సంచికలో తాజాగా

Related Articles

6 Comments

 1. 1

  prabhakaramsivvam

  శ్యామలగారి వ్యాసం ” విద్య విశిష్ట దైవతము ” బాగుంది. ఈ
  నాటి విద్యావ్యవస్థ తల్లిదండ్రులకు, పిల్లలకు గగుర్పాటు. కలి
  గిస్తున్నాయి. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుంచీ బిడ్డ చదువుపై ఆశక్తి, అలజడి, ఆంధోళన. ఎంత ఖర్చు అయినా
  కార్పొరేట్ స్కూల్ లోనే చదివిద్దామనే ఆలోచన తల్లి దండ్రుల లో గూడుకట్టుకుపోతున్నది. 1950- 1970 మధ్య కాలంలో గానీ, అంతకు ముందుగానీ ఏం కార్పొరేట్ స్కూల్స్ ఉండేవి ?
  ఆనాడు చదువులు చదవడం మానేసారా?ఉన్నత పదవులు
  పొందడం మానేసారా ? తల్లి దండ్రులు ఇద్దరూ ఉద్యోగులై
  నందున ఉద్యోగబాధ్యతలు, శ్యామలగారు చెప్పినట్లు
  ఉద్యోగ సమస్యలతోనే సతమతమవుతున్నారు తప్పితే
  పిల్లలను క్రమశిక్షణతో పెంచడం, సంస్కారం నేర్పడం, పెద్దలను గౌరవించే విధంగా పిల్లలను తీర్చిదిద్దడం ఈనాటి
  తల్లిదండ్రుల పెంపకంలో లోపిస్తున్నాయి. స్ర్తీ తప్పనిసరిగా
  విద్యావంతురాలై ఉండాలి. పిల్లలను తీ‌ర్చిదిద్దే బాధ్యతలు
  చేపట్టాలని దేశభక్తి, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పిల్లలలో
  పెంపొందించే దిశలో చదువులు కలిగుండాలని.శ్యామలగారు
  ఆశించడం ప్రపంచ పౌరురాలిగా తన భాధ్యతను నిర్వర్తించి
  నట్టయింది. శ్యామలగారికి అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి.

  Reply
 2. 2

  Guruprasad

  Very nice narration by smt syamala garu
  Regarding education
  From J Guru Prasad

  Reply
 3. 3

  Syamala Dasika

  శ్యామల అందించిన “విద్య విశిష్ట దైవతము” చాలా చాలా బావుంది. చదువుతుంటే చిన్నప్పటి బడి రోజులు గుర్తుకొచ్చాయి! ఇప్పటి చదువులు పిల్లలకు, ముందు ముందు డబ్బులు ఎలాసంపాదించాలో నేర్పుతున్నాయి. అప్పటి చదువులు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ..జీవితపు విలువల్ని నేర్పేవి. ఎంత డబ్బు పెట్టి ఎంత పెద్ద చదువులు చదివినా, రచయిత్రి చెప్పినట్టు ఈ ప్రపంచ పాఠశాలలో అందరం నిత్య విద్యార్దులమే!

  శ్యామలాదేవి దశిక
  న్యూజెర్సీ-యు ఎస్ ఎ

  Reply
 4. 4

  S S Kandiyaped

  This time Ms Syamala has dextrosely woven a highly readable write up on ‘Education ‘. people in the past gave importance to Scholarship and general/ public education is a modern phenomenon. Today education is society driven; sans scholarship. The medieval thought that gentle men can do well without any education had credence in India till almost the end of 19 th. C.
  Education is said to Learn, to Work and To Be.
  Syamala garu highly deserves our compliments for a highly engaging article.
  S S Kandiyaped

