44
ఆ రోజే మహబూబాబాద్ బ్రాంచిలో రిలీవ్ అయ్యాను. మహబూబాబాద్‌తో నా అనుబంధం, ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఆరు సంవత్సరాలు. మూడు సంవత్సరాలు ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘంతో, మరో మూడు సంవత్సరాలు ఆంధ్రా బ్యాంకు మహబూబాబాద్ బ్రాంచితో. మహబూబాబాద్‌లో పని చేయడం, మొదట్లో ఒకింత ఇబ్బందిగా అనిపించినా, రోజులు గడిచే కొద్ది, అక్కడి వాతావరణం, అక్కడి ప్రజలు, ఖాతాదారులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా సిబ్బంది… ప్రతీ విషయం, నా వ్యక్తిత్వానికి చాలా అనుకూలించాయి. ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా, అంతా సవ్యంగా, సాఫీగా జరిగిపోయాయి. అక్కడున్నన్ని రోజులు, ఎంతో జాబ్ శాటిస్ఫాక్షన్ నా సొంతమైంది. ఆ ప్రాంతంతో విడదీయలేని బంధం నన్ను పెనవేసుకుందని నాకప్పుడే తెలిసింది.
మరుసటి రోజంతా సందడి, సందడిగా గడిచింది. కురవి కర్షక సేవా సహకార సంఘ సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మహబూబాబాద్ శాఖ సిబ్బంది, సంయుక్తంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో – మా ఖాతాదారులు, సంఘ పాలకవర్గ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, నా మిత్రులు అందరూ పాల్గొన్నారు. నా సేవలను వాళ్ళంతా కొనియాడుతుంటే కళ్ళంట నీళ్ళు కారుతున్నాయి గాని, నోటంట మాటలు పెగలట్లేదు. అతి కష్టం మీద, మనసు దిటవు చేసుకుని వాళ్లందరూ నాపై చూపించిన అభిమానానికి, నా కర్తవ్య నిర్వహణలో, వాళ్ళందంచిన సహాయ సహకారాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
ఇక ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరుకి కుటుంబ సమేతంగా బయలుదేరాను. మమ్మల్ని రైలెక్కించి ఘనంగా వీడ్కోలు పలికేందుకు, చాలామంది స్టేషన్‌కు చేరుకున్నారు. వాళ్ళంతా పూలదందలతో నన్ను ముంచెత్తారు.
ఇక్కడో వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతనే నా ప్రియ మిత్రుడు డాక్టర్ ప్రసాద్. ఈ రోజు జరిగిన వీడ్కోలు సభలో వున్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా ఉన్నాడు. అయితే మేమిద్దరం ఒకరినొకరం సూటిగా చూసుకునే ధైర్యం చేయలేకపోతున్నాము. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ స్టేషన్లోకి రావడానికి సిగ్నల్ దాటింది. అప్పుడే డాక్టర్ ప్రసాద్ నా దగ్గరకొచ్చి…
“మరలా ఎప్పుడు కలుసుకుంటాం మిత్రమా!” అని అడిగాడు.
“టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుంటాం!” అన్నాను. వెంటనే ప్రసాద్ నన్ను ఆలింగనం చేసుకున్నాడు. దగ్గరగా చేరిన ఇరువురి గుండెలు, లబ్ డబ్ అంటూ పెద్దగా శబ్దం చేస్తున్నాయి. చెంతకు చేరిన ఇరువురి మనసులు ఉద్వేగంతో గుససుసలాడుకున్నాయి.
