నేను చేరినప్పుడు కురవి కర్షక సేవా సహకార సంఘంలో సుమారు 1500 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 4000కు చేరింది. అందుకు తగ్గట్టుగానే ఋణ వితరణ మూడింతలకు పెరిగింది. ఇక స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణాల నిష్పత్తి 1:1కి చేరుకుంది. గ్రామాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడూ, ‘మీకు అండగా మేమున్నాము’ అంటూ సహాయ కార్యక్రమాలు చేస్తూ, నష్ట నివారణ చర్యలు చేపడుతూ, గ్రామీణ ప్రజలకు సాంత్వన చేకూర్చి, వాళ్ళ మనోస్థైర్యాన్ని నిలబెట్టింది మా సంఘం.
బలపాల గ్రామంలో జువారి అగ్రోకెమిల్స్ వారితో కలిసి ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో… రైతులకు శిక్షణ ఇస్తున్న ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం, లా ఫారం, గుంటూరు శాస్త్రజ్ఞులు డా. ఎ. సత్యనారాయణరెడ్డి గారు
మిరప పంట క్షేత్ర సందర్శన
మోద్గుల గూడెం గ్రామంలో స్పిక్ ఎరువుల కంపెనీ వారితో కలిసి ఏర్పాటు చేసిన రైతు శిక్షణా శిబిరంలో… రైతులకు శిక్షణ ఇస్తున్న ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం, మల్యాల, శాస్త్రజ్ఞులు, డా. పమిడి వెంకటేశ్వర్లు గారు
వరిపంట క్షేత్ర సందర్శన
నేరెడ గ్రామంలోని రచ్చబండ దగ్గరే, జువారి అగ్రోకెమిల్స్ వారితో కలిసి ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో… రైతులకు శిక్షణ ఇస్తున్న ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం, లా ఫారం, గుంటూరు శాస్త్రజ్ఞులు డా. ఎ. సత్యనారాయణరెడ్డి గారు
రైతుల కవసరమైన క్షేత్ర సందర్శనలను, శిక్షణా కార్యక్రమాలను పేరొందిన సంస్థలలో నిర్వహించడం, వ్యవసాయాభివృద్ధి కోసం వివిధ విస్తరణ కార్యక్రమాలను చేపట్టడం, తద్వారా పంట దిగుబడులు ఇతోధికంగా పెరిగేట్లు చూడడం, గ్రామాల్లోనే మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం, వెరసి, సంఘ పరిధిలోని గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో వుండేందుకు దోహదపడ్డాయి. అన్నింటికంటే అతి ముఖ్యమైన ఋణ వసూళ్ళ శాతం… ప్రతి సంవత్సరం 90 శాతం పైనే నమోదు అవుతుంది.
‘ఒక్కరోజులో అత్యధిక ఋణాల వసూళ్ళు’ రికార్డు సాధించిన రోజు, అప్పులు తిరిగి చెల్లించేందుకు వచ్చిన సంఘ సభ్యులతో కిక్కిరిసిన సంఘ కౌంటర్ హాల్ దృశ్యం
నేను చేరినప్పటికి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో వున్న కురవి కర్షక సేవా సహకార సంఘం, నేడు ప్రథమ స్థానంలో విరాజిల్లుతుంది.
ఇక నా వ్యక్తిగతంగా చూసుకుంటే, మొదట్లో మా రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారు నాకు చెప్పినట్లు, ఈ సంఘంలో నా విధి నిర్వహణ నాకెంతో సంతృప్తి నిచ్చింది. మరెంతో జాబ్ శాటిస్ఫాక్షన్ని నాకు మిగిల్చింది.
సంఘ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు రైతు వేషధారణలో వచ్చి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రా బ్యాంకు వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారిని, డప్పులతో, లంబాడా సాంప్రదాయ నృత్యాలతో, వేదికపైకి తోడ్కొని వస్తున్న సంఘ సభ్యులు
పెద్దలు అనుభవంతో కూడిన ఆలోచనలతో చెప్పిన మాటలు… అబద్ధాలు అవుతాయా!… అవనే అవవు! కలకాలం నిజాలుగా నిలిచిపోతాయ్!!
