16 నిర్జీవ గతం గుడికి అర్చకురాలులా ప్రస్తుతాన్ని చంపి జ్ఞాపకం తన హృదయాన్ని సమర్పిస్తుంది
17 గంభీరమైన చీకటి గుడినుండి మట్టిలో ఆడుకుందుకు పిల్లలు పారిపోతారు దేవుడు వాళ్ల ఆటను చూస్తూ పూజారిని మరచిపోతాడు
18 సెలయేరులా దాని సొంత ఆకస్మిక నీటి వివరణకి మరోమారు చేయని ఆలోచనల ప్రవాహంలో నా బుద్ధి ఏదో మెరుపుకు తుళ్లిపడుతుంది
19 దాని సొంత ఎత్తు తెలుసుకుందుకు కొండలో నిశ్శబ్దం పైకి లేస్తుంది దాని లోతు చూసుకుందుకు సరస్సులో కదలిక ఆగిపోతుంది
20 కళ్లుతెరవని ఉదయం కళ్లమీద పోతూపోతూ రాత్రి పెట్టిన ఒక్క వీడ్కోలు ముద్దు వేకువ నక్షత్రాన్ని వెలిగిస్తుంది
21 కన్య అందం తెలుసుకోలేని ఉద్విగ్న రహస్యం ఇంకా పక్వానికి రాని పండులాంటిది
22 తన జ్ఞాపకాన్ని కోల్పోయిన దుఃఖం నోరులేని చీకటి సమయంలా పక్షి పాటలైనా లేని కీచురాయి శబ్దం లాంటిది
23 మతాంధత నిజాన్ని చేతిలో భద్రపర్చుకుని పిడికిలితో దాన్ని చంపుతుంది దుర్బల దీపానికి ధైర్యంగా తన అన్ని నక్షత్రాల్నీ రాత్రి ఘనంగా వెలిగిస్తుంది
24 తన బాహువుల్లోనే భూవధువు ఉన్నా అందనంత దూరంలో ఆకాశం ఉంటుంది
25 అనుచరులనుండి దేవుడు ప్రేమను కోరతాడు బానిసలనుండి దెయ్యం విధేయత కోరుతుంది
26 చరిత్ర ధూళిలో కలిసిపోకుండా నిత్యయవ్వన కాలరహస్యంలోనే శిశువు నిత్య నివాసం
27 సృష్టి మెట్లమీద ఒక చిరునవ్వు సమయాన్ని దాటిస్తూ వేగంగా తీసుకుపోతుంది
28 ఉపకారానికి బదులుగా చెట్టుని తనతోనే కట్టి ఉంచుకుంటుంది నేల ఆకాశం ఏమీ అడగదు స్వేచ్చగా వదిలేస్తుంది
29 తళతళ మెరుస్తున్న క్షణాల్ని తప్ప నిత్యమైనదానిలా వజ్రం వయస్సు పెరిగినా గొప్పలు చెప్పుకోదు
30 దూరపు బంధువైనా ఎవరైతే ఉదయం నా దగ్గర కొచ్చారో వారిని రాత్రి తీసుకుపోయాక వారు మరీ దగ్గరయారు
(మళ్ళీ వచ్చే వారం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S. కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు. అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు. వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మహతి-25
పెద్ద మనసు
నవమి – ఖండిక 4: పరోపకారము
జీవన రమణీయం-105
సాహిత్యంలో స్వప్న సృజన!
జీవనవాస్తవికతకే చాసో పెద్ద పీట
దివినుంచి భువికి దిగిన దేవతలు 20
నీతిగా ఉంటే..
సంచిక – పద ప్రతిభ – 125
హిమాచల్ యాత్రానుభవాలు-9
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®