ట్రెయిన్ వచ్చి స్టేషన్లో ఆగింది. ఎ.సి. చైర్ కార్లో, మేము ముందుగా రిజర్వు చేసుకున్న సీట్లలో నా భార్యా, పిల్లల్ని కూర్చోబెట్టి, నేను డోర్ దగ్గరకు వచ్చాను. అందరికీ రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాను. ఇంతలో రైలు కదిలింది. తమ కుడి చేతులను గాలిలో ఊపుతూ, నాకు వాళ్ళంతా అభివాదాలు తెలుపుతూ, నా వైపే చూస్తూ నిశ్చేష్టులై నిల్చున్నారు. నేను డోర్ దగ్గర ఎడమ చేత్తో రాడ్‌ని ఆధారంగా పట్టుకుని, ముందుకు వంగి కుడి చేత్తో వాళ్ళందరికీ అభివాదం తెలుపుతూ, వాళ్ళందరినీ చూస్తూ నిల్చుండిపోయాను. నా కళ్ళ నిండా కమ్మిన కన్నీళ్ళతో నా చూపు మసకబారింది. వాళ్లందర్నీ తృప్తిగా చూడలేకపోతున్నాను. ఒక్కసారి రెండు కళ్ళను గట్టిగా నా కుడిచేత్తో నులుపుకున్నాను. పరవాలేదు, ఇప్పుడు కనిపిస్తున్నారు వాళ్ళంతా… కనిపించినంత సేపు వాళ్లందర్ని చూస్తూ నిల్చుండిపోయాను. వేగం పుంజుకుంటున్న రైలు మహబూబాబాద్‌తో నాకున్న ఆరేళ్ళ బంధాన్ని తెగిందాకా లాగింది. ఆ హృద్యమైన దృశ్యం కనుమరుగైన తరువాత డోర్ దగ్గర నుండి వెనక్కి వచ్చి వాష్ బేసిన్‌పై నున్న అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నాను. కళ్ళ నుండి జాలువారిన కన్నీళ్ళు బుగ్గలపై చారలు గట్టి కనిపించాయి. నీళ్ళతో ఒకసారి ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, కర్చీఫ్‌తో తుడుచుకుని, తల దువ్వుకుని, వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఆ క్షణంలో మా వాళ్ళతో మాట్లాడేందుకు మనస్కరించలేదు. నా పరిస్థితిని గమనించి, అర్థం చేసుకున్న మా వాళ్ళు నన్ను పలకరించే సాహసం చేయలేక మిన్నకుండి పోయారు. ఆ వాతావరణాన్ని అలాగే పొడిగించడం అంత మంచిది కాదనుకున్న నేను…
“ఆ చెప్పండి! గుంటూరు కెళ్తున్నాం కదా! హ్యాపీనా?” అని పలకరించి తేలికపరిచాను.
మహబూబాబాద్‌లో మా అనుభవాలను పునశ్చరణ చేసుకుంటూ మా సంభాషణను కొనసాగించాము. రాత్రి పన్నెండు గంటలకు మేమంతా మా అత్తగారింటికి చేరుకున్నాము.
45
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు రీజినల్ ఆఫీసులో లీడ్ డిస్ట్రిక్టు మేనేజరుగా జాయిన్ అయ్యేందుకు నిర్ణయించుకున్నాను. రీజినల్ మానేజర్ గారిని కలిసి, తరువాత అక్కడి సిబ్బందిని పరిచయం చేసుకుందామని, ఉదయం 10 గంటలకల్లా ఆఫీసుకి చేరుకున్నాను. ముందుగా రీజినల్ మేనేజర్ శ్రీ యల్. వీరభద్రరావు గారిని కలిసేందుకు వారి క్యాబిన్లోకి వెళ్ళాను. ఇక్కడే… ఓ ‘ట్విస్టు’… అదే నా బదిలీ ఉత్తర్వులలో ఏదో మార్పు జరిగిందట! గుంటూరు రీజినల్ ఆఫీసుకు బదులుగా, నన్ను నిడుబ్రోలు బ్రాంచికి మేనేజర్‌గా పోస్టు చేసినట్టు, రీజినల్ మేనేజర్ గారు చల్లగా చెప్పారు. వినగానే నాకు కొంచెం సేపు నోట మాట రాలేదు. సొంత ఇంట్లో ఉండొచ్చని, పిల్లలకు నాణ్యమైన విద్యను సమకూర్చవచ్చని, బంధువులందరికీ సమీపంలో ఉండొచ్చని, ఎన్నో కలలు కన్నాను. ఒక్కసారిగా నా కలల సౌధం కుప్పకూలిపోయింది. కలలు కల్లలు అయ్యాయి. వెంటనే తేరుకున్న నేను రీజినల్ మేనేజర్ గారితో…
“అలాగే సార్! అయితే నేను ఈరోజే నిడుబ్రోలు బ్రాంచికి వెళ్ళి, అక్కడ మేనేజర్‌గా జాయిన్ అవుతాను సార్!… మరి వెళ్ళొస్తాను సార్” అంటూ విసురుగా లేచి బయలుదేరాను.
