కథలన్నీ కంచికి చేరితే నేను రాసిన కథలు మాత్రం అక్కడ చోటు చాలదన్నట్లుగా ఇక్కడి మనుషుల మనసులను మెలిపెట్టి గాఢంగా పాతుకుని గుండెల్లో గూడు కట్టుకుంటాయి. అయితే కరోనా కాటుతో నా కథ ఇలా ముగుస్తుందని నేను కలలోనైనా అనుకోలేదు.
వేల కోట్ల అభిమానుల మనసులు దోచుకున్న నాకు ఘన నివాళులతో వీడ్కోలు చెబుతారనుకున్నాను. నా భౌతికకాయాన్ని నా అభిమానుల కడసారి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారనుకున్నాను. అభిమానుల దాకా ఎందుకు నా కడుపున పుట్టిన పిల్లలకు నా దేహాన్ని చూపించలేదు.. వారికి అప్పగించలేదు. నా ఆఖరి చూపు కోసం నా పిల్లలు నన్ను చూసే ఏర్పాటు ఏ దేశ ప్రభుత్వమూ చేయలేదు. నేను కలగన్న నా అంతిమ సంస్కారాలు నేననుకున్నట్టు జరగనే లేదు.
దళసరి ప్లాస్టిక్ సంచిలో నన్ను బిగించి మూట కట్టేశారు. అయితే నేను ఒంటరిని కాను. నాలాగే మూట కట్టబడ్డ మృతదేహాలెన్నో ఈ ప్రపంచానికి అల్విదా పలుకుతూ నాతో పాటే వున్నాయి.
ఏదో కథలో నేను ‘మనిషి ఒంటరిగా వస్తాడు.. ఒంటరిగానే వెళ్లిపోతాడ’ని రాసిన గుర్తు. తప్పుగా రాసానని ఇప్పుడు కొత్తగా తెలిసింది. ఇక్కడ ఇప్పుడు నాతో పాటు వందల మంది నాకు తోడుగా మూకుమ్మడి దహనానికి సిద్దంగా వున్నారు. మనిషి ఒంటరిగానే వెళ్ళిపోడని మనిషి ప్రకృతి చేతిలో కీలుబొమ్మని ఆఖరుసారిగా ఒకే ఒక్క కథ రాయాలని వుంది. ప్చ్.. సమయం మించిపోయింది.
నా కథలో ఒక నళిని పిచ్చిదయితే తన గుండె గూటిలో పదిల పరుచు కుంటానన్నాడు ఒక అభిమాని. నా కథలో ఒక ధీరజ ఒంటరిగా మిగిలితే తనతో జత కడతానన్నాడు మరో అభిమాని. నా కథలో ఒక సావిత్రి ఎయిడ్స్ బారిన పడితే తనను పెళ్ళాడతానన్నాడు ఓ వీరాభిమాని. ప్రతీ పాఠకుడు నా ప్రతీ కథలోనూ నన్నే కథానాయికగా ఊహించుకుంటాడు. ఆ కథానాయికతో మమేకమై పోతాడు.
నేను అరవయ్యో ఏడుకి దగ్గర పడ్డా పాతిక కథల సిల్వర్ జూబిలీ మాత్రమే చేసుకోగలిగాను. అదేమిటి అరవై వచ్చినా పాతిక కథలేనా అని నన్ను తక్కువ అంచనా వేయకండి. పదిహేనేళ్ళ పిల్లల నుండి తొంభై ఏళ్ళ వృద్దుల వరకూ అందరి ఆరాధ్య కథానాయికని నేనే. చేసుకున్నది సిల్వర్ జూబిలీ అయితే యేమిటి అందరి మనసులలోనూ డైమండులా నిక్షిప్తమయిపోయాను. కొందరు కుర్రకారు హృదయాలను డైమండు లానే కోసేసాను కూడా. అయితే అది వారి బలహీనతే కాని అందులో నా తప్పేమీ లేదు.
నేను శృంగారం గురించి రాస్తే అల్లసానికి శిష్యరికం చేసానన్నారు.. సెక్స్ గురించి రాస్తే డాక్టరు సమరం వారసురాలినన్నారు.. నిర్భయంగా నిర్లజ్జగా బోల్డుగా రాస్తే కమలా దాసు కూతురినన్నారు.. కరుణాత్మక వ్యథలు రాస్తే కన్నీటి వెల్లువై ప్రవహించారు. అక్షరాలతో నేను చేసే స్వేచ్ఛా విహారానికి జోహార్లు పలికారు. నవరసాలొలికించే నవలా రాణినని ఆకాశానికేత్తేసారు. ఏదైనా సభలో నేనుంటానని తెలిస్తే వేలంవెర్రిగా నా అభిమానులంతా అక్కడికి చేరిపోతారు. అదొక సంబరం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాస్టిక్కులో పొట్లమై వున్నాను.. ఒక్కరూ వచ్చి కట్లు విప్పి నన్ను చూడరే..
