సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    GitacharYa

    ఈ కథ/నవల 2008లో రావలసింది.
    సెల్ఫ్ పిటీ మనిషిని చాలా దెబ్బకొడుతుంది. తనలో ఉన్న సామర్ధ్యాన్ని పూడ్చి పెడుతుంది. ఆ సందర్భానికి హరగోపాల్ (లక్షలమంది) పడాల్సిన డోస్ బాగాపడింది. వైద్యానికి లొంగుతే బాగుపడతాడు.

    1. 1.1

      Bhuvana Chandra

      గీతాచార్య గారు చాలా చాలా సంతోషం మీ స్పందన నిజంగా ఈ ఉదయాన్నే ఓ అద్భుతంగా మార్చింది ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  2. 2

    యామిని

    హరగోపాల్ డిప్రెషన్ లోకి వెళ్లడం అతని మనఃస్థితిని బట్టి అతను ఎవరు చెప్పినా వినకపోవడం.. అతని మాటలు విన్న మహిత మాట్లాడిన మాటలు సూటిగా ఉన్నాయ్.
    అతను తనకు తానుగా మారాల్సిందే.
    కుసుమ మరణం బాధ కలిగించింది. మనచుట్టూ ఎందరో కుసుమలు కదా!
    గురువర్యా తదుపరి భాగం కోసం ఎదురుచూస్తూ ఉన్నాం.

  3. 3

    Bhuvana Chandra

    మీ స్పందనకి చాలా చాలా సంతోషం కలిగింది యామిని గారు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    యుగయుగాలుగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మహతి మధనపడడంతో ఈవారం కథ ప్రారంభమై, నేటి యువత ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ లో మునిగిపోవడం గురించి దీర్ఘమైన చర్చలు పాత్రల మధ్య సాగించారు భువన్ జీ. ఇది కళాశాల విద్యార్థులకు సంబంధించిన కథ కాబట్టి, వారు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య గురించి చెప్పితీరాలి. అంతే కాకుండా, మహతిలో ఆత్మవిమర్శ ఎంత చక్కగా ఉంటుందంటే- కుసుమ తనతో తన బాధలు చెప్పలేదని, కారులో వెళ్ళేటప్పుడైనా దిగి తనతో మాట్లాడలేదని పొరపాటున అనుకున్నానే అని గ్రహించగలిగింది. హరగోపాల్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని నిర్లిప్త ధోరణి చూసి విసుగుతో కొంచెం కఠినంగా మాట్లాడి, అంత గట్టిగా అనకుండా ఉండాల్సింది అనుకుంటుంది. ఎవరైనా కూడా తన మాటలు, తన చేతలు గురించి ఒక్కక్షణం ఆలోచించుకుని, విచక్షణ తో ప్రవర్తించడం సమంజసం కదా!
    బాగుంది.👌

    1. 4.1

      Bhuvana Chandra

      హృదయ పూర్వక ధన్యవాదాలు సుశీల గారు మీ స్పందన కోసం వారం వారం నేను ఎదురు చూస్తూనే ఉంటాను మరొక్కసారి మన: పూర్వక ధన్యవాదాలు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి వ్యాఖ్య:
    భువన చంద్ర గారూ మీరు ఈ సంచికలో ప్రస్తావించిన స్త్రీ పాత్ర పోషణ అద్భుతం అనిపించింది.
    స్త్రీ సమస్యలు, వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఖచ్చితంగా కళ్ళముందు ఉంచారు. స్త్రీ ని స్త్రీ ఏ విధంగా అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా కావచ్చు.
    హరగోపాల్ విషయంలో మహి చాలా ముక్కుసూటిగా ఆవేదన, డిప్రెషన్‌లో ఉన్నాడని తెలిసి ఆమె మాటలాడిన తీరు చూస్తే ముచ్చట పడింది నా మనసు. నిజం, సానుభూతి విషయంలో మీ మానసిక వ్యక్తీకరణ అమోఘం..
    సమాజంలో స్త్రీ ఎదుగుతున్న క్రమంలో చాలా కోల్పోతున్నది. అదేదో తెలుసుకునేసరికి సరిదిద్దుకోలేని స్థితి.
    మీ మనోభావాలు, మీ అభ్యుదయభావాలు, మీ ఆవేదన, ఆవేశం, పాత్రల పోషణలో చాలా చక్కగా రాణింపచేస్తున్నారు పురుషులైనా కూడా.
    చాలా అద్భుతంగా ఉంది అండి. నా లోని ఆవేశం ఆవేదన ఆక్రందనలు మరోసారి బయటకు వచ్చాయి.
    మార్పు ఎన్నటికీ సర్. దుఃఖం మినహా ప్రశాంతమైన జీవితం జీవించలేదా? ప్రేమే ఊపిరిగా జీవించే స్త్రీలు ఒత్తిడి వలలో పడి బలి అవ్వాల్సిందేనా.
    మీకు మీ సంస్కారానికి నా ధన్యవాదాలు అండీ నమస్కారము.
    రమాదేవి

  6. 6

    rohinipalnati@gmail.com

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు యుగయుగాలుగా స్త్రీలకు జరిగిన అన్యాయాలు నేటికీ సమాజములో ఆడవాళ్ళ పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు వ్రాశారు. జరిగిపోయిన దాని గురించి బాధ పడటం సముద్రం లో కలిసిన నీరు అని సానుభూతి విషం లాంటిది అని చాలా చక్కగా వ్రాశారు.తల్లితండ్రులు పిల్లలనే కాదు వారి స్నేహితులకు కూడా ఎలా సపోర్ట్ ఇవ్వ వచ్చునో చాలా బాగావ్రాశారు.యవ్వనారంబం లో వచ్చే ఆలోచనలు వలస పక్షుల లాంటివి జీవితమంతా మన దగ్గరే పెట్టు కోవడం సాధ్యమా? మంచి పాజిటివ్ థింకింగ్ నేర్పుతున్నారు.మీ అభ్యుదయ భావాలకు ధన్యవాదాలు – రోహిణి.

  7. 7

    Bhuvana Chandra

    హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు మీ స్పందన నాకు చాలా స్ఫూర్తినిచ్చింది థాంక్యూ సో మచ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!