“అలాగే! ఆల్ ది బెస్ట్ టు యూ!”.. అంటూ రీజినల్ మేనేజర్ గారు కొంచెం బాధ పడుతూ చెప్పినట్లనిపించింది నాకు.
ఆఫీసు నుండి బయటకు రాగానే ఎదురుగా కొరిటెపాడు నుండి ఆర్.టి.సి. బస్టాండుకు వెళ్ళే సిటీ బస్సు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. పరిగెత్తుకుంటూ రోడ్డు దాటి వెళ్ళి, ఒక్క ఉదుటున బస్సెక్కాను. బస్టాండుకు చేరుకుని పొన్నూరు వెళ్ళే బస్సెక్కాను. గుంటూరు నుండి పొన్నూరుకు దూరం 35 కిలోమీటర్లు. ఓ ముప్పావు గంటలో చేరుకోవచ్చు. బస్సులో కూర్చున్నంత సేపూ ఏవేవో ఆలోచనలు…
‘ట్విస్టు’ అంటే ‘ఊహించని ఓ మలుపు’ అని అందరికీ తెలుసు. వాస్తవానికి వర్తమాన కాలంలో ట్విస్టులు ఉన్న కథలనే పాఠకులు చదవడానికి మొగ్గు చూపుతున్నారు. ట్విస్టులు ఉన్న సినిమాలనే ప్రేక్షకులు చూడ్డానికి ఇష్టపడుతున్నారు. కాలానుగుణంగా రచయితలు కూడా, ట్విస్టులతో కూడిన కథలనే రచించడానికి సమాయత్తమవుతున్నారు.
ఆ నేపథ్యంలో… మన నిజ జీవితాల్లో కూడా కొన్ని ట్విస్టులు జరుగుతుండడం మనం గమనిస్తుంటాము. ఇక నా విషయానికొస్తే… 1975 సంవత్సరం… ఇదే గుంటూరు రీజినల్ ఆఫీసులో నేను పని చేసేటప్పుడు ఒక ట్విస్టు జరిగింది. సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్-1 … అక్కౌంట్స్ పేపర్లో నేను ఫెయిలయినట్టు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి నాకు వర్తమానం పంపింది. ఎంతో కష్టపడి చదివి వ్రాసిన పరీక్షలో ఫెయిల్ అవడం నన్నెంతో కలవర పరిచింది. కాని నాలో, పాసవుతాననే నమ్మకం మాత్రం, ఆవగింజంతైనా సన్నగిల్లలేదు. అక్కడ ట్విస్టు ఏంటంటే మరో వారం రోజులోనే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి, జరిగిన పొరపాటుకు చింతిస్తూ, నేను అకౌంట్స్‌లో పాసయినట్లు తెలియజేశారు. అదీ… ట్విస్టు…
ఇప్పుడు ఈ ట్విస్టు మరీ ఆశ్చర్యంగా ఉంది. మహబూబాబాద్‌లో రిలీవ్ అయి గుంటూరులో జాయిన్ అయ్యేలోపే బదిలీ ఉత్తర్వులు తారుమారు అయ్యాయి.
