సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Guru

    Excellent narration by smt syamala garu regarding love
    From J Guru Prasad

    Reply
  2. 2

    prabhakaramsivvam

    శ్రీమతి శ్యామలగారి ” ప్రేమావరణం” బాగుంది.
    ప్రేమావరణాన్ని స్వచ్ఛమైన గాలి, నీరు, ప్రాణ వాయువు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సకల జీవులకు అందించే పర్యావరణంతో
    సరిపోల్చడం రచయిత్రిలో నున్న ప్రేమ తత్వానికి నిదర్శనం. ఆమెలో నున్న మేథాశక్తికి
    నిదర్శనం. ఆమె వ్యాసం చదివిన తరువాత నిజమైన, నికార్సయిన ” ప్రేమ” ఎంత మధురానుభూతిని అందిస్తుందో తెలుస్తోంది.
    ప్రేమలో పడేవారికి ఆ ఇద్దరు ప్రేమికులే ఈ విశ్వంలో ఉన్నట్టు, ఈ విశ్వమంతా తమదే
    అన్నట్టు భావిస్తుంటారు. ఇది అసలైన ప్రేమికుల
    కథ. కృష్ణుడు-రాధ, కృష్ణుడు-రుక్మిణి, కృష్ణుడు–
    సత్యభామ నిజమైన ప్రేమకు ఆనవాళ్లు. నిజమైన ప్రేమకుల ప్రేమకు ఆటంకాలు కలిగితే
    ఆ ఆటంకాలు తొలగించుకొని జీవితంలో ఒకటిగా నిలుస్తారు. మంచైనా– చెడయినా;
    సుఖమైనా–కష్టమైనా జీవితాన్ని కలిసి పంచు
    కుంటారు. మరణిస్తారు. ఈ ప్రేమలో స్వార్థంతో
    కూడుకున్న కల్తీ ప్రేమలు ఉన్నాయి. అది మగ
    వారినుండి కావొచ్చు ఆడవారి నుండి కావచ్చు.
    వారి వారి అవసరాలు తీరిపోయిన తరువాత
    ఎవరి దారినవారు పోతారు. మన సమాజంలో వీటికి కూడా కొదువలేదు. ఇటువంటి దొంగ
    ప్రేమికులు, మోసగాళ్ళు ఇటు మొగవాళ్ళలోనూ
    ఉన్నారు. ఆడవాళ్ళలోను ఉన్నారు. అటువంటి
    స్థిరమైన మనసు లేనివారు జీవితంలో ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. ప్రతీ జీవికి
    ప్రేమించడం తెలుసు, అన్యోన్యంగా బ్రతకడం తెలుసు.ఒకరికోసం త్యాగాలు చేయడం తెలుసు
    శ్యామలగారు చెప్పినట్టు ప్రేమించి, ప్రేమకోసమై జీవించు, ప్రేమకోసమై మరణించిన వారెందరో
    ఈ విశాల ప్రపంచంలో. శ్యామలగారికి హృదయ పూర్వక అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్ : 701 3660 252.

    Reply
  3. 3

    GN Murty

    ప్రేమావరణం మీద జొన్నలగడ్డ శ్యామల గారు వ్రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది.
    ఇందులో ఎన్నో అద్భుతమైన పాటలను విశ్లేషించేరు .వారికి ధన్యవాదాలు

    Reply
  4. 4

    Ramana Velamakakanni

    More than content Shyamala’s narration interests me. It’s mix of old and new film songs perfectly blended. This time reference to few literary legends and their quotes are very apt.Abhinandanalu.

