మాతృమూర్తి ఆనందం కోసం పరితపిస్తూ నాన్న చెప్పే మంచిమాటలు ఆలకిస్తూ అమ్మానాన్నల ప్రేమని అమృతంలా భావిస్తూ అమ్మానాన్నల తో ఆత్మీయంగా మసులుకోవాలి!
తోబుట్టువులకు తోడూనీడగా వుంటూ సహోదర భావాన్ని పెంపొందించుకంటూ సోదరీసోదరులతో అభిమానంగా జీవించాలి!
కట్టుకున్న భార్యకి కన్నీరు రాకుండా కష్టాలని దూరం చేస్తూ ఉత్తమబంధంగా ఇలలో విఖ్యాతినందుకునేలా ముందుకు సాగాలి!
పిల్లల మనస్సులు గెలుచుకునేలా అవసరానికి ఆదుకున్న నేస్తాలకి ఎన్నడూ వీడని మిత్రుత్వాన్ని పంచుతూ జీవనయానం సాగించాలి!
అలాంటప్పుడే రోజువారి జీవితం ఆనందమయం అవుతుంది! బంధాలు, బంధుత్వాలు, స్నేహాల విలువలు తెలుసుకుని.. అందరితో మంచిగా వుంటుంటే.. నిన్ను, నీ ఉనికిని అందరూ గౌరవిస్తారు!!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు. ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు. ‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రామం భజే శ్యామలం-14
నారాయణ.. నారాయణ
నల్లటి మంచు – పరిచయం
అక్షరమాల
మార్మిక సోయగాలపై వెలుగు – ‘కిన్నెరసాని పాటలు – సమీక్ష’
‘వ్యామోహం’ – సరికొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన
సంచిక – పద ప్రతిభ – 130
జ్ఞాపకాల పందిరి-76
సాహితీ ప్రవీణ పురస్కార ప్రదానోత్సవం ప్రెస్ నోట్
తాతగారి ఫొటో
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®