ఆ రోజు పదోన్నతి కోసం నన్ను ఇంటర్వ్యూకి హైదరాబాద్ రమ్మని ఆంధ్రా బ్యాంకు హెడ్డాఫీసు నుండి లెటర్ అందింది. మరో వారం రోజుల్లో ఇంటర్వ్యూ. ఆంధ్రా బ్యాంకు జాతీయం చేయబడిన తరువాత, అధికారుల గ్రేడ్లు జాతీయ బ్యాంకులతో సమానం చేశారు. ఆ ప్రకారం చూస్తే ప్రస్తుత గ్రేడ్లు ఇలా వున్నాయ్…
అంటే… ఇప్పుడు నేను మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్.2 (యమ్.యమ్.2) నుంచి మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ 3 (యమ్.యమ్.3) ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకి వెళుతున్నట్లు….
హైదరాబాదులో ఇంటర్వ్యూ జరిగింది. నాకు యమ్.యమ్.3 గా పదోన్నతి లభించింది. చాలా సంతోషించాను. ఇక బదిలీయే తరువాయి.
ఎక్కడికి బదిలీ అవుతుందా అని ఎదురుచూస్తున్న నాకు, మహబూబాబాద్ ఆంధ్రా బ్యాంకు బ్రాంచికి మేనేజరుగా పోస్టు చేసినట్లు ఆర్డర్ వచ్చింది. అప్పటి వరకు యమ్.యమ్.2 మేనేజరు స్థాయి బ్రాంచిగా వున్న మహబూబాబాద్, ఇప్పుడు యమ్.యమ్.3 మేనేజరు స్థాయీ బ్రాంచిగా అప్‌గ్రేడ్ అయినందున, నన్ను ఆ బ్రాంచికి యమ్.యమ్.3 మేనేజర్‌గా పోస్ట్ చేశారు. అంటే పదోన్నతి లభించినా నేను మహబూబాబాద్ లోనే కొనసాగాలి… ఎందుకిలా జరిగింది?… ఈ విషయం గురించి మరోలా ఆలోచించడం అనవసరం… అనిపించింది. ‘అంతయూ మన మంచికే’ అనుకుంటూ నన్ను నేను సంబాళించుకున్నాను.
ఉన్న ఊర్లోనే బదిలీ. పాత ఆఫీసు నుండి కొత్త ఆఫీసుకు దూరం కేవలం అరకిలోమీటరు మాత్రమే. మధ్యలో వుంటుంది మా ఇల్లు. దూరం తక్కువే గాని… అంతరం ఎక్కువే…
ఓ శుభ దినాన, ఓ శుభ ముహూర్తంలో, ఆంధ్రా బ్యాంకు మహబూబాబాద్ శాఖలో మేనేజర్‌గా జాయిన్ అయ్యాను.
మహబూబాబాద్ బ్రాంచి సిబ్బందితో… కూర్చున్నవారిలో ఎడమ నుండి కుడికి, మూడవ వ్యక్తి రచయిత. నాలుగవ వ్యక్తి పదోన్నతిపై బదిలీ అయి వెళ్తున్న మహబూబాబాద్ బ్రాంచి మేనేజర్ శ్రీ. పి. పూర్ణచంద్రశాస్త్రి గారు
గుమాస్తాగా గుంటూరు, ఒంగోలు శాఖల్లో; అధికారిగా రావులపాలెం శాఖలో పని చేసిన గత అనుభవం వుంది కాబట్టి మేనేజర్‌గా పనిచేయడంపై ఓ అవగాహన వుంది.
***
ఇక ఆఫీసు విషయానికొస్తే, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, ఒక పాత అద్దె భవనంలో వుంది. ఆంధ్రా బ్యాంకు శాఖ, బ్యాంకు కోసమే, స్ట్రాంగ్ రూమ్‌తో సహా, నిర్మింపబడిన ఒక కొత్త భవనంలో వుంది. సిబ్బంది విషయానికొస్తే, మేనేజర్ కాక మరో తొమ్మిది మంది వున్నారు. వారందరితో, నాకు ఇంతకు ముందు నుంచే పరిచయాలు వుండటం మూలాన, వారితో కలిసి పనిచేయడం నాకేమీ కొత్తగా అనిపించలేదు.