  Reply
 5. 5

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి”విద్య విశిష్ట దైవతము” ద్వారా విద్యతో బాటు విలువలను,సంస్కారాన్ని నేర్చుకోలేక పోతే ఆ విద్య అనర్ధాన్నేమిగిలిస్తుందని తెలియజేసారు.అంతేగాదు… ఈ విశ్వం పట్ల విశ్వమానవుడి బాధ్యతను,దేశభక్తిని,సోదరభావాన్ని కలిగించేదిగా విద్య ఉండాలనే సామాజిక బాధ్యతను ఈ వ్యాసం ద్వారా తెలియజేసారు శ్రీమతి శ్యామల గారు.హోంవర్క్ పై కెన్ నెస్ బిట్ లిఖించిన
  Home work I love you
  I think you are great
  It is wonderful fun when you keep me up late………
  Poemని సందర్భానుసారంగా ఈ ఆర్టికల్ లో పొందుపరచడం రచయిత్రికి ఉన్న బహుభాషా ప్రతిభకు నిదర్శనం.అంతేనా…పిల్లలు టీనేజ్ లో కాలేజీలో చేరిన తరువాత చిలిపితనం,అల్లరి చేష్టలతో ఎలా వయసును దొర్లిస్తారో తెలియజేసే “అంగరక్షక్”లో పూజాభట్ పై చిత్రీకరించిన పాట ద్వారా తెలియ జేయడం….రచయిత్రి తాను వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ…అన్ని రంగాలను పరిశీలిస్తూనే వుంటాననే ఓ వాస్తవ దృక్ఫదానికి తార్కాణం.
  “బంగారు పాపాయి బహుమతులు పొందాలి
  పాపాయి చదవాలి మా మంచి చదువు…..”
  పిల్లల చదువులపట్ల తల్లిదండ్రుల తపన,ఆశలను తెలియజేస్తూ…మంచాల జగన్నాధరావు గారు రాసిన పాట ఉదాత్త గీతమై బాలసరస్వతి దేవి గారి గళం నుండి జాలువారిన వైనాన్ని…సందర్భోచితంగా ఉదహరించిన తీరు….విషయ వివరణలో రచయిత్రి లోతైన పరిశోధనకు నిదర్శనం.ప్రాజెక్ట్ వర్కుల పేరిట తల్లిదండ్రులను హింసించి డబ్బు ఖర్చు పెట్టించే నేటి యూట్యూబ్ పనిష్మెంట్ చదువులకు……ఒకనాటి విద్యే పరమావధిగా జ్ఞానంకోసం మెదడును శోధింపజేసే చదువులకు వ్యత్యాసాన్ని తెలియజేస్తూ….ఇతిహాసాలు,పురాణాలను ఉటంకిస్తూ రచయిత్రి వివరించిన విధానం ఆమె మేధస్సులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన సంపదకు తార్కాణం.భవిష్యత్తులో ….శ్రీమతి శ్యామల గారు సమాజంలోని విభిన్న అంశాలను శోధించి వాటి సారాన్ని మనకు అందించాలని అభిలషిస్తూ…..
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 6. 6

  Bhramara

  విద్య గురించి, దాని విశిష్టత ను గురించి సహేతుకంగా వివరించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యక అభినందనలు.💐💐💐పిల్లల ప్రాజెక్టు వర్క్, హోం వర్కుల గురించి, తల్లుల పనిష్మెంటు ల గురించి రచయిత్రి గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. ఒకప్పటి అక్షరాభ్యాసాలు ,ఇప్పటి school admission ల గురించి చక్కగా వివరించారు.భర్తృహరి ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము ‘ , పోతన గారి ‘చదువనివాడజ్ఞుండగు ‘ , వేమన ‘ చదువు జదవకున్న ‘ వంటి పద్యాలు మళ్లీ చదవడం ఆనందంగా ఉంది. రేపటి పోరులు చిత్రంలోని పాట రచయిత్రిగారన్నట్లు నేటి పరిస్థితులకు దర్పణమే. మహాభారతం, మహాభాగవతం లో విద్యాపాటవాలను ప్రదర్శించే సన్నివేశాలను వర్ణించడం చాలా బాగుంది . ఇతిహాసాల్లో విద్యే వివాహ అర్హతగా నిర్ణయించేదన్న పాయింట్ బాగుంది. నేటి చాలా మంది పిల్లలకు అసలుసిసలైన ప్రతినిథి మర్యాద వారబ్బాయి …గురించి చెప్పడం సందర్భోచితంగా ఉంది . ఎంత చదివినా విద్యతోపాటు విలువలను, సంస్కారాన్ని నేర్చుకోలేకపోతే అనర్థాన్నే మిగులుస్తుందని చెబుతూ , చివరిపేరాలో విద్య ఎలా ఉండాలో చెప్పి చక్కటి సందేశంతో ముగించడం రచయిత్రిగారి ప్రతిభకు తార్కాణం. ఈ ప్రపంచ పాఠశాలలో మనమంతా నిత్య విద్యార్థులమే అన్న సంగతిని గుర్తుచేసిన రచయిత్రి శ్యామల గారికి ధన్యవాదాలు . 🙏🙏🙏

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™