క్వారంటీనులో వుండగా ఒక నర్సు జాలిగా నా వంక చూస్తూ అడిగింది.. బంగారు నగలతో వచ్చారేమని. పిచ్చిది నేను రావటమేమిటి… ఉన్నట్టుండి శ్వాస అందకపోతే అంబులెన్స్‌కి కాల్ చేస్తే అమాంతం నా ఆరోగ్య పూర్వాపరాలు తెలుసుకోకుండా తీసుకువచ్చి క్వారంటీనులో కరోనా బాధితుల మధ్య పెట్టేసారు. కాలం కలిసి రానప్పుడు తుమ్మినా దగ్గినా ఐసొలేట్ చేస్తున్న సమయంలో ఊపిరాడకపోవటం పెద్ద విషయమేగా మరి.. ఖర్మంటే ఏమిటో ఇదివరకే ఒక కథలో విపులంగా వివరించాను. ఇప్పుడది స్వయంగా అనుభవిస్తున్నాను.
ఇంతవరకూ ఎన్నేళ్ళగానో ఆస్థమాతో కాపురం చేస్తున్నా ఇబ్బంది పడలేదు నేనెప్పుడూ. కాని ఇప్పుడు కరోనా ముంగిట్లోకి మారాక నా కథ అడ్డం తిరిగింది. నేను రాసిన కథల్లో ఏ కథ కరోనాను ఆకట్టుకుందో మరి.. కరోనా ఉప్పొంగే అభిమానంతో తనూ నా అభిమానినంటూ స్నేహం కోసం చేయి చాచింది.
బ్రతికేదే అభిమానుల ప్రేమాభిమానాల మీద. అభిమానిని చేతులు కలపటం నిషిద్దమని వారించలేను కదా. అక్కడితో ఆగిందా.. కౌగిలించుకుంది.. ముద్దాడింది.. ఏకంగా నాలో తను ఐక్యమైపోయింది. దాని పెనుతుఫాను ప్రేమ తాకిడికి ఈ తట్టుకోవటం కొంచం కష్టమే అయ్యింది. ఆ ప్రేమోద్వేగ ఉదృతానికి త్వరగానే వెంటిలేటర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.
వెంటిలేటరు పెట్టే ముందు నా ఒంటి మీది నగలన్నీ ఒలిచేసారు. నా జ్ఞాపకంగా నా చెల్లెలికిద్దామనుకున్న నా గాజులు, నా కోడలికిద్దామనుకున్న డైమండ్ దుద్దులు, నా ఆరో ప్రాణమైన మనుమరాలికి అనుకున్న నా మెడలో గొలుసు అన్నీ తీసేసుకున్నారు. అయినా అమరమైన నా అక్షరాల్లో నా జ్ఞాపకాలు వదిలాక ఈ భౌతికమైన వస్తువుల విలువ ఏపాటిది.
నన్ను మార్చురీలోకి మారుస్తుండగా మా వారి తొలికానుక ధగధగ మెరుస్తున్న నా ఒంటి రాయి డైమండ్ ముక్కు పుడక మీద ఒక ఆయమ్మ దృష్టి పడింది. నా మనసు విలవిలలాడింది. బిగుసుకుపోయిన ముక్కు నుండి బలవంతంగా లాగి తీసుకుంది. అందుకు మాత్రం చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయనకు వాగ్దానం చేసాను అతని తొలి కానుక నా వంటి మీద నుండి తీయనని అది నాతోటే దగ్ధం చేస్తానని. కాని ఇక్కడ నా గోడు వినేదెవరు..?
నా తలకొరివి పెట్టాల్సిన మా చిన్నోడు అమెరికా నుండి వచ్చే అవకాశం లేదు. ఆఖరుకి డిల్లీలో వున్న పెద్దోడికీ ఆఖరి చూపు దక్కనీయలేదు. నా నోట్లో తులసి తీర్థం గంగా జలం పోసినవాళ్ళు లేరు. ఏ వారసత్వ సంబంధం లేని ప్రభుత్వం నా అంత్యక్రియలు చేస్తోంది. శాస్త్రోత్కంగా అంతిమ సంస్కారం చేసే దిక్కు లేదు. నిజం చెప్పొద్దూ జీవితం మీద ఇంకా ఆశ చావని నాకు దింపుడుకళ్ళెంలో లేచి కూర్చుంటానేమోనని చిన్న ఆశ.
ఇన్ని కీర్తి ప్రతిష్ఠలతో ఇంత ఘనమైన బతుకు బతికి కనీసం జలాభిషేకానికి వేదమంత్రాలకు నోచుకోని చావైపోయింది. అసలు ఈ సమిష్టి దహనకాండ ఏమిటో.. అస్థిసంచయనానికి నా ఎముకల ఎరుక కూడా తెలియదు. కాశీలో నిమజ్జనానికి నాదంటూ ఏమీ దొరకదు. ప్రకృతి భీభత్సానికి మనిషి సృష్టించుకున్న శాస్త్రాలన్నీ పటాపంచలై పోయాయి. ప్చ్.. అతిభయంకర మృత్యువునిచ్చే కరోనా అద్భుత కథ ఒక్కటయినా రాయకుండా బూడిదయిపోతున్నానే అని మాత్రం దుఃఖిస్తున్నాను.

