53
ఆ రోజు శరత్‌బాబు గారి నుండి ఫోనొచ్చింది. వారు కూడా నాలాగే మా బ్యాంకులో గ్రామీణాభివృద్ధి అధికారిగా చేరారు. నాకు బాగా సీనియర్. నాకు గురుతుల్యులు. అందరితో అట్టే కలిసిపోతారు. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంకు స్థాపించిన ‘చైతన్య గ్రామీణ బ్యాంకు’కు ఛైర్మన్. ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం తెనాలిలో ఉండగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా శాఖలున్నాయి.
“సార్! నమస్కారం సార్!” చెప్పాను.
“ఆ… నమస్కారం… ఎలా వున్నారు?” అడిగారు శరత్‌బాబు గారు.
“బాగున్నాను సార్! మీరెలా వున్నార్సార్?”
“నేను బాగానే వున్నాను!”
“ఏంటి సార్! ఫోన్ చేశారు!… చెప్పండి సార్… నాతో ఏమైనా పనిబడిందా!”
“ఆ… పనుండే చేశాలే! ఏం లేదూ… ఈ నెల్లో చైతన్య గ్రామీణ బ్యాంకు చతుర్థ వార్షికోత్సవాన్ని జరపాలనుకుంటున్నాము. ఆ ఫంక్షన్లో మా వాళ్ళేదో నాటిక వేయాలనుకుంటున్నారు. అదేదో నీ దర్శకత్వంలో అయితే బాగుంటుందని నాకనిపించింది. అదీగాక, నాటకాల్లో నీకు బాగా అనుభవం ఉంది కదా! మరి నువ్వేమంటావ్?”
“అలాగే చేద్దాం సార్! నో ప్రాబ్లెమ్!”
“నాకు నీ గురించి బాగా తెలుసయ్యా! నేనడిగితే నువ్ కాదనవని మా వాళ్ళకు ముందే చెప్పాను… మరి ఎప్పుడు కలుద్దాం?”
“సార్! రేపు సాయంత్రం… ఆరు ఆరున్నర కల్లా మీ ఆఫీసుకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్! అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్!”
“అన్నట్లు… ఫంక్షన్ ఇంకో పదిహేను రోజుల్లోనే వుంది. అంత తక్కువ టైమ్‌లో మా వాళ్ళు నాటికను ప్రదర్శించేందుకు తయారవగలరా?”
“ఫంక్షన్ ఇంకెన్ని రోజుల్లో వుందని కాదండి… మీ వాళ్ళలో ఎంత ఉత్సాహం ఉంది… ఎంత పట్టుదల వున్నది… అన్నదే ఇక్కడ ముఖ్యం… మీరు ఈ విషయాలేవీ ఆలోచించకండి! అంతా నేను చూసుకుంటాను! మీరు నిశ్చింతగా వుండండి!”
“నీతో మాట్లాడుతుంటే, కొండంత ధైర్యం వచ్చిందయ్యా! మరి రేపు కలుద్దాం! ఉంటాను!”
“అలాగే సార్!”
***
శరత్‌బాబు గారు అడిగారు… అంతే! ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా…! ఇది నా సామర్థ్యాన్ని చూపించేందుకు, నాకు లభించిన ఓ మహదావకాశం కాదా!
54
సాయంత్రం ఐదు గంటలకు బ్యాంకులో పని ముగించుకుని, ఐదున్నర ట్రెయిన్‌కి తెనాలి బయలుదేరాను. ఆరున్నర కల్లా శరత్‌బాబు గారి ముందున్నాను.
“నమస్కారం సార్!”
“ఆ! నమస్కారం… రావయ్యా… రా! కూర్చో… మా వాళ్ళని పిలిపిస్తాను… మాట్లాడుదువుగాని! (అటెండర్‌తో వాళ్ళని పిలవమని చెప్పారు). ఆ! ఇంకేంటి సంగతులు? బ్రాంచిలో అంతా ఓ.కే.నా?”
“అంతా ఓ.కే. సార్! నో ప్రాబ్లెమ్!”
(అంతలో వాళ్ళంతా క్యాబిన్లోకి వచ్చారు).
“ఆ! రండి రండి! వీరే… మీ నాటికను దర్శకత్వం చేయబోయేది… వీరికి మంచి అనుభవం వుంది… అందునా నా మిత్రుడు… శిష్యుడు… (నా వైపు తిరిగి) వీళ్ళేనయ్యా! మన నాటికలో నటులు!”