    Reply
  5. 5

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”ప్రేమావరణం!”శీర్షిక నన్ను మాత్రమే కాదు…భావోద్వేగాలున్న ప్రతి మనిషి హృదయాన్ని అలరింపజేస్తుంది.”ప్రేమ”….ఓ మధురమైన భావన.యవ్వనంలో ప్రతి యువకుడు..యువతి తమదైన ప్రేమ సామ్రాజ్యంలో విహరించడం సహజం.
    మానవ సంబంధాలు బాల్యంలోనే తల్లిదండ్రుల ప్రేమతో ప్రారంభమవుతాయి.ఆ తరువాత యవ్వనంలో ప్రేయసి/ప్రియుడు సాంగత్యంలో ఏర్పడిన ప్రేమానుబంధం హృదయంలో స్థిరంగా నిలిచిపోతుంది.
    ఈ విషయాన్నే రచయిత్రి తొలి భావకవి బసవరాజు అప్పారావు పలుకులు ద్వారా మనకు గుర్తు చేశారు.
    ప్రేమకు కారణం….”ఆత్మను ఆత్మను కలిపి కుట్టు దారమే నాదు ప్రేమకు కారణమని…..”
    శ్యామల గారి శోధనలో రాయప్రోలు సుబ్బారావు గారి అమలిన శృంగార ఖండకావ్యం “తృణ కంకణం”కూడా చోటు చేసుకోవడం ముదావహం.
    ఈ విధమైన పరిశోధన ద్వారా” ప్రేమ”
    ప్రాచీనతను…పవిత్రతను…రచయిత్రి ఈ తరం పాఠకులకు తెలియజేసారు.
    తన సహజ శైలిలో ప్రేమాలోని అన్ని కోణాలను ఆవిష్కరించారు.ఇతిహాసాలు,చారిత్రాత్మక ప్రేమకథలు,ఆధునిక,అత్యాధునిక ప్రేమ పోకడలను మన కళ్ళ ముందు భావోద్వేగాలతో కూడిన రసమయగీతాలతో నిలిపారు.నిత్యజీవితంలో ప్రేమ ఓ మధురమైన భావన మాత్రమే కాదు…మనిషి జీవితంలో ఓ భాగం కూడా!…..ఈ సుందరమైన భావనను నాలాంటి భావుకులలో కలుగజేసిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  6. 6

    Jhansi koppisetty

    మానస సంచరరే…. శీర్షిక ఆకర్షించింది… ఆపైన ప్రేమావరణం.. నిత్యనూతనమైన విషయం ఆసాంతం గుక్క తిప్పుకోకుండా చదివించింది.. ఎక్సలెంట్ ఆర్టికల్…. రచయిత్రికిపాతకొత్త సినీ గీతాల నాలెడ్జి అబ్బురపరిచింది… Amazing narration indeed👌👌👌

    Reply
  7. 7

    Mramalakshmi

    మనిషి మనుగడను ఆధారమైన అమృతమయమైన ప్రేమ గురించి సందర్భానికి తగిన పాటల కలయికతో మనోహరమైన రచనా సుమాన్ని అందించిన శ్యామలగారికి నమస్సుమాంజలి.ఇంతవరకు మేడంగారి రచనల్లో ఈ రచన కలికితురాయి.మరిన్ని ఇలాంటి రచనలను నిరంతరం మాకు అందిచగలరని ఆశిస్తూ …రామలక్ష్మి 🙏

    Reply
  8. 8

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మానస సంచరరే శీర్షికలో జే. శ్యామల గారు అందించిన అంతరంగమున అందెళ రవళి హృదయాన్ని తాకి ఎన్నో దృశ్య కావ్యాలను కలుల ముందు ఉంచినది. చదివిన తర్వాత కూడా చాలా సమయం ఆ కమనీయ స్పందన మనస్సు లో నిలిచి పోయింది. ఆమె కలం నుండి ఇలాంటి గొప్ప రచనలు ఇక ముందు రావాలని కోరుకుంటున్నాను. ఇలపావులూరి వెంకటేశ్వర్లు.

    Reply
  9. 9

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మానస సంచరరే శీర్షిక లో జే. శ్యామల గారు అందించిన అంతరంగమున అందెళ రవళి హృదయాన్ని తాకి ఎన్నో మధురమైన గతం తాలూకు అనుభూతులను గుర్తు చేసింది. మనస్సును తాకే ఇలాంటి రచనలు ఆమె కలం నుండి రావాలని కోరుకుంటున్నాను.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!