అసలెందుకిలా జరిగింది… ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు’ అంటే ఇదేనేమో! అయినా మన చేతుల్లో ఏముంది? ఎలా రాసి పెట్టి వుంటే అలా జరుగుతుంది. ఇలా కావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉండి ఉంటుందా? ఏమో మరి! అయినా… ఇప్పుడవన్నీ అప్రస్తుతం. బ్యాంకు ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడకు వెళ్ళి విధులను నిర్వహించడం… నా తక్షణ కర్తవ్యం… అందులో వేరే ఊహలకు తావే లేదు… ఒక విధంగా ఆలోచిస్తే ‘అంతయూ మన మంచికే అయ్యుండచ్చు… చూద్దాం… ఏం జరుగబోతోందో…’ అని అనుకుంటుండగానే బస్సు పొన్నూరులో ఆగింది.
46
పొన్నూరు, నిడుబ్రోలు ఒకప్పుడు వేర్వేరు గ్రామాలు కావొచ్చు. ప్రస్తుతం రెండూ కలిసిపోయి, పొన్నూరు మునిసిపాలిటీగా అవతరించాయి. పొన్నూరులో ఆంధ్రా బ్యాంకు శాఖ వుంది. నిడుబ్రోలులో కూడా వుంది. రెండిటికీ మధ్య దూరం ఒక కిలోమీటరు లోపే వుంటుంది.
నిడుబ్రోలు బ్రాంచిలోకి ప్రవేశించి చూడగా, పదిమంది దాకా సిబ్బంది పనిలో నిమగ్నమై వున్నారు. ఖాతాదారులు కొంతమంది కౌంటర్ల ముందు, తమ పనులు చూసుకుంటున్నారు. మరి కొంతమంది కుర్చీల్లో కూర్చుని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. సిబ్బందిలో నాకెవరైనా పరిచయస్తులు ఉన్నారేమోనని అందర్నీ పరిశీలనగా చూశాను. నాకు తెలిసిన ముఖం ఒక్కటి కూడా కనిపించలేదు. వాళ్ళెవరికీ నన్ను గుర్తు పట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ ఇంతవరకు నన్ను చూసి వుండరు. చేసేదేం లేక, నేనే సబ్ మేనేజర్ని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
“ఓ మీరా సార్! నమస్తే సార్! వెల్కం సార్! రండి సార్… మీరు మీ క్యాబిన్లో కూర్చోండి. స్టాఫ్ అందర్నీ పిలిచి మీకు పరిచయం చేస్తాను.!”
“నమస్తే అండి! వాళ్ళెవర్నీ డిస్టర్బ్ చేయొద్దు. కస్టమర్స్‌కి ఇబ్బంది కలుగుతుంది. మనమే వాళ్ళ దగ్గరికి వెళదాం. ఎటూ సాయంత్రం నాలుగు గంటలకు స్టాఫ్ మీటింగు పెట్టుకుందాం… పదండి… ఒక్కొక్కరిగా అందర్నీ కలుద్దాం” అంటూ ముందుకు సాగాను.
సబ్ మేనేజర్ గారు… పేరు శ్రీ యన్. అమర్నాధ్ – సొంతూరు నిడుబ్రోలేనట! ప్రతి ఒక్కరినీ పేరు పేరున పరిచయం చేశారు సబ్ మేనేజర్ గారు. అక్కడే వున్న ఖాతాదారులకు కూడా నన్ను పరిచయం చేశారు.
పరిచయ కార్యక్రమం ముగిసిన తరువాత క్యాబిన్ లోకి వచ్చి నా సీట్లో కూర్చున్నాను. అటెండెన్స్ రిజిస్టర్, లేటెస్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు పంపించమని సబ్ మేనేజర్ గారికి చెప్పాను. కాసేపటికి, డఫ్తరీ ఆ రెంటినీ తెచ్చి నా ముందుంచాడు. సరిగ్గా పన్నెండు గంటలకి అటెండెన్స్ రిజిస్టర్లో ఇనీషియల్ పెట్టాను. తరువాత ఇన్స్పెక్షన్ రిపోర్టు చదవడంలో మునిగిపోయాను.