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
66 Comments
సుగుణ అల్లాణి
ఏం కథ రాసావు …భయం తో వణికి పోయాను ఝాన్సీ …. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాము. దడ పుట్టించావు గా
Jhansi koppisetty
Thank you సుగుణా, నిజానికి అమెరికా పరిస్థితే ఈ కథ రాయటానికి ప్రేరేపించింది డియర్
ఎం హనుమంతరావు
అమ్మా మంచి కథ రాశారు. చాలా బాగుంది.



Jhansi koppisetty
హనుమంతరావు గారూ, ధన్యవాదాలండీ
Sree
రాయటంలో మీకు వేరే చెప్పే పని లేదు . కానీ ఇంతకు ముందు వందల సంవత్సరాలప్పుడు ఇంతకంటే ఘోరంగ జరిగి ఉండవచ్చు. ఇదే better ఏమెూ?? ఏదైన పోయాకఎలా అయితే ఏంటి?? అనే ధోరణి అలవాటు చేసుకోవ్లేమమెూ?? భయంతో ముందే పోతామేమెూ?? కొంత ఈ విషయంలో మెచ్యూరిటీగ ఉండాలేమెూ?? ఇవి నాఅభిప్రాయలు మాత్రమే!!
Jhansi koppisetty
Thank you Sree, thanks a lot for your valuable comment dear
Padmapv
కంచికి చేరని కథ,.. వాస్తవాన్ని తెలియ చేసింది..

.ధన్యవాదాలు, మేడం.. నాకు బాగా నచ్చింది, ఈ కథ.
Jhansi koppisetty
Thank you Padma, మీకు నచ్చినందుకు సంతోషం

డా.కె.ఎల్.వి.ప్రసాద్
కరోన బాధితురాలి/బాధితుడి స్వగతం
కొత్త ఒరవడిలో కథ చెప్పిన తీరు అద్భుతం.
రచయిత్రి నవల/కథా,రచన ల్లో ఆరి తేరి వుండడం వల్ల
వారికి ఇలాంటి ప్రయోగాలు సుసాధ్యమేనని తేలిన్ది.
రచయిత్రి కి
అభినందనలు.
___డా.కె.ఎల్ వి ప్రసాద్
హనంకొండ.
Jhansi koppisetty
Thank you doctor garu, మీ ఆత్మీయ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు
Dr. Sreenivasa Prasad
Story may not reach Kanchi,but reached the hearts of the Readers. Lively & loving with present context.
Jhansi koppisetty
Thank you Prasad garu, thanks a lot for your lovely compliment
rajanikaza@gmail.com
అందరి మనసులో భయాన్ని అక్షర రూపం లో చూపించారు..గ్రేట్ ఝాన్సీ
Jhansi koppisetty
Thank you రజనీ


