సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మాదకద్రవ్యాలు కళాశాల లకు మాత్రమే కాదు భువన్ జీ, హైస్కూల్ స్థాయి వారికి కూడా చేరుతున్నాయి. ఇటీవల మా గుంటూరు నుండి హైదరాబాద్ కి వ్యాపారం జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయాం. అమానుష క్రీడలు ( దేశాన్ని కుదిపేస్తున్న కలకత్తా డాక్టరమ్మ పై దారుణం) మూల కారణం చిత్తుగా మత్తు లో మునిగినవాడు చేసిందే. నార్కోటిక్ కేస్ లకు శిక్షలు చాలా కఠినమైనవి…. ఋజువైతే.
    కానీ ఋజువు కావు. మనిషి మెదడును పనిచెయ్యనీక, ఉద్రేకపరచే భయంకరమైన సాంఘిక విద్రోహక విషయాన్ని స్పృశించారు మీరు. (పైగా చీప్ లిక్కర్ అయితే ప్రాణాలనే తీస్తుంది కూడా.)

    కమల్ దంపతులు అల ని ఆదరించడం ముచ్చట గా ఉంది. వారు బిడ్డ ను కోల్పోయిన క్షణం, అల జన్మించిన క్షణం ఒకటే అన్న ఉదంతం కల్పన కాదు, నిజంగా జరిగిన సంఘటన అన్నారు.

    నాకు షారూఖ్ దీపికా ల ‘శాంతి ఓం శాంతి’ సినిమా గుర్తుకు వచ్చింది.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు నమస్కారం. వారం వారం చక్కగా చదివి మీరు పెడుతున్న కామెంట్స్ నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఒకసారి నేను రాంగ్ డైరెక్షన్స్ లో పెడుతున్న మీ కామెంట్ నాకు మార్గదర్శకం చేసుకోండి థాంక్యూ సో మచ్ చాలా చాలా సంతోషం ధన్యవాదాలు

      Reply
  2. 2

    యామిని

    దేశభిమానం గురించి చాలా గొప్పగా చెప్పారు.🙏
    దేశాన్ని ఏలే ఎవరికీ ఆ ద్యాస ఉన్నట్టు ఎప్పుడూ లేదు.
    ప్రజల ఆరోగ్యం పట్ల నిషేదించాల్సిన వాటిని ప్రోత్సహించడం పట్ల ఆదాయాన్ని మాత్రం చూస్తూ ప్రజలపట్ల బాధ్యతని విస్మరించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. లేకుంటే దేశంలో వాడకూడని వాటిని విచ్చలవిడిగా వదిలేయరు. మందు, సిగిరెట్ లే కాదు.. కూల్ డ్రింక్స్ కూడా హానికరమనే విషయం పాలకులకు తెలుసు. ఏడాది దాటని పిల్లలు కూడా వాటిని తాగుతూ, టెస్టింగ్తి సాల్ట్న వేసిన అనేకమైన తికూడని వాటిని లాంటి తింటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు.
    విదేశాల్లో బాన్ చేసిన మందుల్ని యదేచ్చగా ఆరోగ్యం బాగు పేరుతో అనారోగ్యం కొని తెచ్చి పెడుతున్నారు.
    ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అంతే లేదు.
    ప్రజలు అంతా బావుంది అని భ్రమలో ఉండాల్సివస్తుంది.
    పాత్రల ద్వారా చాలా మంచి విషయాలు డిస్కస్ చేసారు.
    ఇంకా కమల్ గారి ఇంట్లో మీరు చేసే ఆనందకరమైన, రుచికరమైన విందుకు మేము కూడా రావొచ్చా గురువర్యా.. 😊
    (నిజానికి మీరు వ్రాసిన ప్రతీ పాత్ర వెనుక ప్రయాణించి మేము కూడా అక్కడే ఉంటున్నాం)
    కమల్ గారి భార్య అలతో మాకు కూతురుగా ఉంటావా అన్న మాట అప్రయత్నంగా మదిని, కంటిని తడిపింది.
    నాకు కొన్ని జ్ఞాపకాలని తిరగతోడింది.
    మొత్తం బావుంది. అప్పుడే అయిపొయిందా అనిపించింది ఇవ్వాళ.. (ఇంకా మహతి ప్రయాణం రాలేదు ఇందులో )
    వచ్చేవారం మహతి కోసం ఎదురు చూస్తూ..
    నమస్సులు మీకు 🙏🙏💐💐