ఇక ఖాతాదారుల విషయానికొస్తే… అక్కడ ఎక్కువగా రైతులు, చేతిపనివృత్తుల వారు, చిరు వ్యాపారులు వుండేవారు. ఇక్కడ వారితో పాటు, పెద్ద వ్యాపారస్తులు, బడా పారిశ్రామికవేత్తలు వున్నారు. అక్కడ బాగా చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక్కడ బాగా చదువుకున్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆడిటర్లు, ఉద్యోగస్తులు, అధికారులు ఎక్కువ.
ఇక, బ్యాంకు పరిధిలో వుండే గ్రామాల విషయానికొస్తే, పెద్దగా తేడా లేదు. అక్కడి గ్రామాలు, ఇక్కడి గ్రామాలు అన్నీ మహబూబాబాద్ తాలూకా లోవే… కాబట్టి, వాతావరణం, నైసర్గిక స్వరూపం, ప్రజల జీవన విధానాలు దాదాపు ఒకేలా వున్నాయి.
ఇంక బ్రాంచి విషయానికొస్తే, అటు హెడ్ ఆఫీసు, ఇటు రీజినల్ ఆఫీసు మార్గదర్శకంలో నడుస్తూ వుంటుంది. హెడ్ ఆఫీసు తయారు చేసి బ్రాంచి లోనే అందుబాటులో వుంచిన మాన్యువల్స్, రోజూ వారీ విడుదల చేసే సర్క్యులర్స్… బ్రాంచిని నడిపేందుకు పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేస్తాయి. వాటి ననుసరించే బ్రాంచిని నడిపించాలి.
ప్రతి సంవత్సరం ఆ బ్రాంచి ద్వారా జరగాల్సిన బిజినెస్, అంటే డిపాజిట్లు, అప్పులు, వసూళ్ళు,… వీటన్నింటికి లక్ష్యాలను ముందుగానే నిర్ణయిస్తారు. ఆ లక్ష్యాలను అధిగమించగలిగితే, ఆ బ్రాంచి, బ్రాంచి మేనేజరు, సిబ్బంది, అందరూ… బాగా పని చేసినట్లు లెక్క. ఇక నా దృష్టంతా, ఖాతాదారులకు విశిష్ట సేవలందిస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, నిర్ధారించబడిన లక్ష్యాలను అధిగమించడం పైనే ఉండాలి. అదే బ్రాంచి మేనేజరుగా నా విధి నిర్వహణకు కొలబద్ద.
ముఖ్యమైన ఖాతాదారులందరితో పరిచయాలు పెంచుకోవడంపై, గ్రామాలన్నీ తిరిగి రైతాంగంతో, ఇతర గ్రామీణ ప్రజలతో, స్థానిక ప్రజా ప్రతినిధులతో సంబంధాలు పెంపొందించుకోవడంపై, ఓ వారం రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కృతకృత్యుడనయ్యాను. ఖాతాదారులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉంటూ, బ్రాంచిలో ఓ సుహృద్భావ వాతావరణం సృష్టించగలిగాను. నిర్దేశించిన లక్ష్యాలను అవలీలగా అధిగమించేందుకు అనువైన పథక రచన చేసుకుని ముందుకు సాగుతున్నాను.
బదిలీపై వచ్చిన శ్రీ వి. సుబ్బారావు గారు మా బ్రాంచీలో సబ్ మేనేజర్‌గా నాతో పాటే జాయిన్ అయ్యారు. బ్రాంచిలో సబ్ మేనేజర్ పోస్టు చాలా కీలకమైనది. మేనేజర్ తరువాత ఎంతో ప్రాముఖ్యత వున్న పోస్టు సబ్ మేనేజరు పోస్టు. మేనేజర్ ఆఫీసు పనిపై బయటకి వెళ్ళినప్పుడు, తన క్యాబిన్లో ముఖ్యమైన పనిలో వున్నప్పుడు, సబ్ మేనేజర్ బ్రాంచిని సవ్యంగా నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అలాంటి పోస్టులో జాయిన్ అయిన సుబ్బారావు గారు మంచి తెలివైనవాడు, సమర్థుడు.