పరిచయ కార్యక్రమం అయింతర్వాత అందరికీ కాఫీలు అందాయి.
“ఒక పన్చేయండి! ఇక మీరంతా మన మీటింగ్ రూమ్‌లో కూర్చుని మిగతా విషయాలు మాట్లాడుకోండి!… సరేనా?” అడిగారు శరత్‌బాబు గారు.
“అలాగే సార్!” అంటూ అందరూ నిష్క్రమించారు.
“ఓ.కే. ఇక నువ్ నీ పని మొదలుపెట్టొచ్చు… నీకేదైనా చిన్నపాటి సమస్య వచ్చినా… నాతో మాట్లాడడానికి వెనుకాడొద్దు… సరేనా!” అడిగారు శరత్‌బాబు గారు.
“అలాగే సార్! మరి నేను వాళ్ళందరి దగ్గరకు వెళ్తాను సార్!”
“ఓ.కే…. ఆల్ ది బెస్ట్!”
“థాంక్యూ సార్!”
55
అందరం మీటింగ్ రూమ్‌లో కూర్చుని నాటికను ఒకసారి చదువుకున్నాము. ఆ నాటిక పేరు ‘అమ్మ!’. ఇతివృత్తం ఏమిటంటే… నలుగురు అన్నదమ్ములు… మద్యపానానికి బానిసలై, సంపాదించినది సరిపోక, అప్పులపాలై రోడ్డున పడతారు. ఐదు సంవత్సరాల క్రితం, తండ్రి మరణించాడు. కొడుకుల చెడు అలవాట్లతో కలత చెందిన తండ్రి, చనిపోయే ముందు ఆస్తినంతా భార్య పేరు మీద వ్రాయించాడు. తండ్రి ఆస్తిని అనుభవించలేని కొడుకులు, తల్లిని చంపి, ఆ వచ్చే ఆస్తిని అమ్మగా వచ్చే డబ్బును, తమ వ్యసనాలకు వాడుకుందామనుకుంటారు. ఒక రోజు ఫుల్‌గా తాగి, తాగిన మైకంలో, కన్నతల్లిని కడతేర్చి, ఆ శవం పైనేబడి, స్పృహ కోల్పోతారు. తాగిన మత్తు దిగిన తరువాత జరిగింది తెలుసుకుని, ‘అమ్మా!… అమ్మా!!’ అంటూ గుండెలు బాదుకుంటారు. ఘోర తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో మద్యపానాన్ని త్యజిస్తారు.
మంచి భావ ప్రేరేపితమైన కథ…
చదవడం పూర్తయిన తరువాత, వాళ్ళల్లో ఎవరు ఏ పాత్రకు సరిపోతారో నిర్ణయించాము. అందరూ తమ తమ పాత్రల సంభాషణలను విడివిడిగా వ్రాసుకుని బట్టీపట్టమని చెప్పాను. నాటిక ప్రదర్శన ముగిసేవరకు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించాను. వాళ్ళల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఉత్తేజం ఉరకలేస్తుంది. ఎలాగైనా మంచి ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదల వాళ్ళల్లో నాకు ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక వాళ్ళని తీర్చిదిద్దడం పెద్ద కష్టమేమీ కాదనిపించింది నాకు. ప్రతి రోజూ ఇదే టైమ్‌కి వస్తానని, అందరూ తమ పనులు ముగించుకుని తయారుగా వుండాలని చెప్పాను.
ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి ఇంటికి చేరాను.
56
ఓ మూడు రోజులు కూర్చునే సంభాషణలు చదువుతూ, భావయుక్తంగా మాటలను పలకడం, సందర్భోచితంగా ఆరోహణ, అవరోహణ క్రమంలో మాటలను మలచుకోవడంలో, అభ్యాసం చేయించాను. నాలుగు రోజు నుంచి అందరం నిలుచునే, స్టేజీ మీద చేస్తున్నట్లు చేయడం, హావభావాలతో, శరీర కదలికలను, ముఖ కవళికలను మార్చడంలో అభ్యాసం చేయించాను.
ఉన్నట్టుండి ఛైర్మన్ శరత్‌బాబు గారు ఓ రోజు మా రిహార్సల్స్ రూమ్‌లోకి వచ్చి కూర్చున్నారు. రిహార్సల్స్ పూర్తయ్యేవరకు కూర్చుని, చివరిగా… నా దగ్గరకు వచ్చి…
“దర్శకత్వం అంటే ఇంత శ్రమ వుంటుందని నాకు తెలియదు. వాళ్ళందరితో సంభాషణలు పలికించడానికి, హావభావాలను సరిపడా వ్యక్తపరచడానికి, నువ్ ఇంత కష్టపడాల్సివస్తుందని నేను ఊహించలేదు. పైగా ప్రతిరోజూ రావడం, రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరడం… నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాననిపిస్తోంది… తలచుకుంటే చాలా బాధగా వుందయ్యా!”… అంటూ బాధపడ్డారు.
