సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    నవల అంటే కొన్ని పాత్రలు, సంఘటనలు మాత్రమే కాదు. అల పాత్ర ద్వారా సినీ ప్రపంచాన్ని, ఆమె ఉత్తరాల ద్వారా సున్నితమైన ప్రేమ భావాలను అందిస్తున్న భువన చంద్ర గారు మహి పాత్ర చుట్టూ సమాజాన్నీ, పోకడలను, యువత చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. అలానే ఈ వారం వీసెలు, మానికలు వంటి పూర్వకాలపు కొలతలను, అణా అర్ధణా వంటి నాణాలను, ఆనాటి వాటి వెల ను తెలిపారు. గతంలో “మూడో సీత” నవల లోనూ వివరంగా తెలియజేసారు. ఈనాటి తరానికి ఈ లెక్కలు తెలియవు. ఇలా రచనలో జొప్పించి, భావి తరాలకు ఒక రికార్డు లాగా అందించాల్సిన బాధ్యత ను రచయిత స్వీకరించడం అత్యవసరం. భువన చంద్ర గారు రచనల్లో గతం, వర్తమానం, భవిష్యత్తునీ మంచి అంచనాలతో, అవగాహన తో చూపించడం హర్షదాయకం.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎంతగా చక్కగా శ్రద్ధగా చదివి స్పందన తెలియజేస్తారంటే వారం వారం నేను ఎదురు చూస్తూ ఉంటాను
      మరోసారి మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భువనచంద్ర

      Reply
  2. 2

    Sobharaja

    🙏
    మీరు ఈ శీర్షిక లో ప్రతి వృత్తి గురించి,రాజకీయాల గురించి ప్రేమ గురించి చక్కగా చెప్పారు
    గతుకులు పడ్డ బ్రతుకు బాటలో వెతుకులాటే జీవితం అంటూ ప్రతి వృత్తిలోని సాధకబాధకాలను స్పష్టంగా వివరించారు.
    జార్జి వాషింగ్టన్ చెప్పినట్లు రాజకీయాలు రాజకీయనాయకులు లేకుండా ప్రజలే పాలన చేస్తే దేశం శాంతి సౌఖ్యాలతో సుభిక్షంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం కూడా.
    ప్రేమ అనేది దైవంతో సమానం. పరిపూర్ణమైన నిష్కల్మషమైన ప్రతీ ప్రే మలో దైవత్వం ఉంటుంది. నిజమే.
    మీ ప్రతి శీర్షిక వినూత్నంగా ఉంటుంది.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      శోభాజీ నమస్కారం చక్కగా చదివి చాలా శ్రద్ధగా వారం వారం మీ స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు
      మీ స్పందనలే ఆక్సిజన్ లాంటివి
      ఎందుకంటే ఏ రచయిత అయినా కోరుకునేది పాటలు యొక్క సంతృప్తిని సంతోషాన్ని.
      వారం వారం శ్రద్ధగా స్పందన తెలియజేస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలతో భువనచంద్ర

      Reply
  3. 3

    BhuvanaChandra

    సుశీల గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ స్పందన చదివాక థాంక్యూ సో మచ్ వెరీ కైండ్ ఆఫ్ యు