బ్రాంచిని పూర్తిగా అర్థం చేసుకున్న సుబ్బారావు గారు, ఓ రోజు నా క్యాబిన్ లోకి వచ్చి, నా ముందు కూర్చుని, నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు.
“సార్! బ్రాంచి పనితీరు బాగానే వుంది సార్! స్టాఫ్ అంతా మంచివాళ్లే…! సబ్ మేనేజర్‌గా మీకో విషయం చెప్పదలచుకున్నాను సార్! బ్రాంచి మేనేజ్మెంట్ విషయం నాకొదిలేయండి. బ్రాంచిలో ఎలాంటి సమస్యలు రాకుండా, ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నేను చూసుకుంటాను. మీరు డిపాజిట్లు పెంచడం, కొత్తగా అప్పులు ఇవ్వడం, ఇచ్చిన అప్పులు వసూళ్ళు చేయడం, బ్రాంచిని డెవెలప్ చేయడం చూసుకోండి. మనందరం కలిసికట్టుగా పని చేసి మన టార్గెట్లన్నీ రీచ్ అవుదాం సార్” అన్నాడు.
సుబ్బారావు గారి మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. ఉత్తేజాన్ని కలిగించాయి. ఒక మేనేజర్ తన విధులను, విజయవంతంగా నిర్వహించాలంటే, మంచి సిబ్బందితో పాటు, సుబ్బారావు గారులాంటి మంచి సబ్ మేనేజర్ కూడా చాలా అవసరం.
“సుబ్బారావు గారు! మీరిచ్చిన భరోసాతో నాకు కొండంత ధైర్యం వచ్చింది! యస్… మనందరం కలిసికట్టుగా నడుద్దాం! మన లక్ష్యాలను చేరుకొందాం! మన బ్రాంచిని అభివృద్ధి పథంలో నడుపుదాం! మీకు నా కృతజ్ఞతలు సుబ్బారావు గారు!” అంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చాను.
తరువాత ఎవరిపనిలో వాళ్ళం నిమగ్నమయ్యాం.
మహబూబాబాద్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్… అనే ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ చురుగ్గా పని చేస్తుంది. ఆ సంస్థ స్లోగన్ ‘ఉయ్ సర్వ్’. అంటే ‘మేము సేవ చేస్తాము’ అని అర్థం. ఆ సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను అమలుపరుస్తూ, ఆపదలో వున్నవారిని ఆదుకుంటూ, నిరుపేదలకు, విద్య, వైద్య సౌకర్యాలను ఉచితంగా సమకూరుస్తుంది. సమాజంలో డబ్బున్నవాళ్ళు, పలుకుబడి వున్నవాళ్ళు, తోటి మానవులకు సహాయపడాలనుకునేవాళ్ళు, ‘మానవసేవయే మాధవ సేవ’ అని విశ్వసించేవాళ్ళు, ఆ సంస్థలో సభ్యులుగా వున్నారు. ప్రతి సభ్యుడు నెల,నెలా సభ్యత్వ రుసుము చెల్లించాల్సి వుంటుంది.
ఒకరోజు ఆంధ్రా బ్యాంకు సర్క్యులర్ ఒకటి, నా దృష్టికి వచ్చింది. దాని ప్రకారం, బ్రాంచి మేనేజర్లు, లోకల్‌గా వున్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి అంతర్జాతీయ సేవాసంస్థలలో సభ్యులుగా చేరాలి. అందు కవసరమయే ఫీజులన్నింటిని బ్యాంకే భరాయిస్తుంది. క్లబ్లో చేరి, మిగతా సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ, సేవా కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి. తద్వారా అందరితో సత్సబంధాలను పెంచుకుంటూ బ్యాంకు యొక్క పేరు ప్రతిష్ఠలు పెంపొందించేందుకు దోహదపడాలి.
కాకతాళీయంగా అదే రోజు మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మా ఆఫీసుకు వచ్చి, నన్ను వాళ్ళ క్లబ్లో సభ్యుడిగా చేరమని కోరారు. ఎటూ ఆంధ్రా బ్యాంకు, మేనేజర్లకు అలాంటి సంస్థల్లో సభ్యులుగా చేరేందుకు అనుమతినిచ్చింది కాబట్టి, సభ్యుడిగా చేరాను.
