అటు చూడు చెడు కర్మల శాస్త్రాలు ఇటు చూడు మూఢ నమ్మకపు నీడలు అటు వైపో వెర్రితనపు ఆవేశాలు ఇటు వైపో అహంకారపు వేషాలు మూసెయ్ ఒక్కో తలుపు మూసెయ్ మూసెయ్
అటు నవ్వు నటిస్తున్న వాళ్ళు ఇటు నటనలతో కవ్విస్తున్న వాళ్ళు నిన్ను మెట్టుగా చేసుకు నడిచెళ్ళే వాళ్ళింకోవైపు మూసెయ్ ఒక్కో తలుపు మూసెయ్ మూసెయ్
ఇటు నువు చాలా అవసరమని మోసే నోళ్ళు అటు వాడుకు పక్కకు తోసే జాదూగాళ్ళు ఇటు చూస్తే హఠాత్తుగా ఒలికించే ప్రేమలు అటు చూస్తే రెండు నాల్కల నాలుగు ముఖాల హైనాలు మూసెయ్ ఒక్కో తలుపు మూసెయ్ మూసెయ్
మూసెయ్ మూసెయ్ తలుపులు నీ నవ్వుకులికి పడేవాళ్ళపై పక్కకు తిరిగేడ్చే వీళ్ళపై నీ అతినమ్మకపు చాదస్తాల పై నీ అతి కారుణ్యపు హృదయం పై కూడా
మూసెయ్ మూసెయ్ తలుపులు ఒక్కొక్కటిగా త్వరగా అతి త్వరగా
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి. డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. drvijaykoganti2@gmail.com 8309596606
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అదృష్ట లక్ష్మి
TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ
“బదలా”: ఉత్కంఠ భరితం
దాతా పీర్-6
కంచికెళ్ళిన కొత్తకథ
కొత్త కలం
దేశ విభజన విషవృక్షం-18
జైత్రయాత్ర-10
మిర్రర్ మిర్రర్
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 15
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®