సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Sobharaja

    🙏
    ఈ శీర్షిక చదువుతుంటే గుండెని పిండినంత బాధ కలుగుతోంది. ఇందిర చిన్నప్పటి నిస్సహాయత , మూర్ఖత్వాల తన ప్రేమ,జీవితం నిస్సారమై పోవడం,చివరి రోజుల్లో ఆప్రేమకోసంపరితపించడం నిజంగా బాధాకరం. ఎవరికి న్యాయంచెయ్యబోతున్నారు భార్యకా, ప్రేమను కోరుకుంటున్న అభాగ్యురాలికా?
    గం గోత్రి దగ్గరా గంగ గంగే సముద్రం లో కలిసే టప్పుడు కూడూ గంగే. అలాగే ఇందిర కూడా గౌతమ్ యొక్క ఇందిర గానే చనిపోవాలనుకోవడం లో ఎంత గొప్ప ప్రేమ నిద్రాణమై ఉందో!!!!
    అహల్య గారి పరిస్థితి కూడా శోచనీయమే.
    కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి మరి.
    ధన్యవాదాలు🌹🙏

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      ధన్యవాదాలు శోభ గారు చాలా చక్కని ప్రశ్నలు లేవనెత్తారు.. ఏం జరుగుతుందాఅని
      మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను
      ఎందుకంటే చాలా సున్నితమైన సమస్య కదా.
      దీనికి పరిష్కారం మీరు ఏమైనా సూచించగలరా.. ప్లీజ్

      Reply
  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఆడ మగ కలసి పంచుకున్న క్షణానికి ఇద్దరూ బాద్యులే, దాల్చే గర్భం ఓ వరం ఎప్పుడు వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే. మన సమాజం లో పెళ్లి కాకుండా గర్భం దాలిస్తే మేచ్చుకొనే అమ్మా నాన్న, సమాజం వుందా. తండ్రి ఎవరో చెప్పకుండా రిజిస్టర్ లో పేరు రాయకుండా స్కూల్ లో అడ్మిట్ చేసుకోరే. ఇంకా ఆ అమ్మాయి గర్భం వరం గా అనుకోవడం కుదిరే పనేనా ఈ 2024లో కుడా. అందుకే క్షణాన్ని పంచుకుని పెళ్లి చేసుకోని మగవాళ్లని మోసగాడే అంటారు. ఆడవాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అహల్యా తీసుకున్న నిర్ణయం బాగుంది. ఎగేసుకొని మొగుడి వెనకాల తిరుగ కుండా భాద్యత గల ఓ తల్లిగా, బిడ్డగా, ఓ ఆడదానిలా నడుము బిగించింది. జీవితం లో మొగుడు ఒక్కడే కాదు ఇంకా ముఖ్యం అయిన క్యారెక్టర్స్ జీవితం లో వున్నాయి అని గుర్తు చేస్తోంది -ధన్యవాదములు 🙏

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      చాలా చాలా సంతోషం రోహిణి గారు మంచి పాయింట్ లేవనెత్తారు.. నిజం అయితే ఈ నవలలో పెళ్లి కాకుండా గర్భం దాల్చడం అనేది జరగలేదు. అయినా మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా చాలా ఆలోచించదగింది.. తప్పక మీరు దృష్టిలో కూడ ఆలోచించి రాస్తాను
      ధన్యావాదాలు… భువనచంద్ర

      Reply
  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అహల్య ఒక ఉదాత్తమైన పాత్ర. పెద్దగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకోకుండా, భర్త పిల్లలు, తండ్రి అందరికీ అండగా నిలిచింది. ఆమె లేకపోతే ఆ కుటుంబమే లేదు.
    ఇందిర లాంటి ‘తెలివైన’, ఏ పరిస్థితినైనా తన కోణంలోంచే చూసే స్వార్ధపరురాలు ఎప్పటికీ అహల్య లా ఉండలేదు.
    ఇద్దరు స్త్రీలకు తమతమ కారణాలు తమకు ఉన్నా, వారి భావాలకు కేంద్రం “గౌతమ్”. ఆ గౌతమ్ నోరు విప్పకపోవడం ఏమిటో! ఇద్దరు స్త్రీలు క్షోభకు గురౌతున్నారు. తనకు సంబంధం లేని ఇందిరకు సేవ చేయడం ఆమె దయా గుణమో, భర్త ముఖం చూసో కావచ్చు. కానీ తన పిల్లల క్షేమం చూసుకోవడానికి ఆమె బయలుదేరడం చాలా సముచితం. తల్లి కదా!