“నన్ను బాధపెడుతున్నారని మీరనుకుంటున్నారు. నేనలా అనుకోవడం లేదు. నా ప్రజ్ఞాపాటవాలను నిరూపించుకునే ఓ గొప్ప అవకాశాన్ని మీరు నాకు కలిపించారని, నేను అనుకుంటున్నాను.
నిజానికి, మన తెనాలి పట్టణం, కళలకు నిలయం. ఎందరో రంగస్థల మరియు వెండితెర కళాకారులను అందించింది ఈ తెనాలి. ఇక్కడ నాకంటే అనుభవజ్ఞులు, గొప్ప కళాకారులు కోకొల్లలుగా వుంటారు. వాళ్ళల్లో ఏ ఒక్కరిని మీరు అడిగినా,… కాదంటారా!! అలాంటిది, వాళ్ళందర్నీ కాదని ఆ బాధ్యతను నా భుజస్కందాలపై వుంచారంటే… అది కేవలం నాపై మీకున్న అభిమానానికి, నమ్మకానికి నిదర్శనం. అందుకు నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా వుంటాను!” అంటూ శరత్‌బాబు గారి బాధను తగ్గించే ప్రయత్నం చేశాను.
“అదంతా నీ మంచితనమయ్యా!… సరే!… మీరు కానివ్వండి… నేను తరువాత కలుస్తాను!” అంటూ భారంగా బయటికి నడిచారు శరత్‌బాబు గారు.
మేమంతా తిరిగి మా పనిలో పడ్డాము.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
63 Comments
Sagar
ఇంతకమునుపు అందించిన మీ రచనలు వృత్తిపట్ల మీ నిబద్దతను చాటితే ఈ రచన ప్రవృత్తి పట్ల మీ అంకితభావాన్ని స్పష్టం చేస్తోంది. నిజమే అంత మంది కళాకారులున్న తెనాలిలో మిమ్మలిని ఎంచుకోవడం వారికి మీ పై ఉన్న నమ్మకానికి మంచి ఉదాహరణ. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు సర్
Sambasiva+Rao+Thota
Brother Sagar!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..30th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
Sambasiva Rao Thota
K. Sreenivasa moorthy
Good morning Sambasiva Rao garu
Nice to hear from you. If a person having some worth in any art it will automatically comes out of him at any time or at all times. How best we use our talent that rich it becomes. Live example is you sir. I appreciate your interest in the art and your enthusiasm. You are unique sir.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నాటక రంగంలో అప్పుడే మీరు ముదిరిపోయినట్టు
అర్థం అవుతుంది. అదే ఇప్పటికీ మీ చేత నాటికలు
రాయిస్తున్నది.ఇది ఆహ్వానించదగ్గ విషయం.
నాటిక ప్రదర్శన ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నాను. అభినందనలు.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Good morning Andi. Posted my comments please. Eagerly waiting since morning and today I thought I must post my comments early without any delay. Nice about you sir. Thanks for sharing your experiences once again personally.
From
Sri SreenivasaMurthy
Hyderabad
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Very Nicely written
From
Sri Srnivas
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Srinivas Garu
Sambasiva+Rao+Thota
*
మాకు తెలియని , మీ రంగస్థల అనుభవ కోణం, కూడా అందించారు… బాగుంది సార్*
From
Sri Prasad
Guntur
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
Nice sir

From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasiva+Rao+Thota
మరి కొన్ని కోణాలలో సాంబశివ రావు గారు..శభాష్








From
Sri Ravi Ramana
Hyderabad
Sambasiva+Rao+Thota
Ravi Ramana Garu!
Dhanyavaadaalandi
parupalli99@gmail.com
కథా కథనం చాలా బావుంది సర్. డ్రామాలకు రెహర్సెల్స్ వేయటం ఎంతో కష్టం. అందరూ ఒకేసారి రారు. చాలా కష్టాలు ఉంటాయి. మీ అనుభవాలను చక్కగా అక్షరీకరించారు తోట సాంబశివరావు గారు. అభినందనలు.