Sambasiva Rao Thota
చెప్పాలనుకున్నది చెప్పడంలో మీకు మీరే సాటి !!!
Jhansi koppisetty
ధన్యవాదాలండీ మీకు


శ్యాం గోపాల్
ఏమి కథ రాశారు మేడం, డిఫెరెంట్ గా వున్నా బాగుంది. కథ నడిపించడం లో మీకు మీరే సాటి. వైరాగ్యం లో ముంచేసారు.
Jhansi koppisetty
Thanks andi

D.Nagajyothi
గుండెను తడిపిన కథ మేడం గారు….మీ శైలీ పరిణతి కథలో లీనం చేసింది…. ప్రస్తుత పరిస్థితి ని వాక్యాల మధ్య ఇమిడ్చి గుండె బరువు ఎక్కించారు




Jhansi koppisetty
ధన్యవాదాలు నాగజ్యోతిగారూ, మీ ఆత్మీయ స్పందనకు ప్రేమపూర్వక ధన్యవాదాలు
శ్యాం గోపాల్
ఏమి కథ రాశారు మేడం, డిఫెరెంట్ గా వున్నా బాగుంది. కథ నడిపించడం లో మీకు మీరే సాటి. వైరాగ్యం లో ముంచేసారు.
Jhansi koppisetty
Thank you Shyam garu, it’s a situational story….నా ఉద్దేశ్యం ప్రకృతి ముందు మనిషి తృణప్రాయుడని అహంతో విర్రవీగకుండా ఉన్నంతవరకూ ప్రేమగా వుండాలనే సందేశం నిబిడీకృతమై వుంది …
లక్ష్మీ padmaja
హాయ్ డియర్ మీది ఎంతైనా చెయ్ తిరిగిన హ్యాండ్ డియర్,, కలాన్ని అవలీలగా తిప్పేయగలరు ఏ మూలకైనా, కరోనా కూడా మీ కలం దెబ్బకి ఫట్,, చాలా ప్రత్యేకంగా వు ది కథా వస్తువు,, చాలా బాగుంది కథనం,, అభినందనలు
Jhansi koppisetty
Thank you
Jhansi koppisetty
Sorry darling, జవాబిచ్చే లోపే తొందరబడి సబ్మిట్ అయిపోయింది….Such a lovely comment… you made my day


K. Ramasubbamma
పగవారికి కూడా ఇలాంటి చావు ఊహించలేం. బాగారాశారు అనలేను. అనకుండాను వుండలేను. ఇకమీదట ఇలాంటి వి రాయవద్దని చెప్పాలనుందిగానీ చెప్పలేకపోతున్నాను. రాయండి కొద్ది మందికైనా కనువిప్పు కలుగుతుంది వెళ్లే టప్పుడు వెంటతీసుకెల్లేదేది వుండదని


Jhansi koppisetty
Thank you very much రామసుబ్బమ్మగారూ, నిజమే భీతి కలిగించే కథలు మంచి చేయకపోవచ్చును కాని మీరన్నట్టు కొందరికైనా కనువిప్పు కాగలదని ఆశిద్దాం…


పద్మాకర్ దగ్గుమాటి
నేను గుర్తున్నానా రచయిత్రి గారూ. మీ అభిమాని దగ్గుమాటిని. ఐసొలేషన్ వార్డులో మీకు ఉత్తర దిక్కున రెండు బెడ్స్ తర్వాత ఉన్నాను. మీరు మొదటిరోజు ట్రీట్మెంట్ కి వస్తున్నప్పుడే చూసి చెయ్యెత్తి పలకరించాలని అనుకున్నాను. చెయ్యి సహకరించలేదు. మీరు చేరిన మూడోరోజు సాయంత్రం నాలుగు గంటలకి డాక్టర్లు అందరూ నా మంచం దగ్గర గుమిగూడి గుసగుసలు పోయాక దహన వాటికకు తరలించారు. నారోజు కోసం నేను ఎదురు చూడక తప్పదా అంటూ మీరు కన్నీటితో నర్సుతో అన్నారు ఆ సమయంలో.
ఆ మాస్కుల మధ్యన మాటాడుకోలేక పోయాము. ఇప్పుడు వచ్చేస్తున్నారు కదా.
మీ కథల గురించి మాట్లడవలసిన అనేక విషయాలు ఉండాయి.
దహనం ఐపోయే సమయంకోసం ఎదురు చూస్తుంటాను. వైతరణీ నది దాటాక విశాల గడ్డి మైదానాల మధ్యన కొండ శిఖరంలాంటి పొన్నచెట్టు మొదట కూర్చొని ఉంటాను. ఒకసారి పలకరించండి.
Jhansi koppisetty
My God పద్మాకర్ దగ్గుమాటిగారూ, నేను మిమ్మల్ని అస్సలు ఊహించలేదు….ఇక్కడ మిమ్మల్ని ఇష్టపడను కూడా….ఎంత అభిమానం వుంటే మటుకు నేనొప్పుకోను పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా ఇలా వెంటబడి రావటం….