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన:* భువన చంద్ర గారూ నమస్కారం అండీ.
    గొంతులు పడ్డ బ్రతుకు బాటలో వెతుకులాటే జీవితమంటే పాదచారి అన్నమాట
    ఎంత లోతైనదికదా. చాలా అర్థవంతంగా తెలిపారు ధన్యవాదాలు అండీ.
    భంధాలు ముడిపెడుతూ బిగుసుకుంటాయి చాలా. అందులో భాగంగా పాత్ర
    పోషణ అద్భుతం అనిపించింది. ఎంతో విచిత్రంగా అనిపించింది. ఆనందంగా ఉంది.
    భంధాలనేవి ఆత్మకు శాంతి సౌఖ్యాలను తృప్తిను నింపి జీవిత విలువలను పెంచుతాయి.
    ఈ రోజున జీవితంలో సెటిల్ అవ్వాలన్నా, ఎదగాలన్నా మనం చదివే దానికి చేసేదానికి సంభందం లేకుండా ఉంది. వయసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆవేశపు ఆదర్శాలు ఏదో చేయాలనే తపన, జీవిత మార్గం వెతుకులాటేనేమో అనిపిస్తుంది.
    నిజంగానే మీరన్నట్టు పదివేలు కాదు ఈరోజు కోటి అంటే బాగుంటుంది. మంచి ఆలోచన ఈనాడు ఉపయోగించే మాట. కాలాన్ని శరీరం మోస్తుంటే నా ప్రేమని
    హృదయంలో మోస్తున్నది నీవు అన్నకవిత అలా లేఖ ద్వారా అర్థవంతంగా తెలియచేశారు. చాలా బాగుంది అభివందనాలు.
    చికాకును కలిగించే విధంగా ఉన్న అల పాత్రని పోషించారు చాలా మోడల్ గా.
    పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు మనిషిని ఎదిగేలా చేస్తే కొందరకి. అవే పతనమయ్యేలా చేస్తాయి. అల పాత్రని ఒక మనిషి ఆలోచనా విధానం జీవితంలో అన్నది బాగా విశ్లేషించి చెప్పారు.
    మళ్ళీ నా చిన్ననాటి అణాలు బేడీలు కాణీలు అర్ధనాణాలు పావలాలు గుర్తు చేసారు. అబ్బ ఆ రోజులు, ఆ విలువలు, ఆ ఆనందం ఎక్కడున్నాయి? డబ్బు విలువలు పెరుగుతూ పోవటం మినహా.
    చాలా మంచి భావాలని పంచుకునే అవకాశం కలిగించారు. హైదరాబాద్ ప్రయాణం
    అలాగే మహి తల్లిదండ్రుల పరిస్థితులు గురించి ఎదురుచూస్తూ ఉంటుంది మనసు.
    జీవితంలో ఒక మనిషి ఆలోచన ఒక గాలి కెరటంలా వచ్చి వెళ్తుంది.
    అభిమన్యు పాత్ర మహి జీవితంలో ఎలా ఉంటుందో అన్న ఆలోచన తో వచ్చే వారం కోసం ఎదురుచూపులు.
    చాలా బాగుంది అభివందనాలు చాలా సంతోషం అండి.*

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సారా చక్కగా విశ్లేషిస్తున్నారు ప్రతి పదాన్ని చదివి అర్థం చేసుకుని మీ స్పందనని తెలియ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు

      Reply
  5. 5

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఒకప్పటి పది వేలు ఈరోజు న పది కోట్ల తో ఎలా సమానమో లెక్క బాగా చెప్పారు. ఒకప్పటి మన ఆంధ్రుల గొప్ప తనము ఈరోజు న ఆంధ్ర భాష కు ఆంధ్రులు పట్టించిన దుర్గతి బాగా వ్రాసారు. మరిచి పోయిన తూనిక లు కొలతలు గుర్తు చేసారు. ఏ పని చేద్దామన్నా అందులో వుండే లోటు పాట్లు మనిషి ఊఁ గిస లాట మనిషిని వెనక్కి ముందుకు అడుగు వేయనివ్వవు. అల పాత్ర ఎంతో ఉన్నతం గా తీర్చి దిద్దుతున్నారు. కాల గమనం లో ఎవరు పైకి వస్తారో ఎవరు కిందికి పోతారో కాలమే చెప్తుంది. కవిత అర్ధ వంతం గా బాగుంది. ధన్యవాదాలు -రోహిణి

    Reply
    1. 5.1

      BhuvanaChandra

      రోహిణి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చాలా చక్కగా వారం వారం మీ స్పందన అందిస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు
      చాలా శ్రద్ధగా చదివి విశ్లేషిస్తున్నందుకు మరోసారి మీకు నా ధన్యవాదాలు అర్పిస్తూ భువనచంద్ర

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!