సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Yamini Devi

    మనిషి ప్రవర్తన, ఆలోచన, తీసుకునే నిర్ణయాలు, బుద్ది వివేకాల్ని బట్టి కాలంతో మారే పరిస్థితులకు తగినట్టు ఏ వ్యక్తి అయినా తమని తాము హర్షించేలా మలుచుకోగలిగితే బావుంటుంది. హాస్పిటల్ లో ఆవిడ మానసిక స్థితి, చుట్టూ వీళ్ళ సంఘర్షణ, వత్తిడి
    ఇతరులకు మంచిచేయకున్నా పర్లేదు హాని చేయకుండా ఉంటే చాలు అన్న మాట గుర్తు వస్తుంది.
    అల, మహతిల మధ్య చర్చ బావుంది. హాస్పిటల్ లో మహతి ఆవిడ చేయి పట్టుకుని ఒక దగ్గరతనాన్ని తనకు ఇవ్వడం.. ఆవిడ లోపల కొంత మెత్తదనం రావడం బావుంది.
    ప్రణామాలు గురువర్యా 🙏

    1. 1.1

      BhuvanaChandra

      యామినిజీ నేను ఇప్పుడే చదివాను ఒక పాట రాయడం కోసం హైదరాబాద్ వచ్చాను నా సీరియల్ తో పాటు మీ స్పందన కూడా చదవటం నాకు ఎంతో ఎంతో ఆనందంగా అనిపించింది థాంక్యూ సో మచ్ హృదయపూర్వక ధన్యవాదాలు భువనచంద్ర

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మూడు ముళ్లు కి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు భువన చంద్ర గారు. స్నేహబంధం+ ప్రేమానుబంధం+ అనురాగ బంధం. ఇవి లేకనే కదా పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి.
    ఇందిర మనసులో ఇంకా ఏ కొంచెమో “తడి” ఉందని రచయిత అల ద్వారా చెప్పించినా, నేనెందుకో సమాధాన పడలేకపోతున్నా. ఆవిడ “ఎమోషనల్ బ్లాక్ మెయిల్” చేస్తోంది అనిపిస్తోంది. ఆ ప్రోసెస్ లో ఒక కుటుంబం మొత్తం అశాంతికి, ఆందోళన కి గురౌతోందని ఎందుకు గ్రహించలేకపోతోంది! గ్రహించినా కావాలని చేస్తోందా!
    ఏమైనా, ఇందిర లాంటి స్త్రీలు ఈలోకంలో లేరని చెప్పలేం.
    అల, మహి చిన్న పిల్లలు ఇంతగా స్పందిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. కానీ వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడడం లేదు. ఏ స్పందనా లేకుండా ఎలా ఉంటారో మరి!
    పెళ్ళికి ముందు జరిగిన విషయాలు ముఖ్యం కాదు, పెళ్ళయి, ఇన్నేళ్ళు తనతో కాపురం చేసిన భార్య మనసు కష్టపెట్టడం సబబా! ఆమె మనసు ఎంత క్షోభిస్తోందో చూడడం లేదా! కనీసం ఊహించలేడా! పైగా ఆమె చేత సపర్యలు చేయించడం ఏమిటి?
    ప్రపంచంలో మగవాళ్ళు “ఇలా” safe zone లో ఉంటారేమో!
    పాఠకులకు కొన్ని పాత్రల పై సానుభూతి, ప్రేమ కలగడం, కొన్ని పాత్రల పై విసుగు, కోపం కలగడం జరిగిందంటే – రచయిత ఆ పాత్రల చిత్రీకరణలో సక్సెస్ అయినట్టే.

    1. 2.1

      BhuvanaChandra

      స్పష్టమైన అద్దం లాంటి మీ స్పందన నాకు ఎంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
      ప్రతి వారము చక్కగా చదివి అద్భుతంగా స్పందిస్తూ మీరు నాకు ఎంతో స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగిస్తున్నందుకు మరోసారి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ భువనచంద్ర