మహబూబాబాద్ లయన్స్ క్లబ్లో – రచయితను సభ్యుడిగా చేర్చుకునేందుకు ఆమోదించిన తరువాత రచయితకు లయన్స్ క్లబ్ పిన్ను బహుకరిస్తున్న హైదరాబాద్ లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ టిబ్రెవాలె గారు
స్వతహాగానే, సమాజ సేవా కార్యక్రమాలంటే ముందుండే నేను, నాకు ఇదొక మహదావకాశంగా బావించాను. తదుపరి, క్లబ్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, అనతికాలంలోనే మహబూబాబాద్ లయన్స్ క్లబ్లో నాదంటూ ఓ ముద్ర వేయగలిగాను.
(మళ్ళీ కలుద్దాం)
ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..23 rd episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏
Mee Sambasivarao Thota
నాటి చిత్రాలను పదిలంగా దాచి నాటి బ్యాంకు సేవా కార్యక్రమాలు సహజంగా చిత్రించారు. అభినందనలు మీకు.
Prasad Garu! Dhanyavaadaalandi 🙏
కురవి శాఖను అభివృద్దిపదంలో నడపడంలో మీ కృషి అనిర్వచనీయం. అలాగే సబ్ మేనేజర్ గారు మీకు అందించిన సహకారం కూడ ఎంతో విలువైనది సర్. ఇక సమాజ సేవపరంగా రోటరీ కి సంబందించి కొత్తవిషయాలను తరువాత బాగాలలో వస్తుందని ఆశిస్తున్నా. ఆనాటి అనుభవాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్
Brother Sagar! Mundu Mundu.. Manchi vishayalu vuntai… Dhanyavaadaalu 👍 It is Lions Club,not Rotary…
Excellent narration of experiences by T Sambasiva Rao Hats up to his memory power From RvLaxman Rao Hyderabad
LakshmanRao Garu! Mee abhimaana mariyu aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
As usual an excellent narrative! I think the heading (23) and body (31) are not in sync!
sri MN Rao Garu! Dhanyavaadaalandi 🙏 23 is Episode No. 31 is Chapter No. Thank you very much Sir 🙏
Bagundi.R U in touch with all of our classmates settled in Hyderabad?
From Sri VenkateswarReddy Guntur
VenkateswarReddy Garu! Thank you very much 🙏 With few , I am in touch..👍
Very nice. You have involved our class mate Pamidi Venkateswaralu.
From Sri RamanaMurthy Vizag
Thank you very much RamanaMurthy 🙏 Yes .. Lucky lee Mr.Pamidi Venkateswarlu was available there…
You are a Juggernaut, the unstoppable. Keep posting! Keep rocking. You are a rockstar writer. 👍👌👏
From Sri ShivaPrasad Pune
ShivaPrasad Garu! Mee abhimaana mariyu aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
పులి ఎక్కడున్నా పులే .అంచలంచెలుగా మీ సామర్ధ్యం మీద పైకి ఎదిగిన మీకు అభినందనలు.👏🏻👏🏻💐💐💐.
