సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శైలజ గారి స్పందన!*
    There is is so much depth in this episode – lot of warmth. Touching the heart at several places. Wow. Wow wow!
    శైలజ

    Reply
  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. మహతిలోకి అల పరకాయమా అల లోకి మహతి పరకాయ మా అన్నట్లు స్టోరీ మలుపు తిప్పారు. అద్భుతమైన ఉపమానలతో ఈ వారం బాగుంది. “ప్రతిజీవితం తెరకు ఎక్కని సినిమా “ఏ పాత్రని మనము సృష్టించ లేము వాటి అంతట అవే వచ్చి నిషక్రమిస్తాయి భగవంతుడే డైరెక్టర్ “👏 మహీ వాళ్ళ అమ్మమ్మ వెళ్లిపోయిన గట్టం చదువు తుంటే కళ్ళు చెమ్మగిలి కడుపు తరుక్కు పొయింది. అహల్యా స్థానం లో ఎవరు వున్న ఎలా స్పందిస్తారో పరకాయం చేసి వ్రాసిన మీకు 👏ప్రపంచాన్ని జల్లెడ పట్టి పాటకులకు అవగాహన కల్పిస్తున్న మీకు ధన్యవాదాలు – రోహిణి 👏

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కాదంబరి గారి స్పందన*
    ఈ వారం చాలా ఆసక్తికరంగా ఉంది జి. – కాదంబరి

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    నమస్కారం భువన చంద్ర గారూ.
    మీరు ఈ సంచికలో వ్రాసిన ప్రతి వాక్యం, ప్రతి పాత్ర పోషించిన విధానం అర్థం చేసుకోవటంలో జీవిత నాటకరంగం కనిపిస్తుంది అని అనుకుంటున్నా.
    మాటలకందని భావాలు మనసులో మాట ఆలోచన లేని మౌనం వెనుక ఉన్న శూన్యం – అన్నీ కలిపి రంగరించి హృదయాన్ని పిండేస్తున్నట్టు వ్రాసారు.
    అవి అక్షరాలు కాదు, కాచి వడపోసిన అమృత గుళికలు.
    నాకు ఆలోచనకి అనుభూతులకి అభిప్రాయాలు వ్యక్తం చేయలేని స్థితి.
    పాత్రలలో మీరున్నారా లేదా మీలో పాత్రలు ఉన్నాయా?
    ఈ సంచిక పాత్రల్లో మీరు జీవించారు, మమ్మలని జీవింపచేసారు.
    జీవిత వాస్తవాలని ఆలోచన విధానం అర్థం చేసుకోవటంలో మంచిబాట వేసారు.
    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండీ.
    రమాదేవి

    Reply
  5. 5

    Sobharaja

    ఈ episode గుండె లోతుల్లోకి వెళుతోంది. ఈ ధారావాహికలో ప్రతి వాక్యం ఒక ఆణిముత్యం. మా అమ్మమ్మతో అనుబంధం మీ కలం నుండి జాలువారిన ఆ ప్రేమ నన్ను 45 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాయి. ఇంక సినిమాకూడా ఒక విధంగా జీవిత సత్యాలే అని మీ రచనా నైపుణ్యంతో అత్యద్భుతంగా చిత్రీకరించారు. మనసును కదిలించి గత స్మృతుల్లోకి తీ సుకెళ్ళారు. ప్రతీ వాక్యం చాలా గొప్పగా ఉందండీ. మనసును కదిలించిన మీకు ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
  6. 6

    చండి

    అల, మహి..మరపురాని పాత్రలు. వీళ్లు మానసికంగా ఎంతో పరిణతి సాధించారు. సినిమా రంగం లాంటి అస్థిమిత రంగాన్ని ఎంచుకుని అల ఎలా ముందుకెళ్తోందో చూడడం అసాధారణంగా ఉంది. ఈ రంగానికి చెందిన ఎన్నో వాస్తవ పాత్రలు కూడా సీరియల్ లో వస్తున్నాయి. వాస్తవాన్నీ, కల్పననీ పడుగూ పేకలా కలుపుతూ రాస్తున్న ఈ సీరియల్ ఎంతో హృద్యంగా ఉంది.
    పెద్దవాళ్లు కాలగతిలో కలిసిపోయినప్పుడు ఏర్పడే శూన్యం సామాన్యంగా ఉండదు. ప్రతి పాత్రా మీ మనసు నుంచి వస్తున్నదే. అయితే కథా గమనంలో సన్నివేశాన్ని బట్టి వాటి భావాల్లో ఉదాత్తతా, అనుదాత్తతా కూడా గమనార్హం.
    ఇది యువతకి కనువిప్పు. స్నేహితుల్నీ, కొలీగ్స్ నీ అర్థం చేసుకోవడానికి ఒక రిఫరెన్స్ గ్రంథం.
    ఈ సీరియల్ లో ఆహార సందర్భాలు వచ్చినపుడు మాత్రం పండగలా ఉంటోంది. ఎప్పుడూ వినని రుచుల్ని చదువుతున్నాం.

    Reply
  7. 7

    Sobharaja

    ఈ శీర్షిక మనసును కదిలించింది. చిన్నప్పుటి మాఅమ్మమ్మ కళ్ళముందు కదలాడింది. ఎవరైనా అడిగితే తన నోట్లో పెట్టుకోబోయే ముద్దను కూడా ఇచ్చేసేది. మా అమ్మమ్మ తాతల మధ్య అనురాగం కూడా అలాగే ఉండేది. మా అమ్మమ్మ చనిపోయిన తరువాత మా తాతకు నేను వంటచేసి పెడితే మా అమ్మమ్మ గర్తుకొచ్చేది. మీ నవల చదివి స్పందించి నా కథ చెప్పాను.ధన్యవాదాలు మనసును అనురాగ తీరాలకు తీసుకెళ్ళినందుకు. మనసు లో నిలుపుకోలేక మరో స్పందన రాశాను🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!