సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఈ వారం మహతి చాలా సంతోషం గా ఉంది. ఊరందరికి ఎంతో శ్రద్దగా వైద్యం చేసే డాక్టర్ శ్రీధర్, శ్యామల పెళ్లి శ్రీ సీతారాముల కళ్యాణం లా ఊరందరూ జరిపించడం హృదాయాన్ని పట్టుకుని ఆనందం లో ముంచి వేసేలా వ్రాసారు. జీవితాన్ని జైంట్ వీల్ తో పోల్చడం ఆలోచింప చేసే నిత్య సత్యం. ప్రతి మనిషి ఏది సాదించాలన్నా తన కాళ్ళ మీద నిబడాలి అనే జీవన సత్యం యువత నేర్చుకోవాలి. సమస్య తెలియ కుండా ఆలోచించడం -గడ్డి వాములో గుండు సూది కోసం వేదకడం తో పోల్చడం అద్భుతమైన ఉపమానం. నవరసాలు మిలిత మయ్యే మీ రచనలకు ధన్యవాదములు 👏-రోహిణి

    1. 1.1

      BhuvanaChandra

      రోహిణి గారు నమస్కారం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారం వారం మీరు ఇచ్చే స్పందన నాకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది.. మరింత బాగా రాయాలని ఉత్సాహాన్ని పెంచుతోంది
      మీ వంటి పాఠకురాలు నాకు లభించటం నా అదృష్టం అని భావిస్తూ మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: * నమస్తే భువన చంద్ర గారూ.
    ఈ సంచికలో ప్రచురిత పారిజాతాలవి. ప్రేమ మాధుర్యాన్ని నిండుగా నింపుకున్న
    నవపారిజాతాలు. వెన్నెల్లో జాగ్రత్తగా నిదానంగా ఆస్వాదిస్తూ ఒక్కొక్క పూవునివేరుకున్నా.
    భగవంతుడు కనిపించడు. కానీ స్వఛ్ఛమైన ప్రగాడమైన అపరిమితమైన ప్రేమలో
    ప్రకటించుకుంటాడు భగవంతుడు అని నా ప్రగాఢ విశ్వాసం.
    మీరు హిందీ పాటగా, దాని భావం తెలుగులో ఎంతో రుచిగా శుచిగా అర్థవంతమైన విధంగా అందంగా వ్యక్తపరిచారు ప్రతి మాట. సంగీతం భగవంతుడి భాష అయితే మనిషి మానసిక ఘోష సాహిత్యం అన్నారు.
    నిజం చెప్పాలంటే మీ అభిప్రాయాల వ్యక్తీకరణలో ఏదో తెలియని ఓ నిధి దొరికినట్లు ఉంటుంది.
    భాష చాలా పేదది, భావాలు చెప్పగలదు కానీ మనసులోని అనుభూతిని తెలపలేదు. నిజంగా ప్రీతిపాత్రమైనది.
    మీరు రచించిన ప్రతి అంశం అమృతం కురిసిన రాత్రిలా ఉంటుంది.
    ధన్యులవుతాం మనసు పెట్టి చదివితే.
    మీ భాషలో రచనలలో భగవంతుడికీ మనిషికీ అనుసంధానం ప్రేమ ఒక్కటే అనిపించింది. చాలా సంతోషం ఆనందము కలిగాయి. ధన్యవాధాలు
    అండీ. భగవంతుడు తోడు ఆశీర్వచనం ఎల్లవేళలా మీకున్నాయి, ఉంటాయి.*

    1. 2.1

      BhuvanaChandra

      రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి వారము మీరు స్పందిస్తున్న తీరు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నది మీకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    కొన్ని వారాలుగా మహతి ఊరి సమస్యలను పట్టించుకోవడం, త్రిపుర గారితో కలిసి తాతయ్య గారి సలహాలతో పరిష్కారాలు చూడడంతో సీరియస్ గా కథ సాగుతోంది.
    ఒకేసారి అల ప్రేమలో పడడం, డాక్టర్ గారి పెళ్లి ప్రసక్తి తో చాలా ఉత్సాహంగా మారిపోయింది. పాత హిందీ పాటలను ప్రేమించే వారికి ‘అల’ తరుఫున భువన్ జీ అనువాదాలు అమృత సమానమే!

    1. 3.1

      BhuvanaChandra

      సుశీల గారు నమస్కారం. మీరు అందించే ప్రోత్సాహం అపూర్వం. ఒక రచన సాగాలి అంటే పాఠకుల స్పందన చాలా ముఖ్యం. నేను వెళ్లే దారి సరైనదో కాదు చెప్పేది మీలాంటి చక్కని విశ్లేషకుల స్పందనే.
      నీకు నా హృదయపూర్వక నమస్కారాలు
      కథ చదివాకమీరు తెలిపే మీ అభిప్రాయాల్ని
      మనసులో భద్రపరుచుకుంటూ
      నమస్తులతో.. గౌరవంతో.. భువనచంద్ర

  4. 4

    Kadambari

    భువనచంద్ర గారు నమస్సులు. ఈ వారం
    మహతి చాలా హృద్యంగా కొనసాగింది. అల ప్రేమ
    ఆ హిందీ పాట భావం చాలా బాగుంది.డాక్టర్ శ్రీధర్ శ్యామల వివాహం హైలైట్. ఊర్లో అందరూ పూనుకొని వివాహం జరిపించడం చాలా సంతోషకరమైన సంభవం.మొత్తానికి చాలా హృద్యంగా ఉంది.ధన్యవాదాలు
    కాదంబరి.

    1. 4.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు కాదంబరి గారు
      మీ స్పందన చాలా చాలా ఆనందాన్ని కలిగించింది
      మరింత చక్కగా సీరియల్ ని రాసే ప్రయత్నం చేస్తాను….
      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!