బహుశా పదోన్నతి కంటే మీ కొరవి బ్రాంచ్ అనుభవం మీకు జీవితాంతం గుర్తు ఉంచుకునే అనుభవాన్ని , తృప్తి ని మిగల్చిందని నా గట్టి అంచనా.😃
From Sri RaviRamana Prasad Hyderabad
Ravi Ramana Garu! Meeru cheppinatlu kuravi anubhavam , chaalaa goppadi.. Kalakaalam gurthundi pothundi.. Lot of Job Satisfaction,indeed… Mee abhimaana mariyu aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏
Balapala gramam name bagundi mehabubabad photos good nachhindi mamayyagaru
From Mr.AnjaneyaPrasad Guntur
AnjaneyaPrasad! Thank you very much 👍
కర్షక సేవా సహకార సంఘం కురవి అభివృద్ధికి తోడ్పాటులో మీ కృషి,పట్టుదల చాలా ముఖ్యమైనది.మెంబెర్స్ 1500 నుండి 4000 వరకు చేరడం ఒక ఎత్తయితే,ఋణాలు మంజూరు విషయంలో కూడా మూడంతలు పెంచి, ఏ పని చేస్తే మంచిదనో తెలుసుకుని, ఆయా గ్రామలలోఎరువుల కంపెనీ ప్రతినిధులతో రైతు సమావేశాన్ని నిర్వహించి,పంటల క్షేత్ర సందర్శన అనంతరం పది మంది కోసం దారి ఏర్పరిచి, మీకు అండగా మేంఉన్నామని వారికి భరోసా కల్పించి,మనోస్థైర్యాన్నీ నిలబెట్టి సంఘం అభివృద్ధి పథంలో నడిపి రెండవ స్థానం నుండి మొదటి స్థానానికి తీసుకురావడం చాలా సంతోషం,ప్రధానమైన అంశం.మాలకొండా రెడ్డి గారు రీజినల్ మేనేజర్ గారు రైతు సమావేశానికి పంచకట్టుతో రావడం గౌరవప్రదం,సంఘం గొప్పదనం స్పష్టంగా కనిపిస్తోంది.అలసత్వం విడనాడి,శరీరంతో పాటుగా మనస్సును అనుసంధానం చేసుకుని పని చేస్తే, ఏ రంగంలోనైన రాణించవచ్చని,ఫలితం దానంతట అదే వస్తుందని,ఉన్న స్థితి నుండి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని,మీ ప్రమోషన్ ఎమ్ ఎమ్ 3 ద్వారా నిరూపించారు. అలనాటి ఫోటోలు, మరియు జ్ఞాపకాలు, కళ్లకు కట్టినట్టుగా మాకు అందించి,జీవనగమనం ద్వారా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు అభినందనలు మరియు ధన్యవద్సములు సర్.
BhujangaRao Garu! Mee abhimaana mariyu aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏 I thank you for your time and patience …. Your eloberative comments on the episode made me so happy and satisfied,as you have very rightly pointed out on each and every aspect of the Episode.. Infact, I am encouraged and inspired by your comments.. Mee apoorva spandanaku Dhanyavaadaalandi 🙏
Dear Sambasivarao garu, It is very great that you recollect the profiles of the branches where you worked, collect the photos ( very difficult to get the photos from archives) and team work displayed by you. Hearty congratulations. I am getting motivation to consolidate my 40 years of career starting the Position of a clerk in a remote village ( Bhainsa) near the Maharashtra border, to the position of Asst. General Manager with ESbh. From Sri D.S.R.K.Nehru . Hyderabad
DSRK Nehru Garu! Thank you very much for your observations and appreciation 🙏 I am so glad to know that you are motivated by my write ups..and also wanted to write about your Career in your Bank,namely eSBH.. That’s really a great idea and I request you to implement the same immediately… I wish you all the Best in your proposed endeavour 👍 Dhanyavaadaalandi 🙏
Good experience sir.🙏🙏🙏🙏 From Sri Shankaram Hyderabad
Shankaram Garu! Dhanyavaadaalandi 🙏
Chala bagundandi.anchalancheluga eduguthoo vacharu.
From Smt.Kasturi Devi Hyderabad
Kasturi Devi Garu! Dhanyavaadaalandi 🙏
Nice flo From Sri Sathyanarayana Hyderabad
Sathyanarayana Garu! Dhanyavaadaalandi 🙏
Dear Sambasiva Rao ji Iam proud of your great achievements and remembrances In the banking career REGARDS 🙏🙏🙏
From Sri M S RamaRao Hyderabad
Sri M S RamaRao Garu! Thank you very much for your observations and appreciation 🙏
Thota Sambasiva Rao garu, Nice to hear about your achievements and your approach towards any issue that has come across. Previously we were waiting on Sunday for eenadu booklet but now we are addicted to your news every Sunday and we feel very happy to hear from you about so many good things. This is all not only your experiences but an guidelines for us and for our next generations. God bless you sir.
SreenivasaMurthy Garu! Mee aathmeeya mariyu abhimaana spandanaku Dhanyavaadaalandi..🙏 I am delighted to read your comments.. I am encouraged and inspired by your affectionate words.. Thank you very much Andi 🙏
Udyogaparvamulo mi anubhavalu photos to Saha teliyachesaru chaduvutumte chala chala bagundi
From Smt.Seethakkaiah Hyderabad
Seethakkaiah! Dhanyavaadaalu Seethakkaiah 🙏
Another nice episode smooth and breezy Pics are excellent. Help again to imagine the real life Still amazed that u store all those pics so carefully from those days Now a days it is very easy but not easy to store the physical copies without getting spoiled
From Mr.Ramakrishna Hyderabad
Mr.Thank you very much for your observations and appreciation 👍
Sir, good morning. I am interestingly following your life incidents. 🙏
From Sri Janaki Rama Rao Appikatla
Janaki RamaRao Garu! Dhanyavaadaalandi 🙏
ఉద్యజగ జీవవితంలో బదిలీలు, ప్రొమోషన్లు మామూలు కానిది ఆన్నిటినీ జ్ఞపఠ్కమ్సకం ఉంచుకోవడం, అన్ని ఫొటోలు దాచి ఉంచడం.కొన్నిసార్లు నిస్ప్రహతో వాటిని పారేస్తాం – నేను ఒంటరి ఐనప్పుడు కలిగిన విరక్తి లో ‘కారామాస్టరు’ తన ‘యజ్ఞ్నం’ ఇంగ్లీషు లోకి అనువదించడానికి లిఖితపూర్వకంగా నాకిచ్చిన అనుమతిలా (అతనెవరో ఈ తరం వారికి తెలీయదేమోనని). మీరు దీనికి అతీతులు అవడం గొప్ప విషయం.. Congratulations. సోమేశ్వర్ బెంగుళూరు
Someswar Garu! Thank you very much for your observations and appreciation 🙏 Nenentho Jaagrathagaa daachukunna konni photolu,ippudu ilaa upayoga padathaayani neneppudoo oohinchaledu.. It’s only God’s Grace,…🙏 Kaaraa maashtaaru itchina anumathi pathram ,kanipinchakapovadam nizamgaa baadhaakaram … However,Thanks a lot Sir,for your affectionate comments 🙏
సర్ మీ అనుభవాలను అక్షర రూపంను ఇస్తూ చక్కగ నవలీకరించుతూ రాసిన ఈ కథాసంచిక ఎంతో అర్థవంతంగా సాగి పోతున్నది. మీరు లయన్స్ క్లబ్ నేను రోటరీ క్లబ్ ఒకే రకమైన అనుభూతి మళ్లీ ఆ రోజులు గుర్తు కొస్తునాయ్. అభినందనలు. Congratulations. Sir look forward to new chapters…🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👍👍👍👍👍👍jeevanandam Thank you Sir. Hyderabad
Jeevaanandam Garu! Thank you very much for your observations and appreciation 🙏 Along with me, you are also remembering your good olden days.. That’s very nice.. Once again,thank you so much for your affectionate comments 👍
Very nice narration of past events of your Banking carrier. Thanks
From Sri ChandrasekharReddy Hyderabad
Thank you very much ChandrasekharReddy Garu 🙏
సాంబశివ రావు గారు, మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అన్ని ఫొటోస్ అప్పటినుండి జాగ్రత్తసేసి ఇప్పుడు మాకు కుడా చూసే భాగ్యం కలిగించినందుకు దన్యవాదములు. డాక్టర్ ప్రసాద్ గారు మీకు మహబూబాబాద్ లో నే గురువు గా పరిచయం అయినట్లు గా చెప్పినట్లు గా గుర్తు. మీకృషి కి ధన్య వాదములు. From Sri NagaLingeswararao Hyderabad
NagaLingeswararao Garu! Thank you very much for your observations and appreciation 🙏 Yes Dr.Prasad Garu,naaku Mahabubabad lo appatinunde parichayam… Thanks Andi 🙏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శ్రీవర తృతీయ రాజతరంగిణి-21
అంకెలు
ఘనంగా ‘జీవన మొగ్గలు’ పుస్తకావిష్కరణ
అన్వేషణ
అవధానం ఆంధ్రుల సొత్తు-13
చిట్టితల్లి శతకం-8
సామెత కథల ఆమెత-17
మేలైన సమాజాన్ని కాంక్షించే ‘కాలంతో పాటు..’
ఉండనీ అలా!
నాన్న లేని కొడుకు-4
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®