…
బట్ ఏమాటకామాటే…. ప్రపంచపు ఆవలి ఒడ్డున విశాల మైదానంలో పొన్న చెట్టు మొదట్లో ఓ ప్రియమిత్రుని ఎదురుచూపుల ఊహ మటుకు అద్భుతంగా వుందండోయ్
SHANKARMATHANGI1973@GMAIL.COM
Wow.. super అండి
Jhansi koppisetty
Thank you Sir
SHANKARMATHANGI1973@GMAIL.COM
Nice..narration madam






# మీరు రాసిన స్వగతం lively గా .. చాలా బాగుంది..
.. అది ‘నేను’అని కాకుండా వేరే పాత్ర పేరు సృష్ఠించి ఒక కథ లా రాసినట్లు లేదు..
ఆ వర్ణన.. ఆ ఊహ.. షాజహాన్.. తాజ్ మహల్ ను తన కోసం కూడా ముందు గానే కట్టుకున్నట్లు గా ఉంది.. అద్భుతమైన పదాలతో memsmerize చేసారు..
నిజంగానే 15 నుండి 80 ఏళ్ల వారికైనా అందమైన నాయిక ను సృష్టించి..ఊరించే సృజన మీది.. super dear madam..
#
ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఊహించే నిజం.. ఆ ఊహే భయానకం గా అనిపిస్తుంది..
కానీ పాపం.. ఆ పరిస్థితి పగవారికైనా రావద్దు అని కోరుకుందాం..
Tq for the బెస్ట్ స్టోరీ..& thought
SHANKARMATHANGI1973@GMAIL.COM
ప్రతి ఒక్కరి చివరి కోరిక.. తమ అంతిమ యాత్ర చక్కగా జరగాలని.. తన నగలు నట్రా ..కూతురి కో, మనవరాలి కో అందజేయాలని మనసు ఆరాట పడుతుంది..






చుట్టాలు, మిత్రులు,పరిసర ప్రజలు, కుటుంబ సభ్యుల మధ్య ఆ వేడుక ఘనంగా జరగాలని..
తమ మంచితనాన్ని, గొప్పగా కీర్తించాలని..
తమ అష్టమయం పై వారంతా దుఃఖించాలని,విచారించాలని.. తన ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుని లో ఐక్యమవ్వాలని
తదుపరి కర్మ కాండ లు శాస్ట్రోక్తంగా నిర్వహించాలని..
ముందు ముందు తన ఆశయాలను నెరవేర్చాలని..
తన అడుగు జాడ.. లో.. నడవాలని..
ఎన్నో కోరుకొంటారు..
కానీ ఏవి జరగకుండానే అనాధ చావు ని ..ఏ అనాధలు కూడా ఇష్టపడరు…
#చాలా విచిత్రంగా.. ఇలాంటి ఆలోచనలు మా మది లో లేపారు.. మా మనసుల్ని కలవర పరిచారు.. ఝాన్సీ మేడమ్ గారు.. hats off.. excellent
#ఈ దిక్కుమాలిన కరోన ఆ కలలు, అంతిమ వైభవాన్ని సైతం లేకుండా చేస్తుంది..
ఈ కరోనా ని అంతం చేస్తేనే గాని..మా, మీ..మనందరికీ మనశ్శాంతి లేదు..
Tq.. for the unwanted thoughts
Jhansi koppisetty
Yes Sir true, కరోనా కాలంలో చావు పగవాడికి కూడా రాకూడదు


Jhansi koppisetty
శంకర్ గారూ, మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ…. నిజమే కరోనా కాలంలో చావు పగవాడికి కూడా రాకూడదు