Sambasiva+Rao+Thota
Sridhar Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Mee metchugolu naakentho uthsaahaanni ,uthejaanni itchindi..
Thank you very much Sridhar Garu
Sambasiva+Rao+Thota
నేను ఇంతక ముందే చదివి కామెంట్ చేశాను సర్
From
Mr.Sagar
Hyderabad
Sambasiva+Rao+Thota
Ee episode ni Naakante mundu meere chadivi comments koodaa vraasharu..
Chaalaa Santhosham Brother.Sagar…
Sambasiva+Rao+Thota
I think today’s episode is small
It’s good.
Regards
From
Sri Seshumohan
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Seshumohan Garu
Sambasiva+Rao+Thota
It shows the sincere commitment to the drama direction besides attending regular bank work. I predict that you have made the drama was a big hit. Thanks
From
Sri ChandrasekharReddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!

Thank you very much for your affectionate comments which I always cherish…
About your prediction…
Hard work always ends in success..
rao_m_v@yahoo.com
Very interesting. Are you still playing in dramas? You should. I never realized you are a good actor and director too!
Sambasiva+Rao+Thota
Sri MN Rao Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Prasthutham yemi cheyadam ledandi…
3or4 monthslo oka naatika vraasi nannu direct cheyamannaaru ..
BHAGYANAGAR BANKERS GROUP vaaru..
Meeku thappakundaa theliyajesthanu..
Thank you very much for your affectionate comments which I always cherish
Sambasiva+Rao+Thota
Today episode is interesting uncle

From
Mrs.Rajyalakshmi
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Rajyalakshmi
Sambasiva+Rao+Thota
Stepping stone of your future postings.
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
yes RamanaMurthy..
Thank you very much
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao ji


Proud remembrances of your directed drama
at Tenali Regards
M S RAMARAO
Manager retd Central Bank
Hyderabad
Sambasiva+Rao+Thota
RamaRao Garu!
Dhanyavaadaalandi
Paleti Subba Rao
మీలోని నటుడు దర్శకుడిగా మారితే ఫలితాలు అద్భుతంగా ఉండటం తథ్యం. ఆ నటులందరిలో మీరే ప్రతిబింబిస్తారు. నాటకం మంచి ప్రేక్షకాదరణ పొంది ఉంటుందని ఊహిస్తున్నాను సాంబశివరావు గారూ.
Sambasiva+Rao+Thota
Subbarao Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Yes ,as you said, hard work will always ends in success..
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao garu
Iam very happy to note that u have the qualities of Direction and play writing etc . Meeru Bahu Mukharjee Prajnashali Hearty congratulations sir
Sharat Babu garu is very nice person He has many good qualities We together had Trg at Pune Institute CAB and spent nice time there. We are good friends We used to interact many times on rural development zo used to go to his house at Patamata Lanka while I was working at Vijayawada Teo years back I met him at Vijayawada when We had returees conference
We enjoyed recalling the past memories
Thank u
Waiting eagerly for next Sunday write up
R Laxman Rao
Hyderabad
Sambasiva+Rao+Thota
Lakshman Rao Garu!
Thank you very much for your affectionate comments which I always cherish…
Yes .. Sharathbabu Garu is a very nice gentleman as you said..
Good..you also remembered and shared with us your association with Dr.Sharath Babu Garu…
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
One of the Good Ones
FE
Sri Diljeeth
Hyderabad
Sambasiva+Rao+Thota
Diljeeth Jee !
Thank you very much
Sambasiva+Rao+Thota
చాలా చక్కగా వివరిస్తున్నారు మీ జ్ఞాపకాలు మరియు అనుభవాలు.




From
Sri Narayana
Hyderabad and
Sambasiva+Rao+Thota
Narayana Garu!
Dhanyavaadaalandi
Arunakar Macha
గురువు గారికి ప్రణామాలు, నా జీవన గమనంలో….30, చాలా పసందుగా ఉంది. తమరి గురుతుల్యులు శ్రీ శరత్ బాబు గారు మీ కళా నైపుణ్యతను గుర్తుంచి, వారి చైతన్య గ్రామీణ బ్యాంక్ తెనాలి, 4వ వార్షికోత్సవం సందర్బంగా అమ్మ నాటికను తమ సిబ్బందిచే ప్రదర్శించు టకుగాను, దర్శకత్వం వహించ మనగానే, ప్రతి రోజు నీడుబ్రోలు టూ తెనాలి వెళ్లి వారి సిబ్బందికి అమ్మ నాటిక రిహార్సల్ శిక్షణ ఇవ్వడం, అదిచూసి చైర్మన్ గారు మీ పనితనాన్ని మెచ్చుకోవడం, మీరు ఒక గొప్ప అవకాశాన్ని ఎంచు కోవడం, ఇంతమంచి భావ ప్రేరితమైన కథకు దర్శకత్వం వహించడం, మీలో దాగిఉన్న కళాసంపదను మరియొక సారి బహిర్గతం చేయడం అద్భుతం.
