[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘లైవ్ ఇండికేటర్స్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
1 జీవన సూచికలు గణాంకాలే.. విజేత, పరాజితగా ఆయా స్థానాల్లో ప్రథమం, ద్వితీయం,.. ప్రోత్సాహకం.. పోరాట పటిమయే సత్సంకల్పం పోటీలో నిలవడమే ప్రాధాన్యం
2 ఎదిగే ప్రాయంలో అవధులు లేని ఆనందాలు ఎదర బతుకు ఏమిటనే చింత లేకుండా బాల్యం, కౌమారం భరోసా ఇచ్చినా చేతికొచ్చిన యవ్వనానికి రెక్కలు తొడగనీకు రోజటికి రోజూ పాఠం చదవాలిసిందే నిరంతరం నిన్ను నీవు పరిశీలించుకోవాలిసిందే
3 బహుమతులు, ప్రోత్సాహకాలు మానవ చలనాలు స్థిర చిత్తానికి దోహదకారులు మానసిక ఆరోగ్యానికి హేతువులు ఓ గుర్తింపు కోసం పడే ఆరాటంలో ముందూ వెనకా, వెనకా ముందూ సదా బరి లోనే ఉండాలి
4 ఎప్పుడో గానీ తెలియదు ఉడిగి పోయిన వయసులో గతం అప్పుడు నేనలా ఉంటే నేనింకా ఎలా ఉందునో వర్తమానంలో ఓ నిట్టూర్పు ప్రయోజనమేమీ లేదు, జీవన సాఫల్యానికే చివరి అంకం
5 సవ్య దిశలో బాధ్యతాయుతమైన పరివర్తనే బరువును దించుతుంది వసుధైక కుటుంబంలా ఈ లోకంలో గెలుపైనా, ఓటమైనా నిలకడగా గణాంకాలే జీవన సూచికలు..
శ్రీ మరింగంటి శ్రీకాంత్ గారిది రాజన్న సిరిసిల్లా జిల్లా. తండ్రి గారు రఘరామాచార్యులు. శ్రీకాంత్ గారి కవితలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాల పందిరి-73
మిణుగురులు-6
దేశ విభజన విషవృక్షం-6
అరటి పండు
అలనాటి అపురూపాలు-99
నాన్న లేని కొడుకు-10
స్వాతి కవితలు-8- తెలుసా
పూచే పూల లోన-22
సంచిక కవితల పోటీ 2022 ప్రకటన – గడువు పెంపు
నాటి పురాణాల్లో నేటి ఆధునిక విజ్ఞానం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®