కథ-కథానిక అనే రెండు పదాలు గందరగోళపరుస్తుంటవి. వీటిని సమానార్థకాలుగా వాడుతుంటారు. వాస్తవానికి ఇవి రెండు కొద్ది బేధాలతో వేరువేరు. పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీమజిలీ కథలు, భట్టివిక్రమార్క కథలు, సాలభంజిక కథలు, భేతాళ కథలు ఇవన్ని కూడా పూర్వకాలం నుండి ఇప్పటి వరకు తెలుగు సమాజంతో కలిసి నడిచాయి. వీటికి ఒక ప్రయోజనం ఉంది. నీతి చెప్పటం వీటి పరమావధి. మానసికానందానికి, ఆహ్లాదానికి, భయం పోగొట్టడానికి ఇవి సహాయపడ్డాయి. ఆధునిక కథానిక ప్రయోజనం కథ కంటే భిన్నమైనది.
పాశ్చాత్య దేశాలనుండి మనకు దిగుమతి అయినది, ఆధునికమైనది కథానిక. “కదిలేది కదిలించేది, మారేదీ మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు కదిలించేది, పెనునిద్దుర వదిలించేది, పరిపూర్ణపు బ్రతుకునిచ్చేది” కవిత్వమన్నాడు శ్రీశ్రీ. ఈ లక్షణాలన్నీ కథానికకు సరిపోతాయి. అగ్నిపురాణంలో ఆఖ్యానకము, ఆఖ్యాయిక, ఆఖ్యానము, కథానకము అనే పేర్లు కనపడుతున్నాయి. కాని పాశ్చాత్య రచయితలు చెప్పిన కథానికా లక్షణాలు, వివరములు వీటికి సరిపోవటం లేదు. ఇక్కడ లక్షణ చర్చ చేయటం లేదు. కథలు చాలా వరకు కల్పితాలు. ఆంగ్లంలోని ‘షార్ట్ స్టోరీ’ని తెలుగులో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు “కథానిక” అని పిలిచారు. ఆ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చారు. దీన్నే “చిన్నకథ” అని “కథిక” అని పిలిచిన వారున్నారు. మొత్తానికి “కథానిక” అనే పేరు స్థిరపడింది.
కథ పురాణ, ప్రబంధాల్లో ఉంది. అది పద్యరూపంలో సాగింది. నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి పద్యరూపంలోనే వికసించింది. కథ చెప్పాలనే, వినాలనే కోరిక మనకు ప్రాచీన సాహిత్యంలో కనపడుతుంది. అదంతా మార్గకవిత్వ పరిధి లోపలే జరిగింది. ప్రత్యేకంగా ఒక సాహిత్య రూపంలో, విశిష్ట లక్షణాలను సంతరించుకొని తెలుగులో కథ ఇరవైయ్యవ శతాబ్దిలోనే వచ్చింది. అలా వచ్చిన దానిపై ఇంగ్లీషు షార్ట్ స్టోరీ ప్రభావం ఉంది. ఆ చిన్న కథే నేడు కథానికగా పిలువబడుతుంది. వాస్తవంగా నేడు వస్తున్నవన్నీ కథానికలే. కాని మొదటినుండి నోళ్ళల్లో నానుతున్న ‘కథ’ అనే పదం నీడలో కథానిక కలిసిపోయినది. ఈ రోజుల్లో వస్తున్నవన్నీ కథానికలే.
జానపద, సాంఘిక, మానసిక, పౌరాణిక, ఇతిహాస, సాంకేతిక, ఖగోళ, భౌగోళిక విషయాలను ప్రధానం చేసుకొని వేలాది కథానికలు వస్తున్నాయి. భూచర, జలచర, ఉభయచర జీవుల్ని, సాంకేతిక సృష్టి అయిన “రోబో” లాంటి మిషన్లను ప్రధాన పాత్రలుగా చేసుకొని నేటి కథానికలు పాఠకులను ఆలోచింప జేస్తున్నాయి. అలరిస్తున్నాయి. సమాజ జీవనంతో పెనవేసుకున్న ఆనందాల్ని, అంతరాల్ని, సంక్షోభాల్ని, ఘర్షణల్ని, పరిణామాల్ని, విప్లవాల్ని, విలువల్ని, భావజాలాల్ని వెన్నెముకగా చేసుకొని కథానిక మన ముందు ఉన్నది. మానవ జీవన సారాంశాన్ని వస్తువుగా చేసుకొని చారిత్రక వనరుగా కథానిక కనపడుతున్నది.
(మరోసారి మరో అంశంతో)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
A good information. Useful for young writers also all.congrats
కథ, కథానిక అర్థం అయింది సార్ మీ మరో వ్యాసం కొరకు ఎదిరి చూస్తుంటం
అసంపూర్తిగా అనిపించింది. కథ అంటే దేనిని అనాలి.? ఎలా వుంటే కథ అనబడుతుంది? అనేది ఇంకొంచెం వివరంగా చెప్తే బాగుండేదనిపించింది. కథానిక ‘కథ’గా చెప్పబడుతున్నప్పుడు అసలు ‘కథ’ అని దేనిని అంటాం? అనే సందేహం వస్తుంది.
ఇదే అంశాన్ని కొన్ని కథల్ని, కథానికల్ని ఉదాహరణగా తీసుకుని వివరిస్తే మరింత బాగుంటుంది. ఒక అర్థవంతమైన చర్చకు ఆస్కారం కలుగుతుంది. మరోసారి మరోఅంశానికి వెళ్లడం కంటే ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
nice begining sir
రాబోయే వ్యాసాల్లో మీకు జవాబులు దొరకగలవని ఆశిస్తున్న
మీ..వ్యాసం టైటిల్ చూడగానే,క థా నిక -వెంటపడ్డ స్వర్గీయ వే ద గిరి రాంబాబు గారు గుర్థుకువచ్చారు. మీ వ్యాసంలో ఇంకా కథ-కథానికల ,తే డా కు,సరైన స్పష్టత రాలేదు.బహుశా రాబోయే వ్యాసాల్లో తెలుస్తుందనుకుంటా. మంచి విషయం మీద వ్యాసాలు రాస్తున్న మీరు అభినందనీయులు.ధన్యవాదాలు.
thank you sir
కథ – కథానిక మంచి చర్చ. అయితే పూర్తి వివరాలను తెలియజేయగలరు.
మంచి వివరణ
మంచి పరిచయం, స్పష్టీకరణ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అన్నింట అంతరాత్మ-7: పాద సేవకుడిని,, పాదరక్షను నేను!
సానీలు
మానసిక సంఘర్షణలను సహజంగా చిత్రించిన నవల ‘అతిథి’
అలనాటి అపురూపాలు – 209
తెలుగు కు వెలుగు
కవి, అనువాదకులు శ్రీ వై. ముకుంద రామారావు ప్రత్యేక ఇంటర్వ్యూ
చిరుజల్లు-31
సాధించెనే ఓ మనసా!-12
డా. సి. భవానీదేవి గారికి శ్రీ శోభకృత్ ఉగాది పురస్కారం
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®