సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Yamini Devi

    ఆహారం తరువాతే వ్యవహారం అన్నది నిజమే! ఆకలి ఎక్కువ వేస్తే మనసు మిగతా పనులపైకి మనసు లగ్నం చేయనివ్వదు. వంటకాల వర్ణన ఎవరైనా సరే మీ రచనలు చదివి నేర్చుకోవాలి. ఆహా.. ఏమిటీ గురువర్యా పాయసంలో తేలుతున్న జీడిపప్పు కిస్స్మిస్ లు విష్ణుమూర్తి లక్ష్మి దేవులా నమోనమః గురువర్యా.. ఇంకా ఎప్పుడు పాయసం చేసినా ఈ పాల కడలే గుర్తు వస్తుంది. మీ ఆలోచనల్లో నిండున బాలు గారు ఆ తరువాత పాడుతా తీయగా జనరేషన్లు గురించి చాలా చక్కగా చెప్పారు.
    మీరు+ కోటి గారు కలిసి చేసిన ఆ కార్యక్రమం కూడా చాలా బావుండేది అప్పట్లో.. నిన్ననే ఈ మాట నాతో పిల్లలు కూడా అన్నారు.
    కళ్యాణి గారు, అలతో కలిసి అలోచించి
    ఇంకా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండటం కోసం మహతి ఏం చేయబోతుందో అన్న ఆత్రుత ఉంది. వారం వరకూ ఎదురు చూడాలంటే కష్టం. అయినా తప్పదు.
    ప్రణామం గురువర్యా.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      యామి హృదయ పూర్వక ఆశీస్సులు
      ఉదయమే చక్కని స్పందనతో నాకు చాలా చాలా ఆనందం కలిగించినందుకు కృతజ్ఞతలు కూడా…. ఆ స్పందన ఇచ్చిన ఆనందాను భూతితో మరింత ఉత్సాహంగా రాసే ప్రయత్నం చేస్తాను థాంక్యూ థాంక్యూ థాంక్యూ

      Reply
  2. 2

    Sobharaja

    🙏
    మీ నవలలు చదువుతుంటే మీరు భోజన ప్రియులని తెలుస్తోంది. పాయసంలో తేలుతున్న జీడిపప్పు కిస్మిస్ లను పాలకడలిలో పవళించిన విష్ణువుతో పోల్చిన ఉపమానం
    నిజంగా మీరు వివరించినట్లు జానకి గారిఆశీర్వాదంతో S P B సంగీతంతో పాటు తెలుగు భాషలోని సౌందర్యాన్ని స్పష్టతను ఎప్పటికప్పుడు విశదీకరించి భావితరానికి బాటలు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
    మీరన్నట్లు చనిపోవాలనుకునేవారు చెప్పరు. బెదిరించి ఎదుటి మనిషిని బాధ పెట్టాలనుకునే వాళ్ళే ఇలా black mail చేస్తుంటారు.
    మహతి ఆలోచన సమస్యను పరిష్కరించగలదనిపిస్తోంది.
    ధన్యవాదాలు🙏🌹🌹

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      శోభా హృదయపూర్వక ధన్యవాదాలు
      చక్కగా చదివి చక్కని స్పందన తెలియజేసినందుకు
      ఏ రచయిత అయిన ఆనందపడేది రాసిన దానికి పాఠకులు రెస్పాన్స్ ఇచ్చినప్పుడే.
      వారం వారం సీరియల్ చదివి చక్కగా స్పందన తెలియజేస్తూ మరింత స్ఫూర్తిని ఉత్సా హాన్ని కలిగిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు…..ధన్యవాదాలు

      Reply
    2. 2.2

      Rohini

      శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. మంచి భోజనం తో మొదలుపెట్టారు. వంట చేయకుండా తినకుండా తిన్నంత తృప్తిగా ఉంది. ఏదయినా సమస్య వున్నా దానిమీదే కూర్చో కుండా ఎలా బాలన్స్ గా ఉండాలో బాగా వ్రాస్తున్నారు. యోగా ఏమిటి ఆసన సిద్ది ఏమిటి బాగా తెలియ చేసారు. జానకమ్మ ఆశీర్వాదo వటవృక్షం తో పోల్చడం అద్భుతం. బాలూ గారిని, వెన్నెల కంటి గారిని ఎంతోమంది గాయనీ గాయకులను తలుచుకోవటం మీ ఉన్నత మైన మనసుకు తార్కా నం. సినిమా ఫీల్డ్ లో ఉండాలంటే ఎంత డిసిప్లిన్ కావాలి ఎన్ని చిట్కాలుపాటించాలి తెలిపిన మీకు ధన్యవాదములు – రోహిణి 👏

      Reply
      1. 2.2.1

        BhuvanaChandra

        రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కని విశ్లేషణలతో వారం మారం సీరియల్ ని చక్కగా చదివి స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు
        సీరియల్ ని మరింత బాగా రాసే ప్రయత్నం తప్పక చేస్తాను దానికి కారణం మీవంటి మంచి పాఠకులు అందిస్తున్న స్ఫూర్తి థాంక్యూ సో మచ్

        Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది రమాదేవి గారి స్పందన: * నమస్తే భువన చంద్ర గారూ. వంటలు వాటి రుచులు తయారీ విధానం మీరు వ్రాసినది చదువుతుంటే ఆకలి, తినాలి అనిపిస్తుంది. ఆహారం ముందు వ్యవహారం తరువాత ఇది అక్షరాలా నిజం.
    ఆకలితో ఉన్నప్పుడు మనసు దేనిపైకి వెళ్ళదు. ఆకలి తీరాక అన్నీ కావాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా పనిచేస్తుంది.
    వర్షం గురించిన ఆలోచనలో మేఘాలను వర్ణించటం అమోఘం. మీరు వ్రాసిన వర్షం పాటలు గుర్తొచ్ఛాయి. అందానికి నిద్రకి ఉన్న అవినాభావ సంబంధించిన పూర్తి వివరణలు చాలా బాగా ఇచ్చారు.
    సౌందర్య పోషణ చిట్కాలు కూడా స్పష్టంగా విడమర్చి చెప్పిన తీరు అధ్భుతం.
    ఇందిర గారి మనస్తత్వం ఉన్న స్త్రీ మనసుని గురించి అల సిగ్గుపడకుండా చాలా ఖచ్చితంగా తాను తన పైశాచిక ఆనందాన్ని వ్యక్తం చేసింది తన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చింది. ఇందిరగారి
    పాత్రలో పైశాచిక ఆనందం వ్యక్తమవుతోంది. దీనికి సొల్యుషన్ అల సలహాలు సూచనలు సదా ఉపయోగపడతాయి కూడానేమో.
    బాలూగారి గురించి వాస్తవాలు పాడుతా తీయగా వల్ల ఎందరో వెలుగులోకి తీసుకు వచ్చి న సింగర్స్ గురించి వారి వ్వక్తిత్వాన్ని చూపించారు.
    నిజంగా అనూహ్యం, అమూల్యం, ఆదర్శం అందరకీ.
    చాలా బాగుంది అభివందనాలు.
    సమస్య వచ్చినపుడు సమస్యలో ఉండి ఆలోచించటం కంటే ఇంకొకరి సమస్యగా తీసుకుని ఆలోచించే విధానంలో పరిష్కారం స్పష్టంగా ఉంటుంది. అది చాలా చక్కటి సూచన.
    చాలా బాగుంది సంతోషంగా ఉంది అండి. హృదయపూర్వక ధన్యవాదాలు అండీ.*

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      రమాదేవి గారు నమస్కారం చాలా చక్కగా మీ స్పందన తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. భవాని ఆద్యంతం చక్కగా చదివి దానిలోని ప్రతి విషయము వివరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు థాంక్యూ సో మచ్ మరోసారి ధన్యవాదాలు

      Reply
  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    భువన్ జీ!
    శారీరకంగా శక్తిని, తృప్తి నీ ఇచ్చే భోజనాన్ని ఎంత కమ్మగా వివరిస్తారో – మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తి నిచ్చే గొప్ప “తత్త్వాన్ని” విశ్లేషించడం మీ అన్ని రచనల్లో నేను గమనిస్తాను. “కాలం చేయడం” అన్న పదబంధం బహుశా తెలుగు భాష లోనే ఉన్నదన్నారు. అవును. తెలుగు భాష, సాహిత్యాల పట్ల అవగాహన లేని వారికి ఆ గొప్పతనం అవగతం కాదు. పోతన మహాకవి చెప్పిన “అమ్మలగన్న యమ్మ” పద్యం, “ఎవ్వనిచే జనించు” పద్యం విశ్లేషించే కొద్దీ మహత్తర భావాలు ఉద్భవిస్తాయి. ఏ పంచభూతాల నుండి సృష్టించబడిన జీవి చివరికి ఆ పంచభూతాలలోనే కలిసిపోతాయి. ఆ పంచభూతాలు ‘కాలం’ నుండి వచ్చాయి. అనగా భగవంతుని లో లీనమైపోతాయి. “ఎవ్వని యందు డిందు”. పోతన చెప్పిన దానిని “కృష్ణబిలం” ” బ్లాక్ హోల్” అనవచ్చు.
    ఒక మామూలు నవలలో, కథనంలో గొప్ప తాత్త్వికత ను అంతర్లీనంగా చెప్పే మిమ్మల్ని
    సినీ గీత రచయిత గా మాత్రమే అనుకోవడం అమాయకత్వం. ప్రాచీన సాహిత్యం పట్ల మీ అభిరుచి, అధ్యయనం, అవగాహన కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ విషయాలను అప్పుడప్పుడు మీతో గంటలకొద్దీ చర్చించే నాకు “కాలాన్ని” సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటో అర్ధమౌతుంది. అది నా అదృష్టం గా భావిస్తాను.

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      సుశీల గారు వారం వారం ఇప్పుడు నేను ఎదురు చూస్తాను ఎందుకంటే ప్రతి అక్షరాన్ని సంపూర్ణంగా జీర్ణించుకుని అద్భుతమైన విశ్లేషణ చేయడం మీ ఆత్మ లక్షణం
      అందులో ఎటువంటి పక్షపాతాలు ఉండవు బాగుంటే బాగుందని లేకపోతే లేదని నిష్పక్షపాతంగా చెబుతారు
      ఏ రచయిత కైనా ఇటువంటి స్పందనలు అద్దం లాంటివి మమ్మల్ని మేము తెలుసుకోవటానికి అద్భుతంగా ఉపకరిస్తాయి
      ఒక రచయితగా నవల రాయటం వేరు కానీ మీరు చేస్తున్న పని ఏమిటంటే ఒక గీటురాయిగా దానిని విశ్లేషణ చేయడం
      మీకు మరోసారి మరోసారి ధన్యవాదాలు తో కృతజ్ఞతలతో సమస్యలతో భువనచంద్ర

      Reply
  5. 5

    BhuvanaChandra

    రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కని విశ్లేషణలతో వారం మారం సీరియల్ ని చక్కగా చదివి స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు
    సీరియల్ ని మరింత బాగా రాసే ప్రయత్నం తప్పక చేస్తాను దానికి కారణం మీవంటి మంచి పాఠకులు అందిస్తున్న స్ఫూర్తి థాంక్యూ సో మచ్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!