సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రిక్షా నేపద్యంగా తీసిన పాటల వివరణలు బాగున్నాయి. యన్.టి.ఆర్., పాట స్పూర్తి దాయకంగా ఉన్నది. కాదేదీ కవిత కనర్హం అన్నట్లు రిక్షా ప్రయాణం మీద రాసిన పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. ఎదుటివారిని మోసం చేయకుండా కష్టపడి జీవించే ఏ పనైనా గౌరవప్రదమైనదే!…….మీకు తెలుగు కన్నా హిందీ గీతాల మీద ఎక్కువ పట్టు ఉన్నట్లున్నది. అమర్ నాద్ నటించిన “నా చెల్లెలు’ సినిమా పెద్దగా హిట్ కాలేదు. అదే కథ కొంచెం మార్చి యన్.టిఆర్. తో “ఆడపడుచు” తీశారు. అది హిట్ఆ కావటంతో కథనే “చోటే బహెన్” గా తీశారని వినికిడి.

    1. 1.1

      కస్తూరి మురళీకృష్ణ

      మీ వినికిడిలో లోపం వుంది. ‘ఆడపడుచు'(1967)కు మూలం హిందీ ‘ఛోటీ బహెన్'(1959)..దానికి మూలం తమిళ సినిమా ‘ఎన్ తంగై’ (1952). ఈ తమిళ సినిమా ఆధారంగా’ నా చెల్లెలు(1953) సినిమా తీశారు. నా చెల్లెలుకూ, ఆడపడుచుకూ వున్న తేడాలు మధ్యలో ఉన్న ఛోటీ బహెన్ వల్ల వచ్చాయి.

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    రిక్షావాలా మీద తెలుగు, హిందీ లో చాలా పాటలు ఉన్నాయని తెలుసుగానీ అన్నింటినీ ఒకదెగ్గర గుదిగుచ్చి ఈ వ్యాసంలో చూపిస్తుంటే ఆశ్చర్యం వేసింది.రింజిమ్ పాట నాకు చాలా ఇష్టం ఆ రోజుల్లోనే ..ఉన్నవాడికి తింటే అరగదు ..లేనివాడికి తిండే దొరకదు ..!అన్నమాటలు ఎంతచక్కటి రచన అనిపించేది .పాట బాణికూడా బాగుంటుంది .చిన్నప్పుడు ఎక్కువగా దీన్ని హమ్ చేసేదాన్ని కూనిరాగం లా .చాలా పాటలు .ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం .నా రక్తమే నా బండికి పెట్రోలు ..మాటలు కళ్లనీళ్లు తెప్పిస్తాయి శ్రమజీవి గుర్తుకొచ్చి .శంతను శర్మిష్ఠ గారి వ్యాఖ్యానం , మురళీకృష్ణ గారి అనువాదం అద్భుతంగా వున్నాయి .అభినందనలు 🙏🌹🙏🌹

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *నిజజీవితానికి అన్వయించి, ప్రదేశాలని చూపిస్తూ, రిక్షా వాలాల పాటలను ఉటంకిస్తూ, వివరిస్తూ కళ్ళముందు ఆద్భుతమైన పాటలని కళ్ళముందు నిలిపారు. సంచికకు, శంతనూ – శర్మిష్టలకు అభినందనలు, ధన్యవాదాలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి స్పందన: *రిక్షాలు సంబంధించిన చాలా పాటలను స్పృశించి, పోల్చుతూ చక్కని వ్యాసం రాసినందుకు మిక్కిలి అభినందనలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చంద్రశేఖర్ గారి వ్యాఖ్య:* శుభోదయం. రిక్షాలు మాయమైనాయి గనుక, ఆ పాటలు అంతరించిపోయాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటివాళ్ళు ‘ఆటో వాడ్ని ఆటో వాడ్ని’ అనే పాటల్ని కొనసాగిస్తున్నారు.
    దీనికి కారణం ఏమిటంటే శ్రమైక జీవనం అంతా అద్భుతంగా ఉంటుందని, పగలల్లా కష్టపడి సాయంత్రం పాటలు పడుకుని నిద్రపోయి మళ్లీ తమ శ్రమను నమ్ముకుని ముందుకు పోతారని ఒక అపోహ.
    ఈ కార్మికులు కర్షకులు అంతా సుఖ జీవులు, వారికి ఏ బాదర బందీలు లేవు, చీకు చింత అంతకంటే లేదు అనే అపోహను రుద్దడమే సినిమా చేస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఇలాంటి పాటలకే పెద్ద పీట వేస్తారు. శ్రమ దోపిడీని హైలెట్ చేసే పాటలు పెద్దగా ప్రజాదరణ పొందవు.
    ఈ సందర్భంలో ఎంకి పాటలను శ్రీశ్రీ గారు అందుకే పెద్దగా ఎంకరేజ్ చేయలేదనే విషయం మీకు తెలియనిది కాదు .
    స్వస్తి. 🙏🏼💐🙏🏼💐🙏🏼💐*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాడ శాస్త్రి గారి వ్యాఖ్య: *రిం జిమ్.. నా చిన్నప్పుడు బాగా ఇష్టమైన పాట. మొత్తం పాట ఆ రోజు నుండి ఈ రోజు వరకు గుర్తుంది అంటే రచయిత ఎంత చిన్న పదాలతో ప్రాస దృష్టిలో ఉంచుకుని రాసారో అని ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం రిక్షా పాటల మీద మీ సమీక్ష చాలా బాగుంది.👍*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి స్పందన:*ఆనాటి శభాష్ రాముడు సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని రిక్షా పాటలనూ ఒక్కచోటికి ఏరి కూర్చిన శాంతనూ శర్మిష్ఠ గారికి ధన్యవాదాలు. “రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్” అంటూ అప్పటి హైదరాబాదును, అక్కడున్న ముఖ్యమైన ప్రాంతాలనూ చూపించినప్పుడు, మేము కూడా అనుకున్నాము.. ఎంత బాగా ఉంది హైదరాబాదు అని. ఇప్పుడు రిక్షాలు అంటే తెలియని పిల్లలు ఎందరో!

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *బాగా వర్ణించారు. ఆనాటి సినిమాల్లో సైట్ సీయింగ్ చూపిస్తూ.. కథానాయకుడో, లేక ఒక ముఖ్య పాత్రధారియో ఇలాంటి పాటలో మెరిసేవారు. ఆర్. నారాయణ మూర్తి గారయితే ‘ఒరే రిక్షా’ అని సినిమాయే తీశారు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *రిక్షావాలా ప్రధాన పాత్ర గా ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ దాదాపు అన్ని భాషల్లో సినిమాలు వచ్చేయి. జనరంజకంగా ఉండేవి. ముఖ్యంగా ఆ రిక్షావాలా పాడే పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. చలం, పద్మనాభం, ఎంజీఆర్, ఎన్టీఆర్, నారాయణమూర్తి, మహమూద్, చిరంజీవి మొదలైన అనేక మంది నటులు ఈ పాత్రలో జీవించారు. ఆ పాటలు కూడా జీవిత సత్యాలకు దర్పణాలుగా ఉండేవి.
    చక్కని పాటల పరిచయం చేశారు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య:*ఎన్ని రిక్షా పాటలు సేకరించారో!!
    మీరు అన్నట్లు జయమ్ము నిశ్చయమ్మురా గొప్పపాట. కానీ రిక్షా పాట అనగానే గుర్తు వచ్చేది రిం జిం పాటే. బాగా వివరించి చెప్పారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!