    చిన్నపిల్ల అల అన్నట్లు ” ప్రేమ అనేది ఓ మొక్క లాంటిది. దానిని చక్కగా సంరక్షిస్తేనే స్వేచ్ఛ గా, బలంగా పెరుగుతుంది”.
    ఇందిర అలా ప్రేమ ను సంరక్షిస్తే మధుర ఫలాలు అంది వుండేవి.
    గౌతమ్ అనే మహావృక్షం బలంగా ఎదిగి, దానిని అల్లుకుని, దాని నీడలో ఎందరో సేదతీరుతున్న సమయాన, ‘ఆ వృక్షాన్ని’ పెకలించి, తన పెరటిలో నాటుకోవాలనుకోవడం ఆమె మూర్ఖత్వం.

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      సుశీల గారు చాలా చక్కగా ఉంది మీ స్పందన చక్కని పాయింట్ చెప్పారు అంతే చక్కగా దాన్ని విశ్లేషించారు చాలా చాలా ధన్యవాదాలు ‌.. మీస్పందన ఎప్పుడు నాకు ఉత్తేజాన్ని ఇస్తున్నది ధన్యవాదాలు తో భువనచంద్ర

      Reply
  4. 4

    Sobharaja

    🙏
    నాకైతే ఏమనిపిస్తుందంటే మానసికంగా శారీరకంగా కృంగిపోతున్న ఆవిడను కొంత ప్రేమతో స్పందించ జేయడం అవసరం అనిపిస్తుంది. ప్రేమ ఎన్నో రకాలు. భార్యాభర్తల సంబంధమైన ప్రేమ ఒక్కటే ప్రేమ కాదు. అహల్య గౌతమ్ లు ఇద్దరూ కలిసి, ఒకరినొకరు అర్థంచేసుకుని ఆవిడ మనసుకు స్వాంతన కలిగించడం మంచిదేమో. ఇందిర గౌతమ్ దగ్గర్నుంచి శారీరక సంబంధ ప్రేమను ఆశించడం లేదు. తన మనసుకు తోడు తను కోల్పోయిన ఆప్యాయతానురాగాలే తనకు కావలసింది. గౌతమ్ ఇందిర మనసుకు శాంతిని ప్రశాంతతను సంతోషాన్ని కలిగించేలా అహల్య చేయడం మంచిదేమో. ఆవిడ మానవతా దృక్ఫధంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గౌతమ్ తనంతట తాను నిర్ణయం తీసుకొని అహల్యను బాధ పెట్టలేడు. ఇన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన ఆవిడ భర్త మనసును అర్థం చేసుకొని ఇందిరకు ఒక స్నేహితురాలిగా, చెల్లిగా బాసటగా నిలబడితే అప్పుడు ఇందిర మనసులో కూడా మార్పు వస్తుందనిపిస్తుంది. ఉన్నది ఒక్క జీవితం అందులో ఒక మనిషికి మంచి చేయడం ఎంతో భాగ్యం.
    ఇది నా అభిప్రాయం