సాయంత్రం నాలుగు గంటలకు స్టాఫ్ మీటింగులో నా గురించి అంతా చెప్పాను. అలాగే ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఈ బ్రాంచిని ప్రగతిపథంలో నడిపేందుకు అందరి సహకారాన్ని అర్థించాను. అందుకు వారంతా తమ అంగీకారాన్ని మనస్ఫూర్తిగా తెలిపారు. వాళ్ళతో ముచ్చటించిన మీదట, బ్రాంచి గురించి అర్థం చేసుకోగలిగాను.
రాత్రి 8 గంటలకు ఇంటికి చేరి జరిగినదంతా మా వాళ్ళకు వివరించాను. నిరాశకు గురైనారు. నేను చెప్పిన మీదట మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాము.
‘తప్పేదేముంది… సర్దుకుపోదాం…!’ అని.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
53 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..27th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
Sambasiva Rao Thota
Sagar
అన్నిరోజులు ఉత్సాహంగ పనిచేసి అందరితో ఆత్మీయసంబంధాలు నడిపిన మీరు వీడ్కోలు సందర్భంలో ఎలా ఉద్వేగానికి గురి అయ్యారో మీ రచనే చెపుతూంది సర్ . ఇక బదిలీ ఉత్తర్వు మార్పు అనేది మీరు చెప్పినట్లుగా దైవలీలను మన ధిక్కరించలేము కదా? సరి అయిన సమయంలో అడ్డకులు లేకుండా జాయిన్ అయిన మీకు అభినందనలు. మంచి రచనను అందించినందుకు ధన్యవాదములు సర్ .
Sambasiva+Rao+Thota
Brother Sagar!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ ట్విస్టులు కథనం బాగుంది.
ఒకటి మైనస్, మరోటి ప్లస్. తప్పదు స్వీకరించ వలసిందే!
పంపిన చోటికి పోయి పనిచేయడం మీ కెరీర్ కి
ప్లస్ అయిన్ది.
యాజమాన్యం కి మీ మీద అపారమైన గురి ఏర్పడింది. చక్కగా రాస్తున్నారు
మీకు అభినందనలు.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sivarama Krishna
బలే ఉంది సార్. నాకు కూడా ఒకసారి మీలాగే జరిగింది. తిరుపతి జోన్ తిరుమల బ్రాంచిలో మూడేళ్ళు పనిచేశాక నాకు శ్రీనివాసుని సన్నిధానం నుండి కాళహస్తీశ్వరుని సన్నిధికి శ్రీకాళహస్తి బ్రాంచికి బదిలీ అయింది. ఈలోగా నేను మా అమ్మాయి వివాహంకోసం రెండువారాలు సెలవుమీద వెళ్ళి, తిరిగొచ్చి తిరుమలలో రిలీవై, శ్రీకాళహస్తి వెడుతుండగా తిరుపతి జోనలాఫీసులోని పీవో నా మొబైల్ ఫోనుకి ఫోన్ చేసి నిన్ను మదనపల్లి బ్రాంచికి సబ్ మేనేజరుగా పోస్టు చేస్తున్నాం. కాళహస్తికి వారంరోజులు డెప్యుటేషన్ వెళ్ళు. వారం తర్వాత అక్కడ రిలీవై జాయినింగ్ టైం వాడుకొని మదనపల్లె బ్రాంచిలో రిపోర్ట్ చెయ్యి అన్నాడు. ఏం చేస్తాం! ఏదైనా మన మంచికేనని తలూపాను.
అదే నిజమైంది. ఒక నెల గడిచిందో లేదో, ఏదో విషయంలో అప్పటి సీయండీ ఆర్ సీ రెడ్డి గారి ఆగ్రహానికి గురై శ్రీకాళహస్తి బ్రాంచి మేనేజర్ సహా ఆఫీసర్లందర్నీ సుదూర పల్లె ప్రాంతాలకి బదిలీ చేసేసారు. మదనపల్లె అద్భుతమైన బ్రాంచి. ఆడుతూ పాడుతూ నా టెన్యూర్ పూర్తి చేసుకొని కాకినాడ జోనుకి బదిలీ అయ్యాను.
మీరు చాలా హృద్యంగా రాశారు.
Sambasiva+Rao+Thota
SivaRamakrishna Garu!
Nizamgaa alaanti anubhavaalu chaalaa vichithramgaa anipisthaayi….
Mee anubhavaalanu andaritho panchukovadam chaalaa santhosham anipisthundi…
Edemainaa aa vishayaanni Meeru positive gaa theesukoni mundu ki saagadam abhinandaneeyam…
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Bhujanga rao
జీవన గమనం 27 సుదీర్ఘ కాలం తరువాత మహబూబాబాద్ నుండి మీ గుంటూరుకు చేరింది.చాలా సంతోషం.ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి,బ్యాంక్ ఉద్యోగులకు చెప్పనవసరం లేదు.జీవితంలో భాధపడాల్సిన విషయం ఏమీ లేదు దానిని అర్ధం చేసుకోవడం ముఖ్యమని భావించి,నిరాశకు గురికాకుండా, అన్ని అడ్డంకులను అధిగమించి,అంతా మనమంచికే అని భావించి,అప్పుడున్న పరిస్తితులకు అనుగుణంగా,మీ కున్న అనుభవంతో మార్పు చేసిన బ్రాంచిలో జాయిన్ ఐన మీకు అభివందనములు మరియు ధన్యవాదములు సర్.
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!
Meeru cheppina vishayalu akshra sathyaalu..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Dear Samba Siva Rao garu
I have gone through your write up Iam very happy to share with u that both of our cases are of similar in nature. I was promoted to CO ( RD) scale III in 1981 from RO Vijayawada I was only person promoted from entire south Ibdia. I reported at ZO Hyd and took house and admissions for my 3 children at Hyd Loyola school at Vijayanagara colony I went to Vijayawada and vacated the house and getting the house luggage loaded to the Lorry At that time my friend from RO Vijayawada which is just opposite to my house near Benz circle,came and informed me that one of our common friends who was working at CO had informed him that Iwas transferred to RO Bangalore. It was very shocking to me But I have to reconcile myself as my transfer was to accommodate one my class mate and friend at ZO Hyd in my place. At the protest of my earlier RM at Vijayawada and at that time he was RM Bangalore, the management had created a position at RO Bangalore and then Ostend me there . So. I worked there for 3 years and again transferred to Surya agh as BM on operation side
Thanks
R Laxman Rao
Hyderabad
Sambasiva+Rao+Thota
Lakshman Rao Garu!
Really,I have gone through your comments with utmost curiosity..
As you have rightly pointed out that we both have similar experiences in our Career..
With Regard to my change of posting on my transfer,it is only astonishing,but in your case , you have might have faced lot of inconvenience,which was very unfortunate…
But you have taken the pains sportively and positively and joined at Bangalore..
One solace was, ultimately your friend was helped or benefitted..
However,very interesting experience in your case…
I thank you very much for your continued support and encouragement to me,through your affectionate comments..
Sambasiva+Rao+Thota
నమస్కారం సాంబశివరావు గారు సరే కానీయండి చేసేదేముంది సర్దుకుపోదాం
From
Sri Ramana
Vinukonda
Sambasiva+Rao+Thota
Ramana Garu!
Anthegaa mari…
Dhanyavaadaalandi
rao_m_v@yahoo.com
Hats off to you for taking such a disappointment in your stride! It may be common in banks, but not outside! May God bless you!
Sambasiva+Rao+Thota
Sri MN Rao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Adbhuthahaa,….
From
Sri Ramesh
Hyderabad
Sambasiva+Rao+Thota
Ramesh Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Interesting story.. more excited and want to hear more abt from you uncle..
Waiting for next episode
From
Mr.Leelaa Krishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Leelaa Krishna
Sambasiva+Rao+Thota
మేనేజర్ గారూ,
ఏమిటిది? నేను గుంటూరులో మిమ్మల్ని కలుద్దాం అనుకుంటే మీరు చీరాల వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పండి చాలు అని ట్విస్ట్ ఇచ్చారు. అసంతృప్తిగావుంది
From
Sri ARK RAO
KURNOOL
Sambasiva+Rao+Thota
Ramakrishna Garu!
Appudappudu ilaanti anubhavaalu koodaa vuntaayi mari…
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
ఈ రోజు కథ చాలా ఆసక్తిగా ఉంది. మహబూబాద్ నుంచి మీరు రిలీవ్ అయ్యే సన్నివేశం కళ్ళకు కనపడింది. ఆ ఊరి తో ఉన్న బంధం తెగదాక రైలు కదులుతోంది అన్న మీ వర్ణన superb.
అనుకున్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశం కు ట్రాన్స్ఫర్ వచ్చినా positive గా తీసుకోవటం అన్నది , మీ యొక్క ఉద్యోగ నిబద్దత కు నిదర్శనం.
తదుపరి భాగం కొరకు ఎదురు చూస్తూ
బుడగాల నాగరాజు
Vijayawada
Sambasiva+Rao+Thota
Dear Nagaraju !
Nee Abhimaana mariyu aathmeeya spandanaku chaalaa Santhoshamgaa vundi..
Thank you very much
Sambasiva+Rao+Thota
Have you replaced Ramireddy?
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Yes RamanaMurthy

Thank you very much
Paleti Subba Rao
సాంబశివరావు గారూ, ఒక బ్రాంచ్ లో పనిచేసి వేరేచోటికి వెళ్ళేటపుడు మీరు అణచుకున్న భావోద్వేగాలు ఆనందకరం. కాని, ఎవరికోసమో మిమ్మల్ని వేరే చోటుకు బదిలీ చేసినప్పుడు మీరు అణచుకున్న భావోద్వేగాలు చాలా బాధాకరం. అయినా మీరు వాటిని మరచి స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. మీరు చాలా గొప్పవారు సాంబశివరావు గారూ.
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!
Nizaaniki Nidubrolu lo cherina tharuvaatha,akkadiki nannenduku pampaaro ardhamaindi..
Branch Manager gaa pani chesthoo ,aneka samaajasevaakaryakramllo palgonnaanu..
Manchi phalithaalatho paatu, lot of Job Satisfaction,akkada naaku labhinchaayi…
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
చదువుతూ ఉంటే సమయం తెలియలేదు సార్.
ట్విస్టుల బా గా రాశారు.
మహబూబాబాద్ నించి వీడ్కోలు…
హత్తుకునేలా ఉంధి.
మంచి పని చేశారు.
మంచి మార్గం ఎన్నుకున్నన్నరు.
స్వీయ అనుభవాలు రాయడం.
మమ్మల్ని inspire చేసి మా పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు.
ఔను.
బోధించే కన్నా బోధ పడేట్టు రాయటం ఇక కళ.
God bless you
From
Sri Krishna Rao
Facebook
Hyderabad
Sambasiva+Rao+Thota
krishna Rao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Twist leni jeevitham waste
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Avunu Sathyanarayana Garu!