అరుణాకర్ యం,మానుకోట.
Sambasiva+Rao+Thota
Dear Arunakar!
Thank you very much for your affectionate and analytical comments which I really cherish for ever..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
అవకాశాలు అందరికీ రావు..
అవకాశాలను సద్వినియోగం చేసుకునే వారు ఎందరు..
విజేతలను నిర్ధారించేది మనిషి లోని సద్గుణాల సిరులు..
వివేకమనే లక్షణాన్ని పొంది చూడు.. సాటి రారు నీకెవరు
మీ గురించి ఇంతకన్నా ఏమి చెప్పగలను.
అద్భుతాలకు నిలయం మీ తనువు
Tenali
Sambasiva+Rao+Thota
Leelaa Krishna!



Naa gurinchi ayithe..
Ammo..
Adbhthamgaa Kavitha gaa cheppadam..
Marvellous..
Thank you so much
Nee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu Leelaa Krishna
Sambasiva+Rao+Thota
నాటకాలు రాయటమే కాదు డైరెక్షన్ లో కూడా మీకు మంచి అనుభవము వున్నదని తెలిసింది అభి నందనలు
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Seethakkaiah..

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu Akkaiah
Meeru kramam thappakundaa naa episodes annee chaduvuthoo mee spandana theliyajadam naakentho santhoshaannisthundi..
Mee abhimaanaanni naa Pai ilaage konasaaginchaalani manaspoorthigaa korukuntunnaanu
Sambasiva+Rao+Thota
ప్రతి ఆదవారం మీ ఎపిసోడ్. కోసము ఎదురు చూస్తాను
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Seethakkaiah Dhanyavaadaalandi
Bhujanga rao
వృత్తి పట్ల నిజాయితీని చూపించి సమయనుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతూ ముందుకు వెళుతున్న మీకు, కళా నైపుణ్యం అభిరుచి గుర్తించి ఇంత మంది కళాకారులు ఉన్న తెనాలిలో మిమ్మల్ని ఎంచుకోవడం మీపై ఉన్న నమ్మకం.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ నాటికకు దర్శకత్వం వహించడం,నాటిక ప్రజాదరణ పొందు తుందని ఊహిస్తున్నాము. మంచి అనుభవాలు అందిస్తున్నందుకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Mukhyamgaa episode ni aasantham chadivi analytical gaa comments ni vraayadam naakentho Santhosham anipisthundi…
Mee abhimaanaanni naapai ilaage konasaaginchavalasindigaa korukuntunnaanu
Sambasiva+Rao+Thota
Nice
From
Sri RamachandraRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Ramachandrarao Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Good Episode
From
Mr.Ramakrishn
Hyderabad
Sambasiva+Rao+Thota
Thanks Ramakrishna
Sambasiva+Rao+Thota
Good,goahead.
From
Sri VenkateswarReddy
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much VenkateswarReddy Garu
Sambasiva+Rao+Thota
“మీ జీవనగమనంలో”
ప్రతివారం చదువుతూ ఏదో సరదాగానూ, ఒకోసారి చిలిపిగాను మీతో మాట్లాడుతూ వున్నాను. సంచికలో మిగతావాళ్ళంతా మిమ్మల్ని ప్రశంసలతో ముంచేత్తుతున్నారు.
నామాటలు అన్యధా భావించకండి. మన సాన్నిహిత్యం తో కొంత ఎక్కువ చనువు తీసుకుంటున్నానేమో.
From
Sri Ramakrishna
Kurnool
Sambasiva+Rao+Thota
Paravaaledu Ramakrishna Garu!
You are permitted since you are one of my Good Friends!!
Sambasiva+Rao+Thota
బ్యాంకులో మన టాలెంట్ అంతా
ప్రదర్సిస్తున్నారు.సంతోషం.
From
Sri Ramakrishna
Kurnool
Sambasiva+Rao+Thota
Ramakrishna Garu!
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
చాలా బాగుంది సార్
From
Mrs.Bhavani
Hyderabad
Sambasiva+Rao+Thota
Bhavaani Garu!
Thank you very much