41
గత సంవత్సరాలకు మల్లే, ఈ సంవత్సరం కూడా అదే పంథాలో పని చేస్తే, అత్యధికంగా పెంచిన టార్గెట్లను అందుకోవడం అత్యంత కష్టం… అందుకే… అంతకుమించి ఇంకేమైనా చేయగలమా?.. అనే ఆలోచన నా మదిలో కదలాడుతుంది. అప్పుడే ‘మేనేజింగ్ హ్యుమన్ ఫ్యాక్టర్స్ ఇన్ డెవెలప్మెంట్’, ‘అభివృద్ధి సాధనలో మానవ వనరుల వినియోగం’ అనే విషయంపై ఒకానొక మహానుభావుడు వ్రాసిన వ్యాసం చదివాను. ఆ వ్యాసంలోని ఒక కొటేషన్ నా మనసుకు హత్తుకుంది.
‘టేక్ కేర్ ఆఫ్ ది బోయిస్… ది బోయిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బిజినెస్’.
ఆ కొటేషన్‌ని విపులీకరిస్తే,… ‘మనతో కలిసి పని చేసే సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోండి… ఆ సిబ్బంది మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు’ అనే అర్థం స్ఫురిస్తుంది. ఈ కొటేషన్ ఏదో ఒక బ్యాంకు కోసమో, ఒక కార్పోరేట్ సంస్థ కోసమో చెప్పింది కాదు. చిన్నా పెద్దా… అనే తేడా లేకుండా ఏ సంస్థ కైనా అన్వయించుకోవలసిన ఒక అర్థవంతమైన మార్గదర్శక సూత్రం. ఈ సూత్రాన్ని నేను పని చేసే ప్రతి చోటా, తెలిసో తెలియకో, అమలు చేస్తూ వస్తున్నాను. కానీ ఈసారి ఈ బ్రాంచీలో మాత్రం మరింత శాస్త్రీయంగా అమలు పరచాలని నిర్ణయించుకున్నాను.
- మొదటిగా… ఈ టార్గెట్లనేవి కేవలం ఒక్క బ్రాంచి మేనేజర్ కోసం పెట్టినవి కావు… ఆ బ్రాంచికి, ఆ బ్రాంచిలో పని చేసే సిబ్బంది అందరికీ కలిపి ఉమ్మడిగా పెట్టినవి. టార్గెట్లు రీచ్ కాగలిగితే, అది ఆ బ్రాంచి యొక్క, అంటే ఆ బ్రాంచి మేనేజరు మరియు సిబ్బంది యొక్క సమిష్టి కృషి వలన సాధించిన ఘనత అని తెలుసుకోవాలి.
అదే విషయాన్ని బ్రాంచిలో సిబ్బంది సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరికీ అర్థమయ్యేలా చెప్పి ఒప్పించగలిగాను. మనందరి భవిష్యత్తు మన బ్యాంకు అభివృద్ధితో ముడిపడి వుందని సవివరంగా చెప్పాను. తద్వారా ప్రతి ఒక్కరూ, డిపాజిట్ల పెంపుదలలో, అప్పుల వసూళ్ళలో, ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంలో, తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు.
- రెండోది… సిబ్బందిలో ఎవరికైనా తన విధి నిర్వహణలోగాని, వ్యక్తిగత విషయాల్లో గాని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సానుభూతితో పరిశీలించి, ఒక మేనేజర్‌గా సాధ్యమైనంత సహాయ సహకారాలను అందించడం మొదలుపెట్టాను.
- మూడోది… ఎవరైనా సిబ్బంది ఏదైనా సాధిస్తే, హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉత్తేజపరుస్తున్నాను.
- నాలుగోది… ఏ సిబ్బంది అయినా ఒప్పు చేస్తే పదిమందిలో మెచ్చుకోవడం, తప్పు చేస్తే, ఒంటరిగా వున్నప్పుడే మందలించడం ద్వారా వారి మనోస్థైర్యాన్ని నిలబెట్టగలుగుతున్నాను.
- ఐదోది… ఎవరైనా సిబ్బంది ఏదైనా ఫేవర్ కోరితే, చేసేందుకు వీలైతే వెంటనే చేస్తున్నాను. వీలు కాని పక్షంలో చేయలేనని, ఆ సిబ్బంది యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, సున్నితంగా, నేర్పరితనంతో చెప్తున్నాను. నిజానికి, ‘యస్’ అని చెప్పడం కంటే, ‘నో’ అని చెప్పడం చాలా కష్టం.
- ఆరోది… బ్రాంచి తరఫున ఏదైనా సాధిస్తే, అది కేవలం మా సిబ్బంది సహకారం వల్లనే జరిగిందని మా పై అధికారులకు తెలియజేస్తున్నాను. పైవాళ్ళు కూడా నాతో పాటు, మా సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉత్తరం పంపేవారు. ఆ ఉత్తరాన్ని సిబ్బంది అందరూ చూసి సంతకం చేయమని కోరుతున్నాను. అప్పుడు సిబ్బంది, తమ శ్రమని పై అధికారులు కూడా గుర్తిస్తున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నారు.
- ఏడోది… బ్రాంచి అభివృద్ధి కోసం అనునిత్యం శ్రమిస్తూ, తమ వంతు పాత్రను నిజాయితీగా పోషిస్తున్న సిబ్బందికి, పదోన్నతి సమయంలో అన్ని విధాల సహాయకారిగా వుంటున్నాను. పైవాళ్లతో చర్చించి, అర్హత వున్న వారిని అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాను.