…
N. Shamili
చదువుతున్నంత సేపు కన్నీళ్ళు ఆగలేదంటే నమ్మండి.
Jhansi koppisetty
ఏడ్పించి వుంటే మన్నించాలి….. ఈ కథ చదివిన ఒక అభిమాని ఆగలేక నా క్షేమసమాచారం కోసం ప్రొద్దునే కాల్ చేసారు….Thanks andi మీ స్పందనకు
Zareena
ఇప్పటి పరిస్తిని సజీవంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు
Jhansi koppisetty
Thank you Zareena garu మీ స్పందనకు కృతజ్ఞతలండీ
Akbar mohammad
Visual. Imagery. Kanapadindi. Katha chadiveppudu….chavu patla pedda bhayalu levukabatti. Kaani. Aa bayam vunnavallanu ..bayapettesaru. Contemporary. Story for current time. Best wishes…
_ Akbar Mohammad. Artist
Jhansi koppisetty
Thank you very much Kabatti…..Thanks a lot for your nice comment..
మంచికట్ల లక్ష్మణ్
కరోనాతో మరణం కళ్ళకు కట్టినట్టు చూపించారు
మరణం తరువాత కుడా ఎలా ఉందొ చూపారు
కరొనాకు సామజిక దూరం పాటించడమే నేటి అవసరం
మంచి అంశంతో కంచికి చేరని కథ మనసులను దోచింది
వెరీ వెరీ నైస్ మేడం…
Jhansi koppisetty
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాద నవస్సులండీ


Jhansi koppisetty
లక్ష్మణ్ గారూ, మీ స్పంలనకు నా హృదయపూర్వక ధన్యవాదాలండీ
Sudha Mayee
Ee kadha chadhivaka manasantha badha tho nindi poyendi..evariki elanti chavi rakudadu anipisthundi. యే కధ రాశిన ఆ పాత్రా లో పార్కాయ ప్రవేశం చెయ్యడం నీ రాచన లోని గోప్పతనం. Am very proud of you my dear sister
vijay kumar
ప్రస్తుత పరిస్తితి ని గుండె కు హత్తుకునేలా అనుభవించినట్టుగానే రాసారు నిజంగా కళ్ళు చెమర్చాయి, హ్యాట్సాఫ్ టు యూ అండి
మీ కతలు చాలా బాగుంటాయి
ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి
Jhansi koppisetty
Wow సుధా, నీ కమెంటు నాకెంతో ఆనందాన్నిచ్చింది…Thank you dear…Love you


విజయ్
చదివాక గుండె బారంగా మారింది, చాలా బాగా రాసారు కళ్ళ కత్తుకునేలా heart touching గా ప్రాక్టికల్ గా అనుబగావుంచినట్టుగా ఉంది.
మీ కథలు చాలా బాగుంటాయి నార్మల్ గానే
ఈకథ చదువుతున్నంత సేపు వేరే ఆలోచన కూడా చోటు చేసుకోలేదు.
హ్యాట్సాఫ్ అండి
ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి
Jhansi koppisetty
Thank you vijay garu…
Jhansi koppisetty
Thank you Vijay Kumar garu, thanks for your comment, will definitely let you know when I come to Hyderabad
K K Anand
ఒక కఠినమైన వాస్తవానికి
అద్భుతమైన కథ రూపం ఇచ్చారు ఝాన్సీ గారు
It’s truly your mark of write-up
Jhansi koppisetty
Thank you Anand garu….Thanks a lot


Zameer Ahmed
కరోనా చావు, అంత్యక్రియల ఊహ హృద్యంగా వుంది. సాహో ఘాన్సి గారు
Jhansi koppisetty
Zameer Ahmed garu, మీకు ధన్యవాదనమస్సులు..
ceo@greenhonda.in
Very good and strong message. Any sensible person will take all the precautions and care to stay back home safe during this critical hour.
Jhansi koppisetty
CEO Sir, thanks a lot for your kind response…Yeah it’s message oriented too…..If you perceive it in a right way…
ceo@greenhonda.in
This is Vivek….
Mannem sarada
కధ ఒక విభిన్న కోణం లో సాగింది. మరణం అనివార్యమైనా ఎటునుండి ఏ విధంగా కాటు వేస్తుందో తెలియని దుస్థితి లో అందరం వున్నాం. బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే అని అన్నమయ్య ఆలపించినా మనకి ఎక్కలేదు. కధ బాగుంది. అభినందనలు
Jhansi koppisetty
మన్నెం శారదగారూ, మీ ఆత్మీయ స్పందనకు వేవేల నెనర్లు



