241 దినాంతంలో నా పాటల రేవు ఎక్కడనుంచి నేను చూడగలుగుతానో ఆ ఆవలి తీరానికి తీసుకుపోతుంది
242 పూవునుండి పూవుకి ఎగిరే సీతాకోకచిలుక ఎప్పటికీ నాదిగానే ఉండిపోతుంది నేను వలపన్ని పట్టిందే నేను కోల్పోతాను
243 నీ స్వరం, విడుదలైన పక్షి, నిద్రిస్తున్న నా వలని చేరుతుంది నిద్రమబ్బులో నా రెక్కలు మేఘాల పైనున్న కాంతిని చేరుకున్నట్టు కలగంటాయి
244 జీవితం ఆటలో నా వంతు అర్థాన్ని నేను కోల్పోతాను ఇతరులాడే అంశాలు నాకు తెలియవు గనక
245 పూవు తన రెక్కలన్నింటినీ రాల్చి దాని పండుని కనుగొంటుంది
246 పూలతేనె గ్రోలేందుకు ఎప్పుడూ తిరిగొచ్చే దక్షిణగాలి ఆనందం కోసం నా వెనక నా పాటల్ని వదిలేస్తాను
247 మట్టిలో కలిసిపోయిన ఎండుటాకులు అడవి జీవితంలో పాలుపంచుకుంటాయి
248 శబ్దాలు నిశ్శబ్దాల నుండి మనసు దాని పదాల్ని కోరుకుంటుంది వెలుగుచీకట్ల నుండి ఆకాశంలా
249 కనిపించని చీకటి తన మురళి వాయిస్తే నక్షత్రాలు, సూర్యుళ్ల లోకి ఆలోచనలు, కలల్లోకి కాంతిలయ సుడిగాలిలా చేరుతుంది
250 నాకిష్టమైనవి నిన్ను గానంచేసే పాడుకునే నా పాటలు
251 నిశ్శబ్ద స్వరం నా పదాల్ని స్పర్శించినపుడు అతను నాకు తెలుసు కావున నాకు నేను తెలుసు
252 నా అసంపూర్ణత తెలిసినా ఎవరైతే నన్ను ప్రేమించారో వారికి నా అంతిమ అభినందనలు
253 కానుక ఇవ్వలేనిది ప్రేమ అది అంగీకారానికే నిరీక్షిస్తుంది
254 మృత్యువు వచ్చి నాతో గుసగుసలాడి నీ రోజులు ముగిసాయన్నపుడు నేను అతనికి చెప్పనీ, నేను కేవలం కాలంలో కాదు, ప్రేమలో జీవించానని అతను అడుగుతాడు, నీ పాటలు నిలుస్తాయా అని నాకు తెలియదని, నేను పాడినపుడు నాకు తెలిసినదల్లా నా శాశ్వతత్వం తరచు దొరికేదని, నేను అంటాను
255 నా దీపాన్ని వెలిగించనీయనీ అంటుంది నక్షత్రం ఎన్నడూ వాదించకు చీకటిని తొలగించేందుకు అది సాయపడుతుందా అని
256 నా ప్రయాణం ముగింపుకి ముందు నాలోకి నన్ను చేరుకోనివ్వు అంతా ఒకటే అయిన అతను మార్పు గతి ప్రవాహం మీద జనసమూహంలో తేలుతూ కొట్టుకుపోతూ బాహ్య ఆవరణని విడిచిపోతున్నాడు
(సమాప్తం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S. కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు. అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు. వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-38
రెడ్నం సత్యవతమ్మ స్మారక జాతీయ స్థాయి కవితా పోటీ ఫలితాలు
శ్రీపర్వతం-1
శిఖరాగ్రం
కాళీ – తెలుగుభాష
జ్ఞాపకాల పందిరి-123
మానస సంచరరే-46: ‘మాట’ కచేరీ!
మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం
కాజాల్లాంటి బాజాలు-63: వాట్సప్ వీడియోలు..
గతి
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®