మహబూబాబాద్ బ్రాంచిలో ‘డఫ్తరీ’గా పనిచేస్తున్న శ్రీ ఐ.యస్. రావు గారికి ‘క్లర్కు’గా పదోన్నతి లభించి, తను కోరుకున్న నెల్లూరు రీజియన్‌కి బదిలీ అయిన సందర్భంగా… కూర్చున్నవారు (ఎడమ నుంచి కుడికి) సర్వశ్రీ 1). మహేశ్వరరెడ్డి గారు 2). యాదగిరి గారు 3). నరేంద్ర రెడ్డి గారు 4). సుబ్బారావు గారు, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, కురవి మేనేజింగ్ డైరక్టర్, 5). ఐ.యస్. రావు గారు 6). రచయిత 7). ప్రకాశరావు గారు 8). తిరుమల రావు గారు… నిల్చున్నవారు (ఎడమ నుంచి కుడికి) శ్రీమతి విశాలాక్షి గారు… సర్వశ్రీ 1). పార్థసారథి గారు 2). ప్రకాశ్ బాబు గారు 3). వరదా రెడ్డి గారు 4). శివకుమార్ గారు 5). భుజంగ రావు గారు 6). వెంకటేశ్వర్లు గారు మరియు 7). శామ్యూల్ గారు
పైన చెప్పినవే కాకుండా, సిబ్బందికి సహాయపడడంలో, వారిని సంతృప్తి పరచడంలో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. సద్వినియోగం చేసుకున్నాను. తత్ఫలితంగా, సిబ్బంది… బ్రాంచి టార్గెట్లను రీచ్ అయ్యేందుకు, నా బరువు బాధ్యతలను పంచుకుంటూ, నాతో చేయి చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు.
42
నా సహోద్యోగులల్లో చాలామంది ఇప్పటికే బ్యాంకు నుండి హౌసింగ్ లోన్ తీసుకుని ఇళ్ళు కట్టుకోవడమో, కొనుక్కోవడమో చేశారు. నేను కూడా ఈపాటికే ఒక ఇంటిని సమకూర్చుకుని ఉండాల్సి వుంది. అప్పటికీ మా ఆవిడ చెప్తూనే వుంటుంది. కానీ, నేనే… చూద్దాం… చేద్దాం… అంటూ ఇప్పటివరకు విషయాన్ని దాటేస్తూ వచ్చాను.
కాని ఇప్పుడిక ఏ మాత్రం ఆలస్యం చేయదలచుకోలేదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరి జీవితంలో, ఉద్యోగంలో చేరడం, పెళ్ళి చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం అనే మూడు ఘట్టాలు చాలా ముఖ్యమైనవి. నా విషయంలో ఆ మొదటి రెండూ సకాలంలోనే జరిగాయి. మూడోదానికే ఇప్పటివరకు ముహూర్తం కుదరలేదు.
ఓ సినిమాలో, ఓ సినీకవి గారు చెప్పారు…
“పెళ్ళి చేసుకుని, ఇల్లు కట్టుకుని
చల్లగా కాపురముండాలోయో…,
మీరెల్లరు సుఖముగ ఉండాలోయ్…!” అని.
ఆ మూడు ఘట్టాలు పూర్తయితే, ఒక వ్యక్తి యొక్క సగం జీవితం సార్థకమయినట్లే..!
వెంటనే గుంటూరులోని నా స్నేహితులకు, బంధువులకు, కొనడానికి నాకో ఇల్లు వెతికిపెట్టమని ఉత్తరాలు వ్రాశాను.
ఒక ఆదివారం గుంటూరు వెళ్ళాను. వాళ్ళు నాకు ఓ మూడు ఇళ్ళను చూపించారు. నాకు అంతగా నచ్చనందున వాటిని కాదనుకున్నాము. తరువాత ఆదివారం గుంటూరు వెళ్తే, మరో మూడు ఇళ్ళను చూపించారు. అందులో ఒకటి బాగా నచ్చింది. ఆ ఇల్లు గుంటూరు, నెహ్రూనగర్ మూడవ లైనులో, 180 చదరపు గజాల్లో సుమారు ఆరు సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఇండిపెండెంట్ హౌస్. నచ్చిన తరువాత, ఇక ఆలస్యం చేయకూడదని, ఇల్లు అమ్మే వ్యక్తికి, నాకు ఆమోదయోగ్యమైన రేటును కుదుర్చుకున్నాము. కొంత డబ్బును అడ్వాన్సుగా ఇచ్చి, అగ్రిమెంటు వ్రాసుకున్నాము.
ఇంటి పత్రాల, అగ్రిమెంటు కాపీలను జత చేస్తూ, ఆంధ్రా బ్యాంకు హెడ్ ఆఫీసుకు హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు పంపాను. ఓ పది రోజుల తరువాత లోన్ శాంక్షన్ లెటర్ వచ్చింది. ఆ తరువాత వారం రోజుల్లో ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.
నా పేరుతో ఓ ఇల్లు, నా పేరు పైన ఒక స్థిరాస్తి, నా స్వార్జితం… తలచుకుంటేనే చెప్పలేనంత తృప్తి, ఆనందం. ఒక ఇంటి వాడినైనందుకు ఒకింత గర్వం కూడా…
ఆ ఇంటికి కొన్ని అవసరమైన మరమ్మతులు చేయించి, రంగులు వేయిస్తే బాగుంటుందనిపించింది. మా దగ్గరి బంధువులలో ఒకరు బిల్డింగ్ కాంట్రాక్టులు చేస్తూంటాడు. ఆయన ఓ సివిల్ ఇంజనీరు కూడ. మంచి అనుభవం కూడా సంపాదించాడు. అతనికే మా ఇంటి పనులు అప్పజెప్పాను.
ఇల్లు కొనడం అనేది… ఎప్పుడో జరగాల్సింది… కాని ఇప్పటికి జరిగింది. అందుకనే అంటారు – ‘దేనికైనా టైం రావాలి!’ అని.
43
1986 సంవత్సరం.
జిల్లాలోని లయన్స్ క్లబ్‌లన్నీ ఆ సంవత్సరం పొడవునా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను సమీక్షించిన మీదట, మహబూబాబాద్ క్లబ్‌ను ఉత్తమ క్లబ్‌గా, ఆ క్లబ్ అధ్యక్షుడిని ఉత్తమ అధ్యక్షుడిగా, ఆ క్లబ్ కార్యదర్శిని ఉత్తమ కార్యదర్శిగా ఎంపిక చేశారు. కార్యదర్శిగా నా పాత్రను నేను సమర్థవంతంగా పోషించాననేదానికి నిదర్శనంగా నాకీ అవార్డు లభించడం నాకు అపరిమిత ఆనందాన్నిచ్చింది. తదుపరి హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో జిల్లాలోని లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఆ సభలో అవార్డు గ్రహీతలందరికీ అవార్డులను బహుకరించారు. సమాజసేవలో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించిన మహబూబాబాద్ లయన్స్ క్లబ్‌కు, ఆ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశాను.
***
ఇక మహబూబాబాద్ బ్రాంచి టార్గెట్సు విషయానికొస్తే, అలవి కానివైనా,… అవలీలగా సాధించామని చెప్పడం, అతిశయోక్తి అవుతుంది. నిజానికి, నేను మా సిబ్బంది, అందరం కలిసి ఐకమత్యంగా, సంవత్సరం పొడవునా, అహర్నిశం శ్రమించి ఆ టార్గెట్స్‌ని సాధించాము. ముమ్మరంగా సాగిన మా ప్రయత్నాల యొక్క ఫలితాలను, రోజూ వారీ లెక్క లేసుకుంటూ వుండేవాళ్ళం. పొరపాట్లు ఏమైనా దొర్లితే అప్పటికప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టేవాళ్ళం. కలిసికట్టుగా శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించాం. ఆ క్రమంలో వరంగల్ రీజినల్ మేనేజరు గారు మరియు హెడ్డాఫీసులో మా బ్రాంచిని పర్యవేక్షించే ఉన్నతాధికారుల మన్ననలను మేము పొందగలిగాము.
***
మహబూబాబాద్ బ్రాంచీలో మూడు సంవత్సరాల పదవీకాలం పూర్తయింది. ఆ రోజే బదిలీ ఉత్తర్వులు అందాయి. నన్ను గుంటూరు రీజినల్ ఆఫీసులో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (యల్.డి.యమ్)గా పోస్టు చేశారు. గుంటూరు జిల్లాకు ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంక్. ఆంధ్రా బ్యాంకు తరఫున గుంటూరు జిల్లా లీడ్ బ్యాంక్ పథక అమలు బాధ్యతలను గుంటూరు రీజినల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నిర్వహించాలి. ఒక విధంగా నేను బ్రాంచి స్థాయి నుండి జిల్లా స్థాయి బాధ్యతలను చేపట్టబోతున్నందుకు చాలా సంతోషం అనిపించింది. వ్యక్తిగతంగా చూస్తే, ఈ మధ్యనే నేను గుంటూరులో కొనుక్కున్న నా సొంత ఇంట్లోనే మేము నివసించవచ్చు. నా బంధువులందరికి చేరువలో వుండవచ్చు. గుంటూరు పట్టణంలో మా పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంది. గుంటూరు బదిలీ అన్ని విధాలా ఆనందించదగినది. ఆహ్వానించదగినది.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
54 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..26th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
SambasivaRao Thota
R Laxman Rao
It is really good narration and key for sucess mantram Iam happy to mention that Iwas following the same principles while I was BM ,RM and Chairman of a Gramin Bank(RRB) in Darbhanga -Bihar and DGM at Central Office. Ur narration should be really an eye opener fir the present generation of bankers
Thank Samba Siva Rao garu
Sambasiva+Rao+Thota
LakshmanRao Garu!



Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
You are also a very successful Banker and so occupied higher positions in your Bank..
It’s really great of you that you are still relentlessly serving the retired colleagues of your Bank..and also poor and needy people of the Society,as a voluntary social service..
Hats off to you Sir
Boddu Rattaiah
Today’s sri Thota sambasivarao experience article is excellent who is presenting human resources concepts. These are very useful to our day today life.
Nice to his presentation skills.
B Rattaiah tenali
Sambasiva+Rao+Thota
Rattaiah Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
K. Sreenivasa moorthy
Sambasiva Rao garu good morning andi. Nice interpretation of success and its root causes. Well said sir if we attribute our success to our staff and take any negatives on us definitely other staff members will feel happy and take more responsibility and try to work hard with greater determination. Iam for you and we all for growth is the success mantra. One good thing and great thing you mentioned here is appreciate openly and criticise one to one. Ego factor is more dangerous and will get effected Great sir.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!

Thank you very much for analytical comments…
which I always cherish..
Thank you for your encouragement and appreciation…
Paleti+Subba+Rao
మీరు మొదట్నుండీ సిబ్బందితో కలసి మెలసి ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటూ, వారి ఎదుగుదలకు కృషి చేస్తుండడం వల్ల, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవ్వరు కూడా, మిమ్మల్ని జీవితాంతం మరచిపోరు సాంబశివరావు గారూ. ఈ విషయం మీతో కలసి పనిచేసిన వాళ్ళందరికీ విదితమే. ఇంకొక విశేషమేమంటే, మీరు మీ క్రింది సిబ్బంది అభిప్రాయాలకు కూడా విలువిస్తారు. సమిష్ఠి కృషి మంచి ఫలితాన్నిస్తుందని మీరు ఎల్లప్పుడూ విశ్వసిస్తారు.
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!
Thank you very much for your affectionate comments which I always cherish…
God is so great towards me as I could associate with all good friends like you in my career..
But for the support from all my colleagues like you,I would not have succeeded in my efforts to discharge my duties successfully and satisfactorily..
Thank you so much
Sagar
సమిష్టి కృషితో ఏవిదంగా రాణించవచ్చో చేసి చూపించిన మీ పనితనానికి నిదర్శనం ఈ రచన. నిజమే సర్ ఏ రోజైనా క్రిందస్ధాయి ఉద్యోగులను గుర్తించినప్పుడే అసలైన ప్రతిభ భయటపడుతుంది. అంతే కాకుండా మీ ప్రోత్సాహం వారి ఉత్సాహాన్ని రెట్టింపుచేసింది అనడంలో సందేహమే లేదు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు
Bhujanga rao
ఏ రంగంలో నైన అభివృద్ధి జరగాలంటే,సమిష్టి కృషి అందుకు తగిన పట్టుదల అవసరమని భావించి,ఏడు సూత్రాల ప్రణాళిక రూపొందించుకొని,తోటి ఉద్యోగులను ప్రోత్సహిస్తూ, వారి సలహాలను గౌరవించి, పరిస్థితులు,అవసరాలు ఎటు నడిపిస్తే అటువైపు నడుస్తూ,సమయనుకూల నిర్ణయాలతో, విజయసాధనకు అడ్డంకులు లేకుండా సత్పలితాలను పొందవచ్చని నిరూపించి విజయం సాధించారు.మీతో ఈ మూడు సంవత్సరములు కల్సి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఎపిసోడ్స్ మొత్తం సహజంగా ఉంది.ధన్యవాదములు సర్.
Sambasiva+Rao+Thota
Dear BhujangaRao Garu!
I am so happy to read your comments,because you were one of the colleagues who was associated with me at Mahabubabad Branch for three years…
But for the support from all of you at the Branch, I would not have succeeded in discharging my duties so successfully and satisfactorily..
I still remember those golden days at Mahabubabad..moving with all of you…
Thank you so much
Sambasiva+Rao+Thota
Brother Sagar,
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
Brother Sagar!


Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
Nice narration
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Sathyanarayana Garu
Sambasiva+Rao+Thota
Nice sir
From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasiva+Rao+Thota
మీరు ఓ ఇంటివారయిన వివరాలు బాగున్నాయి. Team work తో human values ని గుర్తిస్తూ పని చేయించడంతో ఇంతా బయటా మీ పేరు మారుమ్రోగిపోవడం అభినందనీయం..మీ జీవనగ మనం లోని మలుపులు, మైలురాళ్లు అన్నీ బాగుంటున్నాయి.
రచనా శైలి సులభగ్రాహ్యం గా ఉంది.అభినందనలు
From
Sri vempati KameswaraRao
Hyderabad
Sambasiva+Rao+Thota
KameswaraRao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Eroju miru rasina 7 vishayalu chala bagunnai safalata pomdalamte amdaru patimcha valasinavi teliyachesaru miku dhanyavadalu
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Seethakkaiah!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu Akkaiah
Sambasiva+Rao+Thota
మామయ్య,
టార్గెట్స్ చేరుకొంటానికి మీరు అవలభించిన 7 సూత్రాలు నాకు చాలా ఊరట కలిగించింది. ఇప్పుడే నాకు టార్గెట్స్ ఒత్తిడి పెంచటం చేశారు. ఇంకా నేను మీ పద్ధతిలోనే టార్గెట్స్ టచ్ చేస్తాను అనే నమ్మకం కలుగుతుంది.
సొంత ఇల్లు ఉన్న ఉరికి ట్రాన్సఫర్ రావటం సంతోషకార విషయం.
బుడగాల నాగరాజు
Vijayawada
Sambasiva+Rao+Thota
Dear Nagaraju !


Thank you very much for your affectionate comments…
I am so glad that you are in one way benefitted through this episode..
Wish you all the Best and Success
Sambasiva+Rao+Thota
It is very nice to include management styles.
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Thank you very much RamanaMurthy Garu
Sambasiva+Rao+Thota
బెల్ బొటం పాంట్ బాగుంది సర్.
మొత్తం మీద ఇంటివారయ్యారు. గుంటూరు మారారు.
బాగుంది.ప్రమోషన్ కూడా వచ్చినట్లుంది. అభినందనలు.
From
Sri ARK RAO
KURNOOL
Sambasiva+Rao+Thota
Sri ARK RAO GARU!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Great job
From
Smt.Kasturi Devi
Hyderabad
Sambasiva+Rao+Thota
Kasturi Devi Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Your planned collecive efforts along with your staff have given good results. Finally you were happy,staff are happy and bank management was also happy.
From
Sri ChandrasekharReddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!

Thank you very much for your affectionate comments
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
rao_m_v@yahoo.com
Excellent! We all read circulate such management philosophies, but for first time (of course there could be many more, but I have not come across), I came to know a person, who implemented and got benefit! I presume it must have become a second nature to you. When you whole heartedly help others, you get help from providence (like getting transferred to Guntur as soon as you purchased your house). I suggest you share these experiences face-to-face with younger generation. May God Bless you!
Sambasiva+Rao+Thota
Sri MN Rao Garu!
I am so delighted to go through your comments which were related with your rich experience,connected with Human Relations and Development….
I too strongly believe that if we help others ,we will certainly be helped by God , even without asking,when we really need the same …
Thank you very much for your affectionate comments,coupled with encouragement and appreciation….
Sir….I am fortunate to get acquainted with you..
Thank you so much Sir…
Jhansi koppisetty
మీ ఉద్యోగపర్వంతో ముడిపడి వున్న గృహస్థ ప్రహసనం చాలా బాగా అక్షరబద్దం చేసారు… Very disciplined fruitful journey of life


Sambasiva+Rao+Thota
Jhansi Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Very good naration.
Enjoyed while going through.
Regards
From
Sri Seshumohan
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Seshumohan Garu
Sambasiva+Rao+Thota
Thank you very much for sharing your memorable experiences with Andhra Bank in your 26th episode.
In one of the books I read ” All Readers will generally become good Leaders, if they are writers also they become great Leaders.



Such Leadership qualities are embodied in you.
In single word You are “Great”
From
Sri BoseBabu
Hyderabad
Sambasiva+Rao+Thota
BoseBabu Garu!
Thank you very much for your affectionate comments…
Your observations are quite correct…
But I may not be that level..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
సాంబశివ రావు గారు..a versatile person. Kudos






From
Sri RaviRamana
Hyderabad
Sambasiva+Rao+Thota
RaviRamana Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice Episode…
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna
Sambasiva+Rao+Thota
Good morning, Sir. Now you will write about your Guntur District experiences. Eagerly waiting to know about your Guntur District experiences.


From
Sri Janaki RamaRao
Appikatla
Sambasiva+Rao+Thota
Janaki Rama Rao Appikatla Thank you very much Janaki RamaRao Garu..
Yes you will certainly know about my Guntur experiences soon..
Sambasiva+Rao+Thota
సాంబశివ రావు గారు, 7 సూత్రాల ద్వారా సమీష్టికృషి తో ఎంతో ప్రగతి సాధించ వచ్చుఁ అని నిరూపించి నారు. మీకు అభినందనలు.ఈ తరం వారు కూడా మీ సూత్రాలు పాటిస్తే బాగుంటుంది. గుంటూరు లోని మీ ఇంటి గురుంచి ,ఫోటోలు కోసం రాబోయే సంచిక కోసం ఎదురుసూస్తూవుంటాను. నమస్కారములు.
From
Sri NagaLingeswararao
Hyderabad
Sambasiva+Rao+Thota
NagaLingeswararao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao ji


Really hats off to your endeavour for coordinating
With all concerned for achieving targetted goals of the bank . Cherishing nice
memories of the past banking career is highly commendable Regards
M S RAMARAO
Manager (retd)
Central Bank of India
Begum bazar br Hyderabad
Sambasiva+Rao+Thota
RamaRao Garu!
Thank you very much for your observations,encouragement and appreciation
Sambasiva+Rao+Thota
Sambasiva rao garu
I am regular reader your Sunday sanchika Very nicely presentation
From
Sri Mittapalli Venkata RamaRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much for reading the episodes of my Serial and appreciating the same..
Thanks for your encouragement
డా. కె.ఎల్ వి ప్రసాద్
రావుగారు
మీకు పనిచేయడం
పనిచేయిన్చుకోవడం
బాగా తెలుసు,అలాగే
ఫలితాలు సాధించడం కూడా.
ఫలితంగానే ఒక ఇన్టివారు
కావడానికి వీలయిన్ది.
మంచి గుర్తింపు పొందారు.
అభినందనలు.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi