మన దేశం అభివృద్ధి చెందింది, చాలా సాధించేసాం అని గొప్పగా, గొప్పలు చెప్పుకుంటాం. ఇతర దేశాలతో పోల్చుకుని కాలర్ ఎగరేస్తుంటాం. మనం ఇక సాధించవలసింది ఏమీ లేదన్నట్టు అంచనాలకు మించి ఫీల్ అయిపోతాం. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యానికి తర్వాత, అభివృద్ధిని గురించి ఆలోచిస్తే, మనం వెనకబడి ఉన్నామని చెప్పలేము. శాస్త్ర విజ్ఞాన విషయాలలో ఇతర దేశాలతో పోటీగా మనం అభివృద్ధి చెందుతున్న విషయం వాస్తవం. మరి మనం ఎందులో, ఎక్కడ వెనకబడి వున్నాం? ఇతర దేశాలలో లేని కొన్ని దుర్భాగ్యపు సమస్యలు తరతరాల నుండి మనల్ని వెంబడిస్తూనే వున్నాయ్. వాటి రుగ్మతలనుండి మనం ఇంకా ఏమాత్రం కోలుకోలేక పోయాం. ఆ అంశాలలో అభివృద్ధిని సాధించలేకపోయాం. అవే సమస్యలు సామాన్యుడినుండి సంపన్నుడిని సైతం భూతంలా పట్టి పీడిస్తున్నాయి. కుల వివక్షత, వరకట్నం, స్తీని ఇంకా బానిసగా చూడడం, ఎన్ని శాసనాలు ప్రభుత్వ పరంగా చేసినా మహిళకు రక్షణ లేకపోవడం, పేదవాడి భూములు దర్జాగా కబ్దాలకు గురికావడం… వంటివి ఇలా ఎన్నో! వీటికి తోడు రాజకీయ నాయకులు, ఆయా పార్టీలు, ఓట్ల బాంక్ కోసం ఆకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆలోచనను, శ్రమ శక్తిని నిర్వీర్యం చేయడం వంటి పనుల వల్ల యువతలో అభివృద్ధి పట్ల, భవిష్యత్ పట్ల నిరాశక్తత ఏర్పడుతున్నాయి వీటన్నింటిలోనూ కుల వివక్షత మహా రాక్షసిలా ఇంకా పై… పైకి, విజృంభిస్తూనే వుంది. తక్కువ కులాలవాళ్లుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎక్కువగా చదువుకున్న ఓర్వలేని పరిస్థితులు, కులం నిరూపించుకోవడానికి వాళ్ళు పడే అష్ట కష్టాలు, ఆలోచిస్తే గుండెలు ఝల్లుమంటుంటాయి. ఈ బాధలు పడలేక, ఎంతో మంది యువతీ యువకులు తల్లిదండ్రులకు, ఇతర బంధువులకూ దూరంగా, పాశ్చాత్య దేశాలకు వలసపోయి అక్కడ తమ మేధస్సుతో మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఇతర కులాలకు ధీటుగా గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. మరి, అక్కడ కులాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా! ఈ కుల వివక్షత, పల్లెల్లో పట్నాలలో ఇంకా నిత్యకళ్యాణం పచ్చ తోరణంలా విలసిల్లుతూనే వుంది. ఉన్నత ఉద్యోగాలలో ఉన్నవారికీ ఈ తిప్పలు తప్పడం లేదు. దీనికి నిలువెత్తు సాక్ష్యం నా ఉద్యోగ జీవితంలో ఒక చిన్న సంఘటన మీ కోసం.
***
ఉద్యోగులకు బదిలీ అన్నది సహజం. 3-4 సంవత్సరాలకు బదిలీ తప్పని సరి! పైగా నా ఉద్యోగం రాష్ట్ర స్థాయిది కాబట్టి, రాష్ట్రంలో ఎక్కడికైనా పంపించవచ్చు. కానీ నేను పనిచేసిన మహబూబాబాద్ అప్పట్లో పెద్ద డిమాండ్ గల ప్రదేశం కాదు కాబట్టి, నాపై నా సోదర ఉద్యోగుల వత్తిడి ఉండేది కాదు. పైగా అప్పట్లో అది రాడికల్స్‌కు పెట్టింది పేరు. ఎవ్వరు అక్కడ పని చేయడానికి పెద్దగా ఉత్సాహం చూపించేవారు కాదు. అందుచేత నిరాటంకంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పన్నెండు సంవత్సరాలు పని చేయగలిగాను. అక్కడి వాతావరణం ఆనందంగా ఆస్వాదించగలిగాను. అక్కడ నాకు కుల వివక్షత పెద్దగా ఉండేది కాదు. నా వెనుక ఏమైనా చర్చలు జరిగేవేమో గానీ, ప్రత్యక్షంగా అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాలేదు. బహుశః రచనా వ్యాసంగం, ఉపన్యాస ప్రతిభ, వాటిని నా దరిచేరకుండా చేశాయేమోనని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంతో సత్సంబంధాలు కలిగి ఉండడమే దీనికి ముఖ్య ఉదాహరణ! ఇక అసలు విషయానికి వస్తే, 1994లో, మహబూబాబాద్ నుండి నాకు జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ అయింది. అప్పటి పేదల (సామాన్యుల) ప్రజాప్రతినిధి నర్సంపేట నాటి శాసనసభ్యులు స్వర్గీయ ఎం. ఓంకార్ గారి వల్ల ఇది నాకు సుసాధ్యమయింది. లేకుంటే నేను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి విసిరివేయబడి ఉండేవాడిని.
బదిలీ పత్రాలు తీసుకుని జనగామ ఆసుపత్రికి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్లాను. అది అప్పటికి తాలూకా స్థాయి ఆసుపత్రి. నేను ఉండగానే అది ఏరియా ఆసుపత్రి అయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, జనగాం జిల్లా అయింది. తద్వారా ఆసుపత్రి ఇప్పుడు జిల్లా ఆసుపత్రిగా మారింది. అక్కడ అప్పటి చీఫ్ డిప్యూటీ సివిల్ సర్జన్ కేడర్ ఉండేది. ఆ పోస్ట్ భర్తీ కానందున, ఆసుపత్రి పరిపాలనా వ్యవహారాలు ఉన్న వైద్యుల్లో సీనియర్ చూసేవారు. అప్పుడు అదే ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్ గారు ఆసుపత్రి పరిపాలనా భాద్యతలు చూసేవారు. ఆయన గురించి తెలుసుకుని వెతుక్కుంటూ జనరల్ అవుట్ పేషంట్ గదికి వెళ్లాను. ఆయన అక్కడ పేషేంట్స్‌ను చూస్తూ చాలా బిజీగా వున్నారు. విష్ చేసి విషయం చెప్పి, నా చేతిలో వున్నా కాగితాలు ఆయన చేతిలో పెట్టాను. కర్టెసీ కోసమైనా కూర్చోమంటారేమో అనుకున్నా. ఆ పని ఆయన చేయలేదు.
కాగితాలు అటూ ఇటూ కాస్సేపు తిప్పి, నన్ను కాసేపు ఎగాదిగా చూసి, సీరియస్‌గా – “మీరు ఏమిటోళ్లు?” అన్నాడు. నా స్థాయిలో ఉన్న వాడికి అలాంటి ప్రశ్న వస్తుందని అసలు నేను ఊహించలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురు కాలేదు. అందుకే ఆశ్చర్యానికి గురిఅయి, నిలకడగా మారి – నా కులం ఏమిటో చెప్పాను. నా వంక కాస్త ఆశ్చర్యం గాను, కించిత్ అనుమానం గాను చూస్తూ – “అవునా! మరి, అలా కనిపిస్తలేరు కదా!” అన్నాడు. ఇది ఇంకా మింగుడు పడని ప్రశ్న అనిపించి, కాస్సేపు ఆలోచించి “ఆ కులం వాళ్ళ వేషం యెట్లా ఉండాలంటారు” అన్నాను. ”ఉహు… అట్లా కాదుగానీ… అలా… కనిపిస్తలేరు…” అన్నాడు. “మరి… ఎలా ఉండాలంటారు? పోనీ మీకు అలా అనిపించడానికి గుడ్డల మీద బురద చల్లుకుని, అక్కడక్కడా చింపుకొని రానా?”అన్నా కాస్త సీరియస్‌గా. అప్పటికి ఆయనకు ఇంచుమించు సమాన స్థాయిలో ఉన్న వాడిని, పన్నెండు సంవత్సరాలు గజిటెడ్ హోదాలో పని చేసిన వాడిని, ఆ మాత్రం మంచి బట్టలు వేసుకోకూడదా? అనుకున్నాను మనస్సులో. నేను ఇచ్చిన సమాధానం ఆయనకు ఎక్కడో గుచ్చుకున్నట్లయింది. “అదికాదు… డాక్టర్ సాబ్, మీరు తప్పుగా అనుకోకండి. నేను మామూలు గానే అడిగాను, ఎలాంటి దురుద్దేశంతోను, మిమ్ములను అలా అడగలేదు… మిమ్ములను కించపరచాలని అసలు అనలేదు” అన్నాడు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ… “అది సరే సార్, మనం చదువుకున్న వాళ్ళం, ఉన్నత ఉద్యోగాల్లో వున్నవాళ్ళం, మన స్థాయికి ఆ విధంగా మాట్లాడుకోవడం సభ్య సమాజం హర్షించదు. మనం ఒకళ్ళకి చెప్పవలసిన వాళ్ళమే కానీ, చెప్పించుకునే పరిస్థితి మనకు రాకూడదు కదా!” అన్నాను నవ్వుతూ. “మీరు చెప్పింది అక్షరాలా నిజం, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, అసలు విషయం చెప్పనా, మనిషి పరిచయం కాగానే ‘మీరు ఏమిటోళ్లు’ అని అడగడం సర్వ సాధారణం. ఈ విషయంలో మీ పరిచయం నాకు కళ్ళు తెరిపించింది, మనిద్దరం ఇక ముందు మంచి స్నేహితులం” అని లేచి నిలబడి గట్టిగా కౌగలించుకున్నాడు. నిజంగానే అప్పటి నుండి ఇప్పటి వరకూ మేము మంచి స్నేహితులుగానే మిగిలిపోయాం. ఆయన జీవితానికి సంబంధించి నా చిరు సలహాలు కూడ హృదయ పూర్వకంగా స్వీకరించేవాడు.
కుల వివక్షత అనేది రావడానికి ఒక అవతల వ్యక్తిని తప్పుపట్టడం సరి కాదని నా అనుభవం నాకు నేర్పింది. వృత్తి పట్ల శ్రద్ధ, క్రమశిక్షణ, సేవాభావం, అందరితో కలిసిపోయే స్వభావం ఉంటే, మనకు మనం గిరిగీసుకునే తత్త్వం మానుకుంటే, ఇలాంటి సమస్యలు పెద్దగా ఉత్పన్నం కావని నా ప్రగాఢ విశ్వాసం. వెనుక వినబడే అనవసర కామెంట్లను ఎవరూ ఆపలేరు, అది వేరే విషయం, మనకు అనవసరం కూడా!
ప్రతి అనుభవం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోక, జీవితాలను సరిదిద్దుకునే అవకాశాలు మెండుగా కల్పిస్తుందన్నది మాత్రం అక్షరాలా నిజం!!
(ఇంకా ఉంది)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక…సంపాదక వర్గానికి ఇతర మిత్ర బృందానికీ హృదయ పూర్వక ధన్యవాదములు
ఈ కాలంలో , తక్కువ కులం అని నీచంగా చూసే దృష్టి తగ్గినా, కులాధిపత్యం, కుల దురభిమానం పెరిగందనే చెప్పాలి. మీ విషయంలో, మీ ప్రతిభ అనండి, లేదా మంచి తనం అనండి, ఇలాంటి సమస్యలను అధిక మించి అనేక మందికి ఆదర్శ ప్రాయం అయ్యారు. మీరు వ్యవహారంలో, స్మృతులను కూడా నిర్మొహమాటంగా పంచు కుంటారనేది దీని బట్టి తెలిసిపోతుంది.
రాజేంద్ర ప్రసాద్ గారు, మీ స్పందన అమూల్యం. ధన్య వాదాలు మీకు
Telangana lo naa erukalo caste adagaru….villages lo koodaa employees nu caste adagaru….mari aa Dr.enduku adigaado….idi chaalaa baadhaakaram… meeru cheppinatlu vyakthi yokka nadavadikanu batti viluva untundi gaani caste ni batti kaadu…idi chaalaa sandarbhaallo prove ayindi..mee anubhavam kanuvippu kaliginchedi gaa undi…..
జయపాల్ రెడ్డి గారు మీరు చెప్పింది నిజం.ఆ..ఒక్క చోటే నేను ఆ పరిస్టితిని ఎ దు ర్ కున్నను మీ స్పందన కు ధన్యవాదాలు.
(మీ జ్ఞాపకాల పందిరి…గురించి) మీకు అలాంటి అనుభవమైతే …నన్ను కులమేదని అడగకున్నా రీతిని బట్టి ఈరోజు వరకు ఓ సబార్డినేట్ గా కడు దయనీయంగా చూస్తున్న విధానం ఉంది. ఐతే నేనేనాడూ ఆయన ప్రవర్తనకు బాధ పడలేదు.. జాలి పడుతున్న. లోకా సమస్తా సుఖినోభవన్తు.! అని నా దినచర్యను ప్రారంభిస్తా కాబట్టి. (అధికారం చూసే విధానంలో నాటికీ నేటికీ మార్పు వచ్చిందని నేను భావించను.)
___డా.మల్లిఖార్జున్ ఆకాశవాణి వరంగల్..9
మల్లిఖార్జున్ గారూ మీ స్పందన బాగున్ది కృతజ్నతలు మీకు.
Very wonderful repply sir. Gayalu maaninavi Machhalu migilinavi Gayala machhalay Gnapakalu gurutulu….
……..prof.Rameswaram. Kakatiya university Warangal…9
రామేశ్వరం గారూ మీ స్పందనకు ధన్యవాదాలు.
ఆ వివక్ష ఉన్నన్ని రోజులు దేశం ఇంతే సర్ . మీరు వారికి ఇచ్చిన సమాదానం ఆయన కళ్ళు తెరిపించింది. మనిషిలో మార్పు తెచ్చింది. అయితే ఇప్పటికీ వాడు మా వాడు అనే రీతి చాలా దగ్గర ఉంది. నేను మాత్రం ఉద్యోగంలో చేరిన తరువాత నాకు సన్నిహిత మిత్రుడైన నా స్నేహితుడిని వాడు చెప్పేవరకు నేను కులం అడగలేదు. వాడు చెప్పిన తరువాత నాతో అన్నాడు. నీకు నా కులం అడగాలనిపించలేదా అని? కులం చూసి స్నేహం చెస్తె అదిస్నేహం కాదు. అవకాశవాదం అని చెప్పా వాడికి. గత 23 సంవత్సరాలుగ కొన్ని విషయాలలో ఇద్దరిమద్య కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నా ఇప్పటికీ మా స్నేహం కొనసాగుతుంది అంటే కులం పట్టింపులేకపోవడమే. ఇన్నిరోజుల తరువాత మీ రచన మూలంగ పాత ఙ్ణాపకాన్ని గుర్తు చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సర్ . అలాగే మీ అనుభవం ఇంకా ఆ భ్రమలలో ఉన్న కొందరి కళ్ళు తెరిపిస్తుందని నా ఆశ.
సాగర్ మీ స్పందన చాలా గొప్ప గా విశ్లేషణాత్మకంగా వుంది. మీ అనుభవమూ చాలా గొప్ప ది. ధన్యవాదాలు మీకు
మీరు ఏమిటోళ్లు అని అడిగే వాళ్లు ఇంకా ఉన్నారు. Sir. కాలం మారినా కొంత మంది మారరు.. అలాగే మీతో నేను మెదిలిన ఆ రోజుల ను నేను మర్చి పోలేను .సర్. మీ తరువాయి rajkumar సర్.
____కె.రమేశ్ ఎయిడ్స్ కౌన్సిలర్ మహబూబాబాద్.
రమేశ్ నీ స్పందనకు ధన్య వాదాలు
Caste discrimination is in the mind set of people. When their desires are not satisfied, they use this weapon as a solace. Ambedkar the great scholar had experienced the caste discrimination. When people are in last stages of their life and needs blood infusion, they won’t see blood belongs to which caste. Thank God blood banks are not displaying the caste on the bottles Any how very good article. Eye opening. I seek many more good articles from you.
Thank you My dear brother For your Detailed analysis On my article.
నమస్కారం సార్👏👏👏 మీ కలం నుంచి జాలువారుతున్న జ్ఞాపకాల పందిరి పాఠకులకు, మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు ఒక మధురమైన జ్ఞాపకం . ఒక ఉన్నతమైన సమాజ ఉద్ధరణ కు సంబంధించిన ఉద్యోగంలో ఉన్న మిమ్మలను కులం గురించి ప్రస్తావన తెచ్చిన తోటి ఉద్యోగి ఒక మూర్ఖుడు నిజానికి మిమ్మల్ని చూడగానే చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తిగా ఎవరైనా గుర్తించవచ్చు. కానీ ఆ నాడు జనగామ ఆసుపత్రిలో మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు జరిగిన సంఘటన బాధాకరం. అయినా ఇప్పటికీ సమాజంలో కుహనా సంస్కారులు లేకపోలేదు. కుల అసమానతలు,ప్రస్తావనలు పో లేదనడానికి గత సంవత్సరం మిర్యాల గూడెం లో జరిగిన సంఘటనే ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఏది ఏమైనప్పటికీ కవిగా, రచయితగా మీ రచనా శైలి అద్భుతం .ఇదే క్రమంలో వెలువడుతున్న జ్ఞాపకాల పందిరి మీ ఆటోబయోగ్రఫీ కి మూలాధార రచనకు శ్రీకారం అవుతుందని ఆశిస్తూ రేపటి సంచిక కోసం ఎదురు చూస్తూ ఉండే మీ శ్రేయోభిలాషి డా. గడ్డం వెంకన్న.👏👏👏👏👏
___Dr.Gaddam Venkanna Hanamkonda.
Dr.venkanna Garu Thank you somuch for your analysis of the article.again next sunday with other topic.
Dr.Prasad Garu! Kulavyavastha mana Telugu Rashtrallo yeppatnincho vrellunikuni vundi! Maree mukhyamgaa Ekkkuvagaa Andhra Pradeshlo !! Prabhuthvam Enni chattaalu chesinaa manushllo maarpu raanantha varaku,ee kulaala Kumpati ragulu thoone vuntundi !! Maarpu kosam yeduru chooddam thappa yemi cheyaleni dusthithi manadi ….
అవును సాంబశివరావు గారూ నిజమే!!
ప్రపంచంలోనే ఎక్కడలేని అమానవీయ కులవివక్షత మన దేశంలో ఉంది. వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా మన సామాజిక వ్యవస్థలో కులవ్యవస్థ నేటికీ బలీయమైన దిగానే ఉంది. అంతేకాదు.. బాగా చదువుకున్న కొందరిలోనూ ఆ భావజాలం అలాగే ఉందనడానికి మీ అనుభవమే ఉదాహరణ.. ఈ కుల వివక్షత మెట్ల వ్యవస్థ అంతం అయ్యేది ఏనాడో..
____వెంకట్రామ నరసయ్య సీనియర్ రిపోర్టర్…ఈ నాడు మహబూబాబాద్ జిల్లా
VRN…గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. ఓపికగా చ దు వు తు న్నందుకూ కృత జ్నతలు
నాకు చాలా సార్లు ప్రాంతీయ వివక్షత ఎదురైంది. మీ జ్ఞాపకాలు చదివితే అవి గుర్తుకొస్తున్నాయి.
డాక్టర్ గారూ, ఆయా సందర్భాలలో మీవంటి సహృదయులూ, సంస్కారవంతుల మనసులు ఎంత గాయపడతాయో అర్థం చేసుకోగలను. ప్రతిభకి కులం అడ్డగోడ ఎప్పటికీ కాదు. నా జీవితంలో నేను ఎవరినీ కులం గురించి ప్రశ్నించలేదు. నవ్వుతూ పలకరించే ప్రతి వ్యక్తి తో ఆనందంగా మాట్లాడి స్నేహం చేస్తా. దానికి నిదర్శనం దశాబ్దానికి పైగా సాగే మన అనుబంధమే.
ఇది నిజం సరసి గారు. మీ స్పందనకు ధన్యవాదాలు
మామయ్య, ఆయన అడిగిన ప్రశ్నకు నాకు చాలా బాధ అనిపించిది. కాని మీరు చెప్పిన సమాధానము చదివి వారెవ్వా! సూపర్ అనిపించిది.ఏటి గట్టా మాజాకా. కాని తరువాతి కాలములో మీరు స్నేహితులు కావటం చాలా సంతోషం.
Ashok, సూక్ష్మంగా భలే చెప్పావ్. అభినందనలు
[24/05, 13:42] MANJULA M. DR: That’s why our batch is very nice. We never bothered about anyone caste and never discussed about the same. But your experience is entirely different. I can’t believe it. It is not healthy sign. [24/05, 13:46] MANJULA M. DR: But everyone is bothered about it and especially in politics. Voters are deciding the party on the same basis. It will be much more in smaller states. Caste feeling was there in combined state also but much more after divided into two states. [24/05, 13:47] MANJULA M. DR: I feel it is unfortunate to speak so.
______Dr.M.Manjula.MDS Rtd.professor Hyderabad
Dr.garu, Thank you somuch For your lengthy Response.
ఆచారాలు, సంస్కృతి సమాజం పోకడ అనేది మనకు తెలియకుండానే మనమీద ప్రభావం చూపుతుంది ఆ సంఘటన మూలం అదే అయితే ఆ ప్రభావం నుండి బయట పడడమే చైతన్యం అంటాం, చదువు, వృత్తి వేరు సామాజిక చైతన్యం వేరు ఆ సంఘటన ను ఈ కోణం నుంచి అర్థం చేసుకోవచ్చు
___నిధి* కవి_అరసం హనంకొండ.
Kavi garu, Thank you somuch.
మీ జ్ఞాపకాల పందిరి-7 చదివాను. నో కామెంట్స్.తిరిగి ఏమి రాయలో నాకు రాదండి.అందుకే ఏమీ రాయలేక పోతున్నాను క్షమించండి.మీకు కామెంట్స్ రాసే వారందరూ సాహిత్యములో ఉద్దండులు అలాంటి వారి ముందు నేను ఏమి రాయగలను చెప్పండి. నాకు రాదు కూడా. ఒకేనండి.
_____భారతి.ఈద సరిపల్లి ప .గో.జి
కనీసం చదివినందుకు ధన్య వాదాలాండి
వృత్తిరీత్యా ఉన్నతస్థాయిలో ఉత్తమ బాధ్యతలు నిర్వర్తించిన వారికికూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురుకావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. వివక్షలు పోవాలంటే విలువలు పెరగాలి. అందుకు కలమే జనులను జాగృతం చేయాలి. ఆ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నానికి, వేస్తున్న జ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక అభినందనలు.
ఎలూజై… ధన్యవాదాలు మీకు
____R.Eluzai Evangelist Bheemuni Putnam.
Br.Eluzai Thank you somuch
చేదు జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడటం ఎంతటివారికైనా తప్పదు .. అవి ఏవో కేవలం బాధ్యతలపరమైనవో , వ్యక్తిగత వైఫల్యాలపరమైనవో అయితే వేరు … కాని పాతబడ్డ భావాల వాసనల తో పుట్టుకలను అవమానించే విషయసంబంధులైతే మాత్రం జీవితాంతం మనల్ని వదలవు.. మనిషి ఎదుటివాణ్ణి కులం కొలతల తో కొలిచి నిర్ణయాలకు వస్తే దానికన్నా నీచత్వం లేదు .. కరుడుగట్టిన మూర్ఖత్వానికి పరాకాష్ఠ… ఆధునిక మానవ సమాజం ఈ ఇరుకు గోడల్ని బద్దలు కొట్టి పురోగతి సాధిస్తున్న క్రమం లోనూ ఇటువంటివి అత్యంత బాధాకర సంఘటనలుగా మిగిలిపోయి గుండెకు గుచ్చుకుంటుంటాయి .. మహాకవి జాషువా గారికే ఇట్లాంటి భయంకరానుభవంతప్పలేదు .. అప్పటిదాకా ఆయన కవితామాధుర్యాన్ని తన్మయత్వంతో ఆస్వాదిస్తూ “ మీదేకులమన్న ప్రశ్న వెలయించి , చివుక్కున లేచి పోయినన్ బైకున గ్రుమ్మినట్లగును.. “ .అన్నాడంటే అదెంత బాధాకరమో అర్థమవుతున్నది మీరు ఏనాడూ ఎదుర్కొనని , ఎదుర్కుంటానని అనకోవడానికి వీలు లేని సందర్భం మీకు ఆశ్చర్యం ,అభిమానం , కోపం రావడం అత్యంత సహజమైన లక్షణం .. తగినట్లుగానే సమాధానమివ్వడం కూడా సహజమైన ప్రతిస్పందనే …. ఇక్కడ ఒక్కవిషయం ఉంది … ఒక బాధ్యత గల వృత్తి నిర్వహిస్తున్న ఉన్నత విద్యవంతుడైన వ్యక్తి నోటినుండి ఇటువంటి ప్రశ్న రావటం ప్రశ్నార్థకమే !! మనం ఆయన చదువును శంకించాలా ? ఆయన సంస్కారాన్నా ? అంటే నిస్సంశయంగా ఆయన సంస్కారాన్నే అనేదే సరైన సమాధానం … కాని తప్పు తెలుసుకొని సరిచేసుకోవడం మాత్రం ఉత్తమ సంస్కారం దిశగా ప్రస్థానించడమని భావించవచ్చు .. జాషువా గారి ఆశయమైన “!కుల మతాలకు కట్టుబడని విశ్వనరుని” గా మనిషి ఎదాగాలన్న భావం రాబోయే తరమైనా నిజం చెయ్యడానికి మీ జ్ఞాపకం దారిచూపాలని అభిలషిస్తున్నాను
గురువు గారూ.. మీ ఆత్మీయ స్పందనకు విపులీకరించిన విధానానికి ధన్య వాదాలు సర్ మీకు
ఎంత మనస్సు చిన్న బుచ్చుకొనే అంశమైనా ఆత్మవిశ్వాసం కలిగిఉండడం ఎంత ముఖ్యమో…ఆ ఆత్మవిశ్వాసం చదువు,వృత్తి పట్ల నిబద్ధత,నిజాయితీ ద్వారానే వస్తుంది మనం ఎక్కడ పుట్టినా …ఎవరి మధ్య మసిలినా అని తెలిపిన ఈ వాస్తవ ఘటన ఎంతో విలువైనది సర్🙏💐💐💐
____డి.నాగ జ్యోతి శేఖర్ కాకినాడ తూ గో జి *
జ్యొతీ మీ స్పందన కు ధన్యవాదాలు
మంచి గుణపాఠం చెప్పిన వ్యాసం.ఫ్యూడల్ culture nu ఎదుర్కొన్న విధం స్ఫూర్తి వంతం ధన్యవాదాలు 🙏
_____డా.డి.సుజాత విజయవాడ
ధన్యవాదాలు డాక్టర్ గారూ….
Gyaapakaala pandhiri 7 Prabhutva udyogulu vidyaavanthulu, antho intho raajyaanga lakshyaalu erigina vaaru. Ayinaa prajaasvaamika bhaavanalanu manasuk ekkinchukunna vaaru arudhu. Vidya tho udyogaanni pondhaare kaani, samaajaanni nyaaya sammatham ga avagaahana paruchukunna vaaru, maanaveeyatha ku praadhaanyam ichhe vaaru kula sankuchitaalanu ďhaati raaleka poyina vaaru kokollalu . Meeru raasina vivaksha, kaalaanugunam ga maarpulaku guri avuthu vachhindhe kaani samasi poledhu. Chaala aasaktikaram ga chitrinchaaru aa naati kula vivaksha ghatana.
___Ghanta Rami reddy Literary critic Hanamkonda
Ramireddy sir, Thank you somuch For your detailed Remarks about This article.
నా కవితా వధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపు రే ఖా కమనీయ వైఖరుల్ గాంచి, ‘భళి భళీ యన్నవాడె’ మీ దేకుల, మన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో బాకున గ్రుమ్మి నట్లగును పార్థివ చంద్ర! వచింప సిగ్గగున్ జాషవా గారి పద్యం గుర్తుకు వచ్చింది. మీ వేదనకు అర్థముంది. ఎందుకంటే అలా అడగడం దురదృష్టం. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు అలా మాట్లాడినా అది సాధరణీకృతం కాదన్నది నాభావన. ఆధునిక వ్యవస్థలో ప్రస్తుతం అది వ్యక్తిగతమే.ఒకనాటి సామాజిక జాడ్యం సడలిపోయిందని నాభావం కానీ తనువున విఱిగిన యలుగుల ననువునబుచ్చంగవచ్చు.నతినిష్టురతన్. మనమున నాటిన మాటలు వినుమెన్ని యుపాయములవెడలునెయధిపా అన్న తిక్కనార్యుని పలుకులు సత్యం ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమించిన ప్రసాద్ గారు అనుభవాలశిఖరం
Yes sir It is there. Thank you somuch. రెండు ఆణి ముత్యాల వంటి పద్యాలు అందులో పొ ద గ డం చాలా బావుంది.ధన్యవాదాలు మీకు.
[24/05, 23:03] Dr. P Sugunakar/ Janagoan: బాగుంది అన్నగారు మీరు రాసిన కథ బాగుంది అవును క్యాస్ట్ అడిగిన డాక్టర్ నీ ఫోటో లో బంధించారు అప్పుడే చెప్పి ఉంటే..!! 💪 _____డా.పి.సుగుణా కర్ రాజు, సీనియర్ డాక్టర్ జనగాం జిల్లా ఆసుపత్రి జనగాం.
బ్రదర్ మీ స్పందనకు ధన్యవాదాలు
మీరు చూస్తుండగానె సమస్య మొలిచింది
సీరియస్‌గా నిలిచింది చివరకు తలవంచింది
నిజంగా ఇప్పటి వరకు మీ జీవితంలో..మరపురాని సన్నివేశం… రాసిన తీరు సందర్భాన్ని రక్తీ కట్టించింది.
___k.kumara swami Poet& sr.journalist WARANGAL_U/Hyderabad
మీ కవితాత్మక స్పందనకు ధన్య వాదాలు కుమార స్వామి గారు.
ఇది మన దేశానికి తరతరాలుగా పట్టిన జాడ్యం.. మన అగ్రకులాలవారి నరనరాన జీర్ణించుకుపోయిన అహం… మీరేమిటోళ్ళు అని ప్రశ్నించటానికి చదువుకున్నవారు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికీ మా అమ్మగారు నా స్నేహితులెవరయినా వచ్చి వెళ్ళాక వాళ్ళేమిటోళ్ళే అని ప్రశ్నిస్తారు. మనిషి ఔన్నత్యానికి కొలమానం గుణమే కాని కులం కాదని గ్రహించరు. అయితే ఒక డాక్టరు హోదాలో వున్నవాడిని కూడా అడగటం మటుకు ఆశ్చర్యమే🤔🤔🙄
ఝాన్సీ గారూ మీ నిశ్కల్మశ స్పందన అభిననంద నీయం. ధన్య వాదాలు మీకు.
Good morning Dr Prasad garu Very good experience in your career one good thing I have one Cristian friend one Muslim we three are going every where.they put Three Mascatairs (thee monkeys) name my father also not asking to his employees what is your cast for job they won’t ask specific cast.all are equal in our society men and women only
_____S.Rajeswara rao Hyderabad (Nagarjuna sagar)
Rajeswara rao garu Thank you For your Response *
[25/05, 08:23] Bulli(Lakme Nandana): Don’t know when this discrimination ends.Very sad to hear about your experience in this regard. [25/05, 08:25] Bulli(Lakme Nandana): I teach my students not to value persons by their caste [25/05, 08:27] Bulli(Lakme Nandana): Some where everyone will come across such discriminations but we should keep on going by proving ourselves
____mrs.Laxmi Nandana English teacher Rajahmundry
👌👍 శాస్త్రసాంకేతిక రంగాల్లో మనం సాధించిన ప్రగతి ఉహించలేనిది. అయితే అది ఇప్పుడు వరమా? శాపమా? అనే సందిగ్ధం లో మానవాళి పడింది. కారణం శాస్త్రవిజ్ఞానం ఏస్థాయిలో పెరిగిందో ఏస్థాయిలో మానవత్వం పెరగలేదు సరికదా తిరోగించింది అని చెప్పొచ్చు. మనుష్యుల మధ్య భేదాలను పెంచి లాభపడే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. మానవత్వం పెంచడం ఒకటే మార్గమని నాఉద్దేశ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమేమో అనిపిస్తుంది. నాలో ఉన్న అహంకారం సాటి మనిషిని సమానంగా చుడనివ్వదు. ఏకులమైనా, మతమైనా, దేశమైనా. సొంత తమ్ముణ్ణి కూడా వివక్షత తో చూస్తారు. . మీలాంటి విజ్ఞులు సమస్య పరిష్కారం చూపాలి.
.___Er.Satyanarayana B H E L Hyderabad
సత్యన్నారాయణ గారూ మీ స్పందన అమోఘం ధన్యవాదాలు మీకు
సార్ నమస్తే! మీ కులమేంటి అనడిగిన ఆయనకు మీరు చెప్పిన ఘాటైన సమాధానం చెంపపెట్టులా ఉంది (తప్పుగా భావిస్తే క్షంతవ్యురాలిని). కులసమస్య సమసిపోయినపుడే సమాజం బాగు పడుతుంది సార్. పేరుకే మనది ప్రజాస్వామ్య దేశం. ఏ స్థాయిలో ఉన్నా కులవివక్ష వలన నేడు సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా మీరు, ఆయన స్నేహితులుగా మిగలడం కొసమెరుపు. చాలా బాగుంది సార్. 👌👏🙏💐
_____ఆకునూరు విద్యా దేవి రచయిత్రి హనంకొండ
అమ్మా.. మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు.
జనగామ డాక్టరుకు మీరు అంటించిన సున్నితమైన చురకలు వారిలో మార్పుకు దోహదపడ్డాయి,అందుకు మీకు ధన్యవాదాలు.అయినా అభివృధ్ధి చెందుతున్న మన దేశంలోఈ కులవివక్ష తుడుచుకు పోవటమన్నది చాలా కష్టమన్నది నా భావన.
___బొందల నాగేశ్వర రావు రచయిత చెన్నై*
అవును… మీరన్నది నిజం. ఏమో మార్పు వస్తుందేమో. ఆశా జీవులుగా వుందామ్. మీ స్పందనకు ధన్యవాదములు.
wonderful storys sir కథ వ్రాయడానికి కలము అవసరం,కవిత వ్రాయడానికి కసి తో కూడిన మనస్సు అవసరం,వీటితోపాటు ప్రోత్సాహించే వ్యక్తులు అవసరం.అదే మీకు కిరీటం సార్
_____రేవ్.ఎం.గాబ్రియేల్ బాప్టిస్టు చర్చి గుంటూరు *
పాస్టర్ గారూ మీ అమూల్య స్పందనకు ధన్య వాదాలు.
Sorry br… నీకు ఇలాంటి అనుభవం ఎదురు అయినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఇది హర్షించదగినది కాదు.. ఉపేక్షించకుండానువ్వు చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది. బాగా చేసారు
_____డా.బి.ఎం.ఎస్.శంకర్ లాల్ సీనియర్ డెంటల్ సర్జన్ చందా నగర్ హైద్రాబాద్
సొదరా… నీ స్పందనకు ధన్యవాదాలు.
ఇలాటి అనుభవాలు మనఊరిలో చాలా జరిగాయి ఉదాహరణకు రాంర్లంక హోటల్‌కు వెళితే ప్లేటు కడిగేట్లయితే ఇస్తామనేవారు లేకపోతేసత్తుప్లేట్లో ఇచ్చే వారు కొంతకాలానికి నేనుఇల్లు కడుతున్నాను సేమ్ పర్సెన్ తాపీ పనికివచ్చాడు మనింటిదగ్గరే అన్నం తినే పరిస్థితి వచింది ……ఇలాటి సంఘటనలు ఈమధ్యకాలంలో చాలా జరినవి ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఎలావున్నారు అంటుంటాడు గతంలో అరేఒరే అనేవారు ఇప్పుడేమో మర్యాదగా పిలుస్తున్నారు ఇప్పుడు జ్ఞాపకాల పందిరిలో మీఅ నుభవాలు చెబుతుంటే నాకదే గుర్తుకొచ్చింది.
_____కృష్ణ మూర్తి.కానేటి హైదరాబాద్ (దిండి )
తమ్ముడూ నీ స్పందనకు ధన్యవాదాలు
బాగుంది మిత్రమ మీ దోస్తీ ములాఖాత్ సందర్భం🌷👍
_____శ్రీ బేగ్. ….. హిల్ కాలనీ నాగార్జున సాగర్
ధన్య వాదాలు మిత్రమా మీ స్పందనకు.
Superrrrrrrrr Article It’s a lesson for So many intellectuals, employees, literates n illiterates.
Hats off …… Written out…. In Gnapakalu with Dare n Dash.
……….డా.ఓ .నాగేశ్వర రావు హైదరాబాద్.
Thank you somuch Doctor.
7thepisode చదివాను. నా ప్రాణ స్నేహితురాలు Glory.Helen హేమలత. ఎంబీబీఎస్ అని నేను ఇటు వచ్చా. తను ఖమ్మం లోన్ బీఎస్సీ ఎమ్మెస్సీ చేసింది. Anatomy exams lo vunduga. Vuttara lu తగ్గినవి. …. కొన్ని ఏ ల్ల తరువాత నేను m gm lo jog ఒకరోజు tubectomy చేస్తుండగా. Assist chese dr tho edo.topic lo church compound lo maa friend glory ఉన్నదన్న. అతను చెప్పిన మాట విని షాక్. ఆవిడ మా ఆంటీ. చనిపోయారని. …. విషాదం ఏమిటంటే తను పింగిలి college lo zoology lecturer ga చేసిందని ఒకే వూరిలో వుండి. Kalusukolekapoyanu. తను dr విశ్వనాథ్ mrs colleges. Chaala.rojulataruvata. తెలిసింది. ఫోటో చూడ గలిగా. . . కళ్ళు chamrchutunnavi. మా ఇంట్లో. గ్లోరీ ను అభిమానించేవారు.