    2. 2.2

      BhuvanaChandra

      సుశీల గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారం వారం చక్కగా చదివి స్పష్టంగా నిర్మొహమాటంగా ఇచ్చే మీ స్పందన నాకు అంతులేని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇస్తోంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన” *శ్ర‌ీ భువన చంద్ర గారూ నమస్కారం అండీ. పెళ్ళంటే మూడు ముళ్లు బంధం. ఆ మూడు మీరు చెప్పిన సూత్రం అక్షరాలా సత్యం. స్నేహబంధం, ప్రేమబంధం=అనురాగబంధం. అధ్భుతమైన విలువైన ఆణిముత్యాల మాట. పెళ్లి అంటే ఒకరివొకరు కట్టిపడేయటం అధికారాలు చూపించుకోవటం కాదు అనేది మీరు చెప్పినట్టు. కానీ ఈ రోజు మూడుముళ్ళకి అర్థం, అహం, స్వార్థం, సంకుచితత్వంతో మనసుకి ముడివేసి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవటంలో మునిగి తేలుతున్న ఈనాటి బంధాలు ఎటు దారి తీస్తున్నాయో చూస్తున్నాము.
    మగవాడు మనసుని తెరచి చూపించడు.. గంభీరమైన మౌనం తోనే భాధ్యతలు అన్ని బాధ్యతలని నిర్వ హిస్తాడు. ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంటే సంసారం ఆనందమయం అవుతుంది. ఈనాడు అహంకార బంధంతో
    సాగుతుంది. గౌతమ్ మౌనం వెనక చెప్పుకోలేని మానసిక స్థితి. భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్‌గా కూర్చుని మాట్లాడుకుని ఉంటే సమస్య మహీ వరకూ వచ్చి ఉండేది కాదేమో.
    ఇందిర పాత్రే కాదు, ఏ స్త్రీ అయినా సమస్యని తన కోణం నుండీ ఆలోచిస్తుంది. ఒక్క నిమిషం నేను, నాది అన్న ఆలోచన పక్కన పెడితే అన్నీ సర్దుకుంటాయి. ఆవిడ ప్రేమిస్తే సరిపోతుందా అది తన స్వంతం. ఎదుటి వారికి ఉండాలని రూలులేదు. ఇంతకాలం తరువాత గతాన్ని తవ్వి ప్రేమ పేరుతో ఒక మగవాడి మంచితనాన్ని వాడుకుని భార్యా పిల్లలు ఉన్నారన్న ఇంగితజ్ఞానం లేకుండా ఇంతమందిని బాధపెట్టి ఆవిడ సుఖపడాలనా.?
    కాదు నేను పొందవలసిన ఆనందం తృప్తి మరొకరు పొందుతున్నారన్నయ పైశాచిక ఆనందం. నిజంగా ప్రేమిస్తే అతను ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకోవాలి గానీ పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లని
    మీ నాన్న ప్రేమించాడేమో అడగమనటం ఏమిటి.
    గౌతమ్ మంచితనాన్ని వాడుకోవటానికి ఆడుకోవటమే కానీ అది ప్రేమా పైశాచికమా. నిజంగా ప్రేమిస్తే అతను తన వల్ల ఈ పరిస్థితిలో ఎంతగా నలిగిపోతాడోనని; అతను చక్కటి సంసారం ఆనందమయం కావాలని కోరుకుంటుంది కానీ ఈ ఆలోచనా స్థితిలో ఉండదు.
    అతని మౌనం వెనుక మానసిక స్థితి ఎంతవరకు ఆలోచించారు?
    చాలా మంచి భావాలని పంచుకునే ప్రయత్నంలో మీరు సంపూర్ణంగా, సమర్థవంతంగా పోషించారు. చాలా చక్కగా మంచి సంస్కారపూరితమైన మనసుల కలయికతో పాఠకుల మనసులని కూడా సంస్కారంగా ఆలోచించేలా చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అండీ, నమస్కారము.*

  4. 4

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. పెళ్లి గురించి చక్కని అభిప్రాయం చెప్పారు కానీ అలాంటి జంటలు కనిపించడమే కష్టం. అన్నీ కర్మతో ముడిపడి నవే కనిపిస్తాయి. ఈ సృష్టిలో ఏ ఇద్దరి మనుష్యుల తత్వం ఒక్కలా ఉండదు ఏ రెండు మందులు ఒక్కలా పనిచేయవు అని సృష్టి నియమము అట అందుకే ఆలు మగలు ఆలా ఉంటారేమో. గౌతమ్ చిన్నతనంలో తల్లితండ్రులులేక వాళ్లయింట్లో ఉన్నాడు. బలవంతంగా బయటికి నెట్ట బడ్డాడు. ఇందిరా ప్రేమించి నంత మాత్రం చేత ఇన్ని సవంత్సరాల తరువాత ప్రవర్తించ టానికి ఆవిడ కు హక్కు లేదు. గౌతమ్ ఆస్తులను ఇందిరా తండ్రి కబ్జా చేసాడు. చూసిన దానికి సరిపోయింది. పెళ్లి వయస్సుకు వచ్చిన కూతురు ఉందని సోయ లేని ఆవిడ మనస్థితి ఆ అమ్మాయితోనే వాళ్ళ నాన్న ప్రేమ గురించి మాట్లాడు తుంటే ఇందిరా మానసిక స్థితి సరిలేదు అనిపిస్తోంది. గౌతమ్ గారు వాళ్ళ మరదలికి సేవ చేయటానికి భార్యని కూడా వెంట వేసుకొని వచ్చాడు అదే అహల్య బావ ఉంటే సేవ చేయటానికి ఈయన వెళ్తాడా.. మాతృస్వామ్యం పోయి పితృస్వామ్యం వచ్చింది మానసికంగా శారీరకంగా పురుషాదిక్యత నడుస్తోంది. హ్యూమన్ సైకాలజీ చక్కగా విశ్లేషణ చేస్తున్న మీకు ధన్యవాదములు -రోహిణి 💐

    1. 4.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు అద్భుతమైన పాయింట్ ని మీరు ప్రస్తావించార తప్పనిసరిగా నేను ఇది మనసులో పెట్టుకునే తర్వాత ఎపిసోడ్స్ రాస్తాను థాంక్యూ సో మచ్ అభినందనలతో శుభాకాంక్షలు. భువన్ చంద్ర

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!