Meeru cheppindi correct Andi
Sambasiva+Rao+Thota
జీవితములో ఏదు రై న ప రిస్తితులను అంత.మన మంచికే అని భావించటం మీలోని చాలా గొప్ప విశేషం మంచి రచన అందించిన మీకు ధన్య వాదాలు
From
Smt,Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Seethakkaiah!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu Akkaiah
Sambasiva+Rao+Thota
Very nice
From
Sri Diljeeth
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Diljeeth Jee
Sambasiva+Rao+Thota
interesting episode
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna
K. Sreenivasa moorthy
Sambasiva Rao garu
Fortunes changes and we must accept and there is no other go. Life will be happy if we accept and it will be a new challenge. Nice experiences one from you sir.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
What you have told is quite correct…
Thank you very much for your affectionate comments..
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao ji

NaaJeevana gamanamulo
Cherishing and sharing your own experiences
at Mahaboobabad and Nidabrolu with twists
In the banking career is highly commendable and
Appreciated Regards
M S RAMARAO
Manager retd Central Bank of India Begum bazar br
Hyderabad
Sambasiva+Rao+Thota
RamaRao Garu!

Thank you very much for your appreciation and encouragement
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Nice sir
From
Sri Venkteswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu!
Sambasiva+Rao+Thota
Dear Thota Sambasiva Rao Garu, మీ జీవన గమనం లో కధా సంచిక 24 నుండి 27 వరకు ఇప్పుడే చదివాను. కధ ను సరళంగా చెప్పడం మీ ప్రత్యేకత.
24 లో మీ నాటకరంగ అనుభవాలు 25 లో రికవరీ కి ఉపయోగపడే ఎనిమిది సూత్రాలు , 26 లో బ్రాంచి development కు ఉపయోగపడే 7 సూత్రాలు, 27 లో కొత్త బ్రాంచి లో చేరిన నాటి మీ ఫీలింగ్స్, మీ బదిలీ లో ట్విస్ట్ లు మనసు కు హత్తుకునేలా చక్కగ రాశారు. చాలా విషయాలు నాకు సంబందించినవిగా ఫీల్ అయ్యాను. నన్ను నేను చేసుకున్నాను. విలేజి బ్రాంచి లో నా అనుభవాలు, రికవరీ లో నా ప్రణాళిక డిటో, డిపో.
సూపర్ సార్.
అభినందనలు, శుభాకాంక్షలు.
మీ మిత్రులు గా మాకు గర్వ కారణం.
సూపర్, సూపర్బ్.
Waiting yo read further episodes.,
మీ మిత్రుడు
జీవానందం
Retd IOB
Hyderabad
Sambasiva+Rao+Thota
Jeevaanandam Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku naaku chaalaa santhosham kaligindi..
Miss ayina episodes annintinee kshunnangaa chadivi mee abhipraayaalanu savivaramgaa cheppadam mudaavaham…
Mee anubhavaalanu koodaa nemaruvesukovadam aanandadaayakam..
Mee encouragement ki,appreciation ki ,naa hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Sir thank you. Your writings simply superb n sharing old photos with narration laudable. Nice Sirji.









jeevanandam
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Jeevaanandam Garu
Sambasiva+Rao+Thota
Same to me also
From
Sri ShivaKumar
Hyderabad
Sambasiva+Rao+Thota
ShivaKumar Garu!
Interesting to know that you had similar experience ….
Sambasiva+Rao+Thota
You have done wonderful serve to Andhra Bank customers and general public. Change of transfer order is really a great Twist which you have positively accepted. Hope you have repeated the same service at Nidubrolu also. Such a twist happened to me also. All the best.
From
Sri ChandrasekharReddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Avunu…alaanti twistulu mana Bank udyogulaku tharachoo jaruguthuntaayi..
Alaage naaku Meeku koodaa jarigaayi..
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
గురువు గారు
Acceptance అనేది, అంత మన మంచికే అని తలచడం అనేది…మనం మనశ్శాంతి తో జీవించడానికి కావలసిన విలువలు.
భేష్ భేష్





From
Sri RaviRamana
Hyderabad
Sambasiva+Rao+Thota
Ravi Ramana Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi