‘కదిలే నడక’ శీర్షికన 5 హైకూలను అందిస్తున్నారు డా.టి.రాధాకృష్ణమాచార్యులు.
~
1.
కాంతి వానైన
నింగీ నేల పాటలో
ప్రాణ దీపం స్త్రీ..
~
2.
గౌరవం పొందే
ఆకాశంలో సగమై
స్త్రీ నడిచే భూమి
~
3.
ఆమెలో శక్తీ
ప్రేమలా కురిసే
సహనం ధాత్రే
~
4.
అపర కాళీ
అన్యాయం ఎదిరించే
ఆమే ప్రవాహం
~
5.
అమ్మే శాంతం
కొమ్మల ఊగే గాలి
బాధే చదువు

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.