‌.. మీ పాటలు అద్భుతం‌.. అప్పటికప్పుడు పాటలు అల్లడం,అవి అతికినట్లుగా సరిపోవడం చాలా గొప్ప విషయం.. మీ లాంటి గొప్ప రచయిత నాకు అన్నగా పరిచయం కావడం నా అదృష్టం! 🩷God Bless you!🩷 *

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Lalitha Sivajyothi: *All your fans can save and enjoy memories of your career days 👌👌 And how life lead you I liked it very much.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంథా భానుమతి గారి స్పందన: *అద్భుతం భువన్ జీ. మమ్మల్ని కూడా పాండీబజారు తీసుకెళ్ళి పోతున్నారు. ప్రతీ సన్నివేశం కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. ఎదురుగా కూర్చుని మీరు చెప్తున్నట్లే ఉంది. నా వాల్ మీద షేర్ చేస్తాను.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®