. _______Dr.Anjani devi Kalyani Nursing home HANAMKONDA
డాక్టర్ గారూ మీ స్పందనకు ధన్య వాదాలు.
Ayya,new gnapakalapandiri make Sagan chadukone bhagyam dorikindi. Rachiyata Anati Agra Vargala mentality Chaduva galigamu. Equal stage lo undi kuda meru yeduti variki yechina gowravam rachyeta vyaktitwam Chala Bagundi.migilina Bagam yepudo. Chandrasekhar Dondapati. Vanastalipuram. Hyd.
శేఖర్, నీ స్పందన కు హృదయ పూర్వక ధన్యవాదములు
డాక్టరుగారు.. చాలా బాగా చెప్పారు.. అందరికీ జీవితంలో అపుడో ఇప్పుడో జరిగినదే మీరు చాలా బాగా వివరించారు. కొంత మందికి ఉండకపోవచ్చు కానీ పూర్తిగా కుల వివక్షత ఎన్నటికీ పోదు మన దేశంలో.. మీరన్నట్టు ముఖ్యంగా ఓటు బ్యాంకు గా కులాన్ని వాడు కున్నంతకీ.. కుల వివక్షత లేని దేశం కోసం ఆశిద్దాం..
నీలిమ గారూ మీ స్పందన కు ధన్యవాదాలు
Sir generally illu rentki adiginappudu meeru emitollu ani adagadam rivaju kani meeku ekanga work place lo ila edurukavadam chala badhedindi iana meeru chivaraki atanitone friendship chesi ajathasatruvu ga nirupinchukunnaru anduku mimmalni abhinandinchakunda ela undali cheppandi?
_____sri hari Librarian All India Radio Warangal
శ్రీ హరి గారు, మీ స్పందన కు ధన్యవాదాలు
Mee laantivari anubhavale maalanti variki pathalu sir 🙏🙏🙏
_____శ్రీహరి ఆకాశవాణి వరంగల్
మనుషులంతా ఒక్కటే అందరిలో పారే రక్తం ఒకటే అయినా పాత కాలం లో ఈ పట్టింపు మరీ పట్టీ పట్టీ మనసును అతలాకుతలం చేస్తుందని చెప్పడానికి మీ అనుభవమే ఒక పెద్ద ఉదాహరణ సార్. అయినా ఆ సంభాషణను తేలికగా చేసి స్నేహం గా మార్చి క్రమశిక్షణ, సేవాభావం, కలుపుగోలుతనం వృత్తి పట్ల సేవాభావం ఉంటే ఇలాంటివి ఒకరిపై నొకరిని బాధ పెట్టవనే మీ నిండైన మనస్తత్వానికి హృదయపూర్వక అభినందనలు సార్ మీ ప్రతి ఙ్ఞాపకం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నది వారం వారం అందరికీ ఉంటాయి ఙ్నాపకాలు కానీ మీలాంటి గొప్ప వారి ఙ్ఞాపకాలు సమాజానికి స్ఫూర్తి దాయకం సందేశాత్మకం .మీ మరొక ఆసక్తికరమైన ఙ్ఞాపకాల పందిరి కోసం ఎదురు చూస్తుంటాం 🎍🎍🎍🎍🎍🙏🙏🙏🙏🙏 మొహమ్మద్ అఫ్సర వలీషా ద్వారపూడి తూ .గో. జి.
అఫ్సర్ వలీషా గారు మీ హృదయ పూర్వక స్పందనకు ధన్యవాదాలు.
సామాజిక సమస్యలని స్వాతంత్ర్యానికి ముందు. తరువాత ఎలా ఉన్నాయో. లోతుల్లోకి వెళ్లి చక్కగా. విశ్లేషించారు..స్త్రీలకు విద్య సామాజిక న్యాయం చాలా కల్పించామనే. భ్రమ లో ఎన్నో రెట్లు ఏ విధం గా అన్యాయం జరుగుతోందో. చక్కగా ఎత్తి చూపారు..
కులం పెరు తో ప్రతిభ ని. అణగ ద్రొక్కి సామాజిక అసమానతలని. మరింతగా పెంచుతూ, యువతరం విదేశాలకు ఎందుకు వెళుతోందో విశ్లేషించి. చూపారు..
ఇక ఓ.తోటి డాక్టర్ గారి మనస్తత్వం సమాజం లోని. కొందరి సంకుచిత దృక్పధానికి, మానసికం గా వెనుక బడిన మనస్తత్వానికి ప్రతీక గా నిలుస్తుంది..
అహంకారం. ఎన్ని రూపాల్లో ఉంటుందో… తోటి. స్నేహితుడి లోని. గుణం స్వభావం వ్యక్తిత్వం సౌజన్యం ఔన్నత్యం మంచితనం మాత్రమే చూసే. స్నేహితులందరో…
మీ వ్యక్తిగత ఉదాహరణ కొందరి నైనా తప్పక ఆలోచింప చేస్తుంది….
అభినందనలు…సర్..
____డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్ సాహిత్య వేత్త వరంగల్
సర్…బిజీగా వుండి కూడా చక్కగా స్పందించారు.అందుకే మీ వంటి పెద్దల మాటల కోసం ఎదురు చూడడం.ధన్యవాదాలు డా.ప్రసాద్ గారు.
Gnapakala pandiri lo “Meeremitollu” sheershika chadivanu.Bagundi.Mana deshamlo kulavivaksha prajala manasikathalo ela antarbhagamayindo mee anubhavallonchi baga chepparu.
____Mettu Ravinder Poet,critic&Lecturer in English Warangal.
రవీంద ర్ గారూ మీ స్పందనకు ధన్య వాదాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™