“ఈ సమస్త సృష్టిలా దేవుడెవరు? ఏది దేవుడు అని మీకు అనిపిస్తోందో చెప్పండి” మమల్ని చూస్తా అడిగే అన్న.
“రాముడు నా దేవుడు” నేను అంట్ని.
“ఏసు ప్రభువు నా దేవుడు” జాన్ పాల్ అనె.
“అల్లా నా దేవుడు” సాయిబుల లబాబ్బన్న చెప్పే.
వాళ్ల మాటలు విన్న అన్న నగి, మిగతా వాళ్ళ పక్క చూసే.
“జ్ఞానం దేవుడు”
“ప్రేమే దైవం”
“సంగీతం దేవుడు”
“అందం దేవుడు”
“బలం నా దేవుడు” అనిరి కొంద్రు.
“ప్రకృతే పరమాత్మ”
“పనే పరమాత్మ”
“నరుడే నారాయణుడు”
“మానవ సేవే మాదవ సేవ”
“యదార్థం, పదార్థం. ప్రతీదీ దేవుడే” అనిరి ఇంకొంద్రు.
కడగా ఒకడు “అసలు దేవుడు అనేవాడు లేడు” అనె.
***“దేవుడు అనే విషయం మనిషి మనిషికీ మారింది.
మనిషి మనిషికీ దేవుడు మారాడు.
మార్పు సహజం.
దేవుడైనా జీవుడైనా మార్పుకు లోను అవల్సిందే” అని పోయ అన్న.
7 Comments
Raghunadha Reddy
Nice story
Narayana swamy Bk
Nice
Manasa
Arun
Super sir
K.muniraju
డాక్టర్ అగరం వసంత్ గారు రాసిన ‘కడ’ కత చాలా ఆలోచింప చేస్తుంది. నేటి యువతరం తెలుసుకోవలసిన అవసరం ఉంది. మప్పిదాలు సార్……
Madhu
Good
R.Krishnamurthy
Sir kada story chala bagundi sir good story very nice
sir Mr.Dr. Vasanth