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      యామీజీ హృదయపూర్వక ధన్యవాదాలు
      చక్కని విశ్లేషణలతో మీరు వారం వారం స్పందిస్తున్న తీరు నాకెంతో ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply
  3. 3

    Sobharaja

    🙏
    మీరన్నట్లు మనం భారతీయులం అనేది మరిచిపోయి భాష,కుల విభేదాలతో కొట్టుకు చచ్చేలా చేస్తున్నారు రాజకీయనాయకులు. నాకందుకే Independence Day celebrate చెయ్యడం ఇష్టముండదు. Independence రాక ముందు జాతి మత భాష విభేదాలు లేకుండా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. ఈ నాడు??????
    నిజమే ఎవరితో ఏ బంధం ఎలా ముడి పడుతుందో తెలియదు. కొందరి మీద తల్లి ప్రేమ , పుత్ర వాత్సల్యం,సోదర ప్రేమ కలుగుతూ జన్మ జన్మ బంధంలా అనిపిస్తుంటుంది. ఈ శీర్షిక చాలా చక్కగా కుదిరింది.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      శోభాజీ నమస్కారం. చాలా చక్కని విశేషణలతో మీరు వారం వారం ఇస్తున్న కామెంట్స్ నాకు చాలా స్ఫూర్తిని ఆనందాన్ని ఇస్తున్నాయి సీరియల్ ముందరకి నడవడానికి ఎంతో సహాయపడుతున్నాయి హృదయపూర్వక ధన్యవాదాలు భువనచంద్ర

      Reply
  4. 4

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికినమస్సులు. 78సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము.ఎందరో వీరుల త్యాగ ఫలంతో మన దేశ స్వతంతం పొంది విదేశీయులని తరిమి వేసాము బౌతికంగా కాని వాళ్ల సంస్క్రతి అంతా డౌన్లోడ్ చేసుకొని మనమే విదేశీయులం అయి పోయాము. మన ఆచారావ్యవహారలాన్ని మారిపోయాయి. ఇప్పటి తరానికి దిబ్బరొట్టి తెలియదు పిజ్జా, బర్గర్ తప్ప. పోషక విలువలు అన్నీ నాశనం చేసి కొత్త రెసెపీలు కోకొల్లలు. వస్త్ర ధారణ మాట అసలే లేదు. పట్టు చీర అంటే పెళ్లి కి వేసుకొనే ఫాన్సీ డ్రెస్ మంగళ సూత్రం కూడా అంతే నండోయి. క్రమ శిక్షణ ఆలోచన నశించి పోయాయి. స్వాతంత్రమ్ ఇందుకోసమేనా మన నాయకులు ప్రాణాలు వడ్డి తీసుకుని వచ్చింది అనిపిస్తోంది. మందు వెనుక నున్న మందు రహస్యం బాగా చెప్పారు. మందు మందు లా నే పుచ్చుకోవాలి మంచి నీళ్లు లా కాదు. కొంతమంది ని చూడగానే ఆప్తులు లాగా అనిపిస్తారు దానికి వెనకాల కారణంఆలోచించాలి అన్నమాట. నార్త్ ఇండియా ఆహారం అలవాట్లు బాగా వ్రాసారు. కమల్ దంపతుల పాత్ర అద్భుతం. ధన్యవాదములు -రోహిణి 🙏

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా విశ్లేషించి అప్పటికి ఇప్పటికీ సమాజంలో వచ్చిన మార్పుల్ని చక్కగా అక్షరీకరించారు చాలా చాలా సంతోషం వారంభారం మీరు పంపుతున్న ఈ స్పందనలే నాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి చాలా చాలా ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!