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది రమాదేవి గారి స్పందన: * భువన చంద్ర గారూ నమస్కారం అండీ. ఈ వారం సంచికలో మీరు అల ప్రేమను ఎలా కాపాడుకోవాలో ఒక మొక్కని ఎలా పెంచుకోవాలి అన్న పోలికతో చాలా బాగా పోల్చి చెప్పారు. చాలా బాగుంది. చాలా
    ప్రధాన అంశం.
    స్నేహ భావం లేని ప్రేమ ఉప్పులేని పదార్థాలు వంటివి. జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం. పులిహోరతో దోస ఆవకాయ కాంబినేషన్ కొత్తగా విన్నాను.
    మీరు రుచులు గురించి చెప్తుంటే తిండి రుచులపై ఆసక్తి పెరుగుతోంది.
    ఈ కొత్త రుచి ప్రయత్నించాలనిపించింది.
    ప్రతి రోజు ఓ ప్రత్యేక రోజుగా గడపటం అన్నది చాలా మంచి ఆలోచన, చక్కని సూచన. ఈ ప్రక్రియను పాటించితే నిత్యం ఆనందమయం.
    జీవితం జీవించాలని అదీ ఆనందంగా ఉండాలని మళ్లీ మళ్ళీ కోరుకుంటారు.
    గంగ ఎక్కడయినా గంగే. గంగోత్రిలో ఐనా సముద్రంలో కలిసినా. అది చాలా సహజం.
    ఇందిర పాత్రలో ఒదిగి చూస్తుంటే తెలిసీ తెలియని వయసు ప్రభావంతో జీవితం అనే
    వృక్షాన్ని స్నేహం ప్రేమ స్ధానంలో అహం, తెలియని అతిమూర్ఖత్వంతో చేజేతులా చేసుకొని – చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆన్నీ తెలిసీ అంతా అయ్యాక ప్రేమ గురించి మాట్లాడటం ఏమీ బాగోలేదు.
    ఇలాంటి వారు తమ గురించి తాము చాలా స్వార్థంగా ఆలోచించి ఎదుటివారి పరిస్థితి గురించి వాస్తవాలు విషయం ఆలోచించలేరు.
    చివరి క్షణం వరకూ అదే ఆలోచన చేసి చుట్టూ ఉన్న వారికి ప్రాధాన్యం మారుస్తూ ఇబ్బంది పెడతారు. దానికి పెద్ద ప్రేమ అనే పేరు పెట్టుకోవటం తప్పు అని
    తెలిసినా నా మాటే చెల్లాలనే భావం.
    గౌతమ్ మౌనం వెనక అతి మంచితనం, సంస్కారం, సున్నితత్వం ఉండటంతో ఎవరకీ ఏమీ చెప్పలేని స్థితి అనిపించింది.
    అహల్య సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుని ఒక ధర్మబధ్ధమైన ఇల్లాలుగా తన భాద్యతలను నిర్వహించే ఉత్తమ ఇల్లాలుగా
    నడుచుకుంటున్నది.
    అసలు ఇందిర దగ్గర అంత కాలం ఉండవలసిన అవసరమూ లేదు కూడా.
    స్త్రీకి జీవితంలో ఏవైనా పార్ట్ ఆఫ్ ది లైఫ్.
    ఒక రకంగా స్త్రీ అనే కాదు, పురుషుడికి కూడా అంతే. ఎవరి జీవితం వారిది. తప్పు ఒప్పులనేవి ఇద్దరకీ ఒకటే.
    రెండు చేతులు కలిస్తే తప్పట్లు. ఇద్దరు కలిసి సుఖంలో పంచుకునేటప్పుడు
    కష్టంలో కూడా స్పష్టంగా ఉండాలి. ప్రేమకీ పెళ్లికీ సంభవం అయితే పిల్లలు
    పెళ్లి లేకుండా తల్లయితే ఇద్దరికీ భాధ్యత ఉంది. మాతృత్వం వరం.
    అది దోషంగా మార్చుకుంటున్నారు.
    కాలం మారింది. తండ్రి లేకుండానే వివిధ ప్రత్యామ్నాయాలు వచ్చాయి.
    పెళ్లికి విలువలు పోయి సహజీవనాలు నడుస్తున్నాయి. స్త్రీ హక్కుల కోసం పోరాడి అన్ని రకాలుగా గెలుచుకున్న స్త్రీ పిల్లల పెంపకం కోసం కూడా నష్టపరిహారాలు సంపాదించుకుంది.
    సమాజంలో స్త్రీ నేడు సేఫ్. అన్నీ కావాలనుకున్నపుడు దేనికయినా
    సిద్దపడాలి. దానికి కారణాలు మగవాడిపై రుద్ది తప్పంతా మగవాడిదనటం తప్పు.
    స్త్రీ ఎప్పుడూ ఓ ప్రణయమూర్తే, తన హద్దులూ భాధ్యతలూ మీరనంతవరకు.
    అహల్య పాత్రని చాలా చక్కగా పోషించారు, అభినందనలు అండీ. సంతోషం.
    అహల్య పాత్ర అన్ని వయసుల్లో అన్ని పరిస్థితిలో అసంపూర్ణమే.
    సంపూర్ణం చేయాలంటే ఇందిర గౌతమ్ చేతిలో చివరి శ్వాస తీసుకునేలా వీలయినంత త్వరలో ముగించండి.
    ఆ సంసారం కాస్త ఒడ్డునపడి మనశ్శాంతిగా బ్రతుకుతారు.
    ఏది ఏమైనా మీ రచనాశైలికి నా హృదయపూర్వక అభినందనలు అండీ. నమస్కారము.*

    Reply
    1. 5.1

      BhuvanaChandra

      రమాదేవి గారు చాలా చక్కగా చాలా ఓపికతో చాలా మంచి విశ్లేషణ అని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఈ స్పందన నాకు చెప్పలేనంత ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగించింది మరోసారి మరోసారి మీకు ధన్యవాదాలు

      Reply
  6. 6

    Rama Sandilya

    మీ నవలలోని స్త్రీ. పాత్రల జీవితాలను చదువుతుంటే, చూస్తుంటే స్త్రీ మానసం లోతు కొలిచే సాధనం ఉంటే బావుణ్ణు అనిపిస్తోంది. ఒకో స్త్రీ గురించి ఒక్కోలా ఎలా వ్రాయగలుగుతున్నారు?

    చాలా బావుంది… మళ్ళీ వారానికై ఎదురుచూస్తున్నాము.

    Reply
    1. 6.1

      BhuvanaChandra

      రమాజీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
      మీ వంటి పాఠకులు ఇచ్చే విశ్లేషణలు స్ఫూర్తి నాకు రాయాలని ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి మరోసారి ధన్యవాదాలు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!