శిరీష శ్రీ భాష్యం
హృద్యంగా ఉంది…గుండెను తడి చేశారు
Jhansi koppisetty
శిరీషగారూ, ధన్యవాదాలండీ
Jogeswararao Pallempaati
కరోనా మీద ఇంతకంటే గొప్ప కథని ఓ రచయికగానీ, రచయిత్రిగానీ రాయలేరమ్మా, నిజం!
మీకు తెలీకుండానే కరోనా మీద కథ రాసేశారు, ఏదో కరోనా పూనకం పూనినట్టు!
మానవ సంబంధాలూ, ప్రకృతి భయానక నిశ్శబ్ద యుద్ధాలూ, వాటి పర్యవసనాలూ, మిగిలిన జనం ఒళ్ళు దగ్గరపెట్టుకుని బ్రతికే ఎన్నో నీతులు ఇమిడి ఉన్నాయ్ … ఈ కథలో!
అందరిలాంటి కదులుతున్న మనుషులతో జరిగే అంత్యక్రియలకంటే … కదలలేని శవాల సహవాసంతో జరిగే అంత్యక్రియలు మహా ప్రత్యేకంగా … జీవిత సత్యాన్ని తెలియజేసే విధంగా ఉందమ్మా!
భౌతికంగా దగ్గరికి రాలేని బ్రతికున్న పాఠకుల మనసులన్నీ శవాన్ని చూసి దుఃఖించి సమిష్టి శవదహనాలు పూర్తయ్యే వరకూ అక్కడే తచ్చాడేలా చేసిందీ కథ! దీన్ని దిక్కుమాలిన చావు అంటే నేనొప్పుకోను … దిక్కున్న చావేనన్నది ఎందరికో జీవిత పరమార్థపు దిక్సూచిగా ఈ కథ కొత్త అర్థాన్ని చెప్పింది! హ్యాట్సాఫ్ ఫర్ యువర్ వెరైటీ వే ఆఫ్ డెత్!
Jhansi koppisetty
మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలండీ…. ఇప్పటివరకూ చాలామంది సన్నిహితులు ఇలా రాసినందుకు మందలించారు….మీ కమెంటం చదివాక నేనేమీ పొరపాటుగా రాయలేదన్న నమ్మకం కలిగింది


మొహమ్మద్ అఫ్సర వలీషా
సూపర్బ్ ఝాన్సీ గారు కధలో ఏ పాత్ర లో నైనా ఒదిగి పోయి హృదయానికి హత్తుకునే కధలు వ్రాయడం మీ స్వంతం .నిజమే పుట్టిన ప్రతి మనిషికి చావు తథ్యం వచ్చేటప్పుడు అనామికలా వచ్చినా వెళ్ళేటప్పుడు బోలెడు సంపాదించినా పిడికెడు బూడిదను కూడా వెంట తీసికెళ్ల లేడనే అక్షర సత్యాన్ని కళ్ళ కు కట్టి నట్టు కధలో చూపించారు మీరు పాత్రను ఎంతలా సృష్టిస్థారంటే పాఠకుల కంటి నుండి కన్నీటి చుక్కలు రాలి ఆర్ద్రతతో నింపేంత మీ కధ చదువుతూ ఊహిస్తుంటే మీకసలు ఊపిరాడిందా అనిపించింది మీ నవ్వులు సంతోషం ఉత్సాహం హమేషా మాకు కావాలి ..హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు













Jhansi koppisetty
Such a lovely comment Valeeshaa, మీ మనఃపూర్వక అభినందనలకు ఆత్మీయ స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు


Jhansi koppisetty
ఝాన్సీ ఇప్పడే కంచికి చేరని కధ చదివాను ఇది అనుకోని విధంగా మృత్యువాత పడిన ఒక రచయత వినూత్న మృత్యుఘోష మానవుడు జీవితాన్ని ముగించినా భవబంధాలని త్యజించడు అనే విషయాన్ని కరోనా ని నేపధ్యంగా తీసుకుని రాసిన విధానం slmply superb


రాజకుమారి పి.