సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ‘ప్రతి జీవితమూ ఒక వ్రాయబడని నవల’ – ఒక సాధారణ గృహిణి, అల వాళ్ళ అమ్మ ద్వారా చెప్పించారు భువన్ జీ. ‘సర్దుకుపోవడానికే పుట్టానా’ అన్న ఆమె మాటలు ఈ సమాజం లోని ఎందరో మహిళల మనసు లోని మాటలు. మౌనంగా కుటుంబాన్ని సంభాళించుకు పోయే, ఇంటికి మూల స్తంభం లా నిలిచే “అమ్మ” మనసు లోనికి తొంగిచూసే సందర్భం, సమయం, సహనం పిల్లలకీ ఉండదు, భర్తకీ ఉండదు. ఎదురుగా ఉన్నప్పుడు అర్ధం చేసుకోలేని మనం – ఆమెను గుర్తించేసరికి ఆమె గోడమీద ‘ఫోటో’ లో ఉంటుంది.
    ఒక మామూలు గృహిణి నుండి జీవిత సత్యాలు చెప్పించిన భువన్ జీ ! అభినందనలు!!

    1. 1.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు సుశీల గారు
      మీ స్పందన ఎప్పుడు నాకు అంతులేని స్ఫూర్తిని ఇస్తుంది
      హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    మీరు వ్రాసిన జీవిత సత్యాలు, స్త్రీ పాత్ర పోషణ అద్భుతం అనిపించింది నాకు. అడుగడుగున స్త్రీ ఉహ తెలిసిన నాటి నుండి అనేక భయాలు జాగ్రత్తలు అనుమానాలు, అవమానాలు, సలహాలతో పాటు అపారమైన దుఃఖంతో
    జీవితం జీవించాలి. అదీ కాక తనకి తానుగా ఆలోచించుకుని బ్రతికే అవకాశం కూడా ఇవ్వని రీతులను చుట్టూ సమాజం రీతులుూ చాలా సహజంగా తీర్చిదిద్ది చెప్పారు.
    అల తల్లి పాత్రలాంటివి కోకొల్లలు.
    అలకి ఒక తల్లిగా అల ఎలా జీవితం జీవించాలని అని కోరుకుంటూ జీవితం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చాలా నగ్నసత్యాన్ని అలాగే కాదు ప్రతి స్త్రీ మూర్తికి అందవలసిన ఆణిముత్యాలు కురిపించిన మీకు నా ధన్యవాదాలు అండి.
    చాలా బాగుంది అభివందనాలు.
    రమాదేవి

    1. 2.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు రమాదేవి గారు థాంక్యూ సో మచ్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కాదంబరి గారి స్పందన*
    చాలా బాగుంది జీ. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ఆ జనరేషన్ స్త్రీ గురించి విశ్లేషించి చాలా ఇంటరెస్టింగ్‌గా రాశారు. హ్యూమన్ సైకాలజీ బాగా స్టడీ చేశారు. మీకు మీరే సాటి.👏👏👏👌🙏
    కాదంబరి

    1. 3.1

      Bhuvana Chandra

      సింపుల్ గా చక్కగా సమీక్షించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు రాదంబరి గారు
      మీ సమీక్ష విద్వాన్ విషయం గారిని గుర్తుకు తెచ్చింది థాంక్యూ సో మచ్

  4. 4

    యామిని

    ప్రతీ జీవితమూ ఒక వ్రాయబడని నవల 🙏
    ఆవిడ పాత్ర ద్వారా ఈ భాగం లో చెప్పిన ప్రతీ మాటా కూడా జీవితసత్యాలే🙏
    అత్యధిక జీవితాల్లో అనుభవపాఠాలు.
    అల పాత్రలో పరిణితి చక్కగా ఉంది.
    అనుభవాల్లోనుంచి నేర్చుకున్న జ్ఞానం అసలైంది.
    ధన్యవాదాలు గురువర్యా 🙏💐

    1. 4.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు యామిని గారు
      ఒక రచయిత్రిగా మీరు స్పందించడం నాకు చాలా చాలా ఆనందాన్ని స్ఫూర్తిని ఇచ్చింది మరోసారి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు

  5. 5

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు స్త్రీల సమస్యల పట్ల మీ విశ్లేషణ చాలా బాగుంది. గుర్తించని అమ్మల మనసులోని, భావాలు, నిట్టూర్పులు,వ్రాయబడని జీవితాలు హృదయం స్పందించేలా వ్రాసారు. ఓ అమ్మ తన జీవిత అనుభవం పిల్లలకు పాఠం లా చెప్పటం, తనలా తన పిల్లలు బాధ పడకూడదు అనే ‘తల్లి ‘మనసు, డబ్బు కు వున్నవిలువ బాగా వ్రాసారు. ఎదిగిన కొలదీ మన ఆలోచన పరిణితి ఎలా ఉండాలో అల పాత్ర లో చూసి నేర్చుకోవాలి – ధన్యవాదాలు అండీ – రోహిణి

    1. 5.1

      Bhuvana Chandra

      రోహిణిగారు హృదయపూర్వక ధన్యవాదాలు
      ఈ నవల అలా పాత్ర మీకు నచ్చడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి
      మీ స్పందన రాబోయే ఎపిసోడ్స్ కు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తూ.. మరోసారి ధన్యవాదాలతో
      భువనచంద్ర

  6. 6

    లలితా శివ జ్యోతి

    భువనచంద్ర గారూ స్త్రీ వ్యక్తిత్వం, ఔన్నత్యం చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా తనదైన తీరు లో స్పందించే విధానం చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారుధన్యవాదములు . ఆవును తల్లి ని మించిన హితులు ఉండరు మనకి తెలిసినవే చెప్తుంది అనుకుంటాం ఆ హృదయం వెనుక ఉన్నా తపన, ఆర్తి అర్థం అయినపుడు కన్నీటి ప్రవాహం ఆపలేం 😞. ఎస్ ఇది అని చెప్పలేం కానీ we keep learning from others mistakes.

    1. 6.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు లలితా శివజ్యోతి గారు… నీ స్పందన చూసి ఎంతో ఆనందం కలిగింది.
      సున్నితంగా మీ భావాన్ని తెలియజేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!